నా కొడుకును రాహుల్‌కు దత్తత ఇవ్వలేదు: ప్రియాంక
న్యూఢిల్లీ: తన కుమారుణ్ని సోదరుడు రాహుల్ గాంధీకి దత్తత ఇచ్చినట్టుగా వచ్చిన వార్తలను ప్రియాంక గాంధీ ఖండించారు. ఈ వార్తను ప్రచురించిన ఓ వీక్లి, మరికొన్ని మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపారు. ఇవన్నీ తప్పుడు కథనాలని, కుమారుడి పరువుకు భంగం కలిగేలా కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ప్రియాంక తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. సంబంధిత మీడియాపై క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్టు సమాచారం.
రాహుల్ గాంధీ తన సోదరి ప్రియంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతుల కొడుకు రెహాన్‌ను దత్తత తీసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. తద్వరా రెహాన్ ఇంటిపేరును గాంధీగా మార్చాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపినట్టు ఆ పత్రికలు కథనాలు ప్రచురించాయి. కాగా ఈ కథనాలను ప్రియాంక తోసిపుచ్చారు.