Sreehari Kadiyam
-
డిప్యూటీ సీఎంను అడ్డుకున్న ‘ఏబీవీపీ’
జనగామ : పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్మెంట్ సమస్య పరిష్కరించాలని కోరు తూ జనగామలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని అడ్డుకున్నారు. శుక్రవారం పెంబర్తిలో ‘గ్రామజ్యోతి’ ముగించుకుని హన్మకొం డకు వెళ్తున్న కడియం కాన్వారుుకి ఎదురుగా బైఠారుుంచి నిరసనత తెలిపారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించినా.. నాయకులు వినక పోవడంతో డిప్యూటీ సీఎం కడియం నేరుగా వారి వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకున్నారు. తెలంగా ణ వస్తే విద్యార్థుల జీవితాలు బాగుపడతాయని ఎన్నో కలలు కనాన్మని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సాథం సంపత్ కడియంకు వివరించారు. రీరుుంబర్స్ మెంట్ నిలిచి పోవడంతో 14 లక్షల మంది ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఈబీసీ, వికలాంగులు, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యను మధ్యలో ఆపేసే దుస్థితి నెలకొందని అన్నారు. స్పందించిన కడియం వారం రోజుల్లోగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరసన తెలిపిన వారిలో మండల కన్వీనర్ ఉల్లెంగుల మణికంఠ, శాసనబోయిన మహిపాల్, క్రాంతి కుమార్, మహేందర్, సందీప్, శ్రావణ్, రాజు, సంపత్, శ్రీకాంత్, ప్రభు, అశోక్ ఉన్నారు. -
నాణ్యత పాటించే కాలేజీలకే మనుగడ
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్: రాష్ట్రంలో నాణ్యతా ప్రమాణాలు, నిబంధనలు పాటించే కాలేజీలకే మనుగడ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలను మూసేయడం తమ ఉద్దేశం కాదని, నాణ్యత ప్రమాణాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 288 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1.70 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా ఎంసెట్లో కేవలం 70 వేల మందే క్వాలిఫై అవుతున్నారని చెప్పారు. ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ నిబంధనలను పాటించే కాలేజీలే ఉంటాయని, నాణ్యత పాటించని కాలేజీలెందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో వర్సిటీల కోసం చట్టాన్ని రూపొందిస్తున్నామని, దీనికి 2-3 నెలల సమయం పడుతుందని తెలిపారు. సమస్యల్లోనూ ఫలితాలివ్వడం అభినందనీయం: చుక్కా రామయ్య కొత్తగా ఏర్పడిన తెలంగాణ ఇంటర్ బోర్డులో అనేక సమస్యలు, ఉద్యోగుల కొరత ఉన్నప్పటికీ పట్టుదలతో పనిచేసి, పకడ్బందీగా పరీక్షలను నిర్వహించి ఫలితాలివ్వడం అభినందనీయమని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ కాలేజీల ఫలితాలు కూడా బాగున్నాయని, అయితే ఇంకా పక్కాగా చర్యలు చేపట్టాలని బుధవారం ఆయన పేర్కొన్నారు.