special funds
-
పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల రూపు రేఖలు మార్చేందుకు అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా రూ.1003 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీలకు గతంలో మంజూరు చేసిన ప్రత్యేక నిధులు లేదా పన్ను రూపేణ వచ్చిన, ఫైనాన్స్ కమిషన్ నిధుల జోలికి వెళ్లకుండా ప్రత్యేక నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులను కలెక్టర్లకు మంజూరు చేస్తామన్నారు. పట్టణాలు, నగరాల ప్రధాన కూడళ్ల వద్ద రోడ్ల నిర్మాణాలు, పార్కుల ఏర్పాటు పనులను గుర్తించి ఈనెల 31లోగా ప్రతిపాదనలు పంపాలన్నారు. మున్సిపాల్టీలకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనలు, సలహాలతో ప్రజలు కోరుకునే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా) ప్రకటించిన జిల్లాలోని మున్సిపాల్టీల మాస్టర్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా 15వేల జనాభా గల గ్రామాలను నగర పంచాయతీలుగా, మున్సిపాలిటీలుగా ప్రకటించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో మున్సిపాలిటీల సంఖ్య 145కు చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో మిషన్ భగీరథ, అండర్ డ్రెయినేజీ పనులు సమాంతరంగా వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాన్ఫరెన్స్‌లో జేసీ రవీందర్ రెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, నగర పాలక కమిషనర్ జాన్ సాంసన్, అధికారులున్నారు. -
పాలన లేని పల్లెలేల..!
సాక్షి, హైదరాబాద్: పల్లెలను ప్రగతి పథంలో నడిపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు గ్రామ పంచాయతీలను పునర్‌వ్యవస్థీకరిస్తామంటోంది. పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక నిధులిస్తామని పేర్కొంటోంది. కానీ పంచాయతీల పాలనలో కీలకమైన గ్రామ కార్యదర్శుల నియామకంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఇప్పటికీ 30 శాతం పంచాయతీల్లో కార్యదర్శుల్లేక ఎక్కడి సమస్యలు అక్కడే వెక్కిరిస్తున్నాయి. ప్రణాళిక రూపకల్పన చేసే, పథకాలు అమలు చేసే నాథుడు లేక పనులు కుంటుపడుతున్నాయి. దీనికితోడు తాజాగా 4,122 కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రతిపాదనలతో పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. గ్రామాల అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభా వం చూపబోతోంది. పన్నెండు వేలకు పెరగనున్న పంచాయతీలు రాష్ట్రంలో 8,684 గ్రామ పంచాయతీలుండగా.. 5,065 గ్రామ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో పాలన సౌలభ్యం కోసం పంచాయతీలను జనాభా ప్రాతిపదికన 5,500 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 3,519 మంది కార్యదర్శులే పని చేస్తుండటంతో.. క్లస్టర్లతోపాటు కొన్ని గ్రామాల బాధ్యతలనూ అప్పగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 4,122 కొత్త పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ శాఖకు ప్రతిపాదనలొచ్చాయి. ప్రతిపాదనలు ఆమోదిస్తే పంచాయతీల సంఖ్య 12,806కు పెరుగుతుంది. దీంతో సగటున 3, 4 గ్రామాలకు ఒకరు చొప్పున కార్యదర్శిగా పనిచేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే గ్రామాల పాలన ఇబ్బందిగా మారుతుంది. ప్రణాళిక రూపకల్పన, పన్నుల వసూలు, నిధుల ఖర్చు తదితరాలపై ప్రభావం పడే అవకాశముంది. దీంతో ప్రతి పంచాయతీకి ఓ కార్యదర్శి ఉంటేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని, ఖాళీగా ఉన్న గ్రామ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖలో డిమాండ్ వినిపిస్తోంది. -
జర్నలిస్టులకు నిధులు కేటాయించాలి
విజయవాడ: జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుని కోరారు. తెలంగాణాలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా రూ.30కోట్లు కేటాయించినట్లే ఏపీలోను ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను వెలికితీసే జర్నలిస్టులకు మాత్రం ఏవిధమైన సహాయం అందడంలేదన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులను విస్మరిస్తోందని ఆరోపించారు. -
కేజీ టు పీజీకి మొండిచేయి
* బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించని సర్కారు * విద్యాశాఖ అదనంగా రూ.500 కోట్లు అడిగితే ఇచ్చిందేమీ లేదు * పాఠశాల విద్యకు తగ్గిన కేటాయింపు * విద్యాశాఖకు మొత్తంగా రూ.10,738.62 కోట్లు * గతేడాది కంటే 477.47 కోట్ల తగ్గింపు సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలనుకుంటున్న ప్రతిష్టాత్మక కేజీ టు పీజీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. బడ్జెట్లో దీనికి ప్రత్యేకంగా పైసా కూడా కేటాయించలేదు. దీంతో రాష్ట్రంలోని అన్ని గురుకులాలను ఒకే సొసైటీ పరిధిలోకి తీసుకు వచ్చి కేజీ టు పీజీ పథకాన్ని ప్రారంభించాలని భావిస్తున్న విద్యాశాఖకు నిరాశ ఎదురైంది. 2015-16 బడ్జెట్లో గురుకులాల నిర్వహణ కోసం గురుకుల విద్యాలయాల సొసైటీకి రూ.76.64 కోట్లు కేటాయించిన ఆర్థిక శాఖ.. ఈసారి గురుకులాల నిర్వహణతోపాటు కేజీ టు పీజీని కూడా పేర్కొంటూ రూ.73.84 కోట్లు కేటాయించింది. విద్యాశాఖ కేజీ టు పీజీ కింద 120 కొత్త గురుకులాలను ప్రారంభిస్తామని, వాటికి రూ.500 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం వివిధ సొసైటీల పరిధిలోని 668 గురుకుల పాఠశాలలు, 391 కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయాలు ఉండగా మైనారిటీల కోసం 70 గురుకులాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. వాటితోపాటు మరో 120 గురుకులాలను కొత్తగా నిర్మిస్తే (గతంలో మోడల్ స్కూల్స్ ఫేజ్-2 కింద స్థలాలు గుర్తించినవి) కేజీ టు పీజీలో భాగంగా నియోజకవర్గానికి 10కి పైగా గురుకులాలను కేజీ టు పీజీ స్కూళ్లుగా కొనసాగించవచ్చని విద్యాశాఖ భావించింది. ఇందులో భాగంగానే ఒక్కో దానికి రూ.4 కోట్ల చొప్పున దాదాపు రూ.500 కోట్లు కావాలని ఆర్థిక శాఖకు బడ్జెట్ ప్రతిపాదనలు పంపించింది. కానీ బడ్జెట్లో ఆ మొత్తాన్ని కేటాయించకపోగా.. అత్తెసరు కేటాయింపులతోనే అన్నింటిని (గురుకులాలు, కేజీ టు పీజీ) చూసుకోవాలని పేర్కొన్నారు. 14 వేల కోట్లకు పైగా అడిగితే..! రాష్ట్రంలో ఒక్క పాఠశాల విద్యాశాఖకే రూ.14 వేల కోట్లకు పైగా నిధులు కావాలని విద్యాశాఖ ప్రతిపాదిస్తే వాటిని ఆర్థిక శాఖ పక్కనపెట్టేసింది. కేవలం రూ.8,574 కోట్ల కేటాయింపులతో సరిపెట్టింది. ఖర్చులు, నిర్వహణ వ్యయం పెరిగినందున ప్రణాళికేతర వ్యయం కింద రూ.10,533 కోట్లు అవసరమని ప్రతిపాదించినా పట్టించుకోలేదు. ప్రణాళికేతర పద్దులో భారీగా కోత పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.11,216.09 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఈసారి దానిని రూ.10,738.62 కోట్లకు తగ్గించారు. ముఖ్యంగా ప్రణాళికేతర పద్దులో ప్రభుత్వం భారీగా కోత విధించింది. గతేడాది ప్రణాకేతర పద్దు కింద రూ.7,976.43 కోట్లు చూపగా.. ఈసారి రూ.7,290.94 కోట్లు కేటాయించింది. రూ.685.49 కోట్ల మేర కోత పెట్టింది. పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం 2015-16 బడ్జెట్లో కరువు భత్యం (డీఏ) కింద రూ.1,250 కోట్లు ప్రతిపాదించగా సవరించిన అంచనాల మేరకు రూ.550 కోట్ల వరకు వెచ్చించింది. దీంతో ఆ సవరించిన అంచనాల ప్రకారం ఈసారి (2016-17) నాన్‌ప్లాన్ బడ్జెట్లో ఆ మేరకు కేటాయింపులు తగ్గించి, డీఏ కింద రూ.500 కోట్ల మేర కేటాయించారు. ఇక 2014-15 సంవత్సరంలో ప్రణాళిక వ్యయం కింద పాఠశాల విద్యకు రూ.3,510.56 కోట్లు కేటాయించగా.. 2015-16 సంవత్సరంలో రూ. 1,078.06 కోట్లకు తగ్గించింది. ఈసారి కాస్త పెంచి రూ.1,283.69 కోట్లకు పెంచింది. అయితే విద్యాశాఖ అడిగిన మొత్తంతో ( రూ. 3,591 కోట్లు) పోల్చితే 40 శాతం కూడా ఇవ్వలేదు. ఎస్ఎస్ఏకు పెరిగిన కేటాయింపులు కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాల్లో రాష్ట్ర వాటా పెరగడంతో కిందటేడాది కేటాయింపుల కంటే ఈసారి 205.63 కోట్లు అదనంగా కేటాయించారు. అదీ ఎక్కువ మొత్తం సర్వ శిక్షా అభియాన్‌కే పెంచారు. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌కు నిధులను తగ్గించారు. మరోవైపు మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ విద్య తదితర పథకాల్లో గతంలో కొన్నింటిలో కేంద్ర రాష్ట్ర వాటా 65:35, 70:30, 75:25గా ఉండేది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం అన్నింటికి 60 శాతమే ఇస్తామని, రాష్ట్రాలు 40 శాతం నిధులను వెచ్చించాల్సిందేనని స్పష్టం చేయడంతో ప్రణాళిక వ్యయం కింద ఎస్ఎస్ఏకు నిధుల కేటాయింపును పెంచింది. -
హైదరాబాద్‌కు ప్రత్యేక నిధులివ్వండి
సాక్షి, హైదరాబాద్: దేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం తగిన ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుకు గురువారం లేఖ రాశారు. ముంబై మాదిరిగా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. 625 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ నగరం ఏ-1 కేటగిరీలో ఉందని అందులో పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీల పథకంలో హైదరాబాద్‌ను కూడా చేర్చి, ఏడాదికి కేవలం రూ. వంద కోట్లు మాత్రమే ఇవ్వడం వల్ల సరైన సదుపాయాలు కల్పించడం సాధ్యం కాదన్నారు. దానికి బదులు హైదరాబాద్‌ను ప్రత్యేకంగా గుర్తించి, ఎక్కువ మొత్తంలో నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రత్యేక వ్యూహం అవసరం హైదరాబాద్‌పై అహ్లువాలియా కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను కేసీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. ‘కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 2011లో నియమించిన అహ్లువాలియా కమిటీ ఇచ్చిన నివేదికలో హైదరాబాద్‌కు కీలక రంగాల్లో రూ. 30,370 కోట్ల పెట్టుబడులు కావాలని పేర్కొంది. ఏటా యాజమాన్య, నిర్వహణ ఖర్చుల కింద రూ.1,264 కోట్లు అవసరమని తెలిపింది. నగర ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడానికి, మురికి నీటి కాల్వల నిర్మాణం, నిర్వహణకు రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు కావాలి. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ద్వారా సిగ్నల్ ఫ్రీ కారిడార్ల ఏర్పాటుకు రహదారుల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, బ్రిడ్జిల నిర్మాణం తదితర పనులకు రూ. 20,661 కోట్లు కావాలి. అలాంటిది స్మార్ట్ సిటీ పథకంలో చేర్చి ఏడాదికి రూ.100 కోట్లు కేటాయించడం వల్ల హైదరాబాద్ అవసరాలు తీర్చడం సాధ్యం కాదు. రూ. 5,500 కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన జీహెచ్ఎంసీకి ఏడాదికి కేవలం రూ. వంద కోట్లు ఇవ్వడం వల్ల చెప్పుకోదగిన పనులేవీ చేయడం సాధ్యం కాదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లాంటి ఏ-1 నగరాల అభివృద్ధికి.. ముఖ్యంగా మంచినీటి సరఫరా, డ్రైనేజీ, రవాణా తదితర మౌలిక రంగాలకు ప్రత్యేక వ్యూహం అనుసరించాల్సిన అవసరం ఉంది..’ అని లేఖలో సీఎం పేర్కొన్నారు. కొత్త పథకాన్ని తేవాలి.. హైదరాబాద్‌లో 50% కుటుంబాలకు మురికి కాల్వల సదుపాయం లేదని, ఇక్కడ ఎన్నో ఏళ్ల కింద నిర్మించిన మంచినీటి, మురుగునీటి కాల్వలు శిథిలావస్థకు చేరుకున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. చాలా ప్రాంతాల్లో కొత్త పైప్లైన్లు నిర్మించాల్సి ఉందన్నారు. ఇలా హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్రం కొత్త పథకానికి రూపకల్పన చేయాల్సిన అవసరముందని సూచించారు. లేకుంటే హైదరాబాద్ అవసరాలకు నిధులు సమకూర్చుకోవటం తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర ఇబ్బందిగా మారుతుందని పేర్కొన్నారు. కరీంనగర్‌ను చేర్చండి.. హైదరాబాద్‌కు బదులుగా కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ‘దాదాపు మూడు లక్షల జనాభా ఉన్న కరీంనగర్ భౌగోళికంగా ఉత్తర తెలంగాణ నడిమధ్య ఉంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ త్వరలోనే ద్వితీయ శ్రేణి నగరాల జాబితాలో చేరబోతున్నది. స్మార్ట్‌సిటీ పథకంలో కరీంనగర్‌ను చేర్చితే ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది’ అని లేఖలో పేర్కొన్నారు. స్మార్ట్ సిటీగా కరీంనగర్ కేంద్రానికి ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న స్మార్ట్ సిటీస్ మిషన్ పథకంలో భాగంగా గతంలో ప్రతిపాదించిన హైదరాబాద్‌కు బదులుగా కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ ఎం.దానకిశోర్ ఇచ్చిన లేఖ ప్రతిని ఎంపీ వినోద్ కుమార్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుకు గురువారం అందజేశారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చితే సమగ్ర ప్రణాళిక నివేదిక (డీపీఆర్)ను తయారు చేసుకునేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. కాగా, న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని వినోద్ కుమార్ ప్రధానికి వినతి పత్రం సమర్పించారు. స్మార్ట్ సిటీల కోసం ఇచ్చే రూ.100 కోట్లు సరిపోవని, రూ.1000 కోట్ల చొప్పున కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని కోరారు. -
బాబూ...ఈ ‘అమ్మ’ను మరిచారా ?
- ప్రత్యేక నిధులేవీ ? - జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరని పరిస్థితి - కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ప్రజలు ‘‘ విజయనగరం అమ్మలాంటింది....పేద జిల్లాగా ఉండిపోయింది. ఎంతో బాధేస్తోంది. అధికారంలోకి వచ్చాక జిల్లాకు ప్రత్యేక నిధులు ఇస్తాం’’ ఇదీ ఎన్నికల ముందు విజయనగరం అయోధ్య మైదానంలో జరిగిన ప్రజాగర్జనలో చంద్రబాబు ఇచ్చిన హామీ. అదే మైదానంలో చేసిన వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు వాగ్దానంపై ఇప్పటికీ అతీగతీలేదు. ఏడాదిలోపే తోటపల్లితో పాటు తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ బడ్జెట్లో కనీస నిధులు కేటాయించలేదు. ఇప్పుడా ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక, శాసన సభలో జిల్లాకు పది వరాలు ప్రకటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత అమ్మలాంటి జిల్లాకు ఇచ్చిన ప్రత్యేక నిధుల హామీతో పాటు చాలా వాటిని మరిచిపోయారని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం : చంద్రబాబు...అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తోంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలన్నీ అలాగే ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగా ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. హామీలు అమలు చేయకపోగా, ఇచ్చిన మాట మార్చి మడం తిప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాల బదులు ప్రైవేటు వైద్య కళాశాల మంజూరు చేస్తామని చేతులేత్తేశారు. అనుకూలమైన స్థలం లేకపోవడం వల్లే గిరిజన యూనివర్సిటీ తరలిపోతోందని తప్పించుకున్నారు. జ్యూట్ పరిశ్రమల సంఖ్యను పెంచుతామని చెప్పి, మూతపడిన జ్యూట్ పరిశ్రమల్ని తెరిపించేందుకు చొరవ చూపడం లేదు. ఇదంతా చూస్తుంటే .‘ ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా కన్పిస్తోందని జిల్లా వాసులు విమర్శిస్తున్నారు. ఇంజినీరింగ్ పట్టుభద్రులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లాలో ఎలక్ట్రికల్స్ హార్డ్‌వేర్ పార్కు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇంతవరకు అతీగతి లేదు. కళారంగానికి ఊపిరి పోస్తానని చెబుతూ లలిత కళల అకాడమీని కేటాయిస్తూ ప్రకటన చేశారు. అయితే, అకాడమీ విషయం పక్కనెడితే ఉన్న కళాశాల ఆలనాపాలనా చూసేందుకు కూడా చొరవ చూపలేదు. జిల్లాను పారిశ్రామిక న గరంగా తీర్చిదిద్దుతానంటూ శాసన సభలో వెల్లడించారు. ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. జిల్లాలో మామిడి, అరటి, జీడి, బొప్పాయి ఉత్పత్తుల కు చెందిన విభిన్న రకాల పరిశ్రమలు తీసుకొచ్చేలా ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉపాధి బాట వేస్తామన్నారు. కానీ ఇంతవరకు అతీగతి లేదు. విజయనగరాన్ని స్మార్ట్ సిటీగా తయారు చేస్తానని, జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని ఊపన్యాసం ఇచ్చారు. కానీ ప్రతిపాది జాబితాల్లో జిల్లాకు చోటే లేకుండా పోయింది. రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు, డ్వాక్రా మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రైతులకు అరకొర మాఫీ చేసి మమ అనిపించేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.1390కోట్లు మేర రైతు రుణ బకాయిలుండగా మాఫీ చేసింది రూ.200కోట్లు లోపే ఉంది. ఇక, డ్వాక్రా మహిళలకు రూ.400కోట్ల బకాయిలు ఉన్నాయి. వాటి మాఫీపై ఇంతవరకు నోరుమెదపడం లేదు. ఫీజు రియింబర్స్ మెంట్, స్కాలర్షిప్ ఎప్పటిలాగే అందిస్తానని చెప్పారు. కానీ 2014-15కు సంబంధించి వెనకబడిన తరగతులకు చెందిన కొత్త విద్యార్థులకు ఒక్క రూపాయీ చెల్లించలేదు. 33వేల మంది రెన్యువల్ విద్యార్థులలో 18వేల మందికి 50శాతం చెల్లించి, మిగతాది ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. ఇక, అభివృద్ధి పథకాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కొత్తగా నిధులివ్వకపోగా గతంలో మంజూరైన నిధులపైనా ఆంక్షలు విధించారు. దీంతో మంచినీటి పథకాలు, పంచాయతీరాజ్ రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయని నిరుద్యోగులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జిల్లా రానున్న సీఎం ఈ హామీలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. -
ప్చ్... హామీలకు రాం..రాం
సాక్షి ప్రతినిధి, కర్నూలు : కరువు జిల్లాపై ప్రభుత్వం కనికరం చూపలేదు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేయలేదు. కనీసం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రయత్నమూ కనిపించలేదు. బుధవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా వాసులను తీవ్ర నిరాశ పరిచింది. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల వర్షం కురిపించారు. కానీ.. జిల్లా ప్రజలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీపై కూడా బడ్జెట్లో ప్రస్తావన రాలేదు. ఓర్వకల్లు వద్ద పారిశ్రామికవాడను ఏర్పాటు చేసి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీని మరిచారు. ఆదోని-ఎమ్మిగనూరు మధ్యలో టెక్స్టైల్, అపెరల్ పార్క్ ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడి నుంచే కొనుగోళ్లు చేయిస్తానని ప్రకటించి..నిధులు మంజూరు చేయలేదు. త్రిపుల్ ఐటీ, నంద్యాలలో వ్యవసాయ కళాశాలలను డీమ్డ్ యూనివర్సిటీగా మార్పు.. విత్తన సాంకేతిక పరిజ్ఞానం పరిశోధనలకు మౌలిక వసతులు కల్పన.. ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు, నిమ్స్ తరహాలో రాయలసీమ ఇన్స్టిట్యూఫ్ ఆఫ్ మెడికల్ సైన్స్.. డోన్‌లో ధన్‌బాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ మైనింగ్ తరహా సంస్థను ఏర్పాటు.. ఇలా ఎన్నో హామీలిచ్చినా.. ఒక్కటంటే ఒక్కదానికి కూడా నిధులు మంజూరు చేయలేదు. హామీలకు ‘నీళ్లొదిలారు..’ స్వాతంత్య్రదిన వేడుకలో తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, హెచ్ఎల్సీ, హంద్రీనీవా, గాలేరునగరి, గోరుకల్లు వంటి ప్రాజెక్టులన్నింటికి నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తానని సీఎం హామీ ఇచ్చారు. అదే విధంగా గుండ్రేవుల, గురురాఘవేంద్ర రిజర్వాయర్లు తన కల అన్నారు. అవన్నీ కేవలం మాటలకే పరిమతమని తేలిపోయింది. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ సర్కిల్-1, సర్కిల్-2, సర్కిల్-3 మొత్తానికి కలిపి రూ.145 కోట్లకుపైనే అవసరమని అధికారులు అంచనాలు పంపారు. అయితే బడ్జెట్లో రూ.12.48 కోట్లే కేటాయించారు. గాజులదిన్నె ప్రాజెక్టుకు రూ.1.20 కోట్లు అవసరమైతే బడ్జెట్లో రూ.20 లక్షలు మాత్రమే కేటాయించారు. వరదరాజస్వామి ప్రాజెక్టుకు రూ.2.01 కోట్లు, కేసీ కెనాల్ ఆధునికీకరణ కోసం రూ.8.04 కోట్లు, గురురాఘవేంద్ర లిఫ్ట్ఇరిగేషన్కు రూ.15 కోట్లు కేటాయించారు. తుంగభద్ర లోలెవల్ కెనాల్‌కు రూ.8.22 కోట్లు, హైలెవల్ కెనాల్ స్టేజ్-1కి రూ.15 కోట్లు, స్టేజ్-2కి 2.20 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. మొత్తంగా చూస్తే జిల్లాలోని రిజర్వాయర్లు, కాలువలకు కేటాయించింది తక్కుకవేనని నీటి పారుదలశాఖ అధికారులు చెపుతున్నారు. వ్యవ‘సాయం’ కరువే.. టీడీపీ అధికారంలోకి వస్తే రైతు, డ్వాక్రా, చేనేత రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయానికి, రుణమాఫీకి కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ ప్రస్తావనే రాలేదు. అదే విధంగా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అన్నారు. అది కూడా లేదు. కరువు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించలేదు. ఇక గృహ నిర్మాణం, పలు సంక్షేమ పథకాలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పట్టణాభివృద్దికి తూతూ మంత్రంగా నిధులు విదిల్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ అనుమానమే? ఫీజు రీఎంబర్స్ మెంట్‌పై ఆధారపడి జిల్లాలోని సుమారు 90 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఈ పథకాన్ని అమలు చేయడం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. అందుకు బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయించిన నిధులే కారణం. విద్యార్థులకు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నిధుల కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రాయలసీమ యూనివర్సిటీ అభివృద్ధికి గతంలో రూ.100 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా.. ఆ ప్రస్తావన లేదు. వైద్యం.. దైవాధీనం 108 సర్వీసులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను పటిష్టం చేయాల్సి ఉంది. జిల్లాలోని పీహెచ్‌సీల్లో సుమారు సగానికిపైగా నిర్వహణలోపంతో అస్తవ్యస్తంగా మారాయి. అలాగే జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన వైద్యసదుపాయాలు లేవు. 104 సేవలు పల్లె జనానికి అందటం లేదు. ఉన్న 108 సర్వీసులకు తోడు అదనంగా మరిన్ని వాహనాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. కర్నూలులోని పెద్దాసుపత్రికి ఇప్పటికే రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ ప్రస్తావన రాలేదు. ప్రభుత్వ వైద్యశాల ఆధునికీకరణ, మందుల కొనుగోలుకు నిధులు అంతంత మాత్రంగానే ఉంది. రహదారులు బాగుపడేదెన్నడో..? జిల్లాలో గ్రామీణ రోడ్లు అధ్వానంగా ఉంది. 25 ఏళ్ల క్రితం వేసినవి కంకరతేలి ప్రయాణం నరకంగా మారింది. సరిహద్దు గ్రామాలకు వెళ్లడానికి సైతం ఇప్పుడు అధికారులు భయపడుతున్నారు. అత్యవసర చికిత్స కోసం వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. రహదారుల అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయి. అదే విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు అంకెల గారడీని తలపిస్తోంది. -
విద్యార్థుల్లో ఆలోచనా విధానాన్ని పెంపొందించాలి
చర్చిల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య హన్మకొండ చౌరస్తా : ఆరు దశాబ్దాల పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది.. అందులో భాగంగానే రూ.50వేల కోట్లు కేటాయించిందని ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. హన్మకొండ లోని మిషన్ ఆస్పత్రి ఆదివారం పునఃప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజయ్య మాట్లాడుతూ సామాజిక తెలంగాణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని చర్చిల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. మిషన్ ఆస్పత్రికి పూర్వ వైభవం తీసుకురావడానికి పాటుపడతాన ని అన్నారు. ఆస్పత్రి భూముల ఆక్రమణ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున తీర్పును ఇరు వర్గాలు శిరసావహించాలని సూచించారు. వివాదంలో ఉన్న భూమి ఎవరికి వచ్చినా వైద్య సేవలందించేందుకు సహకరించాలని కోరా రు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ పేదలకు సేవలందించే ఆస్పత్రి భూమిని కబ్జాచేసిన వారిని జైలుకు పంపించాలన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని, ఆయనకు అందరం సహకరిస్తే త్వరలోనే బంగా రు తెలంగాణ సాకారమవుతుందని చెప్పారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిని కేసీఆర్ వదలరని, అందుకు గురుకుల్ ట్రస్టు నిర్మాణాల కూల్చివేతే నిదర్శనమని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ ఆస్పత్రి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. అంత కు ముందు సీబీసీ చర్చిలో ప్రత్యేక ప్రార్థలను చేశారు. కార్యక్రమంలో త్రినగర క్రైస్తవ సహవాసం అధ్యక్షుడు కురియన్, టీసీఎఫ్ అధికార ప్రతినిధి డాక్టర్ పల్లెపాడు దామోదర్, సీబీసీ చర్చి పాస్టర్ నిరంజన్‌బాబు, ఇమ్మానియల్, సుధాకర్, జాన్సన్, యాకోబ్, టి.పాల్, జోసఫ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం రాజయ్యను క్రైస్తవ సంఘాల బాధ్యులు సన్మానించారు. రోగుల భాగోగులు తెలుసుకున్న రాజయ్య సాయంత్రం ఆస్పత్రిలోని వార్డులను సందర్శించిన డిప్యూటీ సీఎం రాజయ్య రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, ఇతర సమస్యలపై అడిగి తెలుసుకున్నా రు. సిబ్బంది అటెండెన్స్ రిజిష్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అప్పుడే పుట్టిన శిశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ ఆస్పత్రిని రెండు వందల పడకలకు విస్తరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. డిప్యూటీ సీఎం వెంట వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరక్టర్ డాక్టర్ సాంబశివరావు, వైద్యులు ఉన్నారు. సమగ్ర సర్వేతోనే అర్హులకు ప్రయోజనం : డిప్యూటీ సీఎం చిల్పూరుగుట్ట(స్టేషన్‌ఘన్‌పూర్) : సమగ్ర కుటుంబ సర్వే ద్వారానే అర్హులకు ప్రభుత్వ పరంగా ప్రయోజనం చేకూరుతుందని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని చిల్పూరు ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 19న నిర్వహించే సమగ్ర సర్వేపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లో మొత్తం 84 లక్షల కుటంబాలున్నాయని, వీరికోసం గత పాలకులు 1996లో మల్టీపర్పస్ హౌస్‌హోల్డ్ సర్వే, 2002లో బీపీఎల్ సర్వే, 2005లో సోషల్ఎకనామిక్, 2011, 2013లోనూ సర్వేలు నిర్వహించి 55లక్షల ఇండ్లు, 71లక్షల మందికి పింఛన్లు, కోటి 10లక్షల మందికి రేషన్ కార్డులిచ్చారని అన్నారు. ఆయా ప్రభుత్వాల్లో అనర్హులు లాభపడగా పేదలు పేదలుగానే మిగిలిపోయారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏగ్రామంలోకి వెళ్లినా ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు అడుగుతుండడంతో సీఎం కేసీఆర్ సమగ్ర కుటంబ సర్వే కార్యక్రమానికి స్వీకారం చుట్టారని వివరించారు. సర్వే రోజు తానుకూడా నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు. మంత్రి పదవితోపాటు ఉపముఖ్య మంత్రి పదవి ఇచ్చినందున 10 జిల్లాల్లో తిరగడం వలన నియోజకవర్గ ప్రజలను కలుసుకోవడంలో జాప్యం జరుగుతోందని, ఇక నుంచి వారంలో ఒక రోజు జిల్లా కేంద్రంలోనూ, మరొక రోజు నియోజకవర్గం లోని ఏదోఒక మండలంలో పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటానని పేర్కొన్నారు. -
చిల్లిగవ్వలేదు..
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: గ్రామ ఖజా నాలు నిండుకున్నాయి. పాలకవర్గాల వద్ద చిల్లిగవ్వ లేదు. ఎన్నికలు జరిగి రెండు నెలలు దాటినా ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదు. అభివృద్ధి ఊసేలేదు. దీంతో కొత్త సర్పంచ్‌లు దిష్టిబొమ్మలుగా మారిపోయారు. నిధులు లేక ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతలో సమైక్యాంధ్ర ఉద్యమం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. జిల్లాలో 920 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 907 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 13 వాయిదా పడ్డాయి. 70 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కొత్త సర్పంచ్‌లంతా ఆగస్టు 2న బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లుగా పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు. ఎన్నికలు ముగిసిన తరువాత గ్రా మాలకు నిధుల కురుస్తాయని సర్పంచ్‌లు భా వించారు. కానీ ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి రాలేదు. ప్రత్యేక నిధులెక్కడ : సాధారణంగా ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధు లు మంజూరు చేస్తుంది. అవి గ్రామాభివృద్ధికి దోహదపడతాయనే ఆయా గ్రామాల్లోనివారు ఏకగ్రీవం దిశగా అడుగులేశారు. నోటిఫైడ్ పం చాయతీలకు రూ.10 లక్షలు, నాన్ నోటిఫైడ్ పంచాయతీలకు రూ.5లక్షలు ప్రత్యేక గ్రాంట్‌గా ఎన్నికల ముందు ప్రభుత్వం ప్రకటించింది. నెలలు గడుస్తున్నా...ఏకగ్రీవమైన 70 పంచాయతీలకు పైసా విడుదల కాలేదు. ఇదిలా ఉంటే రెండేళ్లుగా 13వ ఆర్థిక సంఘం నిధులు లేవు. కొలువుతీరాక అవయినా వస్తాయని ఆశించిన కొత్త సర్పంచ్‌లకు నిరాశే మిగిలింది. వృత్తి పన్ను, సీనరేజీ పన్ను, ప్రత్యేక గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏవీ మంజూరు చేయలేదు. సమైక్యాంధ్ర సెగ జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. ఎంపీడీవోలు, ఖజానా శాఖ సిబ్బంది, పంచాయతీ అధికారులు, ఇలా జిల్లాలో పని చేసే ప్రతీ ఒక్కరూ సమ్మెలోకి వెళ్లారు. దీంతో గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం, వీధి లైట్ల నిర్వహణ వంటి అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. బ్లీచింగ్ చల్లాలన్నా, కాలువల్లో పూడిక తీయాలన్నా, తాగునీటి పైపులు బాగు చేయిం చాలన్నా, వీధి లైట్లు వెలిగించాలన్నా పంచాయతీల్లో బిల్లులు కాకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. కనీసం గ్రామ పంచాయతీల పరిధిలో రావాల్సిన పన్నులు, ఇతర ఆదాయం రాబట్టాలనుకున్నా సిబ్బంది సమ్మెలో ఉండటంతో ఆ డబ్బులు కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో సర్పంచ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కొంత మంది సొంత డబ్బులు ఖర్చు పెట్టి చిన్న చిన్న పనులు చేయిస్తున్నారు. తీర్మానాలు లేకుండా సొంత డబ్బు లు ఖర్చు పెడితే తరువాత పరిస్థితి ఏమిటని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.