sreeshailam
-
దుర్గాదేవిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువైనున్న జగజ్జనని దుర్గమ్మ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాష్టమి రోజున అమ్మవారు దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. సోమవారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. మహాగౌరిగాశ్రీశైల భ్రమరాంబ శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం భ్రమరాంబాదేవి మహాగౌరి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిని నందివాహనంపై ఆసీనులను కావించి అలంకార మండపంలో ఉంచారు. తేజోనిధిగా సూర్య ప్రభపై.. నక్షత్ర వెలుగులో చంద్రప్రభపై తిరుమల కొండ మీద శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ సంబరం అంబరాన్ని తాకేలా సాగుతోంది. ఏడో రోజు సోమవారం ఉదయం సూర్యప్రభపై ఊరేగుతూ స్వర్ణకాంతులతో దివ్యతేజోమూర్తి భక్తులకు దర్శనమి చ్చారు. రాత్రి చంద్రప్రభపై చల్లని చంద్రకాంతుల్లో భక్తులను అనుగ్రహించారు. శ్రీవేంకటేశ్వరుడికి సూర్యచంద్రులు రెండు నేత్రాలు. సూర్యుడు తేజోనిధి, ప్రకృతికి చైతన్య ప్రదాత, సకల రోగాల నివారకుడు. స్వర్ణకాంతులీనే భాస్కరుడిని సప్తఅశ్వాల రథసారధిగా చేసుకుని మలయప్ప మత్స్య నారాయణుడి అలంకారంలో స్వర్ణ కాంతులీనుతూ ఉదయం వేళ తిరుమాడవీధుల్లో వైభవంగా విహరించారు. ఇక భగవంతుని మారు రూపమైన చంద్రుడిని వాహనంగా మలుచుకున్న వేంకటాచలపతి రాత్రి వేళలో తిరుమాడ వీధుల్లో ఊరేగారు. -
26న కృష్ణాబోర్డు సమావేశం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వల కింద ఖరీఫ్‌లో ఆయకట్టుకు నీటి విడుదలే ఎజెండాగా ఈ నెల 26న కృష్ణానదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం జరగనుంది. ఈ నెల 24న బోర్డు, త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని తొలుత నిర్ణయించినా, నీటి విడుదలపై తెలుగు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతో పూర్తి స్థాయి బోర్డు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ భేటీకి ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖల కార్యదర్శులతో పాటు ఈఎన్సీలు, సీఈలు, ఇతర సభ్యులు హాజరుకానున్నారు. ఖరీఫ్ అవసరాల కోసం సాగర్ ఎడమ కాల్వ కింద 30 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలంగాణ ఇప్పటికే విన్నవించింది. ఇందులో ఇప్పటికే 3 టీఎంసీల నీటి విడుదలకు బోర్డు అనుమతి ఇచ్చింది. మిగతా నీటిపై బోర్డు నిర్ణయం చెప్పాల్సి ఉంది. దీనిపై ఏపీతో చర్చించాల్సి ఉంది. ఇక ఏపీ హంద్రీనీవా ద్వారా ఏకంగా రోజుకు ఒక టీఎంసీకి పైగా నీటిని తరలిస్తోంది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకుంటోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఏపీ నీటిని మళ్లిస్తుండటంపై తెలంగాణ అభ్యంతరాలు లేవనెత్తింది. దీనిపై బోర్డు ఏపీతో చర్చించాల్సి ఉంది. ఇక మున్ముందు ఇరు రాష్ట్రాల సాగు, తాగు అవసరాలు, ప్రస్తుతం లభ్యతగా ఉన్న నీటి అంశాలపై బోర్డు ఇరు రాష్ట్రాలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున పూర్తి స్థాయి సమావేశానికి బోర్డు సన్నద్ధమైంది. -
శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ
శ్రీశైలం(కర్నూలు): శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. సెలవులు ముగుస్తుండటంతో.. విద్యార్థులు, ఉద్యోగస్థులు స్వామి వారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ప్రస్తుతం స్వామి వారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సర్వ దర్శనాన్ని నిలిపివేసిన అధికారులు భక్తులకు అలంకార దర్శన అవకాశం కల్పించారు.