south sentral railway
-
కాకినాడకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్– కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్– కాకినాడ (07001/07002) ప్రత్యేక రైలు ఈ నెల 9, 11వ తేదీల్లో రాత్రి 8.50కు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 10, 12 తేదీల్లో సాయంత్రం 7.30కు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది. -
దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీ
వరంగల్ టౌన్: వరంగల్ రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్లో భద్రత, ప్రయాణికులు అందుకుంటున్న సౌకర్యాలు, సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. వరంగల్ స్టేషన్లో 108 సేవలు, అత్యాధునికమైన వెయిటింగ్ హాల్‌ను, ఎస్కలేటర్లను ఆయన ప్రారంభించారు. స్టాల్స్‌లో కూల్‌డ్రింక్స్ ధరలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే గోదాం హమాలీలు తమ సమస్యలపై జీఎంకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం రైల్వే ఉద్యోగులకు సంబంధించిన పుస్తకాన్ని శ్రీవాస్తవ విడుదల చేశారు.