అర్బన్ ఎస్పీగా గోపీనాథ్ | Urban new sp Gopinath | Sakshi
Sakshi News home page

అర్బన్ ఎస్పీగా గోపీనాథ్

Published Mon, Oct 28 2013 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

Urban  new  sp Gopinath

 గుంటూరు, న్యూస్‌లైన్: అర్బన్ జిల్లా ఎస్పీగా జెట్టి గోపినాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా 44 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ప్రస్తుతం అర్బన్ ఎస్పీగా పనిచేస్తున్న బి.వి.రమణకుమార్‌ను హైదరాబాద్ సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు. ఇక్కడే అడిషనల్ ఎస్పీగా కొనసాగుతున్న జెట్టి గోపినాథ్‌కు ఎస్పీగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ గుంటూరు అర్బన్‌లోనే పోస్టింగ్ ఇచ్చారు. నెల్లూరు ఎస్పీగా పనిచేస్తూ ఈ ఏడాది జూలై 4వతేదీన  గుంటూరుకు బదిలీపై వచ్చిన రమణకుమార్ బాధితుల సమస్యల్ని తక్షణ పరిష్కారం చేసిన ఎస్పీగా గుర్తింపు తెచ్చుకున్నారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణలో ఆయన సమర్ధతను ప్రభుత్వం గుర్తించింది. రమణకుమార్ సతీమణి ఉదయలక్ష్మి కూడా ఐఏఎస్ కావడంతో స్పౌజ్ కాజ్ కింద బదిలీ జరిగినట్లు  భావిస్తున్నారు.
 
 నాటి రైతుబిడ్డ .. నేటి ఎస్పీ
 2008 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన జెట్టి గోపినాథ్ స్వగ్రామం నెల్లూరు జిల్లా, ఓజిలి మండలం కలబల్లవోలు . తండ్రి జెట్టి పుల్లయ్య, తల్లి వెంకాయమ్మ. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి ఆయన అగ్రికల్చర్ ఎమ్మెస్సీ పూర్తి చేసి పోలీసు సర్వీసులోకి అడుగిడారు. గోపీనాథ్ భార్య సుష్మ, వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈయన మొదటి పోస్టింగ్ విశాఖ జిల్లా చింతపల్లి ఓఎస్డీగా చేసి అక్కడి నుంచి గ్రేహౌండ్‌‌స అసిస్టెంట్ కమాండెంట్‌గా, ఈఏడాది మార్చి 13న అడిషనల్ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది గుంటూరుకు వచ్చారు. అడిషనల్ ఎస్పీగానే  జిల్లాలో శాంతిభద్రతలు పర్యవేక్షించడంలో కీలకంగా వ్యవహరించారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement