special bar council
-
విభజిస్తేనే ఆందోళన విరమిస్తాం
* హైకోర్టు విభజనకు పట్టుబడుతున్న న్యాయవాదుల సంఘాలు * విధులు బహిష్కరించి ఆందోళన.. స్తంభించిన కోర్టు కార్యకలాపాలు సాక్షి, హైదరాబాద్: హైకోర్టును విభజించాలని, ప్రత్యేక బార్ కౌన్సిల్‌ను ఏర్పాటుచేయాలని... అప్పటి వరకు న్యాయవ్యవస్థలో ఎలాంటి నియామకాలు చేపట్టరాదంటూ న్యాయవాదులు చేపట్టిన ఆందోళన తీవ్రమవుతోంది. ఇప్పటికే న్యాయవాదుల విధుల బహిష్కరణతో 20 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కోర్టు విధులు స్తంభించిపోయాయి. ఈ నెల 14న లోక్ అదాలత్‌ను న్యాయవాదులు అడ్డుకున్నారు. ఈ నెలాఖరు వరకు విధులు బహిష్కరించాలంటూ న్యాయవాదుల సంఘాలు నిర్ణయించాయి. హైకోర్టు విభజన జరిగే వరకూ ఆందోళన ఆపేది లేదని మరోవైపు ఆ సంఘాలు హెచ్చరిస్తుండడంతో ఆందోళన సద్దుమణిగేలా కన్పించడం లేదు. న్యాయవాదులు ఆందోళనకు న్యాయశాఖ ఉద్యోగులూ మద్దతు తెలుపుతున్నారు. హైకోర్టు విభజనలో జాప్యం జరిగితే తాము నిరవధిక సమ్మెకు దిగేందుకూ వెనుకాడమని వీరు ఇప్పటికే ప్రకటించారు. న్యాయవాదుల ఆందోళనలకు అన్ని రాజకీయ పార్టీలు. ప్రజాసంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. హైకోర్టు విభజన జరిగే వరకూ నియామకాలు చేపట్టరాదని తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తోంది. ఈ విషయంపై అఖిలపక్షం ప్రతినిధులు, బార్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. త్వరలో ప్రధానమంత్రిని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలసేందుకూ అఖిలపక్షం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రత్యేక బార్ కౌన్సిల్‌పై స్టే
* ఏపీ హైకోర్టు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత బార్ కౌన్సిల్ యథాతథంగా ఉంటుంది * హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఏపీతో సంబంధం లేకుండా తెలంగాణకు ప్రత్యేకంగా బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసే విషయంలో వెంటనే తగిన చర్యలు ప్రారంభించాలంటూ సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన తీర్పు అమలును హైకోర్టు ధర్మాసనం నిలిపేసింది. ఏపీ హైకోర్టు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుతం ఉన్న బార్ కౌన్సిలే యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆగిపోయిన న్యాయవాదుల నమోదు (ఎన్రోల్మెంట్) ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. న్యాయవాదుల నమోదుకు సంబంధించి ఇరు రాష్ట్రాలకూ వేర్వే రు రిజిస్టర్లను నిర్వహించాలని సూచించింది. బార్ కౌన్సిల్ ఎక్స్అఫీషియో సభ్యులుగా రెండు రాష్ట్రాల ఏజీలకు స్థానం కల్పించాలని తెలిపింది. క్రమశిక్షణ చర్యలపై తుది ఉత్తర్వులు జారీ చేయవద్దని కూడా ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణబార్ కౌన్సి ల్ ఏర్పాటుపై సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. సింగిల్ జడ్జి తీర్పును నిలిపేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్న బీసీఐ అనుబంధ పిటిషన్‌పై శుక్ర వారం విచారణ జరిపిన ధర్మాసనం ప్రధాన పిటి షన్లపై విచారణను 2నెలలకు వాయిదా వేసింది.