special check posts
-
తెలంగాణ సరిహద్దు వద్ద ప్రత్యేక చెక్‌పోస్ట్.. ఎందుకంటే?
జహీరాబాద్: పశువులకు వ్యాపిస్తున్న ముద్ద చర్మపు వ్యాధి తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా ముందు జ్రాగత్తగా అధికారులు కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని మాడ్గి శివారులో రాష్ట్ర సరిహద్దు వద్ద 65వ జాతీయ రహదారిపై ఆదివారం ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. కలెక్టర్ శరత్ ఉత్తర్వులతో పోలీస్, పశు సంవర్థక, రవాణా శాఖల అధికారులు చెక్‌పోస్టు వద్ద సంయుక్తంగా పశువుల తనిఖీ నిర్వహిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి పశువులతో వస్తున్న వాహనాలను పరిశీలిస్తున్నారు. వ్యాధి లేనట్లు నిర్ధారణకు వచ్చాకే పశువులను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఆదివారం గేదెలు, మేకలతో ఉన్న వాహనాలు 15 వచ్చాయని, వ్యాధులు ఉన్న పశువులు ఏవీ రాలేదని అధికారులు పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: నాడు కల్లోలం.. నేడు ప్రశాంతం) -
లెక్కా.. పక్కా!
కోల్‌సిటీ(రామగుండం): ఎన్నికల్లో ఓట్లు పడాలంటే నోట్లు పంచాల్సిందేనన్నది రాజకీయ నానుడి. ఈ సమయంలో ఏ పనికావాలన్నా.. డబ్బు కావాల్సిందే మరి. ప్రచారం, సభలు, సమావేశాలు, పార్టీల్లో చేరికలు, ప్రతి కార్యక్రమానికి మనీ అత్యవసరం. ఎన్నికల సంఘం కోడ్‌పేరిట ఎన్ని నిబంధనలు విధించినా.. పోలీసులు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా..నగదు మాత్రం సోదాల్లో పట్టుబడుతోంది. దొరికిన డబ్బుకు సరైన లెక్కలు చెప్పకపోవడంతో అధికారులు వాటిని సీజ్ చేస్తున్నారు. అయినా.. మనీ మూటలు సరి‘హద్దు’లు దాటుతున్నాయి. అత్యవసర అవసరాల కోసం డబ్బులు తీసుకెళ్లే వారు తప్పనిసరిగ్గా తగిన ఆధారాలు ఉంచుకోవాల్సిందే. లేదంటే ఇబ్బందులు తప్పవు. పత్రం చూపి.. లెక్క చెతిబే సరి... ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద మొత్తంలో నగదును తరలిస్తుంటారు. అనుమానం ఉన్న చోట్ల పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. సరిహద్దులు, టోల్‌ప్లాజాలవద్ద తనిఖీలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలతో పాటు సాధారణ పౌరులూ అవసరాల రీత్యా డబ్బు తీసుకెళ్తుంటారు. బ్యాంకులో జమచేసేందుకు లేదా బ్యాంకు నుంచి తీసుకువస్తున్న సొమ్ముకు సంబంధించిన ఆధారాలు చూపితే సరిపోతుంది. వ్యాపారరీత్యా నగదు తీసుకెళ్తుంటే.. సంబంధిత ధ్రువపత్రాలు వెంట తీసుకెళ్లాలి. రూ.50 వేల వరకు నగదు తీసుకెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతకమటే ఎక్కువ ఉంటే మాత్రం పత్రాలు తప్పనిసరని అధికారులు చెబుతున్నారు. లెక్క చెప్పకపోతే సీజ్... ఎన్నికల కోడ్‌ను అమలు చేయడంలో భాగంగా పలుకమిటీలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్, అకౌంటింగ్ బృందాలు, నోడల్ కమిటీ, వీడియో చిత్రీకరణ తదితర అధికారుల కమిటీలు అనుక్షణం నిఘాపెట్టాయి. నియమావళిని ఉల్లంఘించే చోట వెంటనే చర్యలకు ఉపక్రమిస్తారు. రూ. 50 వేల లోపు నగదు తీసుకెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకెళ్తే స్వాధీనం చేసుకోవడమే కాకుండా దాన్ని సంబంధిత అభ్యర్థి ఎన్నికల ఖర్చులో జమ కడతారు. సాధారణ పౌరులు సైతం తాము తీసుకెళ్తున్న నగదుకు లెక్క చూపని పక్షంలో అప్పటికప్పుడు సీజ్ చేస్తారు. అనంతరం నోడల్ కమిటీకి అప్పగిస్తారు. రుజువు చేసుకోవాలి... పోలీసులకు పట్టుబడ్డ డబ్బు తమదేనని సరైన రుజువులతో కూడిన పత్రాలు చూపించాలి. సంబంధిత పని కోసం తీసుకెళ్తున్నట్లు ఆధారాలు చూపితే తిరిగి డబ్బు తిరిగి ఇచ్చేస్తారు. నోడల్ కమిటీ అధికారులకు సంబంధిత పత్రాలను చూపాల్సి ఉంటుంది. ఈ కమిటీలో డీఆర్డీవో, డీటీవో, జిల్లా కోఆపరేటివ్ అధికారి తదితరులు సభ్యులుగా ఉన్నారు. రూ.10 లక్షలలోపు పట్టుబడిన నగదు నోడల్ కమిటీ పరిధిలో ఉంటుంది. అంతకు మించితే సంబంధిత నగదు వ్యవహారాన్ని ఆదాయ పన్నుశాఖ నోడల్ అధికారులకు అప్పగిస్తారు. ఎన్నికలకోడ్ అమలులో ఉన్నందున నిబంధనల ప్రకారం ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరుపుకోవడం ఉత్తమమని పలువురు సూచిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో లో రూ.2.5 కోట్లు.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు రవాణాను అరికట్టేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక చోట్ల ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు 15 బృందాలుగా విడిపోయి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే 2 కోట్ల 50 లక్షల పైచిలుకు వరకు డబ్బును సీజ్ చేశారు. లెక్కలు చెప్పాల్సిందే... ఎన్నికల కోడ్‌ను ప్రతి ఒక్కరూ అనుసరించాలి. డబ్బు రవాణా చేస్తున్న వారు సరైన పత్రాలను చూపించాలి. రూ.10 లక్షల కంటే ఎక్కువ డబ్బు కలిగి ఉన్న వారు వివరాలు చూపించినప్పటికీ ఐటీ అధికారులు విచారణ జరిపి క్లియరెన్స్ ఇస్తే వదిలేస్తాం. ఎన్నికల్లో పాల్గొంటున్న రాజకీయ నాయకులు రూ.50 వేలు కంటే ఎక్కువ ఉంటే సీజ్‌చేసి కేసు నమోదు చేస్తాం. ఆన్లైన్ లావాదేవీలపై నిఘా పెట్టాం. ఓటర్లను ప్రభావితం చేయకుండా నిఘా పెడుతున్నాం. ఓటర్లను ప్రలోభపెట్టే మద్యం నగదుతో పాటు ఎలాంటి వస్తువులను అనుమతించేది లేదు. – వి.సత్యనారాయణ, రామగుండం సీపీ -
మావోల వేట
► కూంబింగ్ ముమ్మరం ►అటవీ గ్రామాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ► అజ్ఞాతంలో ఉన్న వారి ఫొటోలతో పోస్టర్లు సాక్షి, చెన్నై : రాష్ట్రంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ ముమ్మరం చేశారు. చాపకింద నీరులా సాగుతున్న కార్యకలాపాల్ని తుంచి పడేసేందుకు తగ్గ అస్త్రాలతో ప్రత్యేక బలగాలు అడవుల్లో జల్లెడ పట్టే పనిలో పడ్డాయి. అటవీ గ్రామాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటయ్యాయి. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల ఫొటోలతో కూడిన పోస్టర్లను జన సంచారం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో పోలీసులు ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. రాష్ట్రంలో పశ్చిమ పర్వత శ్రేణుల్ని కేంద్రంగా చేసుకుని ఒకప్పుడు మావోయిస్టులు తమ కార్యకలాపాల్ని సాగించిన విషయం తెలిసిందే. కొడెకైనాల్లో జరిగిన ఎన్కౌంటర్లో తమ నాయకుడు నవీన్ ప్రసాద్ హతం కావడంతో రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు క్రమంగా తగ్గాయి. రాష్ట్రంలో మావోయిస్టులు అన్న పేరుకు ఆస్కారం లేని విధంగా, ఉక్కు పాదంతో అణచి వేశారు. ఈ పరిస్థితుల్లో కొన్నేళ్లుగా చత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మావోయిస్టుల్ని అణచివేయడానికి సాగుతున్న ఎన్కౌంటర్ల పర్వంతో రాష్ట్రంలో మళ్లీ ఆ పేరు తెర మీదకు వచ్చింది. మళ్లీ పశ్చిమ పర్వత శ్రేణుల్ని కేంద్రంగా చేసుకుని మావోయిస్టుల కార్యకలాపాలు సాగుతున్నట్టుగా సంకేతాలు బయలు దేరాయి. దీంతో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లు ఉమ్మడి ఆపరేషన్‌కు చర్యలు చేపట్టడంతో పశ్చిమ పర్వత శ్రేణుల్లో మళ్లీ కూంబింగ్ మొదలెట్టారు. అదే సమయంలో గత ఏడాది అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నాయకుడు రూబేష్, సైనాలతో పాటు ఐదుగురు పట్టుబడడం, ఈ ఘటనకు నిరసనగా కేరళ సరిహద్దుల్లో దాడులు సైతం చోటు చేసుకోవడంతో గాలింపు తీవ్రతరం అయిది. క్రమంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఒకరి తర్వాత మరొకరు పట్టుబడుతూ వచ్చారు. దీంతో పశ్చిమ పర్వత శ్రేణుల్ని అడ్డాగా చేసుకుని మరెందరు దాగి ఉన్నారో, జనం మధ్యలో ఇంకెందరు తిష్ట వేసి ఉన్నారో అన్న అనుమానాలు బయలు దేరాయి. ఈనేపథ్యంలో బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏఓబీ లో ఎన్కౌంటర్ల పర్వం సాగుతుండడం, మావోయిస్టుల మృతుల సంఖ్య పెరగడం, మరెందరో తప్పించుకుని ఉడాయిస్తుండడంతో రాష్ట్రంలోని పశ్చిమ పర్వత శ్రేణులపై అధికార వర్గాలు నిఘా పెంచారు. అక్కడి నుంచి తప్పించుకు వచ్చే వారికి ఇక్కడ నక్కి ఉన్న వాళ్లెవరైనా ఆశ్రయం కల్పించేందుకు అవకాశాలు ఉన్నాయని, మా వోయిస్టుల మధ్య సమాచార సంబంధాలు ఉన్న నేపథ్యంలో ముం దు జాగ్రత్త చర్యగా వేటను ముమ్మరం చేసే పనిలో క్యూబ్రాంచ్, ప్రత్యేక బలగాలు సిద్ధమయ్యాయి. గురువారం ఉదయం నుంచి అడవుల్లోకి ఈ బలగాలు చొచ్చుకు వెళ్లే పనిలో పడ్డాయి. జల్లెడ పట్టే రీతిలో గాలింపు తీవ్రతరం చేశారు. ఇక, అటవీ గ్రామాల్లో అనేక చోట్ల ప్రత్యేక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి, అటు వైపు వచ్చే వాహనాలను, అందులో ఉన్న వాళ్లను తనిఖీల అనంతరం అనుమతించే పనిలో పడ్డారు. ప్రధానంగా నీలగిరి, ఈరోడ్, కోయంబత్తూరుల మీదుగా కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో విస్తరించి ఉన్న అటవీగ్రామాల్లో అనుమానితుల సంచారంపై ఆరా తీస్తున్నారు. ఎవరైనా సంచరిస్తుంటే, తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తూ ఫోన్ నం బర్లను ఇచ్చే పనిలో పడ్డారు. అలాగే, జన సంచారం అత్యధికంగా ఉండే అటవీ గ్రామాల సరిహద్దుల్లోని పట్టణాల్లో అజ్ఞాతంలో ఉన్న ముప్పైకు పైగా మావోయిస్టుల ఫొటోలతో కూడిన పోస్టర్లను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. వీరి ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించి ఉన్నారు. ఇక, నీలగిరి జిల్లాల్లో అయితే, కోరంకుత్తు, హ్యారింగ్ టన్, వెల్లింగ్ టన్, అప్పర్, లోయర్ భవానీ, కీన్న కొలవై, ఇలియ సిగై, ముత్తులి తదితర కేరళ సరిహద్దు చెక్ పోస్టుల్లో భద్రతను మరింతగా కట్టు దిట్టం చేశారు. అనుమానితులను విచారించి, వారి వివరాల సేకరణ అనంతరం వదలిపెడుతున్నారు.