sravani dies
-
హైదరాబాద్: మలక్‌పేట హిట్ అండ్ రన్ కేసులో డాక్టర్ శ్రావణి మృతి
-
హిట్&రన్ కేసు: డాక్టర్ శ్రావణి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట్ హిట్ అండ్ రన్ కేసు విషాదంగా ముగిసింది. కారు ఢీ కొన్న ప్రమాదంలో గాయపడ్డ డాక్టర్ శ్రావణి కన్నుమూసింది. చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ.. మూడు రోజులుగా ఆమె నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే.. ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతోనే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. ఇక నిందితుడిని ఓల్డ్ మలక్‌పేటకు చెందిన ఇబ్రహీంగా గుర్తించారు. అంతేకాదు.. నిందితుడికి లైసెన్స్, కారుకు పేపర్లు సైతం లేవని వెల్లడించారు పోలీసులు. శ్రావణి హస్తినాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెంటల్ డాక్టర్‌గా విధులు నిర్వహించేవారు. ఇదిలా ఉంటే.. నెల వ్యవధిలో ఆ కుటుంబంలో ఇది రెండో విషాదం. సుమారు 25 రోజుల కిందటే శ్రావణి తల్లి గుండెపోటుతో కన్నుమూయడం గమనార్హం. దీంతో ఆ కుటుంబం శోకంలో మునిగిపోయింది. సెప్టెంబర్ 21వ తేదీన ఓలా బైక్ బుక్ చేస్కొని శ్రావణి వెళ్తుండగా.. గుర్తు తెలియని కారు ఒకటి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓలా బైక్ డ్రైవర్ వెంకటయ్య, శ్రావణి గాయపడగా.. పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రావణి పరిస్థితి విషమంగా మారింది. చివరకు ఆమె తుది శ్వాస విడిచింది. ఇక సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు ఇబ్రహీంను గుర్తించారు పోలీసులు. ఇదీ చదవండి: న్యూడ్ కాల్స్‌తో ఆమె నన్ను వేధిస్తోంది సార్.. -
శ్రావణి హత్య.. పోలీసుల కీలక నిర్ణయం!
సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో జరిగిన శ్రావణి దారుణ హత్య తీవ్ర సంచలనం రేపుతోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడి తర్వాత హత్య చేసినట్లుగా వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అసలు శ్రావణిని హత్య చేసింది ఎవరు? బావిలో పడేసి పూడ్చిపెట్టడం ఒక్కరి వల్ల అయ్యే పనేనా? ఈ దారుణానికి ఒడిగట్టడానికి వెనుక కారణాలేంటి అన్నది ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంంలో ఈ కేసు దర్యాప్తులో భాగంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటుచేసినట్టు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. కేసు దర్యాప్తులో అలసత్వం ప్రదర్శించిన బొమ్మలరామారం ఎస్సై వెంకటేశ్‌పై శాఖపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. శ్రావణి హత్యకు సంబంధించి గ్రామస్తుల వద్ద ఏదైనా సమాచారం ఉంటే నేరుగా రాచకొండ పోలీసుల వాట్సాప్ నంబర్ 9490617111 సమాచారం ఇవ్వచ్చునని తెలిపారు. కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఎస్వోటీ డీసీపీ సురేందర్ రెడ్డి, షీ టీమ్ అడిషనల్ డీసీపీ సలీమా, ఐటీ సెల్ అధికారులు ఉంటారని తెలిపారు. శ్రావణి పోస్ట్‌మార్టం అనంతరం ప్రాథమిక విచారణలో పలు విషయాలు వెలుగుచూశాయి. శ్రావణి ఊపిరాడక చనిపోయిందని.. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని తేలింది. దీంతోపాటు ఆమె ఎడమవైపు పక్కటెముకలు విరిగిపోయాయి. కుడివైపుపక్కటెముకలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను చంపిన తర్వాత 25 అడుగుల లోతులోని బావిలోకి పైనుంచి పడేయడంతో పక్కటెముకలు విరిగినట్లు తెలుస్తోంది. శ్రావణి మృతదేహం దొరికిన బావి వద్ద ఎండిన వరిగడ్డిని గుర్తించారు. బాలిక చనిపోయిన తర్వాత కాల్చివేయాలన్న ఆలోచనలో నిందితులు ఉన్నట్లు భావిస్తున్నారు. శ్రావణి హత్య సంఘటనపై ఆమె బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాంలో ఉన్నారు. శనివారం కూడా శ్రావణి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యులు, గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కోసం వెళ్తూ జాతీయ రహదారిపై మరోసారి రాస్తారోకో చేపట్టారు. ప్రజల ఆగ్రహంతో ఆ ప్రాంతమంతా అట్టుడికిపోయింది. సీపీ మహేశ్‌భగవత్ సంఘటన స్థలానికి చేరుకుని నిందితులను 24 గంటల్లో పట్టుకుని చట్టపరంగా శిక్షిస్తానని హామీ ఇవ్వడంతో శ్రావణి అంత్యక్రియలు నిర్వహించారు. @cyberabadpolice @hydcitypolice @TelanganaDGP pic.twitter.com/sekttcEbwq — Rachakonda Police (@RachakondaCop) April 27, 2019 చదవండి: శ్రావణిని చంపిందెవరు? -
శ్రావణిని చంపిందెవరు?
సాక్షి,యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో జరిగిన శ్రావణి దారుణ హత్య తీవ్ర సంచలనం రేపుతోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడి తర్వాత హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. శ్రావణి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 9వ తరగతి పూర్తి చేసిన శ్రావణి, పాఠశాలలో ప్రైవేట్ తరగతులకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా చోటు చేసుకున్న దారుణ ఘటనపై అన్ని వర్గాల్లో ఆందోళన, ఆగ్రహం పెల్లుబుకుతోంది. శ్రావణిని హత్య చేసింది ఎవరు? అనే అంశంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బావిలో పడేసి పూడ్చిపెట్టడం ఒక్కరి వల్లకాదని, నలుగురు వ్యక్తులు ఇందులో పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిందితులను 24 గంటల్లో పట్టుకుంటామని పోలీసులు శ్రావణి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అయితే హత్య వెనక డ్రగ్స్ బానిసలు ఉన్నారా, లేక వ్యక్తిగత, రాజకీయ కక్షలు.., మరేవైనా కారణాలున్నాయా అన్నది తేలాల్సి ఉంది. కాగా, విధినిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించిన ఎస్ఐని ఉన్నతాధికారులు విధుల్లోంచి తప్పించి విచారణకు ఆదేశించారు. అత్యాచారం చేసి హత్య! శ్రావణిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని డీసీపీ నారాయణరెడ్డి చెప్పారు. పోస్ట్‌మార్టం అనంతరం ప్రాథమిక విచారణలో పలు విషయాలు వెలుగుచూశాయి. శ్రావణి ఊపిరాడక చనిపోయిందని తేలింది. దీంతోపాటు ఎడమవైపు పక్కటెముకలు విరిగిపోయాయి. కుడివైపుపక్కటెముకలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను చంపిన తర్వాత 25 అడుగుల లోతులోని బావిలోకి పైనుంచి పడేయడంతో పక్కటెముకలు విరిగినట్లు తెలుస్తోంది. శవం ఉబ్బిపోయి, చర్మం ఊడిపోయింది. అయితే అత్యాచారం విషయం లో మరింత స్పష్టత కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. శ్రావణి మృతదేహం దొరికిన బావి వద్ద ఎండిన వరిగడ్డిని గుర్తించారు. బాలిక చనిపోయిన తర్వాత కాల్చివేయాలన్న ఆలోచనలో నిందితులు ఉన్నట్లు భావిస్తున్నారు. అది వీలుకాకపోవడం తో బావిలో పడేసి పూడ్చినట్లు తెలుస్తోంది. శ్రావణి హత్యకేసులో విచారణ చేపట్టిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన స్థలంలో లభించిన ఆనవాళ్లు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ అధారంగా కొందరిని అనుమానిస్తున్నారు. గ్రామస్తుల రాస్తారోకో.. శ్రావణి హత్య సంఘటనపై ఆమె బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. తాము మిస్సింగ్ కేసు పెట్టినా పోలీసులు సకాలంలో స్పందించలేదని, పోలీసుల వైఫల్యాన్ని నిలదీస్తూ స్థానికులు శుక్రవారం డీసీపీ వాహనంపై దాడి చేసిన విషయం తెలిసిందే. శనివారం కూడా శ్రావణి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యులు, గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. సుమారు గంటకుపైగా రాస్తారోకో జరిగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కోసం వెళ్తూ జాతీయ రహదారిపై మరోసారి రాస్తారోకో చేపట్టారు. దీంతో సుమారు రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజల ఆగ్రహంతో ఆ ప్రాంతమంతా అట్టుడికిపోయింది. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని తీసుకుని బొమ్మలరామారం చేరుకున్న వారు మరోసారి ఆందోళన చేపట్టారు. సీపీ మహేశ్‌భగవత్ సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని, నిందితులను 24 గంటల్లో పట్టుకుని చట్టపరంగా శిక్షిస్తానని హామీ ఇవ్వడంతో శ్రావణి అంత్యక్రియలు నిర్వహించారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన బొమ్మలరామారం ఎస్ఐ వెంకటేశ్వర్లును హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ డీసీపీ ఉత్తర్వులు ఇచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ బొమ్మలరామారం నుంచి హాజీపూర్‌కు వెళ్లే అడ్డదారిలో జరిగిన ఈ అమానుషానికి పాల్పడింది ఎవరనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు సీసీ కెమెరాలను అశ్రయించారు. అయితే పోలీసులు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లోని సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుస్తోంది. కాగా, సమీపంలోని వైన్స్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో ముగ్గురు యువకులు బీర్లు కొనుగోలు చేసిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌కు శివారులో ఉన్న బొమ్మలరామారంలో కొందరు వ్యక్తులు ఇటీవల గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతున్నట్లు పోలీస్‌లకు ఫిర్యాదు వచ్చాయి. ఈ నేపథ్యంలో మత్తు పదార్థాలు సేవించిన వారు ఈ హత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలో విచారణ జరుగుతోంది. -
ఇంజక్షన్ వికటించి చిన్నారి మృతి
ఆర్ఎంపీ నిర్లక్ష్యం వల్లేనంటూ బాధితుల ఆందోళన గోరంట్ల(సోమందేపల్లి) : గోరంట్ల పట్టణంలో ఆర్ఎంపీ వేసిన ఇంజక్షన్ వికటించి చిన్నారి మృతి చెందినట్లు తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. బూగానిపల్లికి చెందిన రాధమ్మ, శంకర దంపతులు తమ కుమార్తె శ్రావణి (3)కి జ్వరం వస్తుండటంతో గోరంట్లలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్లినిక్‌కు తీసుకెళ్లారు. ఆర్ఎంపీ పెద్దన్న ఇంజక్షన్ వేసి పంపించాడు. స్వగ్రామానికి చేరుకున్న కొద్దిసేపటికే చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో తల్లిదండ్రులు వెంటనే క్లినిక్‌కు వెళ్లారు. తమ చేతకాదని, హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లండని ఆర్ఎంపీ సలహా ఇచ్చాడు. అయితే అప్పటికే శ్రావణి మృతి చెందడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు క్లినిక్ ముందు ధర్నాకు దిగారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. తనవద్దకు వచ్చే వారికి డోస్ ఎక్కువగా ఉండే మందులు, ఇంజక్షన్లు ఇస్తుంటారని ఆర్ఎంపీపై ఆరోపణలు ఉన్నాయి. చిన్నారి మృతిపై కొందరు పెద్దమనుషులు జోక్యం చేసుకుని పంచాయితీ చేసినట్లు సమాచారం.