spoke
-
సెంటిమెంట్ ‘అస్త్రం’.. గ్యారంటీ ‘మంత్రం’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కదన రంగంవైపు కాంగ్రెస్ మరో ముందడుగు వేసింది. తుక్కుగూడ సభ వేదికగా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఇటు సెంటిమెంట్ అస్త్రాన్ని, అటు గ్యారంటీ పథకాల మంత్రాన్ని ప్రయోగించింది. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని, ఆ దిశగా సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని ప్రజల్లోకి వెళ్లేలా.. సోనియా, ఇతర నేతలు ప్రసంగించారు. ఇదే సమయంలో రైతులు, మహిళలు, పేదలు.. ఇలా అన్నివర్గాల ప్రజలను ఆకర్షించేలా ఆరు గ్యారంటీల పేరిట కీలక హామీలను ప్రకటించారు. మరోవైపు బీజేపీతోపాటు బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలను టార్గెట్ చేస్తూ అగ్రనేతలు విమర్శలు గుప్పించడం గమనార్హం. కల నెరవేర్చామంటూ.. విజయభేరి సభలో సోనియా కొంతసేపే మాట్లాడినా.. ప్రజలపై సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. తెలంగాణ ఏర్పాటులో తనతోపాటు కాంగ్రెస్ సహచరులు పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనేది తన కల అన్నారు. తెలంగాణ తన చొరవతోనే వచ్చిందని చెప్తూనే.. ప్రజల కల నెరవేర్చినందుకు బదులుగా అధికారాన్ని ఇచ్చి తన కల నెరవేర్చాలనేలా సోనియా ప్రసంగం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. రాహుల్ గాంధీ కూడా తాము తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకున్నామని గుర్తుచేస్తూ.. తమను గెలిపిస్తే ఇప్పుడు ఇస్తున్న హామీలన్నీ నెరవేరుస్తామని ప్రకటించడం గమనార్హం. ఇక సోనియాతోనే మహిళలకు గ్యారంటీ ఇప్పించడం ద్వారా వారిలో భరోసా కల్పించే ప్రయత్నం చేశారని అంటున్నాయి. మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 నగదు సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం హామీలను సోనియా గాంధీనే ప్రకటించారు. ఈ హామీలు మహిళల ఓట్లను రాబడతాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇక రైతులు, యువకులు, వృద్ధులు, పేదల కోసం మరో ఐదు గ్యారంటీలను కూడా కాంగ్రెస్ ప్రకటించింది. ఇవి ఆయా వర్గాలను ఆకర్షిస్తాయని భావిస్తోంది. మూడు పార్టీలను టార్గెట్ చేస్తూ.. అటు సీడబ్ల్యూసీ సమావేశాల్లో, ఇటు తుక్కుగూడ బహిరంగసభలో రెండు అంశాలపైనే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసింది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని, అవసరమైనప్పుడు ఆ మూడు పార్టీలు సహకరించుకుంటాయని కాంగ్రెస్ నేతలు పదేపదే పేర్కొన్నారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ఖేరా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడినప్పుడు.. సభ వేదికపై రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే మాట్లాడినప్పుడు ఈ మూడు పార్టీలపై విమర్శలు గుప్పించారు. పార్టీ కేడర్‌లో జోష్ సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణ, తుక్కుగూడలో భారీ బహిరంగసభతో రెండు రోజుల పాటు జరిగిన హడావుడి రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తుక్కుగూడ సభకు భారీ జనసందోహం రావడంతో కాంగ్రెస్ కేడర్‌లో నెలకొన్న జోష్‌కు నిదర్శమని.. సోనియాగాంధీ పాల్గొన్న ఈ సభకు లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చారని అంటున్నాయి. -
పెళ్లి మాటే ఎత్తని ఈ భామల్ని చూశారా?
-
జెలెన్ స్కీతో ఫోన్లో సంభాషించిన మోదీ
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ భూభాగాల రక్షణ కోసమే ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నామని అవసరమనుకుంటే అణుదాడికి కూడా దిగుతామని కరాఖండిగా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మోదీ ఫోన్లో మాట్లాడారు. అదీకూడా పుతిన్ పెద్ద సంఖ్యలో బలగాలను సమీకరిస్తానని బహిరంగా ప్రకటించిన రెండు వారాల తర్వాత ఇరు నాయకులు ఫోన్లో సంభాషించుకోవడం విశేషం. పైగా పుతిన్ తమ దాడిని ముఖ్యంగా నాటో సభ్య దేశాలైన యూఎస్ దాని మిత్రదేశాలకు వ్యతిరేకంగా చేస్తున్న గొప్ప యుద్ధంగా అభివర్ణించుకున్నాడు కూడా. ఈ మేరకు ఫోన్లో మోదీ....ఉక్రెయిన్‌లో తూర్పు ప్రాంతాల రష్యా బలగాల దాడి గురించి ప్రస్తావిస్తూ...అణుదాడుల విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఇరు దేశాల నాయకులు శత్రుత్వాన్ని విరమించుకోవాలని హితవు పలికారు. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా పునరుద్ఘాటించారు. వివాదానికి ఎప్పుడూ సైనిక పరిష్కారం ఉండదని కూడా దృఢంగా చెప్పారు. అలాగే ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా సహకరించేందుకు భారత్ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని తెలియజేసినట్లు ప్రధాని మంత్రి కార్యాలయం పేర్కొంది. (చదవండి: బంగ్లాదేశ్‌లో సగం పైగా జనాభా అంధకారంలోనే...) -
'మాట్లాడింది చంద్రబాబే'
-
మాట్లాడింది బాబే!
-
మాట్లాడింది బాబే!
- ట్యాపింగ్‌కు అవకాశమే లేదు - ‘ఓటుకు నోటు’ కేసులో నిర్ధారించిన ఇంటెలిజెన్స్ బ్యూరో - ఈ వ్యవహారంపై కేంద్రానికి అరడజను నివేదికలు - జూబ్లీహిల్స్‌లోని బాబు నివాసం నుంచే స్టీఫెన్సన్కు ఫోన్ - సెల్‌టవర్ లొకేషన్ వివరాలతో సహా వెల్లడి - ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీగా బేరసారాలు - స్వయంగా ఓ కేంద్ర మంత్రి పర్యవేక్షణపైనా నివేదిక సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడింది ఏపీ సీఎం చంద్రబాబునాయుడేనని కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) స్పష్టం చేసింది. చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. ట్యాపింగ్ జరిగి ఉండే అవకాశం ఏమాత్రం లేదని నిర్ధారించింది. ఇందుకు తగిన ఆధారాలతో కూడిన అరడజను నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి ఐబీ అందజేసింది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేల బేరసారాల దగ్గరి నుంచి ఓ కేంద్రమంత్రి భాగస్వామ్యం దాకా అన్ని వివరాలనూ ఆ నివేదికల్లో పొందుపరచింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ. 5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో స్టీఫెన్సన్కు రేవంత్ రూ.50 లక్షలు ఇవ్వజూపుతున్న దృశ్యాల వీడియోలతో పాటు స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డులు బహిర్గతమయ్యాయి. దీంతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టీడీపీ నేతలు.. తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ అడ్డగోలు ఆరోపణలకు దిగారు. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో కేంద్ర హోంశాఖ ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఇంటలిజెన్స్ బ్యూరో(ఐబీ)ను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌కు అవకాశం ఉన్న దాదాపు అన్ని విభాగాల అధికారులను ఐబీ విచారించింది. బీఎస్ఎన్ఎల్తో పాటు ప్రైవేట్ ఆపరేటర్లను విచారించి.. తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని నిర్ధారించుకుంది. దీంతోపాటు ‘ఓటుకు నోటు’ కేసుకు సంబంధించి అన్ని అంశాలతో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు అరడజను నివేదికలను ఐబీ అందజేసింది. ఫలానా ఫోన్ ట్యాపింగ్ కోసం లేదా ఫలానా ప్రాంతం నుంచి మాట్లాడే ఫోన్లు ట్యాప్ చేయడం కోసం ఎలాంటి సాంకేతిక సదుపాయాలు వినియోగించలేదని ఐబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో తమ ఫోన్లు ట్యాప్ చేశారంటూ చంద్రబాబు, ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలని తేలిపోయింది. బాబు నివాసం నుంచే.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడింది ఏపీ సీఎం చంద్రబాబేనని తమ నివేదికల్లో ఐబీ స్పష్టం చేసింది. ఆ సమయంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచే చంద్రబాబు మాట్లాడారని సెల్‌టవర్ లొకేషన్ వివరాలతో సహా పేర్కొంది. ఎమ్మెల్యేలతో పెద్ద ఎత్తున బేరసారాలు జరిగాయని నివేదించింది. ఈ బేరసారాలకు ఎవరు పాల్పడ్డారు, వారు ఏ హోదాలో ఉన్నారనే వివరాలను రేవంత్ అరెస్టయిన రెండు రోజులకే కేంద్రానికి అందజేసిన నివేదికలో తెలియజేసింది. కేంద్ర మంత్రి ఒకరు ఈ వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షించారని, కొందరు ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడారని అందులో వివరించింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఉన్నతాధికారులతో ఐబీ అధికారి ఒకరు ఇటీవల తరచూ సమావేశమై, కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు కూడా. ‘‘ఎప్పటికప్పుడు మేం కేంద్రానికి నివేదికలు ఇస్తుంటాం. ఇదేం కొత్త కాదు.. ఏ ముఖ్యమైన ఘటన జరిగినా పూర్వాపరాలు తెలుసుకుంటాం. ముఖ్యంగా రాష్ట్ర పోలీసులపైనే ఆధారపడుతాం. కానీ ఈ కేసులో ఓ ముఖ్యమంత్రి పాత్ర ఉండటంతో ప్రతి దానినీ లోతుగా పరిశీలిస్తున్నాం..’’ ఓ సీనియర్ అధికారి సాక్షి ప్రతినిధికి చెప్పారు.