Spaniel
-
కుక్క ఉంది.. బెయిల్ ఇవ్వండి!
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.13,500 కోట్ల కుచ్చుటోపీ పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు బెయిల్ నిరాకరించినపుడు చిత్రమైన ఘటన జరిగింది.∙ఈ సందర్భంగా నీరవ్ బెయిల్ పొందేందుకు వీలుగా ఆయన లాయర్ల బృందం కొత్తతరహా వాదనను కోర్టుముందుకు తీసుకొచ్చింది. నీరవ్ పెంపుడు కుక్కను కారణంగా చూపుతూ బెయిల్ ఇవ్వాలని కోరింది. నీరవ్ తరఫున క్లేర్ మాంట్గోమెరీ వాదనలు వినిపిస్తూ..‘నీరవ్ మోదీ కుమారుడు ఇక్కడే చార్టర్‌హౌస్ ప్రాంతంలో పాఠశాల చదువు పూర్తిచేశారు. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నారు. దీంతో ఒంటరితనంతో ఉన్న నీరవ్ ఓ కుక్కను తెచ్చుకుని పెంచుకుంటున్నారు దేశాన్ని వదిలిపోయే వ్యక్తులెవరైనా ఈ పని చేస్తారా? బ్రిటన్ ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులకు పేరుగాంచింది’ అని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌కు వచ్చాక మరో దేశపు పౌరసత్వం కోసం నీరవ్ దరఖాస్తు చేసుకోలేదన్నారు. ఒకవేళ బెయిల్ మంజూరుచేస్తే నీరవ్ పాస్‌పోర్టును స్వాధీనం చేయడంతో పాటు హాంకాంగ్, సింగపూర్, యూఏఈలో ఉన్న నివాస అనుమతి పత్రాలను సరెండర్ చేస్తారని కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న ధర్మాసనం నీరవ్ దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. -
పెంపుడు కుక్కకు సారీ చెప్పలేదని..
న్యూఢిల్లీ: దేశరాజధానిలో దారుణం చోటుచేసుకుంది. తమ పెంపుడు కుక్కకు సారీ చెప్పనందుకు ముగ్గురు దుండగులు ఓ మినీ ట్రక్కు డ్రైవర్‌ను కత్తులు, స్క్రూ డ్రైవర్‌తో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఢిల్లీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న విజేందర్ రాణా(45) శుక్రవారం అర్ధరాత్రి తన వాహనంలో ఇంటికి బయలుదేరాడు. ఇక్కడి ఉత్తమ్ నగర్‌లోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో అంకిత్, అతని సోదరుడు పరస్, స్నేహితుడు దేవ్ చోప్రాలు తమ కుక్క టామీతో కలిసి షికారుకు వచ్చారు. శునకాన్ని రోడ్డుకు ఓవైపు వదిలేసి మరోవైపు వీరు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అటుగా వచ్చిన విజేందర్ ట్రక్కును చూసిన టామీ గట్టిగా అరిచింది. దీంతో వాహనాన్ని బలవంతంగా ఆపిన ముగ్గురు దుండగులు విజేందర్‌ను జుట్టుపట్టుకుని కిందకు లాగారు. తమ కుక్క టామీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తనతో గొడవ పడకుండా కుక్కను జాగ్రత్తగా చూసుకోమని విజేందర్ ముందుకు కదిలాడు. కొద్దిదూరం వెళ్లగానే బాధితుడి వాహనాన్ని అడ్డగించిన ముగ్గురు దుండగులు కత్తులు, స్క్రూడ్రైవర్‌తో అతడిని ఆరుసార్లు పొడిచారు. విజేందర్ ఆర్తనాదాలు విని కాపాడేందుకు పరిగెత్తుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చిన సోదరుడు రాజేశ్‌కు మూడు కత్తిపోట్లు పడ్డాయి. వీరిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా విజేందర్ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కొన ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్న రాజేశ్‌ను మెరుగైన చికిత్స కోసం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. కాగా పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
శునకం కోసం సాహసం
హాంకాంగ్‌కు చెందిన ఓ ధీరవనిత తన పెంపుడు కుక్కను రక్షించుకునేందుకు 16 అడుగుల కొండచిలువతో ప్రాణాలకు తెగించి పోరాడింది. సాయికుంగ్లో నివసించే కర్టెనీ లింక్ దంపతులకు డెక్ట్స ర్ అనే పెంపుడు కుక్క ఉంది. గత శనివారం లింక్ దంపతులు సమీపంలోని వెస్ట్కంట్రీ పార్కుకు వాకింగ్ చేయడానికి వెళ్లారు. తోడుగా డెక్ట్సర్ను కూడా వెంటతీసుకెళ్లారు. ఇంతలో 16 అడుగుల బర్మీస్ జాతికి చెందిన కొండచిలువ డెక్ట్సర్ను నోట్లో పెట్టుకుంది. ప్రాణంలా చూసుకుంటున్న తన పెం పుడు కుక్కను రక్షించేందు కు లింక్ వెంటనే వట్టి చేతి తో కొండచిలువపై దాడికి దిగింది. కానీ, కుక్కను రక్షించడం తనవల్ల కాలే దు. వెంటనే ఆమె భర్త పిటీ తన జేబులోంచి చిన్నపాటి కత్తిని లింక్‌కు అందించాడు. ఆలోపే డెక్ట్సర్ను సగం వరకు కొండచిలువ మింగేసింది. వెంటనే తేరుకున్న లింక్ కొండచిలువపై ఆ చిన్నకత్తితోనే పోరాటం మొదలెట్టింది. దాని మెడపై కత్తితో దాడిచేయడంతో చివరకు కొండచిలువ డెక్ట్సర్ను వదిలేసింది. చివరకు చిన్నపాటి గాయాలతో ఆ పెంపుడు కుక్క ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై లింక్ స్పందిస్తూ... ‘జంతు ప్రేమికురాలిగా పాముపై దాడిచేయడం నిజంగా బాధనిపించింది. కానీ, నా పెంపుడు కుక్కను రక్షించడానికి ఆ పనిచేశా’నని పేర్కొంది. బర్మీస్ జాతికి చెందిన కొండచిలువలు హాంకాంగ్‌లో అతిపెద్ద పాముల్లో ఒకటి. ఇవి సుమారు 20 అడుగుల వరకు పెరుగుతాయి.