speeker
-
లౌడ్ స్పీకర్లు బ్యాన్.. మాంసం విక్రయాలపై మార్గదర్శకాలు!
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయడంతోనే కీలక ప్రకటనలు చేశారు. లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేయడంతో పాటు, బహిరంగంగా మాంసం, గుడ్ల విక్రయాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు వీవీఐపీ అతిథుల సమక్షంలో మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామంటూ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు దుకాణాలను నడపడానికి భారత ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని, మధ్యప్రదేశ్‌లో వీటిని అనుసరించేందుకు కఠిన ఆదేశాలు జారీ చేశామని సీఎం తెలిపారు. ప్రతి జిల్లాలో యువత కోసం ఒక ఎక్స్‌లెన్స్ కళాశాలను నిర్మిస్తామని, దీనిని ప్రధాన మంత్రి ఎక్స్‌లెన్స్ కళాశాలగా పిలుస్తామన్నారు. ఇందుకోసం 52 కాలేజీలు ఎంపిక చేశామని తెలిపారు. డిగ్రీ మార్క్స్‌షీట్‌ల కోసం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, వీటికి పరిష్కారంగా కాలేజీలు, యూనివర్శిటీలలలో డిజీ లాకర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కాగా తరచూ నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు హోంశాఖతో మాట్లాడామన్నారు. ధ్వని పరికరాలను నియంత్రించనున్నామని, ఎవరైనా మతపరమైన ప్రదేశంలో పరిమితులను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. జనవరి 22న యూపీలోని అయోధ్యలో జరిగే నూతన రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోనూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అయోధ్యకు వెళ్లే వారికి రామమందిర మార్గంలో స్వాగత సన్నాహాలు చేస్తున్నామన్నారు. 2024 జనవరి ఒకటి నుంచి రాష్టంలోని మొత్తం 55 జిల్లాలలో సైబర్ తహసీల్ ఏర్పాటు చేయనున్నమని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. -
ముగ్గురు రెబెల్స్‌పై అనర్హత వేటు
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 17 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటల్లి, శంకర్‌లపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేసినట్లు స్పీకర్ తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామాలు ఇవ్వలేదనీ, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్(ఫిరాయింపుల నిరోధక చట్టం)ను ఉల్లంఘించారని స్పష్టం చేశారు. ప్రస్తుత శాసనసభ కాలం ముగిసే వరకూ (2023) వీరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు, సభలో పదవులు చేపట్టేందుకు అనర్హులని తేల్చిచెప్పారు. మిగిలిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. అసెంబ్లీలో ఇటీవల జరిగిన విశ్వాసపరీక్షలో కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోవటం తెలిసిందే. తన నిర్ణయంపై రెబెల్స్ కోర్టులకు వెళ్లే అవకాశముందన్నారు. ఆర్థిక బిల్లుకు గనక ఈ నెల 31లోగా ఆమోదం లభించకపోతే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని, అప్పుడు అసెంబ్లీని సస్పెండ్ చేయడం లేదా రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదని చెప్పారాయన. మరోవైపు తమ రాజీనామాలపై స్పీకర్ ముందు హాజరై వివరణ ఇచ్చేందుకు 4 వారాల గడువు కావాలని రెబెల్స్ కోరారు. యెడ్డీ జోరుకు షా బ్రేక్.. బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప, నేతలు జగదీశ్ షెట్టర్, అరవింద్ లింబావలి, మధుస్వామి, బసవరాజ్ బొమ్మై గురువారం ఢిల్లీ చేరారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. అయితే మిగిలిన 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ రమేశ్ కుమార్ తుది నిర్ణయం తీసుకున్న తరవాతే ముందుకెళ్లాలనీ, అప్పటివరకూ ఓపికపట్టాలని యడ్యూరప్పకు షా సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. -
తీజ్ పండుగకు ప్రభుత్వం చేయూత
చిట్యాల : బంజారులు ఏటా జరుపుకునే తీజ్ పండుగ నిర్వహణకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని శాసన lసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని ఒడితల గ్రామ శివారు పాశిగడ్డతండాలో గురువారం గిరిజనులు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ తీజ్ పండుగ గిరి జన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. రానున్న రోజుల్లో తీజ్ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు చర్య లు తీసుకుంటుందన్నారు. అనంతరం గిరిజన యువతులు తీజ్‌బుట్టలను తండా సమీపంలోని చెరువులు, బావుల్లో నిమజ్జనం చేశారు. కాగా, ఉత్సవాల్లో స్పీకర్ దరువేసి ప్రజలను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కాట్రేవుల సాయిలు, టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకుడు సిరికొం డ ప్రశాంత్, మండల అధ్యక్షుడు కుంభం రవీందర్‌రెడ్డి, యూత్ అధ్యక్ష, కార్యదర్శులు కత్తి సంపత్, జన్నె యుగేంధర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఓరంగంటి సధాకర్, నాయకులు శ్రీనివాసరావు, గణపతి, శంకర్, పాపిరెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.