'మందకృష్ణ మాదిగ యాత్రకు అనుమతి లేదు' | No permission to organise the Manda krishna madiga yatra | Sakshi
Sakshi News home page

'మందకృష్ణ మాదిగ యాత్రకు అనుమతి లేదు'

Published Tue, Mar 8 2016 6:40 PM | Last Updated on Mon, Oct 8 2018 3:00 PM

ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ రథయాత్రకు అనుమతి లేదని తిరుపతి అర్బన్‌ ఎస్పీ గోపీనాథ్‌ వెల్లడించారు.

- శాంతి భద్రతల దృష్ట్యా యాత్రకు అనుమతి నిరాకరణ
- మందకృష్ణపై కొంతమంది మాదిగల ఫిర్యాదు: తిరుపతి అర్బన్‌ ఎస్పీ గోపీనాథ్‌


తిరుపతి: ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ రథయాత్రకు అనుమతి లేదని తిరుపతి అర్బన్‌ ఎస్పీ గోపీనాథ్‌ వెల్లడించారు. మంగళవారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. మందకృష్ణ మాదిగ పై చిత్తూరు జిల్లాకు చెందిన కొంతమంది మాదిగలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా మందకృష్ణ మాదిగ యాత్రకు అనుమతిని నిరాకరించినట్టు చెప్పారు. కాగా, ఈ నెల 10న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె నుంచి మందకృష్ణ మాదిగ యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement