sreenath
-
క్వాలిటీ పరంగా మాది చాలా పెద్ద చిత్రం : దర్శకుడు శ్రీనాథ్ పులకురం
‘క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా తెరకెక్కించాం. ఈ సినిమా రిహార్సల్స్, వర్క్ షాప్స్ కు కొన్ని నెలల టైమ్ కేటాయించాం. ఆర్టిస్టులను మా ఊరు పుంగనూరు తీసుకెళ్లి రాయలసీమ యాస నేర్పించాం. డబ్బింగ్ కోసమే 8 నెలల టైమ్ వెచ్చించాం.ఆర్టిస్టుల పరంగా మాది చిన్న సినిమానే కానీ క్వాలిటీ పరంగా చాలా పెద్ద సినిమా’ అని అన్నారు దర్శకుడు శ్రీనాథ్ పులకురం. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’. ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు శ్రీనాథ్ పులకురం మాట్లాడుతూ.. నాకు సినిమా అంటే ఇష్టం. కానీ చాలా మందికి సినిమా అంటే వ్యాపారం. అలాంటి వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఇవన్నీ దాటుకుని ఈ నెల 21న గ్రాండ్ గా మా మూవీ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.మూవీ మీకు తప్పకుండా నచ్చుతుంది. చూసి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా చూశాక మీరు మీ పేరెంట్స్ ను గుర్తు తెచ్చుకుంటారు’అన్నారు. మేము ఇచ్చిన లిమిటెడ్ బడ్జెట్ లో ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′సినిమాను శ్రీనాథ్ అందరికీ నచ్చేలా రూపొందించాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను’అని నిర్మాత భువన్‌రెడ్డి కొవ్వూరి అన్నారు. ‘కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో అన్ని ఎమోషన్స్ కలిసి ఉన్న సినిమా ఇది. ఇలాంటి మంచి మూవీని సపోర్ట్ చేయండని రిక్వెస్ట్ చేస్తున్నా’ అని హీరోయిన్ షాజ్ఞ అన్నారు. ‘ఈ సినిమా మా అందరికి చాలా స్పెషల్. హీరోయిన్‌తో పాటు నాక్కుడా మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను’అని హీరో ప్రణవ్ ప్రీతం అన్నారు. -
Srinath Ravichandran: స్పేస్ టెక్ స్టార్టప్ - అంతరిక్షంలో అగ్ని సంతకం!
ఏరో స్పేస్ టెక్నాలజీ అనగానే విదేశాల వైపు చూసే ఎంతోమందికి మన సత్తా చూపించిన స్టార్టప్‌లలో ‘అగ్నికుల్ కాస్మోస్’ ఒకటి. ఆకాశమంత కలతో బయలుదేరిన ‘అగ్నికుల్’ అమ్ముల పొదిలో దివ్యాస్త్రం అగ్నిబాణ్.. ‘అగ్నికుల్’ అంటే భారత అంతరిక్ష రంగంలో ఆత్మనిర్భర్ విజయగాథ. ఐఐటీ–మద్రాస్ కేంద్రంగా పని చేస్తున్న ‘అగ్నికుల్ కాస్మోస్’ త్రీడీ ప్రింటెట్ రాకెట్ ఇంజిన్‌ను తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రశంసలు అందుకుంది. స్నేహితుడు మోహిన్, ప్రొఫెసర్ చక్రవర్తిలతో కలిసి 2017లో ‘అగ్నికుల్’ను లాంచ్ చేశాడు శ్రీనాథ్ రవిచంద్రన్. మన దేశంలోని ఫస్ట్ ప్రైవేట్ స్మాల్ శాటిలైట్ రాకెట్ ‘అగ్నిబాణ్’ను నిర్మించింది అగ్నికుల్. 30 కిలోల నుండి 300 కిలోల బరువు ఉన్న పేలోడ్‌ను తక్కువ భూకక్ష్యలోకి (సుమారు ఏడువందల కిలోమీటర్ల ఎత్తు) తీసుకువెళ్లే సామర్థ్యం దీని సొంతం. 2020లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో ఒప్పందం కుదర్చుకున్న తొలి భారతీయ కంపెనీగా ప్రత్యేకత సాధించింది అగ్నికుల్. ఒప్పందం ద్వారా ‘అగ్నిబాణ్’ నిర్మాణంలో ‘ఇస్రో’ సహాయ, సహకారాలను తీసుకుంది. ప్లగ్–అండ్–ప్లే ఇంజిన్ కాన్ఫిగరేషన్ సామర్థ్యం ఉన్న అగ్నిబాణ్, మిషన్ అవసరాలకు ఖచ్చితంగా సరిపోయేలా కాన్ఫిగర్ చేయగలదు. ప్రతి క్లయింట్‌కు సంబంధించిన ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా కాన్ఫిగర్ చేయవచ్చు. 3డీ సాంకేతికతతో రూపొందించిన ఈ రాకెట్ ఉపగ్రహ ప్రయోగాల ఖర్చును తగ్గిస్తుంది. మొదట్లో వారానికి కనీసం రెండు రాకెట్ ఇంజిన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ తరువాత నాలుగు ఇంజిన్లకు విస్తరించింది అగ్నికుల్. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్లింది. ‘మోర్ యాక్సెసబుల్ అండ్ అఫర్డబుల్’ లక్ష్యంతో బయలు దేరిన శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్‌లు మరిన్ని లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి రెడీ అవుతున్నారు. "శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈరోజు లాంచ్ చేయాల్సిన ‘అగ్నిబాణ్’ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది." ఆత్మవిశ్వాసమే అద్భుత శక్తి.. 2017లో ‘అగ్నికుల్’తో శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్‌లు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఇన్వెస్టర్ల నుంచి విశ్లేషకుల వరకు ‘మన దేశంలో ఇది సాధ్యమా? ఈ కుర్రాళ్ల వల్ల అవుతుందా’ అనే అనుమాన నీడ ఉండేది. అయితే శ్రీనాథ్, మోహిన్లు ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆత్మవిశ్వాసం అనే అద్భుతశక్తితో ముందుకు కదిలారు. నాలుగు వందల వరకు పిచ్ మీటింగ్‌లు నిర్వహించిన తరువాతే ఫస్ట్ రౌండ్ ఫండింగ్ 2018లో వచ్చింది. అనుమాన నీడ వెనక్కి వెళ్లి ‘అగ్నికుల్’ పేరు ప్రపంచానికి పరిచయం కావడానికి ఎంతోకాలం పట్టలేదు. మన దేశంలో స్పేస్ టెక్ స్టార్టప్‌ల విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఏరోస్పేస్ డిగ్రీలు చేయడానికి చాలామంది విదేశాలకు వెళ్లాలనుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడే ఉండాలనుకుంటున్నారు’ అంటున్నాడు ‘అగ్నికుల్’ కో–ఫౌండర్, సీయివో శ్రీనాథ్ రవిచంద్రన్. — శ్రీనాథ్ రవిచంద్రన్, ‘అగ్నికుల్ కో–ఫౌండర్, సీయివో. -
Independence Day Song : తరం, తరం, నిరంతరం
దేశ స్వాతంత్య్రంలో సాహిత్యం పాత్ర మరువలేనిది. నిజానికి ఏ ఉద్యమం అయినా.. సాహిత్యంతో ప్రజలను జాగృతం చేస్తుంది. ఒక్కతాటిపైకి తెస్తుంది. అలాగే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాటలు, నినాదాలు, కవిత్వాలు, ప్రసంగాలు.. ఒకటేమిటి.. ఉద్యమ స్పూర్తిని పెల్లుబికెలా చేశారు మహానుభావులు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా యువతను మరింత బలోపేతం చేస్తూ, జాతి నిర్మాణ బాధ్యతను చక్కగా గుర్తు చేసే ప్రేరణ గీతాన్ని ప్రజల ముందుకు తెచ్చారు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి. పాటకు సంగీతం, కూర్పు, గానం అందించారు సినీ గాయకులు రవివర్మ పోతేదార్. (సినీ గాయకులు రవివర్మ పోతేదార్) || పల్లవి || తరం, తరం, నిరంతరం, నిర్భయ నవతరం మీరు అనంతరం, అనవరతం, అపూర్వ యువతరం మీరు తరం, తరం, నిరంతరం, నిర్భయ నవతరం మీరు అనంతరం, అనవరతం, అపూర్వ యువతరం మీరు జాగరూకత జారిపోతే తరిగిపోయే తురగ మీరు జాగరూకత జారిపోతే తరిగిపోయే తురగ మీరు జగతి కొరకు..., జాతి కొరకు..., జాగృతమవ్వాలి మీరు వందేమాతరం...భారతీవందనం! వందేమాతరం...భారతీవందనం!! || చరణం 1 || ఎగిసి పడే రక్తం మీరు ఎవరెస్టునైనా ఓడించే అగ్ని శిఖలు మీరు ఎగిసి పడే రక్తం మీరు ఎవరెస్టునైనా ఓడించే అగ్ని శిఖలు మీరు సునామీ కెరటం మీరు అరుణ సింధూర విజయ సౌరభం మీరు సునామీ కెరటం మీరు అరుణ సింధూర విజయ సౌరభం మీరు పాల సంద్రాన ఆదిశేషుని వేయిపడగల హోరు మీరు వందేమాతరం...భారతీవందనం! వందేమాతరం...భారతీవందనం!! || చరణం 2 || భయం తెలియని ధైర్యం మీరు భరత భూమిని బాగుచేసే బాధ్యతే మీరు భయం తెలియని ధైర్యం మీరు భరత భూమిని బాగుచేసే బాధ్యతే మీరు శంఖనాదం మీరు చిత్త శుద్ధికి, లక్ష్యసిద్ధికి అర్థమే మీరు శంఖనాదం మీరు చిత్త శుద్ధికి, లక్ష్యసిద్ధికి అర్థమే మీరు శిలయు మీరు, శిల్పి మీరు, చరితకెక్కే స్థపతి మీరు వందేమాతరం...భారతీవందనం! వందేమాతరం...భారతీవందనం!! ||తరం, తరం, నిరంతరం… || (రచన:డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి; 9848023090) -
మహిళా యాంకర్ పట్ల అసభ్య ప్రవర్తన, హీరో అరెస్ట్
ప్రముఖ మలయాళ నటుడు, స్టార్ హీరో శ్రీనాథ్ భాసీని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనాథ్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ సోమవారం ఓ మహిళా యాంకర్ కేరళలోని మరడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మూవీ ప్రమోషన్లో భాగంగా ఇంటర్య్వూలో పాల్గొన్న హీరో శ్రీనాథ్ మధ్యలో అసభ్యపదజాలంతో తనని దూషించాడని, కోపంతో దుర్భాషలాడంటూ సదరు యాంకర్ ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. చదవండి: టిమిండియాకు రామ్ చరణ్ విందు! అయితే అరెస్టయిన కొద్ది సేపటికే శ్రీనాథ్ బెయిల్‌పై బయటకు వచ్చినట్లు సమాచారం. వివరాలు.. ‘కప్పెలా’, ‘భీష్మ పర్వం’, ‘ట్రాన్స్’ వంటి చిత్రాలతో మలయాళంలో స్టార్ హీరోగా మారాడు శ్రీనాథ్ భాసీని. ఆయన లేటెస్ట్ మూవీ చట్టంబి అన్నికార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలు అడిగిన సందరు మహిళా యాంకర్‌పై హీరో శ్రీనాథ్ విరుచుకుప్డడాడు. చదవండి: అప్పుడే ఓటీటీకి రంగ రంగ వైభవంగా! దసరాకు స్ట్రీమింగ్, ఎక్కడంటే.. యాంకర్ని ఉద్దేశిస్తూ అభ్యంతరకర పదజాలంతో దుర్భాషలాడటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అంతేకాకుండా శ్రీనాథ్ తనతో అసభ్యంగా మట్లాడిన మాటలకు సంబంధించిన రికార్డ్‌ను కూడా ఆమెకు పోలీసులకు ఇచ్చింది. దీంతో అతడిపై 354, 509, 294బీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి చేశారు. ఈ మేరకు హీరోని విచారించిన పోలీసులు సోమవారం సాయంత్రం అతడిని అరెస్ట్ చేశారు. అయితే తన అరెస్ట్‌ను శ్రీనాథ్ ఖండించాడు. యాంకర్ తనను అగౌరవపరుస్తూ ప్రశ్నలు అడగడంతో తాను సహనం కోల్పోయానని అతడు పోలీసుల విచారణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
సవాల్‌గా మానవ అక్రమ రవాణా
అనంతపురం ఎడ్యుకేషన్ : మానవ అక్రమ రవాణా అరికట్టడం ప్రపంచానికి పెనుసవాల్‌గా మారిందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఇండోర్) రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంఆర్ శ్రీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మానవ అక్రమ రవాణా – సవాళ్లు – ప్రమాణాలు’ అనే అంశంపై ఆర్ట్స్ కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో మూడు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు సదస్సుకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. రంగస్వామి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ ఎంఆర్ శ్రీనాథ్ మాట్లాడుతూ ప్రజల నిస్సాహాయతను ఆసరగా చేసుకుని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్నారు. ఇటీవల నిర్వహించిన ఓ అంతర్జాతీయ సర్వే ప్రకారం మానవ అక్రమ రవాణా 167 దేశాల్లో జరుగుతున్నట్లు తేలిందన్నారు. మన దేశంలో 1.83 కోట్ల మంది అక్రమ రవాణ ఉచ్చులో చిక్కుకున్నారని వీరితో వెట్టిచాకిరి, వ్యభిచారం, యాచకవృత్తి వంటివి చేయిస్తున్నారన్నారు. వీటి నిరోధకానికి విస్త్రతస్థాయిలో అవగాహన కల్పిస్తూ పరిశోధనల ద్వారా పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.రామిరెడ్డి , సత్యసాయి యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్. గంగాధరశాస్త్రి , మైఛాయిస్ ఫౌండేషన్ ప్రోగ్రాం డైరెక్టర్ వీవీఎన్ ఇషాక్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రంగస్వామిలు మాట్లాడారు. సదస్సు ముఖ్య ఉద్దేశాన్ని కన్వీనర్ డాక్టర్ ఏసీఆర్ దివాకర్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ టి. శ్యామ్‌ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పద్మశ్రీ, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు హరిశ్చంద్రప్రసాద్, కె. ఈశ్వర్‌రెడ్డి, ఎ. శేషారెడ్డి, చౌడప్ప పాల్గొన్నారు.