sp Gopinath
-
'మందకృష్ణ మాదిగ యాత్రకు అనుమతి లేదు'
- శాంతి భద్రతల దృష్ట్యా యాత్రకు అనుమతి నిరాకరణ - మందకృష్ణపై కొంతమంది మాదిగల ఫిర్యాదు: తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ తిరుపతి: ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ రథయాత్రకు అనుమతి లేదని తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ వెల్లడించారు. మంగళవారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. మందకృష్ణ మాదిగ పై చిత్తూరు జిల్లాకు చెందిన కొంతమంది మాదిగలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా మందకృష్ణ మాదిగ యాత్రకు అనుమతిని నిరాకరించినట్టు చెప్పారు. కాగా, ఈ నెల 10న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె నుంచి మందకృష్ణ మాదిగ యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. -
సంచలన కేసులు ఛేదించాం
గతం కన్నా తగ్గిన నేరాలు చోరీ అయిన సొత్తు రూ.6.95 కోట్లు రికవరీ అయింది రూ.3.11 కోట్లు అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ జట్టి తిరుపతి క్రైం: తిరుపతి అర్బన్ జిల్లాలో పలు సంచలన కేసులు ఛేదించామని అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ జట్టి తెలిపారు. 2015లో ఏడాది మొత్తం జరిగిన వివిధ నేరాలకు సంబంధించిన పోలీసులు తీసుకున్న చర్యలపై మంగళవారం పోలీసు అతిథిగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీయాక్ట్ కేసు నమోదు చేశామన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించేందుకు అడవుల్లో టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని ఏర్పాటు చేసి కూంబింగ్ నిర్వహించామన్నారు. 2015లో 62 కేసులు నమోదు కాగా, 250 మంది ఎర్ర కూలీలను అరెస్టు చేశామన్నారు. మొత్తం వీరి వద్ద నుంచి 1016 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మారిషస్‌లో పట్టుబడిన కొల్లెం గంగిరెడ్డిని భారతదేశానికి తీసుకురావడంలో అర్బన్ జిల్లా పోలీసులు కృషి చేశారన్నారు. ఈ సంవత్సరం సంచలన కేసులైన తిరుచానూరులో ఓ హత్య కేసులో పోలీసు అధికారిని సస్పెండ్ చేశామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శ్రీకాళహస్తి తదితర ప్రాంతాలలో బాధితులకు అండగా నిలిచామన్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో ఎస్ఐ సంజీవ్‌కుమార్ వరదల్లో కొట్టుకుపోతున్న కాళిముత్తు, కృష్ణన్ అనే ఇద్దరిని ప్రాణాలకు తెగించి కాపాడడం జరిగిందన్నారు. మస్కన్ ఆపరేషన్ ద్వారా 127 మంది పిల్లలను చేరదీసి కొందరిని వారి తల్లిదండ్రులకు, మరికొందరిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించారన్నారు. ఈ సంవత్సరంలో దొంగిలించిన మొత్తం రూ.6,95,34,741 కాగా రూ.3,11,31,147 సొత్తును రికవరీ చేశామన్నారు. షీటీమ్‌ల ద్వారా 354 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. మూడు బాల్య వివాహాలను ఆపామన్నారు. ఏఎస్పీలు సుబ్బారెడ్డి, స్వామి, డీఎస్పీలు రవిశంకర్‌రెడ్డి, వెంకటనారాయణ, రవికుమార్, ఇలియాజ్‌బాషా, నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత
తిరుమల: గరుడ వాహనానికి అదనంగా 1500 మందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి అదనపు ఎస్పీ గోపీనాథ్ అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల, తిరుపతిలో రెండు డ్రోన్ కెమెరాలు టీటీడీ ఏర్పాటు చేయనుంది. గరుడ వాహనం ముందు రోజు నుతంచి తిరుమల ఘాట్ రోడ్డుపై బైక్‌లను నిలిపివేస్తామని గోపినాథ్ చెప్పారు. తిరుమల బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన ముఖ్య నిఘా అధికారి నాగేంద్ర కుమార్ సమీపక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు మొత్తం 4,500మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తిరుమల గరుడ వాహనాన్ని పిల్లలు వృద్ధులు రాకుండా చూసుకుంటే మంచిదని ఈ సందర్భంగా ఆయన సూచించారు. -
అర్బన్ ఎస్పీగా గోపీనాథ్
గుంటూరు, న్యూస్‌లైన్: అర్బన్ జిల్లా ఎస్పీగా జెట్టి గోపినాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా 44 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ప్రస్తుతం అర్బన్ ఎస్పీగా పనిచేస్తున్న బి.వి.రమణకుమార్‌ను హైదరాబాద్ సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు. ఇక్కడే అడిషనల్ ఎస్పీగా కొనసాగుతున్న జెట్టి గోపినాథ్‌కు ఎస్పీగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ గుంటూరు అర్బన్‌లోనే పోస్టింగ్ ఇచ్చారు. నెల్లూరు ఎస్పీగా పనిచేస్తూ ఈ ఏడాది జూలై 4వతేదీన గుంటూరుకు బదిలీపై వచ్చిన రమణకుమార్ బాధితుల సమస్యల్ని తక్షణ పరిష్కారం చేసిన ఎస్పీగా గుర్తింపు తెచ్చుకున్నారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణలో ఆయన సమర్ధతను ప్రభుత్వం గుర్తించింది. రమణకుమార్ సతీమణి ఉదయలక్ష్మి కూడా ఐఏఎస్ కావడంతో స్పౌజ్ కాజ్ కింద బదిలీ జరిగినట్లు భావిస్తున్నారు. నాటి రైతుబిడ్డ .. నేటి ఎస్పీ 2008 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన జెట్టి గోపినాథ్ స్వగ్రామం నెల్లూరు జిల్లా, ఓజిలి మండలం కలబల్లవోలు . తండ్రి జెట్టి పుల్లయ్య, తల్లి వెంకాయమ్మ. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి ఆయన అగ్రికల్చర్ ఎమ్మెస్సీ పూర్తి చేసి పోలీసు సర్వీసులోకి అడుగిడారు. గోపీనాథ్ భార్య సుష్మ, వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈయన మొదటి పోస్టింగ్ విశాఖ జిల్లా చింతపల్లి ఓఎస్డీగా చేసి అక్కడి నుంచి గ్రేహౌండ్స అసిస్టెంట్ కమాండెంట్‌గా, ఈఏడాది మార్చి 13న అడిషనల్ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది గుంటూరుకు వచ్చారు. అడిషనల్ ఎస్పీగానే జిల్లాలో శాంతిభద్రతలు పర్యవేక్షించడంలో కీలకంగా వ్యవహరించారు.