spies
-
Covert Creatures: పావురాల నుంచి డాల్ఫిన్ల దాకా..
బెలుగా జాతికి చెందిన అరుదైన పెద్ద గూఢచారి తిమింగలం ‘హవాల్దిమీర్’దక్షిణ నార్వే తీరంలో బుల్లెట్ గాయాలతో విగతజీవిగా కనిపించడం ఇటీవల అంతర్జాతీయ వార్తాంశంగా నిలిచింది. దీంతో అసలు మనిషి ఇంతవరకు ఏ జాతుల జీవులను నిఘా కోసం గూఢచారులుగా వినియోగించుకున్నాడన్న చర్చ మొదలైంది. గూఢచారులుగా ఈ జంతువులు నిర్వర్తించిన విధుల్లేంటి. వాటిల్లో అత్యుత్తమ గూఢచారి ఏది? వంటి ఆసక్తికర అంశాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.. గూఢచార జీవులు... అత్యాధునిక పరికరాలు, చిన్న నిఘా కెమెరాలు రాకముందు సుదూర ప్రాంతాలకు రహస్య సమాచారాన్ని సురక్షితంగా చేరవేయడం ఓ సవాలుగా ఉండేది. దీంతో సందేశాలు పంపడానికి పావురాలను ఉపయోగించేవారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిఘా కోసం జర్మన్ సైన్యం ప్రత్యేకంగా బుల్లి కెమెరాలు రూపొందించి వాటిని పావురాలకు కట్టింది. వాటిల్లో రికార్డయ్యే సమాచారంతో శత్రు జాడ తెల్సుకునేది. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలూ గూఢచర్యానికి పావురాలనే నమ్ముకున్నాయి. 1970లలో అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) తన ప్రత్యేక నిగా ఆపరేషన్ ‘టకానా’లో భాగంగా బుల్లి కెమెరాలు అమర్చిన పావురాలను సోవియట్ రష్యాలోకి పంపింది. ఇలా పావురాలు మాత్రమే కాదు.. పిల్లులు, తిమింగలాలు, డాల్ఫిన్లు, ఇంకొన్ని రకాల పక్షులు, చనిపోయిన జంతువులు కూడా కోవర్ట్ ఆపరేటర్లుగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాయి. డాల్ఫిన్లతో ప్రత్యేకంగా.. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ నావికాదళం సముద్ర క్షీరదాలతో వివిధ కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో ఒకటి డాల్ఫిన్లకు శిక్షణ ఇవ్వడం. అమెరికా నావికాదళం సముద్ర క్షీరదాల కార్యక్రమం(ఎంఎంపీ) కింద సముద్రజలాల్లో నిఘా కోసం డాల్ఫిన్లను ఉపయోగించింది. 1960లలో ప్రాజెక్ట్ ఆక్సిగాస్లో భాగంగా శత్రు నౌకలకు పేలుడు పరికరాలను అమర్చేందుకు సీఐఏ డాల్ఫిన్లకు శిక్షణ ఇచి్చంది. ఈ కార్యక్రమానికి సముద్రాల్లో స్వేచ్ఛగా తిరిగే రెండు ‘బాటిల్‌నోస్’డాల్ఫిన్లను ఉపయోగించారు. ప్రపంచంలోని అత్యంత తెలివైన జంతువులుగా డాల్ఫిన్లు ప్రసిద్ధి చెందాయి. క్రిమియాలోని సెవాస్టోపోల్ నల్లసముద్రంలోని నౌకాదళ స్థావరంలో శత్రు డైవర్లను గుర్తించడానికి, ఎదుర్కోవడానికి డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చేందుకు రష్యా గత సంవత్సరం ఒక క్షీరద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నివేదిక బహిర్గతంచేసింది. 2023 ఏప్రిల్ నుంచి జూన్ వరకు సెవాస్టోపోల్ నౌకాశ్రయంలో తేలియాడే క్షీరదాల బోనుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు బ్రిటిష్ సైనిక నిఘా ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. పిల్లుల చెవులకు మైక్రో ఫోన్లు పిల్లులను తెలివైన జంతువులుగా భావిస్తారు. సీఐఏ 1960వ దశకంలో పిల్లులను ఉపయోగించి ‘ఆపరేషన్ అకౌస్టిక్ కిట్టీ’అనే ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. దీని కోసం 2 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టులో భాగంగా పిల్లుల చెవుల్లో మైక్రోఫోన్లను ఏర్పాటు చేసింది. ఇవి సోవియట్ దౌత్యవేత్తలు, ఏజెంట్ల సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేస్తాయి. పిల్లి పెంపుడు జంతువు. అది బహిరంగ ప్రదేశాలు, కొన్ని రహస్య ప్రదేశాల్లో అవి ప్రత్యక్షమవడం శత్రు దేశాలకు అనుమానాలు పెంచే అవకాశం ఉంటుంది. అదీగాక పిల్లులను నియంత్రించడం అంత సులభం కాదు. శిక్షణాసమయంలో వాటిని శిక్షకులు నియంత్రించలేక చేతులెత్తేశారు. పిల్లులు వాటికి సూచించిన ప్రాంతాలకు కాకుండా తమకిష్టమైన ప్రదేశాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో చేసేదిలేక చివరికి 1967లో ఈ కార్యక్రమానికి ఫుల్స్టాప్ పెట్టేశారు. టాప్ ఏజెంట్.. పావురం పిల్లులు, చనిపోయిన ఎలుకల వంటివాటిని రంగంలోకి దింపి పని కానిచి్చనప్పటికీ వివిధ దేశాల నిఘా సంస్థలు శతాబ్దాలుగా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నది పావురం మీదనే. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన అత్యంత విజయవంతమైన గూఢచారి కార్యక్రమం ‘ఆపరేషన్ కొలంబా’పావురాలతోనే విజయంవంతమైంది. జర్మన్ సైనిక కార్యకలాపాలను, సున్నితమైన సైనిక స్థానాలపై నిఘాను హోమింగ్ జాతి పావురాలు సేకరించాయి. పేపర్‌పై రాసిన సందేశాలను సూక్ష్మ డబ్బాల్లో పెట్టి పక్షి కాలికి కట్టేశారు. ఈ రహస్య సందేశాలలో నాజీ దళాల కదలికలు, నాజీల కొత్త ఆయుధాలపై నివేదికలు, ప్రణాళికాబద్ధమైన రాకెట్ దాడుల వివరాలను వేగులు సేకరించి పావురాల ద్వారా ప్రధాన కేంద్రానికి రహస్యాన్ని పంపేవారు. రచయిత గోర్డాన్ కోరేరా ‘ఆపరేషన్ కొలంబా: ది సీక్రెట్ పీజియన్ సరీ్వస్’పుస్తకంలో ఇలాంటి ఎన్నో వివరాలు ఉన్నాయి. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ 1941 నుంచి 1944 మధ్య నాజీ ఆక్రమిత ఐరోపాపై 16,000 హోమింగ్ జాతి పావురాలను వాడారు. అన్నింటికన్నా ముఖ్యంగా పక్షుల ద్వారా గూఢచర్యం విజయవంతంకావడంతో నూతన టెక్నాలజీలకూ కపోతమే స్ఫూర్తిగా నిలిచింది. గత నెలలో చైనా అచ్చం పావురంలాగా ఉండే చిన్నపాటి నిఘా డ్రోన్‌ను ఆవిష్కరించడం తెల్సిందే. గూఢచార పావురాలని... భారత ఉపఖండంలో సందేశాలను పంపించడానికి పావురాలను ఉపయోగించినట్టుగా చరిత్ర చెబుతోంది. 2020 మేలో కశ్మీర్‌లోని ఓ గ్రామంలో నంబర్ల సెట్ ఉంగరం కలిగిన పావురం కనిపించింది. దానిని పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. పాకిస్తాన్‌కు చెందిన గూఢచారి పావురమై ఉంటుందని, దానిపై ఉన్నది కోడ్ అని అనుమానించిన పోలీసులు.. డీ క్రిప్ట్ చేయడానికి ప్రయట్నించారు. చివరికది గూఢచారి పావురం కాదని తేలడంతో విడిచిపెట్టారు. 2016 అక్టోబర్‌లో భారత ప్రధానిని బెదిరిస్తూ మరో పావురం కనిపించింది. పంజాబ్‌లోని పఠాన్ కోట్లో ఈ పావురాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2023 మేలో ముంబైలో దొరికిన పావురాన్ని చైనా గూఢచారిగా అనుమానిస్తూ ఎనిమిది నెలల పాటు బోనులో ఉంచి దాని ఆనుపానాలు సేకరించారు. ఆ పావురం కాలుకు ఉంగరాలు కట్టి, దాని రెక్కల కింది భాగంలో చైనీస్ భాషలో ఏదో రాశారు. అయితే అది తైవాన్‌లో రేసింగ్ పోటీలో పాల్గొన్న పక్షి అని ఫిబ్రవరిలో తేలడంతో ఎట్టకేలకు దానిని అధికారులు వదిలేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాఠశాలల్లో ‘షీ’క్రెట్ ఏజెంట్స్.. గుడ్, బ్యాడ్ టచ్‌లపై శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ లోని పాఠశాలలు, వసతి గృహాల్లో మైనర్లపై అఘాయిత్యాలు పెరిగాయి. సెలవుల్లో ఇంటికి వెళ్లిన పిల్లలు ప్రవర్తన చూసి తల్లిదండ్రులు ఆరా తీస్తే తప్ప అక్కడేం జరిగిందో బయటపడటం లేదు. పోలీసులంటే పిల్లల్లో నెలకొన్న భయం, ఇతరత్రా కారణాలతో సంఘటన జరిగిన వెంటనే విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించడంలో జాప్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు సరికొత్త కార్యాచరణ రూపొందించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు, ప్రభుత్వ వసతి గృహాలలో షీ టీమ్స్ గూఢచారులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి పనేంటంటే? ప్రతి సంస్థలో వంద మంది విద్యార్థులకు 5–10 మంది ఆసక్తి ఉన్న వలంటీర్లను గూఢచారులుగా ఎంపిక చేసి వీరికి గుడ్, బ్యాడ్ టచ్‌లతో పాటు పోక్సో చట్టం, కేసులు, శిక్షలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆకతాయిలపై ఎలా నిఘా వేయాలి, పోలీసులను సంప్రదించే తీరు, ఏ సమస్యపై ఎలా స్పందించాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. దీంతో ఆయా విద్యా సంస్థలు, వసతి గృహాలలోని విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వెంటనే బృందం సభ్యులు గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తారు. నివాసిత సంఘాల్లోనూ.. నివాసిత సంఘాలలో ఆత్మహత్యలు, గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. వీటిని నివారించేంవదుకు గృహ కమ్యూనిటీలలోనూ స్వచ్ఛంద బృందాలను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ షీ టీమ్స్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరిస్తే మేలని సైబరాబాద్ షీ టీమ్స్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అందుకే హౌసింగ్ కమ్యూనిటీలలో స్వచ్ఛంద గ్రూప్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ గ్రూపులో పోలీసులు, మనస్తత్వ నిపుణులు, న్యాయ సలహాదారులు, వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. సైబరాబాద్‌లోని ప్రతి కమ్యూనిటీల్లో ఈ సభ్యుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని ఉన్నతాధికారి తెలిపారు. (క్లిక్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక ప్రకటన.. ఏడాదికి యాక్షన్ ప్లాన్) -
పాక్ ఏజెంట్.. దొంగ తెలివి!
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ఢిల్లీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల వ్యవహారంలో విస్మయకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. భారత సైన్యానికి చెందిన సున్నిత సమాచారాన్ని సేకరించేందుకు యత్నించిన పాక్ ఏజెంట్ అబిద్ హుస్సేన్.. భారత్ ప్రయోగించిన సీక్రెట్ ఏజెంట్‌కు వాట్సాప్ వాడాలని సూచించాడు. వాట్సాప్‌లో సమాచార బదిలీ చేస్తే ఎవరూ గుర్తించరని పేర్కొన్నాడు. అయితే, సెక్యురిటీ ఆంక్షల వల్ల వాట్సాప్ వాడటం వీలు పడదని భారత సీక్రెట్ ఏజెంట్ చెప్పగా.. తాను దొంగచాటుగా వాడుతున్నానని అబిద్ అసలు విషయం వెల్లడించాడు. (చదవండి: అడ్డంగా దొరికిపోయిన పాక్.. భారత రాయబారికి నోటీసులు!) కాగా పాకిస్తాన్ హై కమిషన్‌లో వీసా అధికారులుగా పనిచేస్తున్న తాహిర్ ఖాన్, అబిద్ హుస్సేన్ భారత ఆర్మీ రహస్యాలు సేకరించడమే లక్ష్యంగా భారత్‌లో ప్రవేశించారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నకిలీ ఆధార్ కార్డులు ఉపయోగిస్తూ..భారత రక్షణ దళానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తూ వీరిరువురు ఆదివారం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దాంతో వారిద్దరినీ భారత్ బహిష్కరించింది. నేటి ఉదయం. అత్తారీ బోర్డర్ గుండా వారిని పాకిస్తాన్ పంపించి వేశారు. అబిద్, తాహిర్పై కదలికలపై జనవరి నుంచే భారత్ నిఘా విభాగం దృష్టి పెట్టినట్టు తెలిసింది. -
మొసాక్ ఫోన్సెకా గూఢచర్యం
బెర్లిన్: మిలియన్ల కొద్దీ డాక్యుమెంట్ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనానికి సృష్టించిన పనామా పేపర్ల లీక్ వ్యవహారంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.వందమందికి పైగా సభ్యులుగా ఉన్న పరిశోధనాత్మక పాత్రికేయుల అంతర్జాతీయ కూటమి(ఐసీఐజే) పనామా కేంద్రంగా పనిచేస్తున్న పనామా పేపర్స్ మరో విషయాన్ని తేట తెల్లం చేసింది. మొసాక్ ఫోన్సికా వివిధదేశాల్లోని ప్రస్తుత, మాజీ ఉన్నత స్థాయి అధికారుల సేవలను ఏజెంట్లుగా వినియోగించుకున్నట్టు ఒక జర్మన్ వార్తాపత్రిక తెలిపింది. అనేక దేశాల గూఢచారులను మొసాకా విస్తృతంగా ఉపయోగించినట్టు మ్యూనిచ్ ఆధారిత వార్తాపత్రిక వెల్లడించింది. దాదాపు మూడు దేశాలకు చెందిన సీక్రెట్ ఏజెన్సీ అధికారులను వాడుకున్నట్టు తెలిపింది. సౌది అరేబియా, కొలంబియా, రువాండా లాంటి దేశాల అత్యున్నత అధికారులను తమ రహస్య సేవలకు వినియోగించుకున్నట్టు ఈ కథనంలో పేర్కొంది. అనేక దేశాలలో,సీఐఎ వారి మధ్యవర్తుల సహాయంతో పనిచేస్తున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా 1990 లో మరణించిన సౌది ఇంటిలిజెన్స చీఫ్ షేక్ కమల్ అదాం 1970 లలో ఫోన్సెకా కు బాగా సహకరించినట్టు తెలిపింది. వివిధ సీక్రెట్ ఏజెంట్లు, వారి ఇన్ ఫార్మర్ల సేవలను సంస్థ వినియోగించుకున్నట్టు తెలిపింది. కాగా ఈ పనామా పేపర్స్ వెల్లడించిన అంశాలతో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయంగా పెను దుమారాన్ని రాజేసింది. విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్న ప్రపంచంలోనే ధనిక, శక్తివంతమైన పలు రాజకీయ నేతల జాబితాను ప్రకటించింది. దీంతో ఐస్ లాండ్ ప్రధాని రాజీనామా చేసిన సంగతి తెలిసింది. -
వారెవా! ఏమి గోవా!!
ఈ మాట ప్లేస్ గురించి మాత్రమే కాదు... ఫుడ్డు గురించి కూడా! గోవాలో తిరిగొస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. వాలో తిని వస్తే బాడీ రీచార్జ్ అవుతుంది. సీఫుడ్డు, కోకోనట్టు, రైస్, కూరగాయలు.. కొంచె స్పైస్... అన్నిచోట్లా ఉండేవే కానీ... గోవా స్టెయిల్లో చేస్తే ఆ టేస్టే వేరు. ట్రై చెయ్యండి. గోవా సమోసా కావల్సినవి: మైదా - కప్పు; వెన్న - 2 టీ స్పూన్లు ఉల్లిపాయల తరుగు - అర కప్పు బంగాళదుంపల ముక్కలు (ఉడికించి, సన్నగా తరగాలి) - కప్పు పచ్చిబఠాణీ - అర కప్పు; పచ్చిమిర్చి - 1 అల్లం ముద్ద- అర టీ స్పూన్ కొత్తిమీర తరుగు - పావు కప్పుకారం - అర టీ స్పూన్; ఉప్పు - తగినంతనూనె - వేయించడానికి తగినంత తయారీ: ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల మైదా వేసి, నీళ్లు పోసి దోసె పిండిలా ఉండలు లేకుండా కలిపి పక్కనుంచాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో ఉల్లిపాయల తరుగు వేసి, వేయించాలి. తర్వాత అల్లం పేస్ట్, ఉప్పు, కారం, బంగాళదుంపలు వేసి కలపాలి. అన్నీ బాగా వేగాయనిపించాక దించాలి.మైదాలో కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా, కొద్దిగా నీళ్లు పోసి గట్టి ముద్దలా కలపాలి. చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని, పూరీ పరిమాణంలో వత్తాలి. కత్తితో సగానికి కట్ చేసి, దీంట్లో సిద్దం చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి, త్రికోణాకారంలో మడవాలి. ఇలా మడిచేటప్పుడు లోపలి మిశ్రమం బయటకు రాకుండా కలిపి ఉంచుకున్న మైదా మిశ్రమంలో వేళ్లను అద్దుకుంటూ చివర్లను అదమాలి. ఇలాగే అన్నీ తయారుచేసుకొని, కాగుతున్న నూనెలో వేసి ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీయాలి. గోవా చేపల కూర కావల్సినవి: చేప ముక్కలు (పాంఫ్రెట్) - 600 గ్రా.లు కొబ్బరి తురుము - ముప్పావు కప్పు కొబ్బరి పాలు - ముప్పావు కప్పు ధనియాలు - టేబుల్ స్పూన్ జీలకర్ర - టీ స్పూన్; అల్లం పేస్ట్ - 4 టీ స్పూన్లు వెల్లులి పేస్ట్ - టీ స్పూన్; పచ్చిమిర్చి - 4 పల్లీ నూనె - 5 టేబుల్ స్పూన్లు నిమ్మరసం - 3 టేబుల్స్పూన్ల ఉల్లిపాయల తరుగు - 3 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి - 15; ఉప్పు - రుచికి తగినంత చింతపండు గుజ్జు - 3 టేబుల్ స్పూన్లు టొమాటో తరుగు - పావు కప్పు పసుపు - అర టీ స్పూన్ తయారీ: తగినంత ఉప్పు, నిమ్మరసంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసుకున్న చేప ముక్కలపై పోసి, గంట సేపు ఉంచాలి. నిమ్మరసంలో నానిన చేప ముక్కలు రుచిగా ఉంటాయి. మిక్సర్జార్లో కొబ్బరి తరుగు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, పసుపు వేసి మెత్తగా గ్రైండ్చేయాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొబ్బరి పాలు పోసి బ్లెండ్ చేయాలి. కడాయి వేడి చేసి, నూనె వేయాలి. నూనె కాగాక ఉల్లిపాయ ముక్కలు వేయించాలి .దీంట్లో టొమాటో ముక్కలు వేసి 3-4 నిమిషాలు వేయించి, కప్పు నీళ్లు కలిపి ఉడికించాలి. పచ్చిమిర్చి తరుగు, చేప ముక్కలను 7 నిమిషాలు సన్నని మంటమీద ఉడికించాలి. పైన మూత పెట్టకుండానే ఈ కూరను వండాలి. మంట తీసి కొత్తిమీర చల్లి దించాలి. రొయ్యల కూర కావలసినవి: రొయ్యలు - పావుకేజీ నూనె - 3 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి - అర టీ స్పూన్; అల్లం - టీ స్పూన్ ఉల్లిపాయ - 1 (తరగాలి); పసుపు - పావు టీ స్పూన్ కరివేపాకు - రెమ్మ; ఉప్పు - తగినంత పేస్ట్ కోసం.. జీలకర్ర - టీ స్పూన్ కొబ్బరి తరుగు పాలు - అర కప్పు మిరియాలు - 15; కారం - టీ స్పూన్ వెనిగర్ - అర టీ స్పూన్; అల్లం - అర టీ స్పూన్ వెల్లుల్లి - అర టీ స్పూన్ తయారీ ఉల్లిపాయలను, వెల్లుల్లిని గ్రైండ్ చేసి పేస్ట్ కోసం తీసుకున్న దినుసులన్నీ కలిపి మెత్తగా నూరుకోవాలి. దీంట్లో వెనిగర్ కలపాలి. రొయ్యలను శుభ్రపరచి, కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో వెల్లుల్లి వేయించి, తరిగిన ఉల్లిపాయలు వేయాలి. కరివేపాకు, నూరిన మిశ్రమం కూడా కలపాలి. దీంట్లో రొయ్యలు వేసి 15 నిమిషాలు ఉడికించాలి. కోకనట్ కేక్ కావల్సినవి: బొంబాయి రవ్వ - కప్పు, ఎండు కొబ్బరి తురుము - కప్పు జీడిపప్పు పొడి - అర కప్పు, బేకింగ్ పౌడర్ - టీ స్పూన కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) - టీ స్పూన్, వెన్న - 2 టేబుల్ స్పూన్లు కండెన్స్డ్ మిల్క్ - పావు కప్పు, పాలు - అర కప్పు యాలకులు - 4, బాదంపప్పు - అలంకరణకు తగినన్నిపంచదార పొడి - తగినంత తయారీ: ఒక గిన్నెలో వేయించిన రవ్వ, కొబ్బరి తురుము, బేకింగ్ పౌడర్, కార్న్‌ఫ్లోర్, పంచదార పొడి, జీడిపప్పు పొడి వేసి కలపాలి. దీంట్లో కరిగించిన వెన్న, కండెన్స్డ్ మిల్క్, పాలు వేసి మళ్లీ బాగా కలపాలి. మరీ గట్టిగా ఉంటే మరికొన్ని పాలు కలపాలి. దీనిపైన మూత పెట్టి, 7 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తీసి, అరగంట సేపు బయట ఉంచాలి. దీంట్లో యాలకుల పొడి, వెనిల్లా ఎసెన్స్ కలపాలి. ఈ కేక్‌ను ప్రెషర్ కుకర్‌లో తయారుచేసుకోవచ్చు. అయితే, గ్యాస్కట్, వెయిట్ అవసరం లేదు. పాత ఇడ్లీపాత్రలా ఉండే మందపాటి కుకర్ అయితే బాగుంటుంది.కేక్ బేక్ చేసే పాత్ర అడుగునే 2 కప్పుల టేబుల్ సాల్ట్ వేయాలి. 2 కప్పుల ఇసుక వేయాలి.దీంట్లో కేక్పాత్ర పెట్టడానికి అనువుగా ఒక స్టాండ్‌ను ఉంచాలి. ఇప్పుడు ఈ పాత్రను వేడి చేయాలి.కుకర్‌లో పెట్టే పాత్ర అడుగున నూనె లేదా వెన్న రాసి మిశ్రమం అంతా అందులో వేసి, స్పూన్‌తో ప్లాట్‌గా సర్ది, పైన బాదం, జీడిపప్పు తరుగులు వేయాలి. ఈ పాత్రను కుకర్‌లో పెట్టి, పైన మూత పెట్టాలి. (గ్యాస్కట్, విజిల్ అవసరం లేని గట్టి మూత ఉండాలి) సన్నని మంట మీద 45-50 నిమిషాల సేపు బేక్ చేయాలి.మిశ్రమం బాగా ఉడికి, ముదురు గోధుమ రంగులోకి వస్తుంది. దీనిని తీసి నిల్వ చేసుకోవచ్చు. 4-5 రోజుల వరకు ఉపయోగించవచ్చు. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కావల్సినవి: అరటికాయ ముక్కలు - కప్పు గుమ్మడికాయ ముక్కలు - కప్పు మునక్కాడ ముక్కలు - 1 కప్పు (మూడు అంగుళాల పరిమాణంలో ముక్కలు చేయాలి) ముల్లంగి - 1 (ముక్కలు చేయాలి) పచ్చి బఠాణీ - అర కప్పుకందిపప్పు - పావు కప్పుపచ్చి కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పు కారం - 3 టీ స్పూన్లు పసుపు - అర టీ స్పూన్ టెఫ్లేమ్ (ఇవి గోవాలో దొరికే సుగంధద్రవ్యాలలో ఒకటి. వంటలకు మంచి సువాసన రావడానికి దీనిని వాడతారు. మనం మిరియాలను ఉపయోగించవచ్చు) - 10 చింతపండు గుజ్జు - టేబుల్ స్పూన్ ఉప్పు - తగినంత తయారీ:చింతపండు గుజ్జు, కారం, కొబ్బరి తరుగు, పసుపు, కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీంట్లో టెఫ్లేమ్స్ లేదా మిరియాలు, 3 కప్పుల నీళ్లు కలిపి ఉడికించాలి. దీంట్లో మునక్కాడలు, ముల్లంగి ముక్కలు, పప్పు వేసి 10 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత గుమ్మడి, అరటికాయ ముక్కలు, పచ్చిబఠాణీలు వేసి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కొబ్బరి తరుగు మిశ్రమం, ఉప్పు, కప్పు నీళ్లు కలిపి మరో 5 నిమిషాలు ఉడికించి దించాలి. ఈ కూర చపాతీ, పూరీ, అన్నంలోకి వడ్డించాలి. -
మహిళా గూఢచారులతో భారత పురుషులకు ఎర!
భారత పురుషులకు ఎరవేసేందుకు పాక్ గూఢచార సంస్థ.. ఐఎస్ఐ కొత్త పంథాను ఎంచుకుంది. సోషల్ మీడియా ద్వారా మహిళా గూఢచారులను రంగంలోకి దింపుతోంది. గతంలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై, ఆ రాష్ట్రంలో ఇతర లక్ష్యాలపై దాడి చేసేందుకు అప్పట్లో నేపాల్ ఐఎస్ఐ ప్రయోగ కేంద్రాలనుంచి మహిళా గూఢచారులను ఇండియాలోకి ప్రవేశపెట్టారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలనే ఆ జిహాదీలు ఆయుధాలుగా వాడుకుంటూ ఇండియాలోని పురుషులకు ఎరవేస్తున్నారు. ఇటీవలి కాలంలో మహిళా గూఢచారుల కేసులు వెలుగు చూడటంతో పోలీసు నిఘా ముమ్మరం చేశారు. 2014 ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఫిరోజ్ పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ భారతీయులు కావడం వారి అనుమానాలకు మరింత బలాన్నిచ్చింది. నిందితులను పోలీసులు విచారించగా కొత్త కోణాలు వెలుగుచూశాయి. ఇండో పాక్ చెక్ పోస్టు దగ్గరి గుస్సేన్ వాలా ప్రాంతాన్నిమహిళా గూఢచారులు రెండుసార్లు సందర్శించినట్లు తెలిసింది. వీరిద్దరినీ విడివిడిగా ట్రాప్ చేసిన ఐఎస్ఐ ఏజెంట్ జయ మిశ్రాతో వీరికి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు నిందితుల్లో ఒకరు మధ్యప్రదేశ్ భోపాల్ జిల్లాకు చెందిన 43 ఏళ్ల శివ్ నారాయణ్ చంద్రవంశం గానూ, మరొకరు 35ఏళ్ల అర్జున్ మాలవ్యగాను గుర్తించారు. ఈ నిందితులిద్దరూ ఐఎస్ఐ మహిళా ఏజెంట్ జయ మిశ్రాతో ఇంటర్నెట్ లో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిరోజ్ పూర్ పోలీస్ సీనియర్ సూపరింటెండెంట్ చెబుతున్నారు. ఐఎస్ఐ ఏజెంటుగా ఉన్న ఆ మహిళా గూఢచారి లాహోర్ లో ఓ క్లినిక్ నిర్వహిస్తోందని, ఆమె నల్లతేళ్లతో తయారు చేసిన ఔషధాలను సమాజసేవ కోసం వినియోగిస్తోందని పోలీసుల దర్యాప్తులో తేలింది. సో... భారత పురుషులు మహిళల పేర్లు కనిపించగానే కనెక్ట్ అయిపోకుండా సామాజిక మాధ్యమాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే మరి. -
భారత్‌లో పనిచేసిన గూఢచారికి వందేళ్లు
వాషింగ్టన్: రెండో ప్రపంచయుద్ధ సమయంలో అమెరికా తరఫున గూఢచారిగా భారత్‌లో పనిచేసి, అసత్య వార్తాకథనాలతో జపాన్ సేనలను తప్పుదోవ పట్టించిన ఎలిజబెత్ బెట్టీ మెకింతోష్ వందో పుట్టినరోజు జరుపుకున్నారు. అమెరికాకు విశేష సేవలిందించినందుకు గాను బెట్టీ వందో జన్మదినాన్ని మంగళవారం సీఐఏ ప్రధానకార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పాత్రికేయురాలైన బెట్టీ 1943 నుంచి కొన్నేళ్ల పాటు భారత్‌లో ఉన్నారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో సీఐఏ పూర్వ సంస్థ ఓఎస్ఎస్లో చేరిన బెట్టీ.. జపాన్ బలగాలు ఓడిపోయి పారిపోతున్నాయని, అమెరికా సేనలు విజృంభిస్తున్నాయంటూ అసత్య వార్తాకథనాలు వండివార్చేవారు. ఇంఫాల్ వద్ద జరిగిన పోరులో జపాన్ సేనలు వెనక్కి వెళ్లేందుకు ఈమె గూఢచర్యమూ కారణమైందని విశ్లేషకులు భావిస్తారు. జపాన్ నుంచి అధికారిక పత్రాలను సైన్యానికి మోసుకొచ్చిన కొరియర్‌ను చంపించి, ఆ కొరియర్ సంచిలో ఫోర్జరీ చేసిన పత్రాలను ఉంచడం ద్వారా.. అమెరికా సేనలకు దొరకరాదని జపాన్ ప్రభుత్వం ఆదేశించినట్లు సైనికులు భ్రమపడేలా చేసినట్లు ఈమెను ప్రశంసిస్తారు.