sportspersons
-
ఇక ఆడుదాం ఆంధ్రా
రాష్ట్రంలో మెగా క్రీడా టోర్నీకి తెరలేస్తోంది. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో క్రీడా సంబరాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పోటీలు ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తోంది. 17ఏళ్లు పైబడిన బాలబాలికలకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖోతో పాటు 3కే మారథాన్, యోగా, టెన్నికాయిట్ వంటి పోటీలను నిర్వహించనుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ క్రీడల్లోనూ పోటీలను చేపట్టనుంది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి క్రీడాకారులను పోటీలకు ఆహ్వానిస్తోంది. మొత్తం ఐదు దశల్లో 2.99 లక్షల మ్యాచ్‌లు, ఈవెంట్స్ జరగనున్నాయి. – సాక్షి, అమరావతి స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ.. ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలకు సుమారు మూడు నెలల సమయం ఉండటంతో గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో క్రీడాకారులను గుర్తించి.. వారు మంచి తర్ఫీదు పొందేలా శాప్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఆయా సచివాలయాల పరిధిలో బాలబాలికలకు విడివిడిగా స్పోర్ట్స్ కిట్లను అందించనుంది. బ్యాడ్మింటన్ రాకెట్లు, రింగ్‌లు, క్రికెట్ కిట్, వాలీబాల్లు సమకూర్చనుంది. 26 జిల్లాల వారీగా ఎన్ని కిట్లు అవసరమో.. వాటి జాబితాను సిద్ధం చేస్తోంది. సీఎస్ పర్యవేక్షణలో.. ప్రభుత్వం యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఏటా దీన్ని నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా 13 మందికిపైగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయిలో అపెక్స్ కమిటీని నియమించింది. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు టోర్నీ నిర్వహణ, విజేతలకు బహుమతుల పంపిణీ తదితర అంశాలపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేస్తోంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి భవిష్యత్తులో మంచి శిక్షణ అందించనుంది. తద్వారా వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సత్తా చాటేలా తీర్చిదిద్దనుంది. క్రీడా శక్తిని పెంపొందిస్తాం.. యువతకు చదువు ఒక్కటే కాదు.. క్రీడలు కూడా ఉండాలి. అందుకే ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ ద్వారా పెద్ద ఎత్తున క్రీడా శక్తిని పెంపొందిస్తోంది. దాదాపు నెలన్నర రోజుల పాటు ఈ పోటీలు ఉంటాయి. ఆరోగ్యకర జీవనశైలికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఈ క్రీడలు మేలు చేస్తాయి. ఈ పోటీల నిర్వహణలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు భాగమవుతాయి. క్రీడాకారులకు అవసరమైన స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేస్తాం. పోటీలకు క్రీడా ప్రాంగణాలను గుర్తించి అభివృద్ధి చేస్తాం. – జి.వాణీమోహన్, ముఖ్య కార్యదర్శి, క్రీడలు, యువజన సర్విసులు 15వేల గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో.. తొలుత 15 వేల గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో 1.50 లక్షల మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధిస్తే మండల స్థాయిలో (680 మండలాల్లో) 1.42 లక్షల మ్యాచ్‌లు, వడపోత అనంతరం నియోజకవర్గ స్థాయిలో 5,250, జిల్లా స్థాయిలో 312, రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్‌లతో పాటు ఫైనల్ పోటీలు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. పోటీల నిర్వహణకు సంబంధించి శాప్.. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్వోపీ)ను సిద్ధం చేసి ఆయా జిల్లా కలెక్టర్లకు పంపించనుంది. ఇప్పటికే పాఠశాలల మైదానాలు, మున్సిపల్ క్రీడా ప్రాంగణాలతో పాటు పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పీఈటీ, పీడీలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. స్థానికంగా క్రీడల్లో గుర్తింపు పొందిన వారి సహాయంతో యువతను పెద్ద ఎత్తు¯]∙పోటీలకు హాజరయ్యేలా ప్రోత్సహించనుంది. -
టాయిలెట్లో భోజనాలు
సహరన్పూర్ (యూపీ): ఉత్తరప్రదేశ్‌లో వినడానికే రోత పుట్టించే ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో క్రీడాకారిణులకు ఇంకెక్కడా చోటు లేనట్టు టాయిలెట్లో భోజనాలు వడ్డించారు! సహరన్‌పూర్‌లోని డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ స్టేడియంలో సెపె్టంబర్ 16 నుంచి 18 దాకా రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్ కబడ్డీ టోర్నమెంట్ పోటీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 16 డివిజన్ల నుంచి 300 మంది అమ్మాయిలు పాల్గొన్నారు. వారికి టాయిలెట్లో భోజనాలు వడ్డించడం తీవ్ర దుమారం రేపింది. అన్నం, కూరలతో పాటు పూరీలను టాయిలెట్లోనే నేలపై పేపర్లు పరిచి ఉంచారు. గత్యంతరం లేక బాలికలు అక్కడే వడ్డించుకొని తింటున్న వీడియో వైరల్‌గా మారింది. దాంతో యూపీ ప్రభుత్వం తీరును నెటిజన్లు అసహ్యించుకున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సహరన్పూర్ జిల్లా క్రీడల అధికారి అనిమేశ్ సక్సేనాను సస్పెండ్ చేసింది. భోజనాలు తయారు చేసిన కేటరర్‌ను బ్లాక్ లిస్ట్‌లో ఉంచింది. మూడు రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ‘‘వీడియోలో కనిపిస్తున్న ఆహారం సెపె్టంబర్ 15న వండినది. పాడైపోయిన ఆహారం కావడంతో భారీ వర్షాల వల్ల స్టేడియంలో ఎక్కడా చోటు లేక ఛేంజింగ్ రూమ్‌లో ఉంచాం. అంతే తప్ప బాలికలకు పెట్టడానికి కాదు’’ అంటూ సక్సేనా సమరి్థంచుకున్నారు. భోజనాలపై కోచ్‌లు, క్రీడాకారిణులు ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదని చెప్పుకొచ్చారు. 300 మందికి భోజనాన్ని ఇద్దరే చేశారని, అన్నం కూడా ఉడకలేదని సమాచారముందని కలెక్టర్ చెప్పారు. దీనిపై బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ మండిపడ్డారు. క్రీడాకారిణుల్ని ఈ స్థాయిలో అగౌరవపరచడం జాతికే అవమానమంటూ ట్వీట్ చేశారు. ఇంత దారుణంగా చూస్తారా అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా దీనిపై మండిపడింది. -
ఆటగాళ్ల ఫైర్ : పునరాలోచనలో హర్యానా ప్రభుత్వం
చండీగఢ్ : క్రీడాకారుల సంపాదనలో మూడోవంతును ప్రభుత్వానికి ఇవ్వాలని హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోహర్ లాల్ ఖత్తర్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ నోటీఫికేషన్ జారీచేయవద్దని సంబంధిత క్రీడా మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ మీడియాకు తెలిపారు. తమ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తాము గర్వంగా ఫీలవుతున్నామని, వారి సమస్యలను పరిగణలోకి తీసుకొని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల్లో ఉన్న అథ్లెట్లు వృత్తిపరమైన క్రీడలతో పాటు వాణిజ్యపరమైన ఆదాయంతో సహా లెక్కగట్టి.. మొత్తం సంపాదనలో మూడవ వంతు సొమ్మును క్రీడా మండలికి చెల్లించాలని ఏప్రిల్ 30 న హర్యానా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అథ్లెట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని ఒలింపిక్ పతాక విజేత సుశీల్ కుమార్, ఫోగట్ సిస్టర్స్ తప్పుబట్టారు. ఆటగాళ్లపై ప్రభుత్వం మరో భారాన్ని మోపడం సరికాదన్నారు. ఈ నోటీఫికేషన్ విడుదల చేసేముందు ప్రభుత్వం తమతో చర్చించాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ నోటిఫికేషన్‌ను ఆ రాష్ట్ర బీజేపీ నేత జవహార్ యాదవ్ వెనకేసుకొచ్చారు. అథ్లెట్లు క్రీడల్లో గెలిచిన ప్రైజ్ మనీని ఇవ్వమనడం లేదని, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వాణిజ్య ప్రకటనల ద్వారా ఆర్జిస్తున్నారో వారినే ఇవ్వమంటున్నామని తెలిపారు. -
అథ్లెట్లకు హర్యానా షాక్
చండీగఢ్: హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయంతో క్రీడాకారులు షాక్‌కు గురయ్యారు. రాష్ట్రంలోని క్రీడాకారులు సంపాదించిన మొత్తంలో మూడో వంతును ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. వృత్తిపరమైన క్రీడలతో పాటు వాణిజ్యపరమైన ఆదాయంతో సహా లెక్కగట్టి.. మొత్తం సంపాదనలో మూడవ వంతు సొమ్మును క్రీడా మండలికి చెల్లించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. అథ్లెట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న అథ్లెట్లు ప్రొఫెషనల్ స్పోర్ట్స్, కమర్షియల్ ఎండార్స్‌మెంట్స్‌లలో పాల్గొనే సమయంలో సదరు నిబంధనలను అంగీకరించాల్సి ఉంటుంది. ఆ సమయంలో క్రీడాకారులకు అసాధారణ సెలవును (వేతనం ఇవ్వరు) ఇస్తారు. పోటీల ద్వారా సంపాదించిన మొత్తంలో మూడో వంతును హర్యానా రాష్ట్ర స్పోర్ట్స్ కౌన్సిల్ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనిని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి వినియోగిస్తాం అని ఏప్రిల్ 30 న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ ముందస్తు అనుమతితో వేతనంతో కూడిన సెలవుపై వెళ్లి ఈవెంట్ లేదా వాణిజ్య ప్రకటనల షూటింగ్లో పాల్గొంటే.. వాటి ద్వారా వచ్చే సంపాదన మొత్తాన్నీ క్రీడా మండలి దగ్గర డిపాజిట్ చేయాల్సిందేనని కొత్త నిబంధన కూడా విధించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై క్రీడాకారులు మండిపడుతున్నారు. హర్యానా క్రీడాకారులు రెజ్లింగ్, బాక్సింగ్‌లలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
క్రీడారంగ రిజర్వేషన్లు భేషైన నిర్ణయం
విద్యా ఉద్యోగాల్లో క్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్లను వర్తింపచేస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు క్రీడాభివృద్ధికి దోహదం చేస్తుంది. క్రీడాకారులకు ఎంతో మేలు చేసే నిర్ణయమిది. తమ ప్రతిభ ద్వారా దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టే క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం ప్రభుత్వం బాధ్యత. ర్యాంక్‌లు, మార్కులకోసం పోటీపడే ప్రస్తుత కాలంలో ఆటలు ఆడితే పిల్లలు పాడవుతారని, చదువుల్లో వెనకబడతారనే తల్లిదండ్రులు ఆలోచిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు క్రీడా సాంస్కృతిక కళల పట్ల ఆసక్తి చూపించడంలేదు. విద్యా సంస్థలు సైతం వీటిని ప్రోత్సహించడంలేదు. క్రీడా పోటీలలో పాల్గొన్న విద్యార్థులు ఏక కాలంలో చదువులపై, ఆటలపై దృష్టి సారించలేరు. అటువంటి విద్యార్థులకు ఉన్నత చదువులలో రిజర్వేషన్ సౌకర్యం ఉండాలి. ఉద్యోగాలలో రిజర్వేషన్ల వల్ల క్రీడాకారులకు భవిష్యత్ ఉపాధి హామీ ఉంటే క్రీడల్లో తమ పిల్లల్ని ప్రోత్సహించే తల్లిదండ్రుల సంఖ్య క్రమంగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. క్రీడలకు సరైన ప్రోత్సహకాలు లేక ఎంతోమంది భావి క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలవలే మిగిలిపోయారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు కూడా దినసరి కూలీలాగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్న దీనగాథలు రోజు వినపడుతూనే ఉన్నాయి. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎయిడెడ్ సంస్థల్లో దాదాపు 29 క్రీడాంశాలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఈ రిజర్వేషన్ సౌకర్యం వర్తించే విధంగా ఉత్తర్వులు జారీ చేసారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత పలు సందర్భాల్లో క్రీడారంగ రిజర్వేషన్లపై అనేక విజ్ఞప్తులు వచ్చాయి. చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు కూడా. అయతే క్రీడా రిజర్వేషన్లను అమలు చేయడంలో అసలు గొప్పతనం ఉంటుంది. అర్హులైన వారికి అవకతవకలు లేకుండా విమర్శలకు తావు లేకుండా అమలు జరగాలి. దొంగ సర్టిఫికెట్లకు అవకాశం లేకుండా నిజమైన క్రీడాకారులకు రిజర్వేషన్ల ఫలాలు దక్కేలా అన్ని శాఖలు సమిష్టి కృషి చెయ్యాలి. ఈ ఫలితాలు పొందిన క్రీడాకారులు భావి క్రీడాకారులను ప్రోత్సహించాలి. - సురేష్ కాలేరు, రాష్ట్ర సహాధ్యక్షులు, తెలంగాణా ఉద్యోగుల సంఘం -
ఆట నుంచి ఓటు దాకా...
బ్యాట్ పట్టినవారు, బాక్సింగ్ చేసిన వారు, ఈత కొట్టిన వారు, షూటింగ్ చేసిన వారు.... ఇలా ఆటగాళ్లెందరో ఓటు వేటగాళ్లుగా మారారు. ఆట మైదానంలో చూపిన నేర్పునే ఓటు మైదానంలోనూ చూపిస్తామంటూ ముందుకొచ్చారు. సినీ స్టార్ల తరువాత అంతటి క్రేజున్న ఆటగాళ్లు ఈ సారి కూడా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఫుట్ బాల్ కింగ్ బైచుంగ్ భూటియా తృణమూల్ కాంగ్రెస్ తరఫున గోల్ కొడతానంటున్నారు. చిరునవ్వుల క్రికెటర్ మహ్మద్ కైఫ్ కాంగ్రెస్ తరఫున ఫీల్డింగ్ చేస్తున్నారు. ఇక షూటర్ రాజ్యవర్ధన్ రాథోర్ బిజెపి తరఫున గురి తప్పనంటున్నారు. ఇప్పటి వరకూ స్టేడియం నుంచి చట్టసభకు పోటీపడ్డ ఆటగాళ్లెవరో చూద్దాం. మన్సూర్ అలీఖాన్ పటౌడీ - మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి రంగంలోకి దిగిన ఈ స్టైలిష్ నవాబు ఎన్నికల్లో మాత్రం గెలవలేకపోయారు. అంతకు ముందు ఆయన 1971 లో హర్యానా నుంచి పోరాడారు. కానీ గెలవలేకపోయారు. దేశానికి క్రికెట్ పిచ్చి అంటని రోజుల్లో ఆయన పోరాడి ఓడారు. చేతన్ చౌహాన్ - ఇండియన్ క్రికెట్ లో అద్భుతమైన ఓపెనర్లలో ఒకరుగా పేరొందిన చేతన్ రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బిజెపి నేతగా నిలిచారు.ఆయన అమ్రోహా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. అస్లాం షేర్ ఖాన్ - ఈ హాకీ షేర్ మధ్య ప్రదేశ్ లోని సాగర్ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈయనది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి, మన హాకీ టీమ్ పరిస్థితి ఒకటేలా ఉంది. జ్యోతిర్మయ్ సిక్దర్ - ఈ స్విమ్మింగ్ ఛాంపియన్ సీపీఎం తరఫున కృష్ణనగర్ (పశ్చిమ బెంగాల్) నుంచి 2004 లో గెలిచింది. 2009 లో మాత్రం ఆమెకన్నా గజ ఈతగత్తె అయిన మమతా బెనర్జీ వేగానికి తలవంచక తప్పలేదు. జస్పాల్ రాణా - ఈ ఏస్ షూటర్ 2009 లో తెహ్రీ గఢ్ వాల్ (ఉత్తరాఖండ్) నుంచి బిజెపి తరఫున పోటీ చేశారు. కానీ గురి తప్పింది. ఆ తరువాత 2012 లో ఆయన బిజెపి వదిలి కాంగ్రెస్ లో చేరారు. ఈ సారి అంచనా తప్పింది. కీర్తి ఆజాద్ - బ్యాట్ తోనూ, నోటి తోనూ సమానంగా ఆడగల కీర్తి ఆజాద్ తండ్రి భగవత్ ఝా ఆజాద్ ఒకప్పటి బీహార్ ముఖ్యమంత్రి. తండ్రి సహా కాంగ్రెస్ నుంచి బిజెపి టీమ్ లో చేరాడు. దర్భంగా ఎంపీ అయ్యాడు. ఈ సారి మళ్లీ రెండో ఇన్నింగ్స్ ఆడతానంటున్నాడు. నవజ్యోత్ సింగ్ సిద్ధు - అద్భుతమైన వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి ఉన్న సిద్ధు రెండుసార్లు అమృతసర్ ఎంపీగా గెలిచారు. మోడీ వీరాభిమాని అయినా 2014 బిజెపీ టీమ్ లో ఈయనకు చోటు దక్కలేదు. మహ్మద్ అజారుద్దీన్ - క్రికెట్ లో ఈయన బ్యాట్ మాత్రమే మాట్లాడింది. ఎంపీగా నోరు మాట్లాడుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆయన అయిదేళ్లలో రెండే రెండు సార్లు నోరు విప్పి మాట్లాడారు. అయిదంటే అయిదు ప్రశ్నలు వేశారు. ఈ సారి రాజస్తాన్ నుంచి లక్ ట్రై చేసుకుంటున్నారు. మనోహర్ ఐచ్ - నాలుగున్నర అడుగుల ఐచ్ ఒకప్పటి మిస్టర్ యూనివర్స్. ఎనభై ఏళ్లు వచ్చినా కండల వీరుడిగానే నిలిచాడు. ఈయన బిజెపి తరఫున బెంగాల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ మధ్యే ఐచ్ చనిపోయారు.