south zone dcp
-
హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ సాయిచైతన్యపై ఈసీ వేటు
సాక్షి, హైదరాబాద్: నగర పోలీస్ కమిషనరేట్ సౌత్ జోన్ డీసీపీపై ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సాయి చైతన్యకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగిందంటూ సీపీని ఆదేశించింది. బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో సాయి చైతన్యపై ఈసీ చర్యలు తీసుకుంది. -
హైదరాబాద్: వివాదంలో సౌత్‌జోన్ డీసీపీ సీసీ గోపికృష్ణ
-
పాతబస్తీలో కార్డన్ సెర్చ్: రౌడీషీటర్లు అరెస్ట్
హైదరాబాద్ : పాతబస్తీ, ఫలక్‌నుమా ప్రాంతాల్లో పోలీసులు గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 16 మంది రౌడీషీటర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎలాంటి ధృవపత్రాలు లేని 60 ద్విచక్రవాహనాలు, 3 కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. సౌత్‌జోన్ డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 400 మంది పోలీసులు పాల్గొన్నారు. -
పాతబస్తీలో 105 మందిపై రౌడీషీట్లు
హైదరాబాద్: పాతబస్తీలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ నేరాలకు పాల్పడుతున్న 131 మందిపై దక్షిణ మండలం పోలీసులు షీట్లు ఓపెన్ చేశారు. ఇందులో 105 మందిపై రౌడీషీట్లు, 25 మందిపై సస్పెక్ట్ షీట్లు, ఒక్కరిపై సీడీసీ(సిటీ డోసర్ క్రిమినల్)లను తెరిచారు. దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... పాతబస్తీలో ఏడాది కాలంగా కార్డన్ సెర్చ్‌లు, కమ్యూనిటీ పోలీసింగ్, పీడీ యాక్ట్‌లను ప్రయోగిస్తుండడంతో వ్యవస్థీకృత నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఇప్పటి వరకు 47 మందిపై పి.డి.యాక్ట్ నమోదు చేశామని, మరో 20 మందిపై నమోదు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం అయినట్లు ఆయన వివరించారు. ఈ క్రమంలోనే గతంలో ఉన్న రౌడీషీటర్లలో వయోవృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, సత్ప్రవర్తన కారణంగా 200 మందిపై రౌడీషీట్లను తొలగించినట్లు తెలిపారు. కాని, ఇటీవలి కాలంలో పాతబస్తీలో కొందరు యువకులు ఎక్కువగా నేరాలకు పాల్పడుతుండటంతో వారిని కట్టడి చేసేందుకు కొత్తగా రౌడీషీట్లను తెరుస్తున్నామన్నారు. ప్రస్తుతం రౌడీషీట్లు నమోదైన వారి కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని సత్యనారాయణ చెప్పారు. -
216 మంది బాలకార్మికులు వెలుగులోకి..
హైదరాబాద్: కార్ట్ అండ్ సర్చ్ లో భాగంగా మంగళవారం షెల్టర్ హోంలో సౌత్ జోన్ డీసీపీ నిర్వహించిన సోదాల్లో 216 మంది బాలకార్మికులను కనుగొన్నారు.వీళ్లంతా బీహార్, జార్ఖండ్, కర్ణాటక, బంగ్లాదేశ్ లకు చెందిన వారుగా గుర్తించారు. వీరందరినీ వారివారి స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చైల్డ్ వెల్పేర్ విభాగం తెలియజేసింది. బాలకార్మికుల చేత వెట్టిచాకిరి చేయిస్తున్న 22 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. వీళ్లందరినీ కొంతమంది హైదరాబాద్ కు తీసుకువచ్చి వివిధ ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు మొదలైన ప్రదేశాల్లో పనిలో చేర్పిస్తున్నారని ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది పిల్లలను ఈ వృత్తిలో దించుతున్నారని ఆయన తెలిపారు.