Actor Sreenath Bhasi Arrested For Verbally Abusing Woman Anchor - Sakshi
Sakshi News home page

Sreenath Bhasi: మహిళా యాంకర్‌ పట్ల అసభ్య ప్రవర్తన, హీరో అరెస్ట్‌

Published Tue, Sep 27 2022 9:52 AM | Last Updated on Tue, Sep 27 2022 10:34 AM

Actor Sreenath Bhasi Arrested For Verbally Abusing Woman Anchor - Sakshi

ప్రముఖ మలయాళ నటుడు, స్టార్‌ హీరో శ్రీనాథ్‌ భాసీని కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రీనాథ్‌ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ సోమవారం ఓ మహిళా యాంకర్‌ కేరళలోని మరడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మూవీ ప్రమోషన్లో భాగంగా ఇంటర్య్వూలో పాల్గొన్న హీరో శ్రీనాథ్‌ మధ్యలో అసభ్యపదజాలంతో తనని దూషించాడని, కోపంతో దుర్భాషలాడంటూ సదరు యాంకర్‌ ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. 

చదవండి: టిమిండియాకు రామ్‌ చరణ్‌ విందు!

అయితే అరెస్టయిన కొద్ది సేపటికే శ్రీనాథ్‌ బెయిల్‌పై బయటకు వచ్చినట్లు సమాచారం. వివరాలు.. ‘కప్పెలా’, ‘భీష్మ పర్వం’, ‘ట్రాన్స్’ వంటి చిత్రాలతో మలయాళంలో స్టార్‌ హీరోగా మారాడు శ్రీనాథ్‌ భాసీని. ఆయన లేటెస్ట్‌ మూవీ చట్టంబి అన్నికార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలు అడిగిన సందరు మహిళా యాంకర్‌పై హీరో  శ్రీనాథ్ విరుచుకుప్డడాడు.

చదవండి: అప్పుడే ఓటీటీకి రంగ రంగ వైభవంగా! దసరాకు స్ట్రీమింగ్‌, ఎక్కడంటే..

యాంకర్‌ని ఉద్దేశిస్తూ అభ్యంతరకర పదజాలంతో దుర్భాషలాడటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అంతేకాకుండా శ్రీనాథ్‌ తనతో అసభ్యంగా మట్లాడిన మాటలకు సంబంధించిన రికార్డ్‌ను కూడా ఆమెకు పోలీసులకు ఇచ్చింది. దీంతో అతడిపై 354, 509, 294బీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి చేశారు. ఈ మేరకు హీరోని విచారించిన పోలీసులు సోమవారం సాయంత్రం అతడిని అరెస్ట్‌ చేశారు. అయితే తన అరెస్ట్‌ను శ్రీనాథ్ ఖండించాడు. యాంకర్ తనను అగౌరవపరుస్తూ ప్రశ్నలు అడగడంతో తాను సహనం కోల్పోయానని అతడు పోలీసుల విచారణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement