Sophisticated facilities
-
నయా ట్రెండ్...విలేజ్గ్రౌండ్
రోజులు మారాయి. యువత కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. వ్యాపారంలో అయితే వినియోగదారుడి ఆకర్షణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అధునాతన వసతులు కోరుకుంటున్నారు. అందులో భాగంగా పోర్టబుల్ క్యాబిన్ల డిమాండ్ పెరిగింది. తొలుత పెద్ద నగరాలకు పరిమితమైన ధోరణి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు తరలివచ్చింది. కొందరు పెదకాకానిలో తయారు చేస్తూ ఆకర్షిస్తున్నారు. పెదకాకాని/యడ్లపాడు: పోర్టబుల్ క్యాబిన్లు చకచకా రెడీ అవుతున్నాయి. చిన్న చిన్న ఇళ్లు, ఫామ్‌హౌస్, సెక్యూరిటీ క్యాపిన్స్, పర్సనల్ ఆఫీసు, రియల్ ఎస్టేట్ ఆఫీసులు, టాయిలెట్స్, స్లోరేజ్ క్యాబిన్స్ స్థలాన్ని బట్టి సైజులు, ఆకారాలు, అందమైన డిజైన్లలో తయారవుతున్నాయి. గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామ శివారులోని ఆటోనగర్, వెంగళరావునగర్ సమీపంలో సర్వీసు రోడ్డు పక్కనే గత కొంతకాలంగా రెడీమేడ్ గదులు తయారవుతున్నాయి. విదేశాలలో ఇళ్లను ఒక చోట నుంచి మరొక చోటకు మర్చడం, అవసరాన్ని బట్టి ఎత్తు పెంచుకోవడం, తగ్గించుకోవడాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ తయ్యబ్ సోదరులు బెంగళూరు కేంద్రంగా పోర్టబుల్ క్యాబిన్లు నిర్మాణం పనులు ప్రారంభించారు. స్థానికంగా తయారీ... ఆ తరువాత దేశవ్యాప్తంగా అక్కడక్కడా ఈ తరహా పరిశ్రమ ఏర్పాటు చేసి తయారు చేస్తున్నారు. పెదకాకాని వై జంక్షన్ సమీపంలో పరిశ్రమ ఏర్పాటు చేసుకుని అవసరాన్ని బట్టి క్యాబిన్లు సరఫరా చేస్తున్నారు. వర్కర్లను కూడా ఉత్తరప్రదేశ్ నుంచి పిలిపించి నిర్మాణానికి వినియోగించుకుంటున్నారు. వారి వద్ద పనులు నేర్చుకుని ఈ ప్రాంతానికి చెందిన వారే పెదకాకానిలో మూడో క్యాబిన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పోర్టబుల్ క్యాబిన్లలో ఇంటీరియల్ డెకరేషన్ ప్రత్యేక ఆకర్షణగా, అందమైన ఇళ్లను తలపిస్తున్నాయి. లక్షరూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అందంగా ఆకర్షణీయంగా డిజైన్లు చేసి ఇవ్వడం ద్వారా ఆర్డర్లు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ఇతర జిల్లాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని, 25 సంవత్సరాల పాటు మన్నిక ఉంటుందని, వారంటీ బిల్లు ఒక సంవత్సరం పాటు ఫీ సర్వీసు ఉంటుందని, సర్వీసు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. రూపులు మార్చుకుంటున్న కాకా హోటళ్లు... కాకా హోటళ్లు...చాయ్ దుకాణాలు అంటే పురాతన కాలంలో పూరి గుడిసెల్లోనూ..ఆ తర్వాత పెంకుటిళ్లు..పక్కా గదుల్లోనూ దర్శనమిచ్చేవి. ఇప్పుడది పూర్తిగా తనషేప్ను మార్చుకుంటుంది. నయాజమానా నయాట్రెండ్ చందానా.. పెద్దపెద్ద సిటీల్లోని కార్పొరేట్ తరహాతో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కంటైనర్లను వివిధ రకాల వస్తువుల్ని తరలించేందుకు వాడుతుంటారు. సిమెంట్, ఇటుకలు, ఐరన్ అనే మాటేలేకుండా ఎంచక్కా ట్రెండీగా వీటిని తయారు చేస్తున్నారు. కంటైనర్లను కేవలం రవాణాకే కాకుండా ఇల్లు.. వ్యాపార దుకాణాలుగా మార్చి వినియోగిస్తున్నారు. పట్టణాల్లోనే కాకుండా వాటిని మారుమూల పల్లెల్లోనూ ఏర్పాటు చేయడంతో అవి అందర్ని అకర్షిస్తున్నాయి. విదేశాల్లో నడిచే ఈ కొత్త ట్రెండ్ మన దేశంలోనూ వేగంగా విస్తరించడం విశేషం. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఇప్పుడిప్పుడే వీటికి విశేష ఆదరణ లభిస్తోంది. గతంలో.. సాధారణంగా చాయ్ లేదా ఫాస్ట్‌ఫుడ్ ఇతర వ్యాపార దుకాణాలను ఏర్పాటు చేయాలంటే ఎక్కడైనా కూడళ్లలో నిర్మించిన షాపింగ్ కాంపెక్లŠస్ల్లోని గదుల్ని అద్దెకు తీసుకోవాలి. అడ్వాన్స్‌లు, అవి నిర్మించిన గదులు మనకు అనుకూలంగా లేకుండా మార్పులు చేర్పులకు నిర్మాణాలు, డెకరేషన్లకు అదనంగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. తీరా మనం ఏర్పాటు చేసిన షాపు ‘క్లిక్’ కాకున్నా మనకు ‘లక్’ లేకున్నా..అప్పటి వరకు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. రీ యూజ్ ఇలా.. కంటైనర్లకు 50 ఏళ్ల తర్వాత వాటి జీవిత పరిమితకాలం అయిపోతుంది.వాటిని షిప్పింగ్‌కు వాడకూడదు. అలాంటి వాటిని వేస్ట్‌గా పోనివ్వకుండా తిరిగి ఉపయోగంలోకి తెస్తున్నారు. వాటిని స్క్రాబ్ కింద కొని వీటికి నిపుణులు అందమైన రూపునిస్తూ అద్భుతంగా మలుస్తున్నారు. షిప్పింగ్ కోసం వినియోగించే మెటల్ కంటైనర్లను పోర్టబుల్ హౌసెస్, ఆఫీస్ క్యాబిన్, హోటల్స్, టీస్పాట్, ఫ్యాన్సీ, కిరణా వంటి బిజినెస్ షాప్స్, మెటల్ క్వారీల వద్ద సేఫ్టీరూమ్స్, ఫాంహౌస్‌ల వద్ద మినిగెస్ట్హౌస్లు, భవన నిర్మాణాల సమయంలో స్టాక్గోడవున్ వంటి వాటికి ఈకంటైనర్లను వినియోగిస్తున్నారు. లోపల ఏమేమీ ఉంటాయంటే... లోపల అంతా బైసన్, ఎంటీఎ బోర్డులు, సీలింగ్, వాల్పేపర్లు, డోర్స్, యూపీవీసీ విండోస్, వినైల్ఫ్లోర్స్, టైల్స్, ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు, స్విచ్‌బోర్డులు, కబోర్డ్స్, అడ్జస్ట్ఫ్యాన్, ఏసీ, టీవీ పాయింట్స్, కంప్యూటర్స్, హాలు, కిచెన్, వాష్‌రూం, 1000లీటర్ల పైన ట్యాంక్, లోహం కావడంతో వేడి రాకుండా రాక్వోల్ వినియోగించి ప్రీమియం లుక్ తీసుకువస్తున్నాం. అన్నింటికీ అనుకూలత... తక్కువ ఖర్చుతో అన్ని సదుపాయాలతో కొద్దిపాటి స్థలంలోనే ఏర్పాటు చేసుకునే వీలుంది. ఒకచోట నుంచి మరోచోటకు సులభంగా తరలించుకోవచ్చు. మన అవసరం తీరాక కొన్నధరకు పెద్దగా నష్టం రాకుండా తిరిగి వీటిని విక్రయించుకోవచ్చు. జీఏసిస్టం, ఎంఎస్సిస్టం అనే రెండు రకాలుగా సెమీ, ఫుల్లీ ఫర్నిచర్ సౌకర్యాలతో వీటిని తయారు చేస్తున్నారు. ముందుగానే రెడీమెడ్గా తయారు చేసి ఉన్నందున ఎప్పుడు కావాలంటే అప్పుడే తెచ్చుకోవచ్చు. రోజురోజుకు వీటికి మంచి ఆదరణ పెరగడంతో ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, ప్రధాన పట్టణాల్లోనూ వీటి తయారీ కార్ఖానాలు వెలిశాయి. మోబుల్ హౌస్, షాపు ఏదైనా... పక్కాగృహ నిర్మాణాల మాదిరిగానే వీటి ధర అడుగుల చొప్పున ఉంటుంది. ఒక్కొక్క అడుగు సుమారు రూ.900 నుంచి రూ.1200 వరకు వారు అందించే నాణ్యతను బట్టి అందిస్తున్నారు. షిప్పింగ్ కంటైనర్..8గీ40 లేదా 8గీ20 మాత్రమే దొరుకుతాయి. పోర్టక్యాబిన్స్తో పోల్చుకుంటే ఇవి స్టాండెండ్‌గా ఉండడంతో పాటు ధరలోనూ సుమారు రూ.లక్ష వ్యత్యాసం ఉండోచ్చు. ఎందుకంటే ఇది స్టాండెడ్గా ఉంటాయి. ఒక్కొక్క షాపు ధర రూ.లక్ష నుంచి రూ.6.50 లక్షలు పడుతుంది. సింగిల్ బెడ్రూం కలిగిన ఇల్లు రూ.30 లక్షలు పలికే ఈరోజుల్లో కంటైనర్ పోర్ట్‌బుల్ హౌస్ 20గీ8 సైజు ఇల్లు రూ.4.50 లక్షలు, అదే పుల్లీ ఫర్నిచర్‌తో రూ.6.50 లక్షలు, 40గీ8 ఇల్లు రూ.8 లక్షలు, ఫుల్లీ ఫర్నిచర్ హౌస్ రూ.8.50 లక్షలకు రావడంతో అంతా ఇటువైపు దృష్టిని సారిస్తున్నారు. కార్ఖానా నుంచి కావల్సిన చోటుకు తరలించే సమయంలో ఎలాంటి డ్యామేజ్ జరిగే అవకాశం లేదు. నిర్మాణం కంటే ప్రత్నామ్యాయంతోనే మేలు... పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలతో ప్రస్తుతం శాశ్వత భవనం లేదా గదుల నిర్మాణాలు చేయాలంటే తలకుమించిన భారం అవుతుంది. దీనికి తోడు కూలీల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఇన్ని ఇబ్బందులు పడేకంటే వ్యాపారాలకు కంటైనర్ దుకాణాల్ని కొనుగోలు చేసుకుంటే సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు వద్దనుకున్నప్పుడు తిరిగి అమ్ముకోవచ్చు. వీటిని వీధుల్లో పొలాల్లో ఇళ్లమధ్య ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందుకే ఆధార్సెంటర్కు రెడీమెడ్గా కంటైనర్‌ను తీసుకురావడం జరిగింది. – వెంకటనర్సు, యడ్లపాడు -
బస్షెల్టర్లు ఇక హైఫై
గ్రేటర్లో త్వరలో ఏర్పాటు హైటెక్ వసతులతో నయా రూపం.. నాలుగు కేటగిరీలుగా 430 చోట్ల.. సిటీబ్యూరో: సిటీలో బస్ షెల్టర్లు..ఇక హైటెక్ హంగులతో ఏర్పాటు కానున్నాయి. ఇప్పుడున్న అధ్వానపు షెల్టర్ల స్థానంలో ‘హై ఫై’ షెల్టర్లు కొలువుదీరనున్నాయి. మీరు షెల్టర్‌కు వెళితే..అత్యాధునిక సౌకర్యాలు మీ చెంతకు వస్తాయి. అరచేతిలో టెక్ వ్యవస్థ ఆర్ఎఫ్పీలను నాలుగు ప్యాకేజీలుగా ఆహ్వానించనున్నారు. ప్రతి ప్యాకేజీలోనూ ఏ,బీ,సీ,డీ గ్రేడ్లు ఉంటాయి అలవోకగా ఇముడుతుంది. వీటితోపాటు సామాన్య సదుపాయాలు కలిగిన బస్షెల్టర్లను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ , తదితర నగరాల్లోని బస్షెల్టర్లను చూసి వచ్చిన జీహెచ్ఎంసీ, అస్కీ ప్రతినిధుల బృందం దేశంలోని ఏ నగరానికీ తీసిపోని విధంగా హైదరాబాద్‌లోనూ ఉత్తమ సదుపాయాలతో కూడిన బస్షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) పద్ధతిలో వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే సంస్థలను ఆహ్వానిస్తూ త్వరలోనే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ) జారీ చేయనున్నారు. కనీసం పది సంవత్సరాల కాలవ్యవధితో పేర్కొన్న సదుపాయాలను కల్పించడంతోపాటు, నిర్వహణ బాధ్యతల్ని సైతం కాంట్రాక్టు సంస్థ చేపట్టాల్సి ఉంటుంది. అత్యున్నత సదుపాయాలు కలిగిన బస్షెల్టర్లతో సహా మొత్తం నాలుగు గ్రేడ్లుగా వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలు, సదుపాయాలు కలిగిన వాటిని ఏ గ్రేడ్‌గా పేర్కొంటుండగా, సదుపాయాలు తగ్గే కొద్దీ బీ, సీ,డీ గ్రేడ్లుగా మరో మూడు కేటగిరీలు వెరసి మొత్తం నాలుగు గ్రేడ్లలో బస్షెల్టర్లు ఏర్పాటు చేయనున్నారు. బస్ షెల్టర్‌ను సూచించే సైనేజీ, లైటింగ్, ఫుట్‌పాత్, సీటింగ్, బస్రూట్లు, బస్నెంబర్లు, ఎక్కడినుంచి ఎక్కడకు వెళ్లేది, బస్సు వేళలు, తదితర ప్రయాణికులకు అవసరమైన సమాచారం అన్ని గ్రేడ్లలోనూ ఉండనున్నప్పటికీ, ‘ఏ’ గ్రేడ్‌లో వైఫై, మొబైల్ చార్జింగ్, ఏటీఎం, కాఫీ మిషన్, ఏసీ, పే ఫోన్, ఐవీఆర్ఎస్, మంచినీరు తదితర అదనపు సదుపాయాలుంటాయి. వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే సంస్థలు బస్‌షెల్టర్ పైన, సైడ్ ప్యానెల్స్, సీటింగ్‌కు వెనుకవైపు వాణిజ్య ప్రకటనలకు స్థలాన్ని అద్దెకిచ్చుకునే అవకాశం ఉంటుంది. అన్ని గ్రేడ్లలో వెరసి గ్రేటర్ వ్యాప్తంగా 430 బస్షెల్టర్లు ఏర్పాటు చేయనున్నారు. నిజంగా ఇవి అందుబాటులోకి వస్తే నగరంలో మురికి కూపాలుగా మారిన షెల్టర్లకు మోక్షం లభిస్తుంది. -
మనం మరింత ‘స్మార్ట్’
{పజలకు అత్యాధునిక సౌకర్యాలు సాంకేతిక పరిజ్ఞానం విస్తృతం విద్య, వైద్య, రవాణా రంగాల్లో ప్రగతి {పభుత్వ సేవలు వేగవంతం సిటీబ్యూరో: బైరామల్‌గూడకు చెందిన జయంత్ మాదాపూర్ వెళ్లాలనుకున్నాడు. సమయం సాయంత్రం 4 గంటలు. అప్పుడు బయలుదేరితే ఎక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో తెలియదు. ట్రాఫిక్ జామ్‌తో ఎంతసేపు ఆగాల్సి వస్తుందో అంతుపట్టడం లేదు. ఎలా? ...వర్షం కురిసిన సమయంలో ఖైరతాబాద్ జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్. ఇది తెలియక వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకున్న వారితో మరింత రద్దీ. అత్యవసర పనులపై వెళ్లాల్సిన వారు ముందుకు కద ల్లేని దుస్థితి. ...ఇలాంటి సమస్యలకు త్వరలో పరిష్కారం లభించనుంది. ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాలనుకుంటున్నారో... ఆ మార్గంలో ట్రాఫిక్ స్థితిగతులు... రహదారులపై పరిస్థితిని ఆన్లైన్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. తద్వారా ప్రయాణం చేయడమో... లేక వాయిదా వేసుకోవడమో... ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవడమో చేయవచ్చు. ఇవే కాదు. ఇతర సమస్యలూ ‘స్మార్ట్’గా పరిష్కారం కాబోతున్నాయి. ...ఇప్పటికే స్మార్ట్ సిటీ వైపు ప్రయాణాన్ని ప్రారంభించిన హైదరాబాద్‌ను కేంద్రం అధికారికంగా ‘స్మార్ట్’గా ప్రకటించడంతో నగర వాసులకు ‘ఆధునిక’ ఫలాలు అందబోతున్నాయి. ఈ- గవర్నెన్స్‌లో భాగంగా ఈ- ఆఫీస్, కాల్‌సెంటర్, ఆన్లైన్, మొబైల్ యాప్‌ల ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉచిత వైఫై వంటి సేవలు ఇప్పటికే నగరంలో అందుబాటులో ఉన్నాయి. ఇకపై ఈ సేవలు మరింత మెరుగవనున్నాయి. సిటిజన్ చార్టర్ కచ్చితంగా అమలయ్యే అవకాశం ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజలు కార్యాలయాల దాకా వెళ్లకుండానే సదుపాయాలు కల్పించడం స్మార్ట్‌సిటీ ముఖ్య లక్షణం. వేగంగా సమాచార మార్పిడి, సత్వర సేవలతో అత్యంత నివాసయోగ్య నగరంగా మారబోతోంది. సత్వర సదుపాయాలకు... భవన నిర్మాణ అనుమతులతో పాటు చక్కనైన టౌన్‌ప్లానింగ్, మెరుగైన ప్రజా రవాణా, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, అందరికీ భద్రత, డిజిటల్ టెక్నాలజీ విరివిగా వినియోగానికి స్మార్ట్ సిటీతో అవకాశం ఉంటుంది. కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడమే కాక, ప్రజలకు ఏం కావాలో... వాటిని సత్వరం అందజేయడమే దీనిలక్ష్యమని సంబంధిత రంగాల్లోని వారు చె బుతున్నారు. ఇప్పటికే స్లమ్‌ఫ్రీ సిటీ, మల్టీ ఫ్లై ఓవర్లు, ఘన వ్యర్థాల నిర్వహణకు ఇంటింటికీ రెండు చెత్తడబ్బాలు వంటి వాటికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ అడుగులు ఇకపై మరింత వేగవంతమవుతాయి. నీటి సమస్యకు పరిష్కారం గ్రేటర్ పరిధిలో జలమండలికి 8.64 లక్షల నల్లాలు ఉన్నాయి. వీటికి రోజువారీగా 365 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రధాన నగరంలో రెండు రోజులకోసారి, శివారు ప్రాంతాల్లో నాలుగు రోజులు.. కొన్ని ప్రాంతాల్లో వారం,పదిరోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. జలమండలి నల్లా కనెక్షన్ లేని భవంతులు పది లక్షలకు పైమాటే. మహా నగర వ్యాప్తంగా జలమండలి మంచినీటి సరఫరా నెట్వర్క్ లేకపోవడంతో శివారు వాసులు బోరుబావులు, ప్రైవేటు నీటి ట్యాంకర్లు, ప్రైవేటు ఫిల్టర్ప్లాంట్లపైనే ఆధార పడుతున్నారు. ఇంటింటికీ నల్లా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నగరమంతటా మంచినీరు, మురుగునీటి పారుదల వ్యవస్థలకు సుమారు రూ.20 వేల కోట్లు అవసరం. దీనికోసం జలమండలి సిద్ధంచేసిన ప్రతిపాదనలు కాగితాల్లోనే మగ్గుతున్నాయి. స్మార్ట్‌సిటీగా ఎంపికైన తరుణంలోనైనా ఈ పథకాలకు మోక్షం లభిస్తుందని సిటీజనులు ఆశిస్తున్నారు. ఆరోగ్య భాగ్యం రాజధానిలో ప్రస్తుతం అనారో గ్యం రాజ్యమేలుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్న కాలుష్యం... మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు నగర వాసుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దేశంలోనే అత్యధిక మధుమేహ బాధితులు హైదరాబాద్‌లో ఉన్నారు. హృద్రోగులు, క్యాన్సర్ బాధితులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నారు. తమకు జబ్బు ఉన్నట్లు ఇప్పటికీ చాలా మందికి తెలియదు. బస్తీవాసులకు సీజనల్, లైఫ్ స్టయిల్ వ్యాధులపై అవగాహన లేకపోవడమే దీనికి కారణం. గ్రేటర్లో వందకు పైగా ప్రభుత్వ ఆస్పత్రులు, 40-50 వరకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వెయ్యికి పైగా నర్సింగ్ హోమ్‌లు, క్లీనిక్స్ ఉన్నాయి. ఇవి రోగుల అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేకపోతున్నాయి. సీజన్ మారిందంటే చాలు.. ఆస్పత్రుల్లో బెడ్డు దొరకని పరిస్థితి. డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు గ్రేటర్ వాసులను అతలాకుతలం చేస్తున్నాయి. ఒకటి రెండు కార్పొరేట్ ఆస్పత్రులు మినహా మరెక్కడా టెలిమెడిసిన్ సేవలు అందుబాటులో లేవు. క్షతగాత్రులను, హృద్రోగులను, నిండు గర్భిణులను ట్రాఫిక్ రద్దీని చేధించుకుని ఆస్పత్రికి తరలించేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ప్రతిష్టాత్మక ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, ఫీవర్, సరోజినిదేవి, ఈఎన్టీ, ఛాతి, మానసిక చికిత్సాలయం రోగుల అవసరాలు తీర్చలేక పోతున్నాయి. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే కొత్త రోగాలు వ్యాపిస్తున్నాయి. భాగ్యనగరం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందితే ప్రజలకు ఆరోగ్య భాగ్యం దక్కుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. విద్యా ప్రమాణాల మెరుగుకు... విద్యా రంగంలో హైదరాబాద్ స్మార్ట్ సిటీ కావడానికి అర్హతలన్నీ దాదాపుగా ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని అంశాల్లో మెరుగు పడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రాథమిక, మాధ్యమిక విద్యా విషయంలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధనా సిబ్బంది లేకపోవడం... ఇప్పటికీ 70 శాతం ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేకపోవడం గమనార్హం. లెక్కకు మిక్కిలిగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో వసతులు ఫర్వాలేదనిపించినా... అర్హత గల ఉపాధ్యాయులు లేకపోవడం లోటే. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో విద్యార్థులు ఉండడం లేదు. సాంకేతిక విద్యకు సంబంధించి నగరం, పరిసర ప్రాంతాల్లో దాదాపు 150 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో నాణ్యమైన విద్య ఏమేరకు అందుతోందనేది ప్రశ్నార్థకమే. నగరంలో 10 విశ్వవిద్యాలయాలు కొలువు దీరాయి. ఇందులో చారిత్రాత్మకమైన ఉస్మానియా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జేఎన్టీయూహెచ్లూ ఉన్నాయి. సీసీఎంబీ, ఐఐసీటీ, హెచ్‌సీయూ తదితర సంస్థలు పరిశోధనా రంగంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. హైదరాబాద్ స్మార్ట్ సిటీ కాబోతున్న నేపథ్యంలో నగర జనాభాకు అనుగుణంగా మరిన్ని వసతులు కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది. రవాణా సౌకర్యం... నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. దీనికి అనుగుణంగా రవాణా సదుపాయాలు పెరగడం లేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో కేవలం 3,800 సిటీ బస్సులు...నిత్యం 32 లక్షల మందికి సేవలందిస్తున్నాయి. పొరుగున ఉన్న బెంగళూరులో 6000 బస్సులు రోజూ 45 లక్షల మందికి రవాణా సదుపాయం కల్పిస్తున్నాయి. దీన్ని బట్టి మన నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో తెలుసుకోవచ్చు. నగర శివార్లలోని వందలాది కాలనీలు ఇంకా రవాణా సౌకర్యానికిదూరంగానే ఉన్నాయి. ఎంఎంటీఎస్ సేవలూ అంతంతమాత్రమే. రెండో దశ పూర్తయితే తప్ప శివార్లకు ఈ సేవలు అందే అవకాశం లేదు. మరోవైపు నగరంలో బస్ ట్రాక్‌లు, బస్ బేలు లేవు. దీంతో కొద్దిపాటి దూరం చేరుకోవడానికే చాలా సమయం పడుతోంది. గ్రేటర్లో వాహనాల సంఖ్య 43 లక్షలకు చేరుకుంది. దీనికి అనుగుణంగా రోడ్లు విస్తరణకు నోచుకోవడం లేదు. సైకిళ్లకు ప్రత్యేక మార్గాలు లేవు. పాదచారులు నడిచేందుకు ఫుట్‌పాత్‌లు లేవు. కేవలం 8 శాతం రోడ్లపైనే అన్ని రకాల వాహనాలు, జనజీవనం కొనసాగుతున్నాయి. దీంతో వాహన వేగం దారుణంగా పడిపోయింది. ట్రాఫిక్ రద్దీతో గంటకు 15 కిలోమీటర్లు కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఇటీవల ప్రభుత్వం ముంబయి తరహా క్యూ పద్ధతికి, బస్ బేల నిర్మాణానికి చే సినప్రయత్నాలు ఒక్క అడుగు కూడా ముందుకు పడ లేదు. ఒకవైపు మెట్రో నిర్మాణం, మరోవైపు ఇరుకు రహదారులు. మొత్తంగా నగరంలో రవాణా సదుపాయం నరకప్రాయంగానే ఉంది. ‘స్మార్ట్ సిటీ’గా రూపాంతరం చెందితే ఈ సౌకర్యాలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఎలా ఉండాలంటే... హైదరాబాద్ వంటి నగరంలో ఒక చోటు నుంచి మరో చోటుకు 45 నిమిషాల్లో చేరుకునేలా సదుపాయాలు ఉండాలి. రహదారులకు ఇరువైపులా కనీసం 2 అడుగుల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు ఉండాలి. {పత్యేకంగా సైకిల్ ట్రాక్‌లు ఉండాలి. {పజలందరికీ రవాణా సౌకర్యం 24 గంటల పాటు నీటి సరఫరా అన్ని ఇళ్లకూ నీటి కనెక్షన్లు. మనిషికి 135 లీటర్ల వంతున నీటి సరఫరా అందరికీ మరుగుదొడ్లు పాఠశాలల్లో బాలలు, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు వృధా నీటిని ట్రీట్మెంట్ చేయగలగాలి. సివరేజి నెట్వర్క్ ఉండాలి. ఇంటింటి నుంచి చెత్త సేకరణ తడి,పొడి చెత్త వేర్వేరుగా సేకరణ ఘన వ్యర్థాల రీసైక్లింగ్ అన్ని ప్రాంతాల్లో వరదనీటి కాలువలు నీటి నిల్వ ప్రాంతాలు ఉండకూడదు. అందరికీ విద్యుత్, 24 గంటల పాటు అందుబాటులో ఉండాలి. విద్యుత్ వృథా చేయకుండా తగిన టారిఫ్ ఇంటింటికీ ఫోన్ సదుపాయం. వైఫై. 100 ఎంబీపీస్ స్పీడ్ టెలిమెడిసిన్ సదుపాయాలు అవసరం. అత్యవసరంగా స్పందించే సమయం 30 నిమిషాలు. జనాభాకు తగిన ట్టుగా వివిధ స్థాయిల్లో ఆస్పత్రులు, విద్యా సౌకర్యాలు ఉండాలి. వీటిని సాధించేందుకు సదుపాయాలు కల్పించాలి. దీనికి కేంద్రం తనవంతుగా నిధులు అందజేస్తుంది. -
మియాపూర్.. రవాణా హబ్
- మళ్లీ తెరపైకి ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ - పాత ఫైళ్లకు బూజు దులిపిన హెచ్ఎండీఏ - కొత్త టెర్మినళ్ల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్‌ను విశ్వనగరంగా ఆవిష్కరించేందుకు నగరానికి నలువైపులా అత్యాధునిక వసతులతో కూడిన ‘బస్ టెర్మినళ్ల’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో గతంలో రూపొందించిన పలు ప్రాజెక్టులకు ప్రాణ ప్రతిష్ట చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గతంలో మియాపూర్‌లో తలపెట్టిన ‘ట్రాన్స్‌పోర్టు సిటీ’ ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి పెండింగ్‌లో పడిన ఈ ప్రాజెక్టును మళ్లీ పట్టాలపైకి ఎక్కించేందుకు హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రాజెక్టుపై ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్లగా దానిని పునరుద్ధరించాలని ఆయన సూచించారు. దీంతో దాన్ని మరోసారి లోతుగా పరిశీలించి సీఎంకు పంపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు సిద్ధంగా ఉండటంతో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. మెగా ప్రాజెక్టు : నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూసేందుకుగాను శివారు ప్రాంతాల్లోనే ఇంటర్ సిటీ బస్ టెర్మినల్స్ నిర్మించాలని హెచ్ ఎండీఏ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఆ మేరకు నగర శివారులోని మియాపూర్‌లో ఆధునిక వసతులతో ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మియాపూర్ ( ఎన్‌హెచ్-9, 7లను కలిపే మియాపూర్-కొంపల్లి ఇంటర్మీడియట్ రింగ్‌రోడ్డు) వద్ద 55 ఎకరాల్లో ‘ట్రాన్స్‌పోర్టు సిటీ’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడమేగాక ఇందుకు సంబంందించి టెండర్లు కూడా ఖరారయ్యాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్మించేందుకు కేఆర్ఆర్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం సైతం కుదుర్చుకొంది. బస్ టెర్మినల్ నిర్మాణంతో పాటు 33 సంవత్సరాలు లీజ్ ప్రాతిపదికన దానిని నిర్వహించేందుకు అప్పట్లో అంగీకారం కుదిరింది ఇందుకు ప్రతిఫలంగా హెచ్ఎండీఏ సదరు సంస్థకు రూ.64.22కోట్లు చెల్లించే విధంగా అగ్రిమెంట్ చేసుకొంది. అయితే పీపీపీ విధానంలో చేపట్టిన ఏ ప్రాజెక్టుకైనా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ( ఎస్‌ఐఏఈ) నుంచి విధిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే... ఈ ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ ఏపిఐఏఈ నుంచి అనుమతి తీసుకోలేక పోయింది. అప్పట్లో హెచ్ ఎండీఏ కమిషనర్‌గా ఉన్న నీరభ్‌కుమార్ ప్రసాద్ దీనిపై శ్రద్ధ చూపకపోవడంతో లాంఛనాలన్నీ పూర్తయినా ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో ఈ ప్రాజెక్టు పెండింగ్ జాబితాలో చేరింది. ట్రాఫిక్ ఫ్రీ...: నగరానికి నలువైపులా ఇంటర్ సిటీ బస్ టెర్మినల్స్‌ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుండటంతో రానున్న రోజుల్లో నగరరోడ్లపై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే బస్సులు, ఇతర వాహనాలు పగలంతా ఇక్కడే ఉండి రాత్రిపూట తిరుగు పయనమవుతుంటాయి. ఈ క్రమంలో ఆయా వాహనాలన్నీ నగరంలోని వివిధ రోడ్ల వెంట పార్కు చేసి ఉంచుతుండటంతో ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ప్రస్తుతం తలపెట్టిన ఇంటర్సిటీ బస్ టెర్మినళ్లు అందుబాటులోకి వస్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలన్నీ శివార్లలోనే నిలిపివేయనుండడంతో నగరంలో ట్రాపిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించగలదని వారు భావిస్తున్నారు.