speedy justice
-
కోర్టులను ఆశ్రయించడానికి సంకోచం వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు గత ఏడు దశాబ్దాలుగా ప్రజా న్యాయస్థానంగా వ్యవహరిస్తోందని భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. ఎంతో విశ్వాసంతో వచి్చన వేలాది మంది పౌరులు సుప్రీంకోర్టు ద్వారా న్యాయం పొందారని పేర్కొన్నారు. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించడానికి భయపడాల్సిన పని లేదని ప్రజలకు సూచించారు. నిస్సంకోచంగా కోర్టులకు రావొచ్చని చెప్పారు. ఆదివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో సీజేఐ మాట్లాడారు. వ్యవస్థీకృత ప్రజాస్వామ్య సంస్థలు, ప్రక్రియల ద్వారా రాజకీయ విభేదాలను పరిష్కరించుకోవడానికి రాజ్యాంగం మనకు వీలు కల్పిస్తుందని వివరించారు. ఎన్నో రకాల సమస్యల పరిష్కారానికి న్యాయస్థానాల వ్యవస్థ ఉపయోగపడుతుందని వెల్లడించారు. దేశంలోని ప్రతి కోర్టులో ప్రతి కేసు రాజ్యాంగబద్ధమైన పాలనకు పొడిగింపేనని అన్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నామని ఉద్ఘాటింటారు. కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు సైతం ప్రారంభించామని తెలిపారు. దేశ పౌరుల ఆకాంక్షలను నెరవేర్చడానికి తమ వంతు కృషి చేస్తున్నామని సీజేఐ స్పష్టం చేశారు. న్యాయం పొందడానికి కోర్టులను చివరి మజిలీగా భావించాలన్నారు. 2023 నవంబర్ 25 నాటికి సుప్రీంకోర్టు 36,068 తీర్పులను ఆంగ్ల భాషలో వెలువరించిందని చెప్పారు. ఈ తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువాదించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని సవరించుకొనే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే సామర్థ్యం రాజ్యాంగానికి ఉందని తెలియజేశారు. ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసు ఏర్పాటు చేయాలి: రాష్ట్రపతి నైపుణ్యం కలిగిన యువతను న్యాయ వ్యవస్థలోకి తీసుకురావడానికి, వారి ప్రతిభకు సాన పెట్టడానికి అఖిల భారత జ్యుడీషియల్ సరీ్వసు ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ముర్ము సూచించారు. ఆదివారం సుప్రీంకోర్టులో రాజ్యాంగ దినోత్సవంలో ఆమె ప్రసంగించారు. న్యాయం పొందే విషయంలో పౌరులకు ఖర్చు, భాష అనే అవరోధాలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇలాంటి పరిమితులను తొలగించాలన్నారు. న్యాయాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని, ప్రజలే కేంద్రంగా న్యాయ వ్వవస్థను తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. యువత న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించడానికి మరిన్ని అవకాశాలివ్వాలన్నారు. పార్లమెంట్ అభేద్యమైనది: ఉపరాష్ట్రపతి ప్రజాస్వామ్యానికి ఆత్మ పార్లమెంట్ అని ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్ చెప్పారు. ఆదివారం ఢిల్లీలో రాజ్యాంగ దినోత్సవంలో మాట్లాడారు. పార్లమెంట్ ఔన్నత్యాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ గానీ, న్యాయ వ్యవస్థ గానీ తగ్గించలేవని పేర్కొన్నారు. పార్లమెంట్ అభేద్యమైనదని స్పష్టం చేశారు. పార్లమెంట్ అధికారాల్లో జోక్యం రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, న్యాయవాదులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. ఏడడుగుల ఈ అంబేడ్కర్ విగ్రహాన్ని శిల్పి నరేష్ కుమావత్ రూపొందించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదివారం సుప్రీంకోర్టు ఆవరణలో మొక్కలు నాటుతున్న రాష్ట్రపతి ముర్ము, సీజేఐ జస్టిస్ చంద్రచూడ్. చిత్రంలో కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ -
కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి
కుషాయిగూడ: న్యాయం కోసం కోర్టుకు వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. కుషాయిగూడ పారిశ్రామికవాడలోని ఆఫెల్ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్ డ్రాస్టిక్ కోర్టుతో పాటు ఇతర కోర్టుల సముదాయాన్ని శనివారం ఆయన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కోర్టు అడ్మిమినిస్టేటివ్ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. వినోద్‌కుమార్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ అరాధే మాట్లాడుతూ, సత్వర న్యాయం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటన్నారు. ఈ క్రమంలో న్యాయస్థానాలను ఆశ్రయించే కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. న్యాయవ్యవస్థ పనితీరు ప్రభావవంతంగా, సమర్థవంతంగా ఉన్నప్పుడే న్యాయస్థానాలపై విశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టులో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలని చీఫ్ జస్టిస్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెషన్స్ జడ్జి బి.ఆర్. మధుసూదన్‌రావు, జిల్లా కలెక్టర్ డి.అమోయ్‌కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, రాచకొండ సీపీ డి.ఎస్. చౌహాన్, రిజిస్ట్రార్ జనరల్ తిరుమలదేవి, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రఘునాథ్‌రెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. రామచంద్రారెడ్డి, సెక్రటరీ ఎం.రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
సత్వర న్యాయం అందించాలి: జస్టిస్ రజని
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాలపై నమ్మకంతో వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయవాదులు, న్యాయమూర్తులు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ టి.రజని పేర్కొన్నారు. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై వెళ్తున్న జస్టిస్ టి.రజనిని నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సత్కరించారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయమూర్తుల సహకారంతో లోక్‌అదాలత్, జైలు అదాలత్, మీడియేషన్ ద్వారా వేలాది కేసులు పరిష్కరించి కక్షిదారులకు న్యాయం అందించామన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు తిరుమల్‌రావు, సుధాకర్‌నాయుడు, సాయికల్యాణ్ చక్రవర్తి, తిరుపతి, రమాకాంత్, విల్సన్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జితేందర్‌రెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్, పూర్వ అధ్యక్షులు కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.