SP Bala Subramaniam
-
SP బాలసుబ్రహ్మణ్యం తో సహా ఏ సింగర్ ని మెచ్చుకోలేదు..నా జీవితంలో..!
-
‘మణి’తో చెదురు మధుర మెమొరీస్
మా చిన్ననాటి నెల్లూరు స్నేహితులు ఏ పేరుతో పలకరిస్తే తను పులకరిస్తాడో ఆ ముద్దుపేరే ‘మణి’. సినిమా వాళ్ళు పిల్చుకున్న పేరు బాలూ. వెరసి యస్పీ ‘బాలు’ సుబ్ర‘మణి’యం అయ్యాడు. తనతో నాకా రోజుల్నుంచే పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారి, బంధమవడానికి మూల కారకుడు – కారణజన్ముడు మహమ్మద్ రఫీ. ఇక మేం వయసులో ఎదిగే కొద్దీ మా దారులూ, రహదారులూ, రహసందులూ వేరయ్యాయి. నేనేమో డాక్టరీ చదివి చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్ట్నయ్యాను. తనేమో ఆ మూడు అంగాల్లో గొంతును ఎన్నుకొని దాన్ని ఎన్ని మెలికలు తిప్పాలో తిప్పి, డాక్టరేట్లూ, పాటలకి మంచి రేట్లూ సంపాదించుకుంట, చివరికి ‘పద్మభూషణ్’ దగ్గర ఆగాడు. నేనేమో నా పేషెంట్ల గూబల్ని గుయ్యిమనిపిస్తూ వైద్యం చేసుకుంటుంటే తనేమో శ్రోతల చెవుల్లోని కర్ణభేరులకు తన శ్రావ్యమైన గొంతుతో సాంత్వన కలిగించేవాడు. సింగర్‌గా తొలిరోజుల్లో తను పాడిన సినిమా పాటలు నాలుగైదు మట్టి రికార్డులుగా హెచ్.ఎం.వి. వారు మార్కెట్లోకి వదలగానే వాటిని చూసుకొని మురిసిపోయి, సన్నగా రివటలా ఉన్న మనిషి కాస్తా శారీరకంగా ఉబ్బి, మానసికంగా తబ్బిబై్బ పోయాడు. బాడీ షేమింగ్ చెయ్యడానికి రౌడీమూక రెడీ అవుతుందని ముందే పసిగట్టి, వాళ్ళ కంటే ముందు తన మీద తనే జోకులేసుకోవడం మొదలెట్టాడు. వేదిక మీద ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ‘ఈ భారీకాయాన్ని దొర్లించుకుంటూ రావడంలో మీ కంటే వెనుకబడిపోయాను’ లాంటి జోకులు వేసుకుంటే ఇక అవతల వాళ్ళకేం మిగిలిందని! అందుకనే నేను అతనికి పెట్టిన పేరు ‘జోకులపతి ఫన్డితారాధ్యుల శుభ్రహాస్య గోలసుబ్రమణ్యం’. ఓసారి నాకు ఫోన్ చేసి ‘ఫలానా మన కామన్ ఫ్రెండ్‌కి మీ మున్సిపాలిటీలో ఏదో సర్టిఫికేట్ కావాలట. ఆ ఫ్రూఫ్లేవో పంపుతాడు. నువ్ కాస్త ఫాలోఅప్ చెయ్. మొన్న నేను కచ్చేరీకి వచ్చినప్పుడు ఎవరో వచ్చి కలిశారు. మేయరట. ఆ నంబర్ తెలుసుకుని నాకు పంపించు. నేనూ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తాను’ అన్నాడు. ‘మేయరా? నేన్నమ్మను గాక నమ్మను’ అన్నాను. ‘ఏం? నా ఫ్యానై ఉండకూడదా? ఇందులో నమ్మకపోవడానికేముంది?’ అన్నాడు. ‘నా పర్సనల్ అనుభవంతో చెప్తున్నాను, అక్కడ మెజా రిటీ వాళ్ళు మేస్తారు మేస్తారు మేస్తారు’. మణీ, నేనూ కలిసి ఎన్నోసార్లు వేదికలెక్కి నాటిక ప్రదర్శనల్లో పాల్గొన్నాం. ఓ సంవత్సరం ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌కి మైమ్ ప్రదర్శన. నటి రేవతి యాంకరింగ్. ప్రేక్షకుల్లో టాలీ, కోలీ, బాలీవుడ్ సెలబ్రిటీస్ ఎందరో! కల్పనా అయ్యర్ డాన్స్ మొదలైంది. తర్వాత మా ‘వైద్యోనారాయణో హరీ’ మ్యూజిమైమ్. సైడ్వింగ్లో మేకప్పు లతో రెడీగావున్నాం. అప్పుడు చూసుకుంటే బాలు తెల్లకోటు (ఆప్రన్) మర్చిపోయి వచ్చాడు. అందులో మేమిద్దరం డాక్టర్లం. ఏదో కామెడీగా ఆపరేషన్ చేసే సీను. ఒక్కసారి నాకైతే గుండెల్లో గుదిబండ పడ్డట్టయింది. ‘ఏం వర్రీకాకు. నువ్వు డాక్టర్ పాత్ర కంటిన్యూ చెయ్. నేన్నీ పక్కన కంపౌడర్‌గా మారిపోతాన’ని అప్పటికప్పుడు ప్యాంటు మోకాలు వరకూ మడిచి, చొక్కా పై బటన్స్ రెండు విప్పేసి రెడీ అయిపోయాడు. ప్రదర్శన బ్రహ్మాండంగా వచ్చింది. అలా మేం తెరవేయగానే వేదిక వెనక్కి వచ్చిన దర్శకుడు బాలచందర్, మణితో ‘నీకొక కథ రెడీ చేసుకోబోతున్నాను. అందులో హీరో నువ్వే. నేను చెప్పినప్పుడు డేట్స్ యివ్వు’ అనేసి వెళ్ళిపోయారు. తర్వాత అది నిజంగానే కార్య రూపం దాల్చి తమిళంలో వసంత్ అనే తన అసిస్టెంట్‌తో దర్శ కత్వం చేయించారు బాలచందర్ ‘కేలడి కన్మణి’ (ఇందులోనూ మణి ఉంది గమనించారా). పెద్ద హిట్టయింది. ఓ ఉదయం తిరుపతి నుంచి మెడ్రాస్ కార్లో వెళ్తూ బోర్ కొట్టి ‘వీడు అర్ధరాత్రీ అపరాత్రీ ఫోన్లు చేసి డోకులొచ్చే జోకులేసి విసి గించేస్తుంటాడు కదా ఇప్పుడైతే ఒ.పి.లో పేషెంట్లతో మాంచి బిజీగా ఉంటాడు కదా? డయల్ చేసి యివ్వు కాలెత్తాడంటే అయిపోయాడే’ అని తన పి.ఎ. విఠల్‌తో అన్నాడట. తర్వా తెప్పుడో నాకు చెప్పారు. సరే, ఇక్కడ నా ఫోన్ మోగింది. ‘ఏం చేస్తున్నావ్’ అట్నుంచి మణి గొంతు.‘ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకేం చేస్తాను గురూ’ అన్నాను. ‘అదే. ఎన్నో ఏళ్ళ నుండి నిన్నెప్పుడడిగినా ప్రాక్టీస్ అనే అంటావు. మరి పర్ఫెక్ట్ అయ్యేదెప్పుడు? ప్రాక్టీస్ మేక్స్ ఎ మాన్ పర్ఫెక్ట్ అంటారు గదా. అంటే నువ్ ప్రాక్టీస్ సరిగ్గా చెయ్యడం లేదన్నమాటేగా. ఇప్పుడు నేను న్నాననుకో పాట ప్రాక్టీస్ చేస్తాను. పర్ఫెక్ట్ అయ్యాకే రికార్డింగ్ చేస్తారు. అలా నువ్వూ పెర్ఫెక్ట్ అవ్వాలని నా ఆశ’... ఇలా సాగి పోయింది వరుస. కాసేపు కామెడీ పక్కన బెడ్తే మీతో పంచుకోవలసిన మరో గొప్ప విషయాన్ని నా బీరువా అరల్లోంచి బైటికి తీస్తాను. కాకినాడలో నేను ఫైనలియర్ యమ్బీబీయస్ చదువుతున్న రోజుల్లో కొవ్వూరు నుంచి ఇక్కడికి వలసొచ్చిన ఓ భారీ నంబరు మెంబర్లున్న ఫ్యామిలీతో పరిచయమైంది. ప్రతి రాత్రీ వాళ్ళొచ్చి నా బేచిలర్ రూమ్‌లో సంగీత సాహిత్య సమలంకృత సద్గోష్ఠి జరుపుతుండేవారు. ఆ అన్నదమ్ముల్లో ఒకాయన కొడుకు వయొ లిన్ అద్భుతంగా వాయించేవాడు. అతనికప్పుడు ఇంకా నిక్కర్ల వయసే! అతన్ని సినిమాల్లోకి పంపించాలనే ఉద్దేశంతో ముందో సారి బాలూకి పరిచయం చెయ్యమని నన్నడిగారు. నేనా కుర్రాడ్ని మద్రాస్‌లో మణి యింటికి తీసుకెళ్తే ఆ రాత్రి రెండు కీర్తనలు వింటే చాలనుకున్న బాలూకి ఇరవై రెండయినా తన్మయత్వం విడలేదు. అతిశయోక్తి కాదనుకుంటే ఆ రాత్రి అదే ఐ మీన్ తెల్లవారు జాము వరకూ రెండొందల రెండయినా అయ్యుంటాయి. చివర్న చేతు ల్నిండుగా చప్పట్లుకొట్టి ‘వెరీగ్రేట్. ఎలాంటి చైల్డ్ ప్రాడిజీని తీసు కొచ్చావ్! సంగీత ప్రపంచంలో ఇతనే హైట్స్‌కి వెళ్ళిపోతాడో నేనూహించలేను. గాడ్ బ్లెస్ యు’ అన్నాడు. ఆ కుర్రాడి పేరు – కీరవాణి. కీరవాణికి ఆస్కారకుడూ, ఆస్కారణ భూతుడైన∙రాజమౌళి కప్పుడు బహుశా రెండో, మూడో, ఏడో ఏడు. చాలాసార్లు వేదికల మీద కీరవాణి ప్రసక్తి వచ్చినప్పుడు మణి ‘నా ఫ్రెండ్ దివాకర్ నాకు మొట్టమొదట పరిచయం చేశాడు’ అంటుండేవాడు నేను గర్వపడేలాగ. తీరా ఇవ్వాళ కీరవాణి ఆస్కార్ పట్టుకొచ్చిన వేళకు, ముందే కూసిన కోయిలలా, కంగ్రాట్స్ చెప్పకుండానే, కంగారుపడి, కాయం చాలించి, కాలం చేసి, కీర్తిశేషుడయ్యడు బాలూ! నాకెంతో ఆప్తుడు, మనందరికీ ఇష్టుడైన మణి / బాలూకి ఈ డెబ్భయ్ ఏడవ జన్మదినాన ఈ భూగోళం ఉన్నంత కాలం బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ మెమొరబుల్ రిటర్న్స్ ఆఫ్ ది డే. డా‘‘ వై. దివాకర రావు వ్యాసకర్త ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్టు, కాకినాడ మొబైల్: 94403 40484 (నేడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి) -
మహోజ్వల భారతి: పుణ్యభూమి నా దేశం నమో నమామి
ఆజాదీ ఉద్వేగస్వరం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. బాలూ ఆలపించిన దేశభక్తి గీతాల్లో.. ‘పుణ్యభూమి నాదేశం నమో నమామి’, ‘జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపి గరియసి..’.. ప్రతి స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల నాడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మార్మోగిపోతుంటాయి. బాలూ జీవించి ఉంటే ఇప్పుడీ ఆజాదీ ఉత్సవాలకు ఆయన గళం అమృతోత్సవ స్వర వర్ణాలను అద్ది ఉండేది. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆ రెండు పాటల పల్లవులు, చరణాల్లోని కొన్ని భాగాలు. పుణ్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహా మహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత గన్న భాగ్యోదయ దేశం.. నా దేశం ..! ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రం (1993) లోని ఈ పాటకు సాహిత్యం జాలాది. సంగీతం ఎం.ఎం. కీరవాణి. సాహిత్యంలోని దేశభక్తి భావోద్వేగాలన్నిటినీ సంగీతానికి తగ్గట్లుగా ఒడలు పులకించేలా ఎప్సీ తన గళంలో పలికించారు. అదుగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి / అడుగొ అరి భయంకరుడు కట్ట బ్రహ్మన / అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన / వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి / అజాదు హిందు ఫౌజు దళపతీ నేతాజీ / అఖండ భరత జాతి కన్న మరో శివాజీ.. అని ఎస్పీ పాడుతున్నప్పుడు ఆనాటి సమరయోధులంతా కనుల ముందు సాక్షాత్కరించినట్లే ఉంటుంది. జనని జన్మభూమిశ్చ.. స్వర్గాదపి గరియసి / ఏ తల్లి నిను కన్నదో / ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా నీ తల్లి మోసేది నవమాసలేరా / ఈ తల్లి మోయాలి కడవరకురా.. కట్టే కాలేవరకురా ఆ రుణం తలకొరివితో తీరెనురా / ఈ రుణం ఏ రుపానా తీరేదిరా / ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా.. అనే ఈ దేశభక్తి గీతం ‘బొబ్బిలిపులి’ చిత్రం (1982) లోనిది. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం జె.వి.రాఘవులు. పాడింది ఎస్పీబీ. ఈ గీతంలో ఆయన ధీర గంభీర స్వరం.. శతఘ్నిలా ప్రతిధ్వనించి ప్రతి జవాను హృదయం ఉప్పెంగేలా చేస్తుంది. ఎస్పీబీ వ్యక్తిగతంగా కూడా బాధ్యత గల దేశ పౌరుడిగా ఉండేవారు. కరోనా సమయంలో ప్రజల్లో భయాందోళనలు పోగొట్టి వారికి ధైర్యం చెప్పడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశమంతటా ఒక ఐక్యతా కార్యక్రమంగా దీపాలు వెలిగించి, పళ్లేలు మోగించాలని చెప్పినప్పుడు ఎస్పీబీ తు.చ. తప్పకుండా ఆ సూచనను పాటించారు. అంతేకాదు, యువతరాన్ని అందుకు మోటివేట్ చేశారు కూడా! -
నిష్క్రమించిన దిగ్గజం
దాదాపు అయిదున్నర దశాబ్దాలపాటు సినీ సంగీత ప్రపంచాన అసాధారణమైన, అనితరసాధ్య మైన ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించి భూగోళం నాలుగు చెరగులా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం కన్ను మూశారు. ప్రపంచ దేశాలన్నిటా గత ఏడెనిమిది నెలలుగా కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తోంది. ఇంతవరకూ దాదాపు పది లక్షలమందిని అది బలితీసుకుంది. వీరిలో ‘మా బాలు’ వుంటా రని ఆయన అభిమానుల్లో ఏ ఒక్కరూ అనుకోలేదు. అసలు తనకు కరోనా సోకిందని ఆయనే స్వయంగా ఒక వీడియో ద్వారా వెల్లడించినప్పుడు అభిమాన జనం నిర్ఘాంతపోయింది. తమకో, తమ కుటుంబసభ్యులకో వచ్చినంతగా తల్లడిల్లింది. ఆయన ఈ మహమ్మారి బారి నుంచి సురక్షి తంగా బయటపడాలని అందరూ వేయి దేవుళ్లకు మొక్కుకున్నారు. ఆయన యోగక్షేమాలను ప్రతి రోజూ ఆరా తీశారు. చికిత్సకు ఆయన బాగా స్పందిస్తున్నారని తెలుసుకున్నాక ఉపశమనం పొందారు. ఈ నెల 7న జరిపిన కోవిడ్ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చిందన్నాక అందరూ çసంతోషంతో ఉప్పొంగారు. కానీ ఆ మహమ్మారి పోతూ పోతూ బాలు ఊపిరితిత్తుల్ని బాగా దెబ్బ తీసింది. హఠాత్తుగా గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్యం విషమించిందన్న వార్త అందరినీ దిగ్భ్రమలోకి నెట్టింది. 24 గంటలు గడవకముందే ఆ స్వర మాంత్రికుడు ఈ లోకం నుంచి నిష్క్రమించారు. తెలుగింట పుట్టిన ఒక అద్భుతం బాలసుబ్రహ్మణ్యం. సంగీతంలో ఆయన కన్నా నిష్ణాతులు ఉండొచ్చు. చాలాసార్లు తానే చెప్పుకున్నట్టు ఆయనకన్నా గొప్ప గాయకులు ఉండొచ్చు. కానీ ఏక కాలంలో భాషనూ, నుడికారాన్ని, పదాల విరుపును, అందులోని సంస్కారాన్ని అంత బాగా ఒడిసిపట్టుకోగలిగే నిష్ణాతుడు మరొకరుండరు. మాతృభాషలో మాత్రమే కాదు... తాను పాడిన దాదాపు 18 భాషల్లోనూ, 41వేల పాటల్లోనూ ఆయన ఈ నియమం పాటించారు. కెరీర్ మొదట్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్ తమిళ సినిమాలో పాడే అవకాశం ఇచ్చినప్పుడు చెప్పిన మాటను ఆయన చివరి వరకూ తుచ తప్పకుండా పాటించారు. ‘పాట బాగా పాడావుగానీ, ఉచ్చారణ సరిగ్గా లేదు. తమిళం నేర్చుకుని రా’ అని ఆయన చెప్పారట. ఏడాదిపాటు ఆ భాషను ఔపోసన పట్టి, ఆయనతోనే శభాష్ అనిపించుకుని మరీ తమిళంలో పాడారు. అప్పటినుంచి తాను పాడే పాట ఏ భాషదైనా దాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకుని, అవగాహన చేసుకునేవారు. కనుకనే ఏ భాష మాట్లాడేవారైనా బాలును తమవాడిగా భావించారు. ఆయన పాట పండిత, పామర జన రంజకం కావడం... చిత్ర విజయానికి అది దోహదపడటం గమనించి ఆయన కోసం నిర్మాతలు, సంగీత దర్శకులు క్యూ కట్టేవారు. తాను పాట పాడాల్సిన నటుడెవరో తెలుసుకుని, వారి పాత్రేమిటో ఆరా తీసి, వారి గాత్రాన్ని అవగాహన చేసుకుని అచ్చం వారే పాడుతున్న అనుభూతి కలిగించడానికి బాలు చేసిన ప్రయత్నం అనితరసాధ్యం. బాలుకు ముందు ఈ ప్రయత్నం చేసినవారు దాదాపు లేరు. కనుకనే అన్ని తరాల కథానాయకులూ బాలూనే ఎంచుకునేవారు. రాజబాబు, అల్లు రామ లింగయ్యవంటి హాస్యనటులు, కైకాలవంటి కేరెక్టర్ ఆర్టిస్టులు–ఇలా అందరిలోనూ ఆయన గాత్రం ఒదిగిపోయేది. అది భక్తిరసాన్ని ఒలికించే పాటైనా, విస్ఫులింగాల్ని వెదజల్లే పాటైనా, అది ఆర్ద్రతను చాటే పాటైనా, ఆవేశాన్ని రగిల్చే పాటైనా... నవ రసాలూ ఆయన గళం పలికేది. ఆయన గొంతు పలికే వరకూ పాటలో సైతం ధ్వన్యనుకరణ సాధ్యమని ఎవరికీ తెలియదు. ఆ అరుదైన కళ ఆయన నోట పాటనే కాదు... సంభాషణల్ని కూడా పలికించింది. ‘మన్మథ లీల’తో మొదలుపెట్టి ఎన్నో చిత్రా లకు ఆయన డబ్బింగ్ చెప్పారు. ప్రఖ్యాత నటుడు ‘దశావతారాలు’ సినిమాలో కమల్ హాసన్ ఏడు పాత్రల్లో నటిస్తే బాలు ఆ పాత్రలన్నిటికీ వైవిధ్యభరితమైన డబ్బింగ్ చెప్పి అందరినీ సంభ్రమాశ్చ ర్యాల్లో ముంచెత్తారు. ఎవరైనా చెబితే తప్ప అన్ని పాత్రలకు బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పారని తెలిసే అవకాశం లేదు. మనం సినిమాలోనో, రేడియోలోనో, టీవీ చానెల్‌లోనో ఒకటికి పదిసార్లు విన్న పాటే అయినా... భిన్న వేదికలపై అదే పాట పాడిన ప్రతిసారీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంగతులను నింపి, అద్భుత స్వరాలాపనతో ఆహూతుల్ని మంత్రముగ్ధుల్ని చేయడం ఒక్క బాలూకు మాత్రమే సాధ్యం. కర్ణాటక సంగీత దిగ్గజం బాలమురళీకృష్ణ చాలా తరచుగా–‘నాకు సంగీతం పెద్దగా తెలియదండీ...కానీ సంగీ తానికి నేను తెలుసును’ అనేవారు. బాలసుబ్రహ్మణ్యంలోనూ అదే వినమ్రత ఉట్టిపడేది. ప్రఖ్యాత దర్శకుడు కె. విశ్వనాథ్, సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ ఆయన్ను ఆ వినమ్రత నుంచి బయటకు తీసుకురాకపోయివుంటే ‘శంకరాభరణం’ వంటి కళాఖండం సాధ్యమయ్యేది కాదు. ఆ చిత్ర ఇతి వృత్తంతోపాటు బాలూ గొంతునుంచి జాలువారిన పాటలన్నీ దాని ఘన విజయానికి తోడ్పడ్డాయి. సామాన్యులకు సైతం సంగీతంపై ఆసక్తినీ, అనురక్తినీ కలిగించాయి. చిన్ననాటినుంచే వేదికలపై నిర్భయంగా మాట్లాడటం, పాడటం అలవాటైంది కనుక కొత్తగా తోసుకొచ్చిన బుల్లితెర మాధ్యమం కూడా ఆయనకు ఇట్టే పట్టుబడింది. అంతకు చాన్నాళ్లముందు ఆయన వివిధ నగరాల్లోనూ, పట్టణా ల్లోనూ ఆర్కెస్ట్రాతో ప్రదర్శనలిచ్చిన సందర్భాలున్నాయి. అలాంటి సమయాల్లో తాను పాడే పాట లోని సాహిత్యాన్ని, అందులోని సొబగుల్ని, ఆ పాట సందర్భాన్ని చమత్కారభరితంగా చెప్పడం, చెణుకులేయడం ఆయనకు అలవాటు. దాన్నే బుల్లితెరపై కూడా కొనసాగించి తెలుగుపాటను అజ రామరం చేశారు. పాడుతా తీయగా, ఎందరో మహానుభావులు, పాడాలని ఉంది వంటి కార్యక్రమా లతో వందలాదిమంది ప్రతిభాశాలురను తీర్చిదిద్దిన ఘనత ఆయనదే. చివరి వరకూ పాట కోసం పరితపించి, ఆ క్రమంలోనే అనారోగ్యానికి లోనయి, కానరాని తీరాలకు వెళ్లిపోయిన బహుముఖ ప్రజ్ఞాశాలి బాలసుబ్రహ్మణ్యం స్మృతికి ‘సాక్షి’ వినమ్రంగా నివాళులర్పిస్తోంది. -
ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్
-
బాలు సార్ త్వరగా కోలుకోవాలి
-
నిలకడగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం
సాక్షి, చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఆదివారం కాస్త మెరుగుపడిందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్లాస్మా చికిత్సతో ఆరోగ్యం మెరుగుపడినట్లు వెల్లడించారు. మరో 2 రోజులు వెంటిలేటర్‌పై ఉండాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తోందని.. ççస్పృహలోకి వచ్చారని వివరించారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ కూడా సాయంత్రం మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. తన తండ్రి ఆరోగ్యం కుదుటపడిందని.. అందర్నీ గుర్తు పడుతున్నారని చెప్పారు. తన తల్లి కూడా బుధవారంలోపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని తెలిపారు. బ్రదర్.. నీ కోసం ఎదురు చూస్తున్నాం: కమల్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఆదివారం ట్వీట్ చేశారు. ‘సోదరుడా.. నీ కోసం ఎదురుచూస్తున్నాం. అనేక ఏళ్ల పాటు మీరు నాకు గొంతుకగా ఉన్నారు. నేను మీ స్వరానికి ముఖ చిత్రంగా ఉన్నాను. మీ స్వరం మళ్లీ ప్రతిధ్వనించాలి. త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తారని ఎదురుచూస్తున్నాం’ అంటూ కమల్ ట్వీట్ చేశారు. -
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్
-
బాలూకి మాతృ వియోగం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తల్లి శకుంతల (89) సోమవారం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు నెల్లూరులో కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారామె. ఎస్పీబీ తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి ప్రసిద్ధి చెందిన హరికథకుడు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం సమీపంలోని కోనేటమ్మపేట గ్రామానికి చెందిన శకుంతలతో వివాహం అయింది. వారి ప్రథమ సంతానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. నెల్లూరు నగరం లోని తిప్పరాజువారి వీధిలో సాంబమూర్తి దంపతులు ఒక ఇంటిని కొనుక్కున్నారు. అక్కడే ఈ దంపతుల సంతానం బాలుతోపాటు గిరిజ, పార్వతి, జగదీష్, శైలజ, వసంతలక్ష్మి పెరిగి పెద్దవారయ్యారు. శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి భిక్షాటనాపూర్వక త్యాగరాజ స్మరణోత్సవాలను నిర్వహించేవారు. ఆ పరంపర ఇప్పటికీ నెల్లూరులో కొనసాగుతోంది. ఇంటిపై మమకారం సంతానం అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు సాధించినప్పటికీ తాను ఉన్న ఇంటి పైనే శకుంతలకు మమకారం ఎక్కువ. భర్త మరణించి దాదాపు 40 ఏళ్లు అయినా ఆమె ఆ ఇంటిని వదలలేదు. భర్త కష్టార్జితం కావడం, జీవితంలో అన్ని ఘట్టాలతో పెనవేసుకున్న గృహం కావడంతో ఆమెకు ఆ ఇల్లంటే ప్రాణం. తండ్రి మరణానంతరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన దగ్గర చెన్నైలో ఉండాలని కోరినా ఆమె ఒప్పుకోలేదు. తన జ్ఞాపకాలను, తన ఇంటిని దూరం చేయొద్దని బాలును ఒప్పించారామె. చేసేదేం లేక బాలు ఆమె కోసం ఒక కుటుంబాన్ని ఆమె వద్ద ఉంచి ఆమె ఆలనాపాలనా బాధ్యతలు చూసేలా చేశారు. ఓ సంగీత కచేరి నిమిత్తం లండన్ వెళ్లిన బాలు తల్లి మరణవార్త తెలియగానే ఇండియా బయలుదేరారు. శకుంతలమ్మ అంతిమ యాత్ర స్వస్థలమైన నెల్లూరులో మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, తమ సంప్రదాయంలో భాగంగా నెల్లూరు బోడిగాడి తోటలో ఖననం చేయనున్నామని బంధుమిత్రులు తెలిపారు. – సాక్షి, నెల్లూరు -
శాశ్వతంగా నిలిచేది అక్షరమే
-
శాశ్వతంగా నిలిచేది అక్షరమే
హైదరాబాద్: అక్షరం ఎప్పుడూ శాశ్వతంగా నిలుస్తుందని ప్రముఖ సినీ నేపథ్య్గ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. గోకుల్చంద్ర, రాహుల్‌చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొల్లపూడి మారుతీరావు సంపాదకత్వంలో రూపుదిద్దుకున్న 116 మంది ప్రముఖ కథా రచయితల వైభవ దీపిక ‘వందేళ్ల కథకు వందనాలు’ గ్రంథావిష్కరణ సభ సోమవారం రాత్రి నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళామందిరంలో జరిగింది. సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం హాజరై గ్రంథాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. తొలిప్రతిని కొండూరి రామ్మూర్తికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి, విజయ్ నిర్మాణ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయితలను ఘనంగా సత్కరించారు. -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : అతడు: పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం నువ్వు రామ్మా ఓ వేదమా... విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేరుచేయుమా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా ॥ చరణం : 1 అ: ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా ఆమె: నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా నువ్వు రామ్మా ఓ అరుంధతి... ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా ॥ చరణం : 2 అ: చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది ఆ: ఆ జ్వాలలతోనే జీవించే టి ధైర్యం అందిస్తూ ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు నువ్వు రామ్మా మాంగల్యమా... వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళ్లకు విడాకుల వేడుకలో నేడు తె ంపడం నేర్పడానికి ॥ చిత్రం: ఆహ్వానం (1997) రచన: సిరివెన్నెల, సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి గానం: ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర -
ఎస్పీ బాలుకి డబ్బింగ్ చెప్పాలనేది నా డ్రీమ్! - ఆర్.సి.ఎం.రాజు
ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సినిమా చూశారుగా. అందులో గోదావరి పుష్కరాల సన్నివేశంలో ప్రత్యర్థుల్ని ఎన్టీఆర్ తెగ నరుకుతుంటాడు. ఆ సందర్భంలో ఎన్టీఆర్‌ని చూసిన శరత్‌సక్సేనా భావోద్వేగానికి లోనై.. ‘సింగమలై అన్నా...’ అని అరుస్తాడు. ఆ డైలాగు చాలా చిన్నదే. కానీ అందులోని ఉద్వేగం జనాలను కట్టిపడేసింది. ఆ డైలాగ్ చెబుతూ తెరపై మనకు కనిపించింది శరత్‌సక్సేనా. కానీ వెనకున్న వ్యక్తి వేరు. అతనే... అనువాద కళాకారుడు ఆర్.సి.ఎం.రాజు. ప్రతినాయక పాత్రధారులకు తన కంఠాన్ని అరువిస్తూ... ఆయా పాత్రలకు తన గొంతుతో ప్రాణ ప్రతిష్ట చేస్తున్న రాజుతో ‘సాక్షి’ ప్రత్యేకంగా జరిపిన ఇంటర్వ్యూ ఇది. అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారా? లేక అనుకునే అయ్యారా? ‘అనుకోకుండా’ అని చెప్పలేను, ‘అనుకునే’ అని చెప్పలేను. అయితే.. అంతా తెలిసే జరిగిందని మాత్రం చెప్పగలను. మా నాన్నగారి పేరు ఆర్.సుబ్బరాజు. రిటైర్డ్ సబ్ఇన్స్పెక్టర్. అమ్మ జయమ్మ హౌస్‌వైఫ్. అమ్మకు నన్ను కళాకారుణ్ణి చేయాలని కోరిక. చిన్నప్పుడే స్టేజ్ షోలు చేస్తుండేవాణ్ణి. కాలేజ్ టైమ్‌లో అయితే మిమిక్రీ షోలు చేశాను. ఓ ఆర్కెస్ట్రా కూడా నడిపా. అప్పట్లో ఉపన్యాస పోటీలు ఎక్కడ జరిగినా మొదటి బహుమతి నాదే. మొదట్నుంచీ నా పెర్ఫార్మెన్స్ కంటే... గాత్రానికే ఎక్కువ ప్రశంసలొచ్చేవి. జనం ఆదరిస్తుంటే అర్థమైంది... నా గాత్రంలో ఏదో గమ్మత్తు ఉందని. చివరకు ఆ గాత్రమే ఈ రోజు నన్ను ఓ స్థాయిలో నిలబెట్టింది. అసలు డబ్బింగ్ రంగంలోకి ఎలా వచ్చారు? నా లక్ష్యం ఆలిండియా రేడియో ఎనౌన్సర్ అవ్వడం. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మా ఊరు. అక్కడే డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేయడానికి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చేరా. అక్కడ చదువుతున్నప్పుడే... ‘యువవాణి’ కార్యక్రమానికి ఆలిండియా రేడియో వారు ఆడిషన్స్‌కి పిలిచారు. అప్పుడే.. యాదృచ్ఛికంగా ‘రుతురాగాలు’ సీరియల్లో నగేష్ కర్రకు డబ్బింగ్ చెప్పే అవకాశం లభించింది. మరి సినిమా అవకాశం...? నాగార్జున ‘ఆటో డ్రైవర్’ సినిమాకు డబ్బింగ్ శాఖలో పనిచేశా. ‘ఆనందం’(2000) సినిమాలో వెంకట్ పాత్రకు డబ్బింగ్ చెప్పాను. అదే నా తొలి బ్రేక్ అనువాద కళాకారునిగా మీకు పేరు తెచ్చిన సినిమాలు? నరసింహనాయుడు, ఇంద్ర, సింహాద్రి, పోకిరి... ఇలా ఎన్నో ఉన్నాయి. రవిశంకర్‌గారు బిజీగా ఉంటే.. డబ్బింగ్ ఇన్‌చార్జ్‌లు నాతో చెప్పించేవారు. మీరు ఛాలెంజ్‌గా తీసుకొని డబ్బింగ్ చెప్పిన సినిమాలు? ‘రక్తచరిత్ర’లో వివేక్ ఓబెరాయ్కి, ‘రక్త కన్నీరు’లో ఉపేంద్రకి డబ్బింగ్ చెప్పాను. ఆ రెండు పాత్రలకీ డబ్బింగ్ చెప్పడానికి చాలా కష్టపడ్డా ఎందరో నటులకు గాత్రదానం చేశారు. మరి మీరే ఎందుకు నటించకూడదు? నటనలో భాగమే డబ్బింగ్. అయితే.. అనువాద రంగంలో బిజీ అయ్యాక... నటుడు అవ్వాలని మనసులో ఉన్నా అవ్వలేని పరిస్థితి. ఇటీవలే ‘అవతారం’ చిత్రానికి డబ్బింగ్ చెబుతుంటే.. కోడి రామకృష్ణగారు అడిగారు.. ‘నటిస్తావా..’ అని. చేస్తానని చెప్పేశా. నేడో రేపో ఆయన నుంచి ఫోన్ రావచ్చు. ప్రస్తుతం ఏయే సినిమాలకు డబ్బింగ్ చెప్పారు? ‘ఎవడు’లో రాహుల్దేవ్కి, ‘అత్తారింటికి దారేది’లో ముఖేష్‌రుషికి, ‘భాయ్’లో ఆశిష్విద్యార్థికి, కోడిరామకృష్ణ ‘అవతారం’లో సత్యప్రకాష్కి. అన్నీ విలన్లకేనా. హీరోలకు చెప్పలేదా? మమ్ముట్టి, మోహన్‌లాల్‌లకు చెప్పేశాను. మలయాళం డబ్బింగ్ ‘4ఫ్రెండ్స్’ చిత్రానికి గాను కమల్‌హాసన్‌కి కూడా చెప్పాను. ఇంకెవరికైనా డబ్బింగ్ చెప్పాలని కోరిక ఉందా? ఎస్పీ బాలుగారికి చెప్పాలి. ఆయనంత గొప్పగా డబ్బింగ్ చెప్పడమంటే ఛాలెంజే. ఆయనకు డబ్బింగ్ చెప్పాలన్న కోరిక ఎప్పుడు తీరుతుందో! అవార్డులేమైనా అందుకున్నారా? ‘పురాణ గాథలు’, ‘మొగలిరేకులు’ సీరియల్స్‌కి నందులు అందుకున్నాను. సినిమాల విషయానికొస్తే... ‘డార్లింగ్’ చిత్రంలో ముఖేష్‌రుషికి, ‘పోరు తెలంగాణ’లో నటుడు జమకి చెప్పిన డబ్బింగ్‌లకు నందులొచ్చాయి. డబ్బింగ్ కళ ఒకప్పుడు ఉన్నంత ఉన్నతంగా ఇప్పుడుందంటారా? ఇప్పుడు కూడా మంచి డబ్బింగ్ ఆర్టిస్టులున్నారు. జగ్గయ్య, పీజేశర్మ లాంటి వాళ్లు డబ్బింగ్ కళకు వన్నె తెస్తే... సాయికుమార్, రవిశంకర్ లాంటి వాళ్లు దాన్ని ఓ అత్యున్నత స్థానంలో నిలబెట్టారు. వాళ్లందరూ నాకు ఆదర్శమే. డబ్బింగ్ చిత్రాల్ని, సీరియల్స్‌ని రద్దు చేయాలనే ఉద్యమంపై మీ అభిప్రాయం? సమర్థించలేను. ఖండించనూ లేను. ఫలితం ఏదైనా శిరసావహిస్తానంతే.