south africa vs ireland
-
SA vs IRE: సౌతాఫ్రికాకు ఊహించని షాకిచ్చిన ఐర్లాండ్
సౌతాఫ్రికాతో మూడో వన్డేల్లో ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. సఫారీ జట్టును 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. వన్డేల్లో సౌతాఫ్రికాపై ఐరిష్ టీమ్‌కు ఇది రెండో గెలుపు కావడం విశేషం. కాగా యూఏఈ వేదికగా ఐర్లాండ్- సౌతాఫ్రికా మధ్య అబుదాబి వేదికగా పరిమిత ఓవర్ల సిరీస్ జరిగింది.రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరుజట్లు చెరో విజయంతో 1-1తో ట్రోఫీని పంచుకున్నాయి. ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి రెండింటిలో సౌతాఫ్రికా వరుసగా 139, 174 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ క్రమంలో సోమవారం నాటి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ప్రొటిస్ జట్టుకు ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది.పాల్ స్టిర్లింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో బల్బిర్నీ 45 పరుగులతో రాణించగా.. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ 88 రన్స్‌తో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ కర్టిస్ కాంఫర్(34) ఫర్వాలేదనిపించగా.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన హ్యారీ టెక్టార్ 60 పరుగులు చేశాడు. ఇక వికెట్ కీపర్ లోర్కాన్ టకర్ 26 పరుగులు చేయగా.. లోయర్ ఆర్డర్ సింగిల్ డిజట్ స్కోర్లకే పరిమితమైంది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐర్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆది నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. ఐరిష్ బౌలర్ల దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. జేసన్ స్మిత్ పోరాటం వృథాఓపెనర్లు రియాన్ రెకెల్టన్(4), రీజా హెండ్రిక్స్(1), వన్‌డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్(3) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వాళ్లలో కైలీ వెరెన్నె 38, ట్రిస్టన్ స్టబ్స్ 20 పరుగులు చేయగా.. ఆరోస్థానంలో వచ్చిన జేసన్ స్మిత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 93 బంతుల్లో 91 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ఐరిష్ బౌలర్ల ధాటికి మిగతా వాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో స్మిత్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. 46.1 ఓవర్లలో 215 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ కావడంతో ఐర్లాండ్ విజయం ఖరారైంది. 69 పరుగుల తేడాతో ప్రొటిస్ జట్టుపై గెలుపొందింది. ఐర్లాండ్ బౌలర్లలో గ్రాహం హ్యూమ్, క్రెయిగ్ యంగ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. మార్క్ అడేర్ రెండు, ఫియాన్ హ్యాండ్, మాథ్యూ హంఫ్రేస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మూడో వన్డేకు ముందే... సిరీస్ కోల్పోయినా సౌతాఫ్రికా ఆధిక్యాన్ని ఐర్లాండ్ 2-1కు తగ్గించగలిగింది. ఐరిష్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: IPL 2025: ఐపీఎల్లో విలువ పెరిగింది -
Ban vs SA: సౌతాఫ్రికా జట్టుకు బిగ్ షాక్!
సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నండ్రే బర్గర్ గాయపడ్డాడు. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో మిగిలిన రెండు వన్డేలతో పాటు.. బంగ్లాదేశ్ పర్యటనకూ దూరమయ్యాడు. కాగా సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంది.అక్కడ ఐర్లాండ్‌తో రెండు టీ20లు ప్రొటిస్ జట్టు.. సిరీస్‌ను 1-1తో కలిసి ప్రత్యర్థితో పంచుకుంది. ఈ క్రమంలో బుధవారం నుంచి వన్డే సిరీస్ మొదలుపెట్టింది. మొదటి మ్యాచ్‌లో 139 పరుగులతో ఐరిష్ జట్టును చిత్తు చేసిన సౌతాఫ్రికా.. శుక్రవారం రెండో వన్డేలో తలపడుతోంది.బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కూడా దూరంఅయితే, ఈ మ్యాచ్ ఆరంభానికి ముందే క్రికెట్ సౌతాఫ్రికా నండ్రే బర్గర్ గాయం గురించి వెల్లడించింది. ఈ పేసర్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడని.. దీంతో ఐర్లాండ్‌తో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడని తెలిపింది. అదే విధంగా.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కూడా బర్గర్ అందుబాటులో ఉండకపోవచ్చని... త్వరలోనే అతడి స్థానాన్ని వేరొక ఆటగాడితో భర్తీ చేస్తామని పేర్కొంది.టీమిండియాతో సిరీస్‌లతో అరంగేట్రంకాగా ఐర్లాండ్‌తో తొలి వన్డేలోనూ బర్గర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక గతేడాది డిసెంబరులో టీమిండియాతో టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నండ్రే బర్గర్.. అదే నెలలో వన్డే, టెస్టుల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. భారత జట్టుతో జరిగిన మూడు టెస్టుల్లో కలిపి 14 వికెట్లు తీసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. ఐదు వన్డేల్లో ఆరు, రెండు టీ20లలో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఆ తర్వాత క్రికెట్ సౌతాఫ్రికా వన్డే చాలెంజ్ టోర్నీలో రాణించిన 29 ఏళ్ల నండ్రే బర్గర్.. ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రాజస్తాన్ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడి ఏడు వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్-2024లో రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా జట్టులోనూ రిజర్వు ప్లేయర్‌గా ఉన్నాడు. కాగా సౌతాఫ్రికా జట్టు అక్టోబరు 16న బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టనుంది.రెండు టెస్టులుఇరు జట్ల మధ్య అక్టోబరు 21- నవంబరు 2 వరకు రెండు టెస్టుల సిరీస్ జరుగనుంది. ఇందుకు సంబంధించి సౌతాఫ్రికా ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు అన్రిచ్ నోర్జే, మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడీ, గెరాల్డ్ కోయెట్జీ వంటి వంటి స్టార్ పేసర్లు దూరమయ్యారు. తాజాగా బర్గర్ కూడా దూరం కావడం ప్రభావం చూపవచ్చు.బంగ్లాతో టెస్టులకు దక్షిణాఫ్రికా జట్టుటెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, సెనూరన్ ముత్తుసామి, డేన్ ప్యాటర్సన్, డేన్ పీడ్ట్, కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రెకల్టన్ వెర్రేన్నే(వికెట్ కీపర్).చదవండి: పాక్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్? -
చెలరేగిన ఓపెనర్.. సౌతాఫ్రికా ఘన విజయం
ఐర్లాండ్‌తో తొలి వన్డేలో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పాల్ స్టిర్లింగ్ బృందాన్ని ఏకంగా 139 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సౌతాఫ్రికా.. ఐర్లాండ్‌తో తొలుత రెండు టీ20లు ఆడింది.పొట్టి సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ప్రొటిస్ జట్టు గెలుపొందగా.. రెండో టీ20లో అనూహ్య రీతిలో ఐర్లాండ్ పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం వన్డే సిరీస్ మొదలైంది. అబుదాబి వేదికగా జరిగిన మొదటి వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది.చెలరేగిన ఓపెనర్ఓపెనర్ రియాన్ రికెల్టన్.. 102 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 91 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ టోనీ డి జోర్జీ(12), కెప్టెన్ తెంబా బవుమా(4), వాన్ డెర్ డసెన్(0) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో ఐదో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ రికెల్టన్‌తో కలిసి ప్రొటిస్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. 86 బంతుల్లో 79 పరుగులు చేశాడు.మిగతా వాళ్లలో జోర్న్ ఫార్చూన్ 28, లుంగి ఎంగిడి 20(నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది. ఐరిష్ బౌలర్లలో మార్క్ అదేర్ నాలుగు, క్రెయిగ్ యంగ్ మూడు వికెట్లు కూల్చగా.. హ్యూమ్, ఆండీ మెక్‌బ్రిన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.132 పరుగులకు ఆలౌట్ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ను సౌతాఫ్రికా బౌలర్లు ఆది నుంచే బెంబేలెత్తించారు. ఏ దశలోనూ ఐరిష్ బ్యాటర్లను కోలుకోనివ్వలేదు. ఫలితంగా 31.5 ఓవర్లకే 132 పరుగులు చేసి ఐర్లాండ్ జట్టు కుప్పకూలింది. ప్రొటిస్ పేసర్లలో లిజాడ్ విలియమ్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీశాడు. ఒట్నీల్ బార్ట్‌మన్, వియాన్ ముల్దర్ ఒక్కో వికెట్ కూల్చారు. స్పిన్నర్ జోర్న్ ఫార్చున్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఐర్లాండ్ బ్యాటర్లలో జార్జ్ డాక్రెల్ 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన రియాన్ రెకెల్టన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం(అక్టోబరు 4) రెండో వన్డే జరుగనుంది.చదవండి: న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీకి సౌథీ గుడ్‌బై.. కొత్త కెప్టెన్ ఎవరంటే?