ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : నగరంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ ముందు శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్సీ వర్గీకరణకు టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎలా మద్ధతు ఇస్తాడంటూ మాలమహానాడు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీఎన్ఎస్ఎఫ్ నాయకులకు, మాలమహానాడు నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు మాలమహానాడు నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ స్టేషన్‌కు తరలించారు.