speciality Chemicals
-
కెమ్‌కాన్ స్పెషాలిటీ.. రికార్డ్ లిస్టింగ్
గత నెలలో ఐపీవోకి వచ్చిన కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో బంపర్ లిస్టింగ్‌ను సాధించింది. ఇష్యూ ధర రూ. 340కాగా.. ఎన్ఎస్ఈలో ఏకంగా 115 శాతం(రూ. 391) ప్రీమియంతో రూ. 731 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి అమ్మకాలు పెరగడంతో కొంతమేర వెనకడుగు వేసింది. రూ. 610 దిగువన ఇంట్రాడే కనిష్టానికి చేరింది. ప్రస్తుతం రూ. 305 లాభంతో రూ. 645 వద్ద ట్రేడవుతోంది. ఇంతక్రితం హ్యాపీయెస్ట్ మైండ్స్ 111 శాతం ప్రీమియంతో లిస్ట్‌కావడం ద్వారా 2020లో రికార్డ్ సాధించిన సంగతి తెలిసిందే. 149 రెట్లు సెప్టెంబర్ 21-23 మధ్య ఐపీవో చేపట్టిన కెమ్‌కాన్ స్పెషాలిటీ రూ. 318 కోట్లను సమీకరించింది. ఇష్యూ 149 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. తద్వారా ఈ ఏడాది(2020) పబ్లిక్ ఇష్యూకి అత్యధిక స్పందన సాధించిన రెండో కంపెనీగా నిలిచింది. 151 రెట్లు బిడ్స్ సాధించడం ద్వారా హ్యాపియెస్ట్ మైండ్స్ తొలి ర్యాంకును కైవసం చేసుకుంది. ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ రూ. 95.4 కోట్లను సమకూర్చుకుంది. షేరుకి రూ. 340 ధరలో 28.06 లక్షల షేర్లను జారీ చేసింది. ఇష్యూ నిధులను తయారీ సామర్థ్య విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కెమ్‌కాన్ పేర్కొంది. బ్యాక్‌గ్రౌండ్ కెమ్‌కాన్ ప్రధానంగా హెచ్ఎండీఎస్, సీఎంఐసీగా పేర్కొనే స్పెషలైజ్డ్ కెమికల్స్‌ను రూపొందిస్తోంది. వీటిని ఫార్మాస్యూటికల్ రంగంలో వినియోగిస్తారు. అంతేకాకుండా ఇన్ఆర్గానిక్ బ్రోమైడ్స్లోనూ ఉపయోగిస్తారు. కాల్షియం, జింక్, సోడియం బ్రోమైడ్స్గా పిలిచే వీటిని అత్యధికంగా చమురు క్షేత్రాల పరిశ్రమలో వినియోగిస్తారు. ఆయిల్వెల్ కంప్లీషన్ కెమికల్స్‌గా వీటిని సంబోధిస్తారు. ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ నివేదిక ప్రకారం దేశీయంగా హెచ్ఎండీఎస్ కెమికల్స్‌ను కెమ్‌కాన్ మాత్రమే తయారు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. కెమికల్ ఉత్పత్తులను యూఎస్, ఇటలీ, జర్మనీ, జపాన్, రష్యా తదితర పలు దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఫార్మా రంగంలో హెటెరో ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్, అరబిందో తదితర పలు కంపెనీలను కస్టమర్లుగా కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 262 కోట్ల ఆదాయం, రూ. 70 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. నికర లాభం రూ. 49 కోట్లుగా నమోదైంది. -
కెమ్‌కాన్ స్పెషాలిటీ ఐపీవోకు 13 రెట్లు బిడ్స్
కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూకి రెండో రోజు మంగళవారానికల్లా దాదాపు 13 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో 1.4 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 3.6 రెట్లు అధికంగా స్పందన లభించగా.. రిటైల్ ఇన్వెస్టర్లు 13 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. నేడు ముగియనున్న ఇష్యూకి రూ. 338-340 ధరల శ్రేణికాగా.. తద్వారా రూ. 318 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 44 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూలో భాగంగా 45 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటితోపాటు మరో రూ. 165 కోట్ల విలువచేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. యాంకర్ నిధులు ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ ఇప్పటికే రూ. 95.4 కోట్లను సమకూర్చుకుంది. షేరుకి రూ. 340 ధరలో 28.06 లక్షల షేర్లను జారీ చేసింది. ఫార్మాస్యూటికల్ కెమికల్స్ తయారీ కంపెనీ.. కెమ్కాన్లో ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో ఐడీఎఫ్సీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్, డైనమిక్ ఈక్విటీ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్‌కేర్ ప్లాన్, మిరాయి అసెట్ ఫండ్స్, టాటా మల్టీ అసెట్ అపార్చునిటీస్ ఫండ్ తదితరాలున్నాయి. ప్రమోటర్ల వాటా విక్రయం కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్‌లో ప్రమోటర్లయిన అగర్వాల్, గోయల్ కుంటుంబీకులకు 100 శాతం వాటా ఉంది. ఐపీవోలో భాగంగా కేఆర్ అగర్వాల్, ఎన్వీ గోయల్ 22.5 లక్షల షేర్లు చొప్పున విక్రయించనున్నారు. ఇవికాకుండా కంపెనీ రూ. 165 కోట్ల విలువచేసే ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులను తయారీ సామర్థ్య విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కెమ్‌కాన్ పేర్కొంది. బ్యాక్‌గ్రౌండ్ కెమ్‌కాన్ ప్రధానంగా హెచ్ఎండీఎస్, సీఎంఐసీగా పేర్కొనే స్పెషలైజ్డ్ కెమికల్స్‌ను రూపొందిస్తోంది. వీటిని ఫార్మాస్యూటికల్ రంగంలో వినియోగిస్తారు. అంతేకాకుండా ఇన్ఆర్గానిక్ బ్రోమైడ్స్లోనూ ఉపయోగిస్తారు. కాల్షియం, జింక్, సోడియం బ్రోమైడ్స్గా పిలిచే వీటిని అత్యధికంగా చమురు క్షేత్రాల పరిశ్రమలో వినియోగిస్తారు. ఆయిల్వెల్ కంప్లీషన్ కెమికల్స్‌గా వీటిని సంబోధిస్తారు. ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ నివేదిక ప్రకారం దేశీయంగా హెచ్ఎండీఎస్ కెమికల్స్‌ను కెమ్‌కాన్ మాత్రమే తయారు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. కెమికల్ ఉత్పత్తులను యూఎస్, ఇటలీ, జర్మనీ, జపాన్, రష్యా తదితర పలు దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఫార్మా రంగంలో హెటెరో ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్, అరబిందో తదితర పలు కంపెనీలను కస్టమర్లుగా కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 262 కోట్ల ఆదాయం, రూ. 70 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. నికర లాభం రూ. 49 కోట్లుగా నమోదైంది. -
కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ ఐపీవో 21న
కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 21న(సోమవారం) ప్రారంభంకానుంది. ఇష్యూకి రూ. 338-340 ధరల శ్రేణికాగా.. తద్వారా రూ. 318 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. 23న(బుధవారం) ముగియనున్న ఇష్యూలో భాగంగా 45 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటితోపాటు మరో రూ. 165 కోట్ల విలువచేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 44 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ నిధులు ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ తాజాగా రూ. 95.4 కోట్లను సమకూర్చుకుంది. షేరుకి రూ. 340 ధరలో 28.06 లక్షల షేర్లను జారీ చేసింది. ఫార్మాస్యూటికల్ కెమికల్స్ తయారీ కంపెనీ.. కెమ్కాన్లో ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో ఐడీఎఫ్సీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్, డైనమిక్ ఈక్విటీ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్‌కేర్ ప్లాన్, మిరాయి అసెట్ ఫండ్స్, టాటా మల్టీ అసెట్ అపార్చునిటీస్ ఫండ్ తదితరాలున్నాయి. ప్రమోటర్ల వాటా విక్రయం కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్‌లో ప్రమోటర్లయిన అగర్వాల్, గోయల్ కుంటుంబీకులకు 100 శాతం వాటా ఉంది. ఐపీవోలో భాగంగా కేఆర్ అగర్వాల్, ఎన్వీ గోయల్ 22.5 లక్షల షేర్లు చొప్పున విక్రయించనున్నారు. ఇవికాకుండా కంపెనీ రూ. 165 కోట్ల విలువచేసే ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులను తయారీ సామర్థ్య విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కెమ్‌కాన్ పేర్కొంది. బ్యాక్‌గ్రౌండ్ కెమ్‌కాన్ ప్రధానంగా హెచ్ఎండీఎస్, సీఎంఐసీగా పేర్కొనే స్పెషలైజ్డ్ కెమికల్స్‌ను రూపొందిస్తోంది. వీటిని ఫార్మాస్యూటికల్ రంగంలో వినియోగిస్తారు. అంతేకాకుండా ఇన్ఆర్గానిక్ బ్రోమైడ్స్లోనూ ఉపయోగిస్తారు. కాల్షియం, జింక్, సోడియం బ్రోమైడ్స్గా పిలిచే వీటిని అత్యధికంగా చమురు క్షేత్రాల పరిశ్రమలో వినియోగిస్తారు. ఆయిల్వెల్ కంప్లీషన్ కెమికల్స్‌గా వీటిని సంబోధిస్తారు. ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ నివేదిక ప్రకారం దేశీయంగా హెచ్ఎండీఎస్ కెమికల్స్‌ను కెమ్‌కాన్ మాత్రమే తయారు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. కెమికల్ ఉత్పత్తులను యూఎస్, ఇటలీ, జర్మనీ, జపాన్, రష్యా తదితర పలు దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఫార్మా రంగంలో హెటెరో ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్, అరబిందో తదితర పలు కంపెనీలను కస్టమర్లుగా కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 262 కోట్ల ఆదాయం, రూ. 70 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. నికర లాభం రూ. 49 కోట్లుగా నమోదైంది. -
క్యామ్స్- కెమ్‌కాన్ స్పెషాలిటీ.. ఐపీవోలకు రెడీ
గత వారం రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టడం ద్వారా ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీవో ఏకంగా 151 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌కాగా.. రూట్ మొబైల్ ఇష్యూకి సైతం 73 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఈ బాటలో తాజాగా కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్(సీఏఎంఎస్- క్యామ్స్), కెమ్‌కాన్ స్పెషాలిటీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. వివరాలు చూద్దాం.. క్యామ్స్(CAMS) లిమిటెడ్ ఈ నెల 21న(సోమవారం) ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూకి రూ. 1229-1230 ధరల శ్రేణిని క్యామ్స్ ప్రకటించింది. 23న(బుధవారం) ముగియనున్న ఇష్యూలో భాగంగా 1.82 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 1,82,500 షేర్లను ఉద్యోగులకు కేటాయించనుంది. వీటిని ఐపీవో ధరలో రూ. 122 డిస్కౌంట్‌కు జారీ చేయనున్నట్లు క్యామ్స్ తెలియజేసింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 12 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ ద్వారా రూ. 2242 కోట్లవరకూ సమకూర్చుకోవాలని క్యామ్స్ భావిస్తోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ)కి అనుబంధ విభాగమైన క్యామ్స్.. మ్యూచువల్ ఫండ్స్‌కు అతిపెద్ద రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్‌గా సేవలందిస్తోంది. ఐపీవోలో భాగంగా శుక్రవారం(18న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించడం ద్వారా కొంతమేర నిధులు సమీకరించనుంది. కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 21న(సోమవారం) ప్రారంభంకానుంది. ఇష్యూకి రూ. 338-340 ధరల శ్రేణికాగా.. తద్వారా రూ. 318 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. 23న(బుధవారం) ముగియనున్న ఇష్యూలో భాగంగా 45 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటితోపాటు మరో రూ. 165 కోట్ల విలువచేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 44 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఐపీవోలో భాగంగా శుక్రవారం(18న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించడం ద్వారా కొంతమేర నిధులు సమీకరించనుంది. కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ కెమ్‌కాన్ తయారు చేసే హెచ్ఎండీఎస్, సీఎంఐసీ తదితర స్పెషాలిటీ కెమికల్స్‌ను ప్రధానంగా ఫార్మాస్యూటికల్ రంగంలో వినియోగిస్తారు. ఐపీవో నిధులను విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. దేశీయంగా హెటెరో, లారస్ ల్యాబ్స్‌తోపాటు.. అరబిందో, ల్యాన్టెక్ తదితర ఫార్మా కంపెనీలకు సరఫరా చేస్తోంది. యూఎస్, జపాన్, చైనా తదితర దేశాలకూ ఎగుమతులు చేపడుతోంది. -
యాంటీడంపింగ్- కెమికల్ షేర్లు గెలాప్
కేంద్ర ప్రభుత్వం కాస్టిక్ సోడా దిగుమతులపై యాంటీడంపింగ్ సుంకం విధింపు గడువును పొడిగించేందుకు తాజాగా నిర్ణయించింది. ప్రధానంగా చైనా, కొరియా నుంచి దిగుమతయ్యే క్యాస్టిక్ సోడాపై ఇప్పటికే విధించిన యాంటీడంపింగ్ సుంకాలను నవంబర్ 17వరకూ కొనసాగించనున్నట్లు ప్రకటించింది. దీంతో కెమికల్ రంగ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు కౌంటర్లు భారీ లాభాలతో దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం.. దూకుడు ప్రస్తుతం బీఎస్ఈలో మంగళం ఆర్గానిక్స్ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 51 ఎగసి రూ. 558 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో ఎన్ఎస్ఈలో మంగళం డ్రగ్స్ 5 శాతం ఎగసి రూ. 116 వద్ద ఫ్రీజ్‌కాగా.. తిరుమలై కెమికల్స్ 12 శాతం దూసుకెళ్లి రూ. 64కు చేరింది. ఇక ఎన్ఎస్ఈలో వినైల్ కెమికల్స్ 15 శాతం పురోగమించి రూ. 109ను తాకింది. గుజరాత్ ఆల్కలీస్ 8.5 శాతం జంప్‌చేసి రూ. 348 వద్ద ట్రేడవుతోంది. ఇతర కౌంటర్లలో బీఎస్ఈలో ఆంధ్రా పెట్రోకెమ్ 10 శాతం పెరిగి రూ. 25 వద్ద ఫ్రీజయ్యింది. ఈ బాటలో హిమాద్రి స్పెషాలిటీ, రోజారీ బయోటెక్, పిడిలైట్ ఇండస్ట్రీస్, జీహెచ్‌సీఎల్, కేసర్ పెట్రోప్రొడక్ట్స్, టైక్ ఇండస్ట్రీస్ తదితరాలు 2-10 శాతం మధ్య ఎగశాయి. -
క్లారియంట్ భారీ డివిడెండ్- షేరు గెలాప్
స్పెషాలిటీ కెమికల్ దిగ్గజం క్లారియంట్ కెమికల్స్ వాటాదారులకు భారీ బొనాంజా ప్రకటించింది. షేరుకి రూ. 140 చొప్పున ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రికార్డ్ డేట్‌ను ఈ నెల 18గా వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా ఈ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. వెరసి ఎన్ఎస్ఈలో క్లారియంట్ షేరు దాదాపు 17 శాతం దూసుకెళ్లింది. రూ. 80 జంప్‌చేసి రూ. 565 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 575 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! ర్యాలీ బాటలో గత మూడు నెలలుగా గ్లోబల్ పేరెంట్ కలిగిన క్లారియంట్ కెమికల్స్ ర్యాలీ బాటలో సాగుతోంది. స్విట్లర్లాండ్ కంపెనీ క్లారియంట్ మాతృ సంస్థకాగా.. ప్రధానంగా టెక్స్టైల్స్, లెదర్ కెమికల్స్ తయారీలో పేరొందింది. గత మూడు నెలల్లో క్లారియంట్ షేరు 106 శాతం లాభపడింది. ఇదే సమయంలో మార్కెట్లు కేవలం 20 శాతం పుంజుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఈ కౌంటర్‌కు మరింత బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గతేడాది నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 71 కోట్లను తాకింది. అంతక్రితం(2018-19)లో రూ. 30 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 5 శాతం పెరిగి 757 కోట్లను తాకింది. అత్యంత నాణ్యమైన ప్రొడక్టులతో మార్కెట్లో మరింత విస్తరించడం ద్వారా కంపెనీ పటిష్ట పనితీరు చూపినట్లు క్లారియంట్ యాజమాన్యం ఫలితాల సందర్భంగా పేర్కొంది. దీంతో క్యాష్‌ఫ్లో బాగా మెరుగుపడినట్లు వెల్లడించింది. కాగా.. ముందుగా అనుకున్నట్లు ఆగస్ట్ 13న కాకుండా 20న కంపెనీ 63వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని(ఏజీఎం) నిర్వహించనున్నట్లు క్లారియంట్ తాజాగా పేర్కొంది. -
స్టాక్స్ వ్యూ
ఆర్తి డ్రగ్స్ బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.668 టార్గెట్ ధర: రూ.790 ఎందుకంటే: జెనరిక్ బల్క్ యాక్టివ్స్, అడ్వాన్స్డ్ ఇంటెర్మీడియేట్స్, స్పెషాల్టీ కెమికల్స్‌ను తయారు చేసి భారత్‌లోనూ, విదేశాల్లోనూ విక్రయిస్తోంది. బ్రెజిల్, మెక్సికో, నెదర్లాండ్స్, స్పెయిన్లతో సహా మొత్తం 94 దేశాల్లో తన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. ఫైజర్, బేయర్, క్లారియంట్, సనోఫి-అవెంటీస్, మెర్క్, తెవ, సీర్లే తదితర కంపెనీలకు తన ఉత్పత్తులను కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ విధానంలో అందిస్తోంది. కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఓ మోస్తరుగా ఉన్నాయి. నికర అమ్మకాలు 2 శాతం వృద్ధితో రూ.264కోట్లకు పెరిగాయి. రూ.17 కోట్ల నికర లాభం సాధించింది. ఇబిటా 9 శాతం వృద్ధితో రూ.40 కోట్లకు పెరిగింది. ఫార్మా సెగ్మెంట్లో అత్యంత పటిష్టమైన సెగ్మెంట్లలో ఒకటైన యాంటీ-బయోటిక్ విభాగాన్ని మరింత శక్తివంతం చేస్తోంది. కొత్త ప్రాజెక్ట్‌లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో గణనీయమైన రాబడులను సాధించగలమన్న ధీమా కంపెనీ వ్యక్తం చేస్తోంది. ఫార్ములేషన్ విభాగం ఆదాయం పెంచుకోవడానికి ఇటీవలే ఒక అమెరికా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. రెండేళ్లలో నికర అమ్మకాలు 12 శాతం, నికర లాభం 21 శాతం చొప్పున వృద్ధి సాధించగలవని అంచనా వేస్తున్నాం. షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.36గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.40గానూ ఉండొచ్చని భావిస్తున్నాం. అలాగే మార్కెట్ ధరకు, పుస్తక ధరకు ఉన్న నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో 4.6గానూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4కు తగ్గొచ్చని అంచనా వేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్స్పోర్ట్ హౌస్ స్టేటస్ లభించింది. ఇమామి బ్రోకరేజ్ సంస్థ: నొముర ప్రస్తుత ధర: రూ.1,010 టార్గెట్ ధర: రూ.1,313 ఎందుకంటే: ఇమామి ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. దేశీయ వ్యాపారంలో రాబడి జోరుగా పెరిగింది. అమ్మకాలు బాగా ఉండటంతో స్థూల మార్జిన్లు అధికంగా వచ్చాయి. దేశీయ వ్యాపారంలో ఆదాయం 23 శాతం వృద్ధితో రూ.590 కోట్లకు పెరిగాయి. అమ్మకాలు (పరిమాణం పరంగా) 15 శాతం వృద్ధి చెందాయి. నవరత్న ఆయిల్ 17 శాతం, నవరత్న టాల్క్ 12 శాతం, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ 20 శాతం, బోరోప్లస్ 12 శాతం, ఫాస్ట్ రిలీఫ్ 18 శాతం, హెల్త్‌కేర్ డివిజన్ 28 శాతం చొప్పున రాబడులను సాధించాయి. స్థూల మార్జిన్లు 440 బేసిస్ పాయింట్లు పెరిగాయి. దీంతో ఇబిటా మార్జిన్ 130 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇబిటా 33 శాతం వృద్ధితో రూ.100 కోట్లకు పెరిగింది. నికర లాభం 24 శాతం వృద్ధితో 87 కోట్లకు ఎగసింది. ప్రకటనల వ్యయాలు బాగా పెరిగాయి. ప్రకటనలు, ప్రమోషన్ల వ్యయాలు 24 శాతానికి వృద్ధి చెందాయి. దాదాపు 8 సంవత్సరాల్లో ఇదే అధిక వ్యయం. ఈ క్వార్టర్ల్లో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం వల్ల ఈ స్థాయి వ్యయాలయ్యాయని భావిస్తున్నాం. కొత్తగా జండు జెల్ బామ్ జూనియర్, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ ఇన్స్టంట్ ఫెయిర్‌నెస్ ఫేస్ వాష్, జండూ నిత్యం ట్యాబ్లెట్లను మార్కెట్లోకి తెచ్చింది. సార్క్ రీజియన్‌లో 47 శాతం వృద్ధి కారణంగా అంతర్జాతీయ వ్యాపారం 22 శాతం పెరిగింది.