సోనీ నుంచి మరో కొత్త ఫోన్: ఫీచర్లివే...
ఎక్స్పీరియా ఎక్స్జెడ్ ప్రీమియం స్మార్ట్ఫోన్ను గత నెలలోనే లాంచ్ చేసిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ సోనీ, మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సోనీ ఎక్స్పీరియా ఎక్స్ఏ1 ఆల్ట్రా పేరుతో దీన్ని భారత్ మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీని ధర 29,990 రూపాయలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ స్టోర్లలోనూ ఇది అందుబాటులో ఉంది. బ్లాక్, వైట్, గోల్డ్ రంగుల్లో ఇది మార్కెట్లో లభ్యమవుతోంది.
సోనీ ఎక్స్పీరియా ఎక్స్ఏ1 ఆల్ట్రా స్పెషిఫికేషన్స్...
6 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే
క్వాడ్ కోర్ 2.3 గిగాహెడ్జ్+క్వాడ్ కోర్ 1.6 గిగాహెడ్జ్ ఎస్ఓసీ
4జీబీ ర్యామ్
64జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్
256జీబీ వరకు విస్తరణ మెమరీ
23 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫ్లాష్ కెమెరా
2700ఎంఏహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 7.0 నోగట్