
‘వందేళ్ల కథకు వందనాలు’ గ్రంథావిష్కరణ సభలో విజయ్ కుమార్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సాక్షి దినపత్రిక ఈడీ కె.రామచంద్రమూర్తి, గొల్లపూడి మారుతీరావు, రచయిత్రి చాగంటి తులసి, అంపశయ్య నవీన్
హైదరాబాద్: అక్షరం ఎప్పుడూ శాశ్వతంగా నిలుస్తుందని ప్రముఖ సినీ నేపథ్య్గ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. గోకుల్‌చంద్ర, రాహుల్‌చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొల్లపూడి మారుతీరావు సంపాదకత్వంలో రూపుదిద్దుకున్న 116 మంది ప్రముఖ కథా రచయితల వైభవ దీపిక ‘వందేళ్ల కథకు వందనాలు’ గ్రంథావిష్కరణ సభ సోమవారం రాత్రి నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళామందిరంలో జరిగింది.
సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం హాజరై గ్రంథాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. తొలిప్రతిని కొండూరి రామ్మూర్తికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి, విజయ్ నిర్మాణ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయితలను ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment