నల్ల చిరుత.. మళ్లీ వస్తోంది!
ట్రాక్ మీదకు వచ్చాడంటే చాలు.. ఎప్పుడు మొదలుపెట్టాడో, ఎప్పుడు పూర్తి చేశాడో కూడా తెలియనంత వేగంగా పరుగులు తీస్తాడు. అలాంటి నల్ల చిరుత ఉసేన్ బోల్డ్ మళ్లీ రంగంలోకి దిగుతున్నాడు. గాయాల కారణంగా కొంతకాలంగా ట్రాక్‌కు దూరంగా ఉన్న బోల్ట్.. వచ్చే నెలలో మళ్లీ పరుగులు మొదలుపెడుతున్నాడు.
వచ్చే నెలలో గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ క్రీడలతో మొదలుపెట్టి, వరుసపెట్టి నాలుగు ఈవెంట్లలో బోల్ట్ పాల్గొంటాడు. భూమ్మీద ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన అథ్లెట్‌గా పేరు పొందిన ఉసేన్ బోల్ట్.. తన రేసింగ్ షెడ్యూలును విడుదల చేశాడు. కామన్వెల్త్ క్రీడల్లో జమైకా తరఫున స్ప్రింట్ రిలేలో కూడా పాల్గొంటున్నాడు. ఈ విషయాన్ని తన ట్విటర్ అకౌంట్, వెబ్సైట్ ద్వారా తెలిపాడు.
My race schedule finalized: CWG 4x100m, Brazil- Rio-Sun 17 Aug, Poland-Warsaw Sat 23 Aug, Zurich-Thurs 28 Aug ..#SeenUsoon #Cantwait
— Usain St. Leo Bolt (@usainbolt) July 20, 2014