sri jaya nama samvatsaram
-
శ్రీ జయ నామ సంవత్సర రాశిఫలాలు
మేషం (ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం - 5.) వీరికి జూన్ 19 నుంచి చతుర్ధంలో గురుడు ఉచ్ఛస్థితి సంచారం అన్ని విధాలా ఉపకరిస్తుంది. ప్రథమార్థంలో సామాన్యంగా ఉన్నా, క్రమేపీ పరిస్థితులు కొంత చక్కబడతాయి. నవంబర్ నుంచి అష్టమ శని ప్రారంభం. సప్తమ, అష్టమ రాశుల్లో శని సంచారం అంత అనుకూలం కాదు. మొత్తం మీద వీరికి మధ్యస్థంగా ఉంటుంది. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. రావలసిన సొమ్ము ఆలస్యం కాగలదు. ఎంతగా శ్రమించినా తగిన గుర్తింపు రాక నిరాశ చెందుతారు. ఇతరులకు హామీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు కాకుండా నిదానం పాటించడం సర్వదా శ్రేయస్కరం. జీవిత భాగస్వామితో వివాదాలు నెలకొంటాయి. తలచిన పనులు కొంత నెమ్మదిస్తాయి. అయితే జూలై నుంచి గురుని అనుకూలత వల్ల ఆర్థికంగా, సామాజికంగా ఉత్సాహవంతంగా ఉంటుంది. శ్రేయోభిలాషులు అన్నివిధాలా సహకరిస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడే అవకాశం. ద్వితీయార్థంలో వాహన, గృహయోగాలు. వ్యాపార సంస్థల వారికి సామాన్య లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధుల్లో కొంత అప్రమత్తత పాటించాలి. ద్వితీయార్థంలో పదోన్నతులతో పాటు బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికరంగం వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలం. కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు దక్కినా అసంతృప్తి తప్పదు. రాజకీయవర్గాలకు మొదట్లో కొంత వ్యతిరేకత ఎదురైనా ద్వితీయార్థంలో పదవులు, సన్మానాలు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. తరచూ దూరప్రయాణాలు ఉండవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్ మధ్య కుజుడు, నవంబర్ నుంచి శని అష్టమస్థితి కారణంగా వ్యవహారాలలో చిక్కులు. వ్యయప్రయాసలు. చర్మ, నరాల సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. వైద్య సలహాలు స్వీకరిస్తారు. ఈ కాలంలో స్థానచలనాలు కలిగే అవకాశం. జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. వీరు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడంతో పాటు, శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. అదృష్ట సంఖ్య-9. వృషభం (ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం -5.) వీరికి ప్రథమార్ధంలో గురు, శని, రాహువుల అనుకూల స్థితి ఉపకరిస్తుంది. వ్యయంలో కేతువు వల్ల మానసిక క్లేశాలు, వ్యయప్రయాసలు. ద్వితీయార్థంలో గురుడు తృతీయ రాశిలో సంచారం కలిగినా శుభస్థితి వల్ల మధ్యస్థంగా ఉంటుంది. జూలై నుంచి పంచమ రాహువు, లాభస్థితిలో కేతువు అన్ని విధాలా అనుకూలురు. ఈ రీత్యా చూస్తే వీరికి ప్రథమార్థంలో రాబడి బాగుంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తులు, బంధువులు చేరువ కాగలరు. ఇతరులకు సలహాలు ఇవ్వడంలో చొరవ చూపుతారు. కొన్ని వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. అయితే తొందరపాటు మాటల కారణంగా ఇంటాబయటా వివాదాలు నెలకొనే అవకాశముంది, ఆచితూచి వ్యవహరించండి. గృహ నిర్మాణాలు, శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. భూసంబంధిత వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆశయాల సాధన దిశగా ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగస్తులకు పెండింగ్ బకాయిలు అందుతాయి. విధుల్లో ప్రశంసలు అందుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి మంచి గుర్తింపు రాగలదు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కళాకారులు నైపుణ్యాన్ని చాటుకుని ముందుకు సాగుతారు. రాజకీయవర్గాల వారు కొత్త పదవులు చేపట్టే వీలుంది. ప్రజాదరణ పొందుతారు. వ్యవసాయదారులకు మొదటి పంట లాభదాయకం. సాంకేతిక వర్గాలవారికి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొందరికి విదేశీయానం కూడా ఉండవచ్చు. అక్టోబర్ - నవంబర్ మధ్య అష్టమ కుజుడు, నవంబర్ నుంచి సప్తమ శని ప్రభావం వల్ల కొంత చికాకులు తప్పకపోవచ్చు. నరాలు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఈ గ్రహాలకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఆదిత్య హృదయం పఠించండి. ఆషాఢం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-6. మిథునం (ఆదాయం - 11, వ్యయం - 8, రాజపూజ్యం - 3, అవమానం - 1.) వీరికి జూన్ నుంచి గురుబలం విశేషం. ప్రథమార్థంలో శని, రాహుకేతువులు అనుకూలురు. జూలై నుంచి అర్థాష్టమ రాహువు ప్రభావం కలిగినా గురుబలం ఉపకరిస్తుంది. మొత్తం మీద వీరికి ద్వితీయార్థం అనుకూల కాలమని చెప్పాలి. స్వతంత్రభావాలు, నిర్ణయాల వల్ల కొన్ని చిక్కులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. ఇతరుల అభిప్రాయాలను అంతగా పట్టించుకోకపోవడం వల్ల ఒక్కొక్కప్పుడు సమస్యలు ఎదురయ్యే అవకాశం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. స్థిరాస్తి విషయంలో నెలకొన్న వివాదాలు జూన్ తర్వాత పరిష్కారం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని రుణాలు సైతం తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విలాసవంత జీవనానికి డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. శాస్త్ర, పరిశోధనారంగాల వారికి మంచి గుర్తింపు. విద్యార్థులు అనుకున్న ర్యాంకులు సాధిస్తారు. కళాకారులు చేజారిన అవకాశాలు సైతం తిరిగి దక్కించుకుని విజయాలు సాధిస్తారు. రాజకీయవేత్తలకు శుభసూచకాలే. పదవులు అప్రయత్నంగా దక్కుతాయి. వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలం. నవంబర్ - జనవరి మధ్య కుజుని అష్టమస్థితి సంచారం వల్ల ఈతిబాధలు, మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. అయితే మకరరాశి కుజునికి ఉచ్ఛస్థితి కావడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. దుర్గాదేవికి కుంకుమార్చనలు, సుబ్రహ్మణ్యారాధన మంచిది. చైత్రం, శ్రావణం, ఆశ్వయుజం, మాఘమాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-5. కర్కాటకం (ఆదాయం - 5, వ్యయం - 8, రాజపూజ్యం - 6, అవమానం - 1.) వీరికి జూన్ నుంచి గురుడు స్వక్షేత్ర సంచారమైనా ఉచ్ఛస్థితి వల్ల కొంత అనుకూలం. జూలై నుంచి అర్థాష్టమ రాహువు, నవంబర్ 1 వరకు అర్థాష్టమ శని ప్రభావం అధికం. మొత్తం మీద వీరికి ఆదాయానికి లోటు లేకున్నా వృథా ఖర్చులు ఎదురవుతుంటాయి. ఇంటాబయటా ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. మంచికి వెళ్లినా అపవాదులు భరించాల్సిన పరిస్థితి. కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. తరచూ ప్రయాణాలు ఉంటాయి. ద్వితీయార్థంలో శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు నవంబర్ నుంచి అనుకూలిస్తాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే కొన్ని విజయాలు సాధించే వీలుంది. దూరమైన బంధువులు తిరిగి దగ్గరకు చేరతారు. కొన్ని వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడే వీలుంది. అయితే, శని, రాహువుల ప్రభావంతో పాటు, జూలై -సెప్టెంబర్ మధ్య కుజుని అర్ధాష్టమ స్థితి వల్ల కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు కలిగినా అవసరాలకు డబ్బు అందడం విశేషం. జనవరి - ఫిబ్రవరి మధ్య అష్టమ కుజుని ప్రభావం వల్ల చర్మ, ఉదర సంబంధిత రుగ్మత లు, తద్వారా ఔషధసేవనం. వ్యాపారులు స్వల్పలాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు పైస్థాయి నుంచి ఒత్తిళ్లులు ఎదురైనా సమర్థతను చాటుకుంటారు. విద్యార్థులు అనుకున్న ఫలితాల కోసం మరింతగా శ్రమించాలి. వ్యవసాయదారులకు రెండవపంట అనుకూలం. పారిశ్రామిక, సాంకేతికరంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కళాకారులు నైపుణ్యాన్ని చూపినా తగిన గుర్తింపు రావడం కష్టమే. రాజకీయవర్గాల వారు ద్వితీయార్థంలో కొంత అనుకూల ఫలితాలు సాధిస్తారు. వైశాఖం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణమాసాలు అనుకూలం. శని, గురు, రాహువు, కుజులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అదృష్ట సంఖ్య-2. సింహం (ఆదాయం - 8, వ్యయం - 2, రాజపూజ్యం - 2, అవమానం - 4.) వీరికి జూన్ వరకూ గురుడు యోగదాయకుడు. తదుపరి వ్యయస్థితి కలిగినా ఉచ్ఛస్థితి వల్ల శుభకార్యాల నిర్వహణకు ఖర్చు చేయాల్సివస్తుంది. జూలై వరకు రాహువు, నవంబర్ వరకూ శని యోగదాయకులు. మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలుఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలమే. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు సానుకూలంగా పరిష్కారం. గృహ నిర్మాణం, వాహనాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆశయాల సాధనలో ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తండ్రి తరఫు నుంచి ఆస్తి లేదా ధనలాభ సూచనలు. జీవిత భాగస్వామి సలహాల ద్వారా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలకు లోటు ఉండదు. ద్వితీయార్థం నుంచి గురుబలం తగ్గడం వల్ల కార్యక్రమాలపై మరింత శ్రద్ధ చూపాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. లాభాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఉద్యోగస్తులు పదోన్నతులతో కూడిన బదిలీలు పొందుతారు. కళాకారులకు ఊహించని అవకాశాలు దగ్గరకు వస్తాయి. అవార్డులు సైతం దక్కవచ్చు. విద్యార్థుల శ్రమ వృథా కాదు. మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభిస్తాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారు జారవిడుచుకున్న అవకాశాలను తిరిగి పొందుతారు. రాజకీయవర్గాలకు ప్రత్యర్థులు సైతం సహకరిస్తారు. పదవీయోగం, సన్మానాలు. క్రీడాకారులు నైపుణ్యాన్ని ప్రదర్శించి తమ సత్తా చాటుకుంటారు. నవంబర్ నుంచి శనికి అర్థాష్టమ స్థితి, సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య అర్థాష్టమ కుజుని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా నరాలు, ఉదరం, నేత్ర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఈ కాలంలో శని, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. చైత్రం, జ్యేష్టం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-1. కన్య (ఆదాయం - 11, వ్యయం - 8, రాజపూజ్యం - 5, అవమానం - 4.) వీరికి జూన్ నుంచి గురుడు లాభస్థితి విశేషమైనది. నవంబర్ వరకూ ఏల్నాటిశని ఉన్నా గురుబలం వల్ల ప్రభావం తగ్గుతుంది. నవంబర్ నుంచి ఏల్నాటి శని పూర్తికాగలదు. జన్మరాశిలో జూలై వరకూ కుజుని స్తంభన వల్ల కొంత ఆందోళన, మానసిక అశాంతి. ఒత్తిడులు ఎదుర్కొంటారు. మధ్యమధ్యలో కొంత అవరోధాలు కలిగినా దేవగురుడు మీకు అన్ని విధాలా అనుకూలించడం వల్ల అధిగమిస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. రావలసిన బాకీలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు, రుణాలు తీరతాయి. పెండింగ్లోని కోర్టు కేసులు పరిష్కారమవుతాయ. స్థిరాస్తి వృద్ధి. జీవితాశయ సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ప్రత్యర్థులను సైతం చాకచక్యంగా మీ దారికి తెచ్చుకుంటారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. నేర్పుగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పరిహసించిన వారే ప్రశంసిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఇంటి నిర్మాణాలు, ఆస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో మొదట్లో కొంత వెనుకబడినా క్రమేపీ అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులు పనిభారం తగ్గి ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు సఫలమవుతాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు దరిచేరి ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, విశేష ప్రజాదరణ. వ్యవసాయదారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. క్రీడలు, శాస్త్ర, సాంకేతిక వర్గాలకు అరుదైన పురస్కారాలు అందుతాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. శని, రాహు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, పుష్య మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-5. తుల (ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 1, అవమానం - 7) వీరికి జన్మరాశిలో శని, రాహువులు, జూలై వరకూ కుజుడు వ్యయంలోనూ, తదుపరి జన్మరాశిలో సంచారం అంత అనుకూలం కాదు. అయితే గురుని స్థితి కొంత అనుకూలం కావడం ఊరట కలిగించే విషయం. మొత్తం మీద వీరికి సామాన్యంగానే ఉంటుంది. ప్రతి పనిలోనూ నిరాసక్తత, జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రుణబాధలు ఎదురవుతాయి. చేసే కార్యాలలో ఏకాగ్రత లోపించడం వల్ల కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం. అందువల్ల నిర్ణయాలలోనూ ఆచితూచి అడుగు వేయడం సర్వదా శ్రేయస్కరం. బంధువులు, మిత్రుల నుంచి అపవాదులు, విమర్శలు సైతం ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ యత్నాలు నెమ్మదిస్తాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ప్రధమార్థంలో గురుని భాగ్యస్థితి, తదుపరి దశమస్థితి వల్ల కొంత అనుకూలత ఉంటుంది. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. శుభకార్యాలకు విరివిగా ఖర్చు చేస్తారు. ఇతరులకు సైతం సహాయపడి దాతృత్వాన్ని చాటుకుంటారు. విలాసవంతంగా గడుపుతారు. వ్యాపారులు కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తత పాటించాలి, పైస్థాయి నుంచి ఒత్తిడులు ఎదుర్కొంటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. కళాకారులకు ద్వితీయార్థంలో కార్యజయం, శుభవార్తలు. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు కొంత ఫలించే అవకాశం. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారు కొంత నిదానంగా సాగడమే ఉత్తమం. రాజకీయవర్గాలకు ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురుకావొచ్చు, ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. మొత్తం మీద వీరికి సామాన్యమనే చెప్పాలి. శని, రాహు, కేతువులు, కుజునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా పఠించండి. జ్యేష్టం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-6. వృశ్చికం (ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం - 7) వీరికి జూన్ 18వరకు అష్టమ గురుడు, వ్యయంలో శని, రాహువుల సంచారం అనుకూలం కాదు. జూన్ నుంచి గురుడు భాగ్యస్థానంలో ఉచ్ఛస్థితి వల్ల ఏల్నాటి శని ప్రభావం ఉన్నా జన్మరాశిపై గురుదృష్టి వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు క్రమేపీ పుంజుకుంటాయి. ఎంతటి బాధ్యతనైనా పట్టుదలతో నెరవేరుస్తారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు తీరతాయి. జూన్ వరకూ కొంత ఆదుర్దా, మానసిక అశాంతి. కార్యక్రమాలలో ఆవాంతరాలు, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. కొన్ని విషయాలలో మౌనం మంచిది. కోపతాపాలకు దూరంగా ఉండండి. జూన్ నుంచి శుభకార్యాల నిర్వహణ. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సఫలం. స్థిరాస్తి వృద్ధి. సమాజంలో మంచి గుర్తింపు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరుకుంటారు. విమర్శలు గుప్పించిన వారే ప్రశంసలు కురిపిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ధన లేదా ఆస్తి లాభాలు ఉంటాయి. వ్యాపారులు సామాన్య లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు శ్రమ పెరిగినా తగిన గుర్తింపు రాగలదు. పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాల వారి కృషి కొంతమేరకు సఫలమవుతుంది. విద్యార్థుల కష్టం కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. కళాకారులకు ద్వితీయార్థంలో అనుకున్న అవకాశాలు దక్కుతాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు, తిరిగి జనవరి - ఫిబ్రవరి మధ్య కుజ ప్రభావం వల్ల ఒత్తిడులు, అయినవారితో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదుర్కొంటారు. వీరు శని, రాహు, గురు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించడం మంచిది. ఆషాఢం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-9. ధనుస్సు (ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం - 7) వీరికి జూన్ వరకు గురుడు సప్తమంలోనూ, తదుపరి అష్టమంలోనూ సంచరిస్తాడు. నవంబర్ వరకూ శని లాభస్థానంలో సంచారం. తదుపరి వ్యయస్థానంలో సంచరిస్తాడు. నవంబర్ నుంచి వీరికి ఏల్నాటిశని ప్రారంభం. అయితే గురుడు అష్టమంలో సంచారమైనా ఉచ్ఛస్థితి కావడం, వ్యయస్థితిలోని శనిని వీక్షించడం మంచిది. మొత్తం మీద శ్రమ కలిగినా కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలిగినా అవసరాలకు తగినంత డబ్బు అందుతుంది. సమాజంలో మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు. బంధువులు, మిత్రులు పూర్తిగా సహకరిస్తారు. ప్రథమార్థంలో వాహనాలు, ఆభరణాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. చిరకాల ప్రత్యర్థులు కూడా అనుకూలురుగా మారతారు. వ్యాపారులకు లాభాలు ఊరిస్తాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు కోరుకున్న బదిలీలు పొందుతారు. విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది, తరచూ విదేశీ పర్యటనలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అవార్డులు సైతం దక్కవచ్చు. రాజకీయ నాయకులకు ప్రథమార్థంలో పదవీయోగాలు, విశేష ప్రజాదరణ. విద్యార్థుల కృషి కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. క్రీ డాకారులు, శాస్త్రవేత్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. నవంబర్ నుంచి ఏల్నాటిశని ప్రారంభం వల్ల కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. చేసే పనిలో ఏకాగ్రత లోపించడం, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో వీరు శని, గురులకు జపాదులు నిర్వహించాలి. హనుమాన్ చాలీసా పఠనం ఉపకరిస్తుంది. చైత్ర, శ్రావణం, ఆశ్వయుజం, మాఘ మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-3. మకరం (ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 3, అవమానం - 3.) వీరికి జూన్ నుంచి గురుడు, నవంబర్ నుంచి శని విశేష యోగకారులై ఉంటారు. మొత్తం మీద వీరికి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. తలచిన పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయ సహకారాలు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు. పట్టుదలతో కార్యోన్ముఖులై ముందుకుసాగి విజయాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి కొలిక్కి వస్తుంది. కోర్టు వివాదాలు సైతం పరిష్కారమవుతాయి. ద్వితీయార్థంలో ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అందరి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. కొత్త పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. రాజకీయవర్గాల వారికి చేజారిన పదవులు తిరిగి దక్కే అవకాశం. కళాకారులు ఊహించని రీతిలో అవకాశాలు దక్కించుకుంటారు, పురస్కారాలు వంటివి పొందుతారు. విద్యార్థుల శ్రమ ఫలించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండవ పంట విశేషంగా లాభిస్తుంది. పారిశ్రామిక, వైద్యరంగాల వారు అనుకున్నది సాధిస్తారు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు అవకాశాలు మెరుగుపడి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రథమార్థంలో షష్టమంలో గురుడు, అర్థాష్టమంలో కేతు సంచారం వల్ల మనోవ్యథ, ఆరోగ్యసమస్యలు, ప్రయాణాలలో అవరోధాలు వంటి చికాకులు ఎదురవుతాయి. వీరు గురు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. వైశాఖం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8. కుంభం (ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 6, అవమానం - 3.) వీరికి జూన్ వరకూ గురుడు విశేష యోగకారకుడు. భాగ్యస్థానంలో శని, రాహువులు సామాన్యులు. ఈ రీత్యా చూస్తే వీరికి ప్రధమార్థంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. యత్నకార్యసిద్ధి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. మిత్రులు, బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశయాలు సాధిస్తారు. శత్రువిజయం. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. రాబడితో పాటు ఖర్చులూ పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరి ఆమోదం పొందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరిగినా తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు దక్కే సూచనలు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులకు నూతనోత్సాహం. పంటల దిగుబడి పెరిగి రుణభారాల నుంచి విముక్తి పొందుతారు. రాజకీయవర్గాలకు పద వులు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలు గతం కంటే మెరుగైన అభివృద్ధిని సాధిస్తారు. శాస్త్ర, సాంకేతిక, క్రీడారంగాల వారికి పూర్వవైభవం. అష్టమరాశిలో జూలై వరకూ కుజుడు, జూలై నుంచి రాహువు సంచారం అంత మంచిది కాదు. దీనివల్ల మానసిక ఆందోళన. చర్మ, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు. లేనిపోని వివాదాలు నెలకొంటాయి. ఈ గ్రహాలకు పరిహారం చేయించుకుంటే మంచిది. విష్ణుసహస్రనామ పారాయణం మంచిది. చైత్రం, జ్యేష్టం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8. మీనం (ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 2, అవమానం - 6.) వీరికి జూన్ నుంచి గురుడు విశేష యోగప్రదుడు కావడంతో పాటు, స్వక్షేత్రాన్ని వీక్షించడం శుభదాయకం. అష్టమ శని, రాహు ప్రభావం ఉన్నా గురుబలం వీరికి కొండంత అండగా ఉండడం శుభసూచికం. మొత్తం మీద వీరికి అనుకూలమనే చెప్పాలి. ఆర్థికంగా కొంత పుంజుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి విజయాలు సాధిస్తారు. బంధువర్గం, జీవిత భాగస్వామి తరఫు వారితో నెలకొన్న విభేదాలు తొలగుతాయి. సమాజంలో మంచి గుర్తింపుతో పాటు, గౌరవం పొందుతారు. మీ ఆశయాలు నెరవేరతాయి. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. భూ, వాహనయోగాలు. చిరకాల ప్రత్యర్థులు సైతం అనుకూలురుగా మారతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు ద్వితీయార్థంలో మరింతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. పనిభారం మాత్రం తప్పదు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. కళాకారులకు మిశ్రమంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాల వారు జూన్ నుంచి అభివృద్ధి పథంలో సాగుతారు. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. రాజకీయవర్గాలకు కొంత వ్యతిరేకత ఎదురైనా క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. విజయాల కోసం శ్రమపడాలి. శాస్త్ర, న్యాయ, సాంకేతికరంగాల వారు గతం కంటే మెరుగైన ఫలితాలు చూస్తారు. క్రీడాకారులు ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సొంతం చేసుకుంటారు. జూలై -సెప్టెంబర్ మధ్య అష్టమంలో కుజ, శని కలయిక వల్ల ఈతిబాధలు, మానసిక ఆందోళన. జీవిత భాగస్వామితో విభేదాలు. చర్మ, గొంతు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. శనికి తైలాబిషేకం, సుబ్రహ్మణ్యాష్టకంతో పాటు దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించుకుంటే మేలు. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, పుష్యమాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-3. సర్వేజనా సుఖినోభవంతు... పుష్కరాలు... గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. గురుడు మేష రాశిలో ప్రవేశంతో గంగానది, వృషభం-నర్మద, మిథునం-సరస్వతీ, కర్కాటకం-యమున, సింహం-గోదావరి, కన్య-కృష్ణా, తుల-కావేరి, వృశ్చికం-తామ్రపర్ణీనది, ధనుస్సు-పుష్కర వాహిని, మకరం-తుంగభద్ర, కుంభం-సింధు నది, మీనం-ప్రణీతానదులకు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాలు 12 రోజులపాటు జరుగుతాయి. ఈ పన్నెండు రోజులు నదీస్నానాలు, దానధర్మాలు పుణ్యఫలాన్నిస్తాయి. శూన్యమాసాలు - నిర్ణయాలు సూర్యుడు మీనరాశిలో ఉండే చైత్రం, మిథున రాశిలో ఉండే ఆషాఢం, కన్య యందు భాద్రపదం, ధనుస్సులో ఉన్నప్పుడు పుష్య మాసం శూన్య మాసములని అంటారు. ఈ శూన్య మాసాల్లో శుభకార్యాలు నిర్వర్తించరు. ఆయనములు ఆయనములు రెండు. సూర్యుడు (రవి) మకర రాశిలో ప్రవేశంతో ఉత్తరాయణం, కర్కాటక రాశిలో ప్రవేశించునప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఒక్కొక్కటి ఆరు నెలల కాలం ఉంటుంది. ఉత్తరాయణం ఆరునెలల కాలం అత్యంత పవిత్రమైన దిగా భావిస్తారు. ఈ కాలంలో పుణ్యకార్యాలు శుభఫలితాలనిస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాలకు కూడా ప్రశస్తమైనది. -
శ్రీ జయ నామ సంవత్సరం - శుభముహూర్తాలు 2014 -15
చైత్ర మాసం ఏప్రిల్ 4 శుక్ర, శు.పంచమి, రోహిణి నక్షత్రం, మిథున లగ్నం ప.11.54కు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. 5 శని, షష్టి తత్కాల సప్తమి, మృగశిర నక్షత్రం మకర లగ్నం రా.2.12కు వివాహాలు. 9 బుధ, దశమి, పుష్యమి నక్షత్రం, వృషభలగ్నం ఉ.8.53కు అన్నప్రాశన, శంకుస్థాపన, ఉపనయన, గృహప్రవేశాలు, క్రయవిక్రయాలు. 10 గురు, దశమి తత్కాల ఏకాదశి, మఖ నక్షత్రం, వృశ్చిక లగ్నం రా.9.09కు వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు, 11 శుక్ర, ఏకాదశి తత్కాల ద్వాదశి మఖ నక్షత్రం, మిథున లగ్నం ప.11.31కు అన్నప్రాశన, అక్షరస్వీకార, వివాహ, ఉపనయన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు. 17 గురు, బ.విదియ తత్కాల తదియ, అనూరాధ నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.11.53కు వివాహ, గృహప్రవేశాలు. 20 ఆది, పంచమి తత్కాల షష్టి , మూల నక్షత్రం, కర్కాటక లగ్నం ప.11.54కు అన్నప్రాశన, క్రయవిక్రయాలు, సాధారణ పనులు. 21 సోమ, సప్తమి, ఉత్తరాషాఢ నక్షత్రం, రా.11.34కు గర్భాదాన, గృహప్రవేశాలు. 22 గురు, దశమి, ధనిష్ట నక్షత్రం, వృషభలగ్నం ఉ.7.50కు అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహాలు, ఉపనయనాలు. తిరిగి రా.11.22కు శతభిషం నక్షత్రం, ధనుస్సు లగ్నంలో వివాహ, గృహప్రవేశ, గర్భాదానాలు. 25 శుక్ర, ఏకాదశి, శతభిషం నక్షత్రం, వృషభలగ్నం ఉ.7.45కు అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపన, దేవతాప్రతిష్ఠలు. వైశాఖ మాసం మే 1 గురు,శు.విదియ తత్కాల తదియ, రోహిణి నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.10.54కు వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు., రా.12.34కు మకరలగ్నంలో వివాహాలు. 2 శుక్ర, తదియ తత్కాల చవితి, మృగశిర నక్షత్రం, వృశ్చిక లగ్నం రా.7.40కు వివాహ, గృహప్రవేశాలు, మకర లగ్నం రా.12.21కు వివాహాలు. 5 సోమ, షష్టి, పునర్వసు నక్షత్రం, మిథునలగ్నం ఉ.9.54కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, దేవతాప్రతిష్ట, క్రయవిక్రయాలు. పుష్యమి నక్షత్రం, వృశ్చికలగ్నంలో రా.7.29కు గర్భాదానం. 7 బుధ, అష్టమి తత్కాల నవమి, మఖ నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.10.32కు వివాహ, గర్భాదానాలు. 8 గురు, నవమి, మఖ నక్షత్రం, వృశ్చికలగ్నం రా.7.16కు వివాహ, గృహప్రవేశ, గర్భాదానాలు. 10 శని, ఏకాదశి, ఉత్తర నక్షత్రం, మిథున లగ్నం ఉ.9.34కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, క్రయవిక్రయాలు. 12 సోమ, త్రయోదశి, చిత్త నక్షత్రం, మిథున లగ్నం ఉ.9.36కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, క్రయవిక్రయాలు. 15 గురు, బ.పాడ్యమి, అనూరాధ నక్షత్రం, మిథునలగ్నం ఉ.9.18కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, వివాహాలు, క్రయవిక్రయాలు. రా.9.59కు ధనుస్సు, రా.11.28కు మకరలగ్నాలలో వివాహ, గర్భాదానాలు. 17 శని, తదియ, మూల నక్షత్రం, మిథునలగ్నం ఉ.9.09కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, వివాహ, క్రయవిక్రయాలు. రా.11.24కు మకరలగ్నంలో వివాహాలు. 19 సోమ, పంచమి, ఉత్తరాషాఢ నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.9.54కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, క్రయవిక్రయాలు. 22 గురు, అష్టమి తత్కాల న వమి, శతభిషం నక్షత్రం, మిథునలగ్నం ఉ.8.48కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, వివాహాలు. 23 శుక్ర, నవమి తత్కాల దశమి, ఉత్తరాభాద్ర నక్షత్రం, మకర లగ్నం రా.10.58కు వివాహాలు, గర్భాదానాలు. జ్యేష్ఠ మాసం జూన్ 1 ఆది, శు.చవితి, పునర్వసు నక్షత్రం, మిథునలగ్నం ఉ.8.09కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, క్రయవిక్రయాలు. 2 సోమ, పంచమి, పుష్యమి నక్షత్రం, మిథునలగ్నం ఉ.8.06కు అన్నప్రాశ న, అక్షరస్వీకార, శంకుస్థాపన, గృహప్రవేశాలు, దేవతాప్రతిష్ట, ఉపనయనాలు. తిరిగి రా.10.18కు మకరలగ్నంలో గృహప్రవేశాలు. 4 బుధ, షష్టి తత్కాల సప్తమి, మఖ నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.8.52కు అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహ, ఉపనయనాలు. 12 గురు, చతుర్దశి, అనూరాధ నక్షత్రం, మిథునలగ్నం ఉ.7.29, కర్కాటక లగ్నం 8.26కు అన్నప్రాశన, అక్షరస్వీకార, వివాహ, శంకుస్థాపన, గృహప్రవేశాలు, క్రయవిక్రయాలు. 13 శుక్ర, పౌర్ణమి తత్కాల బ.పాడ్యమి, మూల నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.8.09కు వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు. 14 శని,బ. పాడ్యమి తత్కాల విదియ, మూల నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.8.19కు అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపన, ఉపనయన, వివాహాలు, క్రయవిక్రయాలు. 16 సోమ, చవితి, ఉత్తరాషాఢ నక్షత్రం, కర్కాటకలగ్నం ఉ.8.09కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు. 20 శుక్ర అష్టమి, ఉత్తరాభాద్ర నక్షత్రం, సింహలగ్నం ఉ.11.09కు అన్నప్రాశన, ఉపనయన, అక్షరస్వీకార, వివాహాలు. తె.4.05కు రేవతి నక్షత్రం, వృషభలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, శంకుస్థాపనలు. 21 శని, నవమి, రేవతి నక్షత్రం, సింహలగ్నం ఉ.11.02కు అన్నప్రాశన, అక్షరస్వీకార, వివాహ, ఉపనయన, శంకుస్థాపన, గృహప్రవేశాలు, క్రయవిక్రయాలు. తె.4.03కు అశ్వని నక్షత్రం, వృషభలగ్నంలో శంకుస్థాపన, వివాహాలు. 22 ఆది, దశమి, అశ్వని నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.7.44కు అన్నప్రాశన, అక్షరస్వీకార, వివాహ, ఉపనయన, శంకుస్థాపన, దేవతా ప్రతిష్టలు, క్రయవిక్రయాలు. ఆషాఢమాసం జూలై 2 బుధ,శు.పంచమి, మఖ నక్షత్రం, కర్కాటక లగ్నం, ఉ.7.09కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. 4 గురు, సప్తమి, ఉత్తర నక్షత్రం, సింహ లగ్నం ఉ.10.10కు అన్నప్రాశన, క్రయవిక్రయాలు, ప.3.34కు వృశ్చిక లగ్నంలో క్రయవిక్రయాలు. 7 సోమ, దశమి, స్వాతి నక్షత్రం, సింహలగ్నం ఉ.9.57కు అన్నప్రాశన, క్రయవిక్రయాలు. 13 ఆది, బ.పాడ్యమి, ఉత్తరాషాఢ నక్ష త్రం, కర్కాటక లగ్నం ఉ.6.24కు సాధారణ కార్యాలు, ప.2.58కు వృశ్చిక లగ్నంలో క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. 14 సోమ, విదియ, శ్రవణం నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.6.19కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. 18 శుక్ర, సప్తమి, రేవతి నక్షత్రం, వృశ్చికలగ్నం ప.2.42కు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. రిజిస్ట్రేషన్లు. శ్రావణమాసం ఆగస్టు 1 శుక్ర, శు.పంచమి తత్కాల షష్టి, హస్త నక్షత్రం, ధనుస్సు లగ్నం సా.4.56కు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. 10 ఆది, పౌర్ణమి, శ్రవణం నక్షత్రం, కుంభలగ్నం రా.8.10కు సాధారణ కార్యాలు, శుభకార్యాల ప్రస్తావన. 11 సోమ, బ.పాడ్యమి, ధనిష్ఠ నక్షత్రం, సింహలగ్నం ఉ.7.43కు అన్నప్రాశన, శంకుస్థాపన, గృహప్రవేశాలు. రా.12.44కు వృషభలగ్నంలో గృహప్రవేశాలు. 13 బుధ, చవితి, ఉత్తరాభాద్ర నక్షత్రం, కుంభలగ్నం రా.7.54కు వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు. రా.12.32కు వృషభలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు. 14 గురు, చవితి, రేవతి నక్షత్రం, కుంభలగ్నం రా.7.54కు, వృషభలగ్నం రా.12.32కు, మిథున లగ్నం తె.3.21కు వివాహ, గృహప్రవేశాలు, 15 శుక్ర, పంచమి, రేవతి నక్షత్రం ధనుస్సు లగ్నం సా.4.03 క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, సాధారణ కార్యాలు. తె.3.17 మిథునలగ్నం వివాహాలు. 20 బుధ, దశమి, మృగశిర నక్షత్రం, కన్యాలగ్నం ఉ.8.43కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. భాద్రపద మాసం సెప్టెంబర్ 1 సోమ, శు.సప్తమి, అనూరాధ నక్షత్రం, మకరలగ్నం సా.4.24కు వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు. 5 శుక్ర, ఏకాదశి, ఉత్తరాషాఢ నక్షత్రం మకరలగ్నం సా.4.18కు సాధారణ కార్యాలు, వ్యాపారాలు. 6 శని, ద్వాదశి, శ్రవణం నక్షత్రం, వృశ్చికలగ్నం ప.11.23కు అన్నప్రాశన, వ్యాపారాలు, ఆర్ధిక వ్యవహారాలు. 10 బుధ, బ.పాడ్యమి తత్కాల విదియ, ఉత్తరాభాద్ర నక్షత్రం, మకర లగ్నం ప.3.49కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 12 శుక్ర, చవితి, అశ్వని నక్షత్రం, మకరలగ్నం ప.3.42కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. ఆశ్వయుజ మాసం సెప్టెంబర్ 26 శుక్ర, శు.విదియ తత్కాల తదియ, చిత్త నక్షత్రం, మకరలగ్నం ప.2.47కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 27 శని, తదియ, స్వాతి నక్షత్రం, ధనుస్సు లగ్నం ప.1.12కు వ్యాపార, సాధారణ కార్యాలు. ఆర్థిక లావాదేవీలు. అక్టోబర్ 1 బుధ, ఆశ్వయుజ శు.సప్తమి, మూల నక్షత్రం, మకరలగ్నం ప.2.27కు వ్యాపార, ఆర్థిక లావాదేవీలు. 3 శుక్ర, నవమి తత్కాల దశమి, ఉత్తరాషాఢ నక్షత్రం, కుంభలగ్నం సా.4.35కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 5 ఆది, ద్వాదశి, ధనిష్ఠ నక్షత్రం, ధనుస్సు లగ్నం ప.12.40కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. 8 బుధ, పౌర్ణమి, రేవతి నక్షత్రం, కుంభలగ్నం సా.4.17కు వ్యాపారాలు, ఆర్థిక లావాదే వీలు. 9 గురు, బ.పాడ్యమి, ఆశ్వని నక్షత్రం, ధనుస్సులగ్నం ప.12.24కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. 17 శుక్ర, నవమి, పుష్యమి నక్షత్రం, ధనుస్సు లగ్నం ప.11.54కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. 19 ఆది, ఏకాదశి, మఖ నక్షత్రం, మకర లగ్నం ప.1.16కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. కార్తీక మాసం అక్టోబర్ 26 ఆది, శు.తదియ, అనూరాధ నక్షత్రం, మకర లగ్నం ప.12.48కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 30 గురు, సప్తమి, ఉత్తరాషాఢ నక్షత్రం, వృశ్చికలగ్నం ఉ.7.48కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. నవంబర్ 1 శని, కార్తీక శు.నవమి, ధనిష్ట నక్షత్రం, కుంభలగ్నం ప.2.43కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 5 బుధ, త్రయోదశి, రేవతి నక్షత్రం, మీన లగ్నం ప.3.09కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 6 గురు, పౌర్ణమి, అశ్వని నక్షత్రం, మకరలగ్నం ప.12.04కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. రిజిస్ట్రేషన్లు. 9 ఆది, బ.తదియ, రోహిణి నక్ష త్రం, మకరలగ్నం ప.11.50కు సాధారణ కార్యాలు, ఆర్థిక, వ్యాపార లావాదేవీలు. 13 గురు, సప్తమి, పుష్యమి నక్షత్రం మకరలగ్నం ప.11.36కు అన్నప్రాశన, వ్యాపార, ఆర్థిక లావాదేవీలు. 17 సోమ, దశమి, ఉత్తర నక్షత్రం, మకరలగ్నం ఉ.11.17కు సాధారణ కార్యాలు, అన్నప్రాశనలు, వ్యాపారాలు. మార్గశిర మాసం డిసెంబర్ 3 బుధ, శు.ద్వాదశి, అశ్వని నక్షత్రం, ధనుస్సు లగ్నం ఉ.8.48కు అన్నప్రాశన, వ్యాపార, ఆర్థిక లావాదేవీలు. 7 ఆది, బ.పాడ్యమి, మృగశిర నక్షత్రం, ధనుస్సు లగ్నం ఉ.8.32కు అన్నప్రాశన, గృహప్రవేశ, వివాహ, వ్యాపారాలు. సింహలగ్నంలో రా.11.55కు వివాహ, గృహప్రవేశాలు. 10 బుధ, చవితి, పుష్యమి నక్షత్రం ధనుస్సు లగ్నం ఉ.8.19కు అన్నప్రాశన, గృహప్రవేశాలు, వ్యాపార లావాదేవీలు. తులాలగ్నం తె.4.12కు గృహప్రవేశాలు. 12 శుక్ర, షష్టి, మఖ నక్షత్రం, తులాలగ్నం తె.4.07కు వివాహ, గృహప్రవేశాలు. 13 శని, సప్తమి, పుబ్బ నక్షత్రం, కుంభలగ్నం ప.11.54కు సాధారణ కార్యాలు. 14 సోమ, నవమి, ఉత్తర నక్షత్రం, ధనుస్సులగ్నం ఉ.7.57కు, కుంభలగ్నం ఉ.11.46కు అన్నప్రాశన, గృహప్రవేశాలు,క్రయవిక్రయాలు. 17 బుధ, దశమి, తత్కాల ఏకాదశి, చిత్త నక్షత్రం, మేషలగ్నం ప.2.54కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. పుష్యమాసం డిసెంబర్ 24 బుధ, శు.తదియ, ఉత్తరాషాఢ నక్షత్రం, కుంభలగ్నం ప.11.14కు అన్నప్రాశన, వ్యాపార, ఆర్థిక లావాదేవీలు. 26 శుక్ర, పంచమి, ధనిష్ట నక్షత్రం, కుంభలగ్నం ప.11.06కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. 27 శని, షష్టి, శతభిషం నక్షత్రం, కుంభలగ్నం ప.11.03కు అన్నప్రాశన, వ్యాపార లావాదేవీలు. 28 ఆది, సప్తమి, ఉత్తరాభాద్ర నక్షత్రం, మేషలగ్నం ప.2.10కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. జనవరి - 2015 7 బుధ, బ.విదియ, పుష్యమి నక్షత్రం, మకరలగ్నం ఉ.8.02 అన్నప్రాశన, వ్యాపారాదులు. 11 ఆది, షష్టి, ఉత్తర నక్షత్రం, మీనలగ్నం ఉ.10.44కు సాధారణ కార్యాలు. మాఘమాసం జనవరి 22 గురు, శు.తదియ, ధనిష్ఠ నక్షత్రం,, మిథునలగ్నం సా.4.44కు క్రయవిక్రయాలు, వ్యాపారాదులు. ధనుస్సు లగ్నం తె.5.30గంటలకు వివాహ, శంకుస్థాపన, గృహప్రవేశాలు. 24 శని, చవితి తత్కాల పంచమి,ఉత్తరాభాద్ర నక్షత్రం, తులాలగ్నం రా.1.15 వివాహాలు. 25 ఆది, పంచమి, రేవతి నక్షత్రం తులాలగ్నం రా.1.11 వివాహాలు. 29 గురు, దశమి, రోహిణిన క్షత్రం, ధనుస్సు లగ్నం తె.5.02 వివాహాలు, గృహప్రవేశాలు. 30 శుక్ర, ఏకాదశి తత్కాల ద్వాదశి, మృగశిర నక్షత్రం, ధనుస్సు లగ్నం తె.5.01 వివాహాలు, గృహప్రవేశాలు. 31 శని, ద్వాదశి, మృగశిర నక్షత్రం, మేషలగ్నం ఉ.11.53 ఉపనయనం, వివాహ, గృహ ప్రవేశాలు. ఫిబ్రవరి 2 సోమ, చతుర్దశి, పుష్యమి నక్షత్రం, తులాలగ్నం రా.12.41 గృహప్రవేశాలు. 4 బుధ, బ.పాడ్యమి, మఖ నక్షత్రం, తులాలగ్నం రా.12.34 వివాహాలు,ధనుస్సు లగ్నం తె.4.41 వివాహాలు, గృహప్రవేశాలు. 6 శుక్ర, బ.విదియ తత్కాల తదియ, ఉత్తర నక్షత్రం, ధనుస్సు లగ్నం తె.4.32 వివాహాలు, గృహప్రవేశాలు. 9 సోమ, బ.పంచమి, చిత్త నక్షత్రం,, మేషలగ్నం ఉ.11.22 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయన, శంకుస్థాపన, గృహప్రవేశాలు. 11 బుధ, బ.సప్తమి, స్వాతి నక్షత్రం, మేషలగ్నం ఉ.11.11 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహాలు, శంకుస్థాపనలు. 12 గురు, అష్టమి తత్కాల నవమి అనూరాధ నక్షత్రం, ధనుస్సు లగ్నం తె.4.09 వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు. 14 శని, దశమి తత్కాల ఏకాదశి, మూల నక్షత్రం, మకర లగ్నం తె.5.31 వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు. 15 ఆది, ఏకాదశి, మూల నక్షత్రం, మేషలగ్నం ఉ.10.54 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహాలు, శంకుస్థాపనలు. ఫాల్గుణమాసం ఫిబ్రవరి 21 శని, శు.తదియ, ఉత్తరాభాద్ర నక్షత్రం, తులాలగ్నం రా.11.26 వివాహాలు, ధనుస్సులగ్నం తె.3.33 వివాహాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు. 22 ఆది, శు.చవితి, రేవతి నక్షత్రం, తులాలగ్నం రా.11.22 వివాహాలు, గర్భాదానాలు. 25 బుధ, శు.సప్తమి తత్కాల అష్టమి, రోహిణి నక్షత్రం, తులాలగ్నం రా.11.10 వివాహాలు. మార్చి 1 ఆది, శు.ఏకాదశి తత్కాల ద్వాదశి, పునర్వసు నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.10.49 శంకుస్థాపనలు, గృహప్రవేశాలు. 2 సోమ, ద్వాదశి తత్కాల త్రయోదశి, పుష్యమి నక్షత్రం,, ధనుస్సు లగ్నం రా.2.57 శంకుస్థాపన, గృహప్రవేశాలు. 4 బుధ, చతుర్దశి, మఖ నక్షత్రం, తులాలగ్నం రా.10.41 వివాహాలు, ధనుస్సు లగ్నం రా.2.48 వివాహాలు, శంకుస్థాపన, గృహప్రవేశాలు. 6 శుక్ర, బహుళ పాడ్యమి, ఉత్తర నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.2.39 వివాహాలు,శంకుస్థాపన, గృహప్రవేశాలు. 7 శని, విదియ, ఉత్తర నక్షత్రం మేష లగ్నం ఉ.9.35 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, శంకుస్థాపనలు. ధనుస్సు లగ్నం రా.2.37 వివాహాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు. 8 ఆది, తదియ, హస్త నక్షత్రం, మేషలగ్నం ఉ.9.30 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహాలు, శంకుస్థాపనలు. రా.10.24 చిత్త నక్షత్రం, తులా లగ్నంలో వివాహాలు. 9 సోమ, చవితి, చిత్త నక్షత్రం, మేష లగ్నం ఉ.9.26 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయన, శంకుస్థాపన, వ్యాపారాలు. 11 బుధ, పంచమి తత్కాల షష్టి, అనూరాధ నక్షత్రం తులాలగ్నం రా.10.12 వివాహాలు. 12 గురు, షష్టి తత్కాల సప్తమి, అనూరాధ నక్షత్రం మేష లగ్నం ఉ.9.15 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వివాహాలు, ఉపనయనం, శంకుస్థాపనలు. 14 శని, నవమి, మూల నక్షత్రం, మేషలగ్నం ఉ.9.07 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వివాహాలు ఉపనయనం శంకుస్థాపనలు. 15 ఆది, దశమి, ఉత్తరాషాఢ నక్షత్రం ధనుస్సు లగ్నం రా.2.03 వివాహ, గృహప్రవేశాలు. -
శ్రీ జయ నామ సంవత్సరం - ఫలితాలు
ఈ సంవత్సరం రాజు, మంత్రి కూడా చంద్రుడే కావడం శుభప్రదం. నవనాయకుల్లో నలుగురు శుభులు కాగా, ఐదుగురు పాపులు. 21మంది ఉపనాయకుల్లో 13మంది శుభులు, ఎనిమిది మంది పాపులు. వర్షలగ్నం ధనుస్సు కావడం, లగ్నాన్ని గురుడు వీక్షించడం శుభకరం. తూర్పు, ఉత్తర ప్రాంతాలలో సుభిక్షం, మధ్యప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు. వర్షలగ్నంలో లగ్న, చతుర్థాధిపతి గురుడు సప్తమస్థితి, ద్వితీయ, తృతీయాధిపతి శని రాహువుతో కలసి లాభస్థితి, పంచమ, వ్యయస్థానాధిపతి కుజునికి రాజ్యస్థితి, షష్టమ, లాభస్థానాధిపతి శుక్రుడు సప్తమ, రాజ్యస్థానాధిపతి బుధునితో కూడి తృతీయ స్థితి. అష్టమ స్థానాధిపతి, రాజైన చంద్రుడు చతుర్ధస్థానంలో భాగ్యస్థానాధిపతి అయిన రవితో కలయిక. రాజైన చంద్రునిపై కుజదృష్టి వల్ల రాజకీయ, ఆర్థికరంగాల్లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొనే అవకాశం. దేశంలో అలజడులు, ప్రజల మధ్య వైషమ్యాలు ప్రబలినా గురు ప్రభావం వల్ల తీవ్రత తగ్గి శాంతి నెలకొంటుంది. ఇరుగుపొరుగు దేశాలతో సమస్యలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ఇక జగర్లగ్నం వృషభం అయినది. లగ్న, షష్టమాధిపతి శుక్రుడు రాజ్యస్థితి, ద్వితీయ, పంచమాధిపతి బుధునికి లాభస్థితి. తృతీయాధిపతి చంద్రుడు పంచమంలో సప్తమ, వ్యయాధిపతి కుజునితో చేరిక, చతుర్ధాధిపతి రవి కేతువుతో కలిసి వ్యయంలో ఉచ్ఛస్థితి. అష్టమ, లాభాధిపతి గురునికి ద్వితీయస్థితి కలిగింది. వర్ష, జగర్లగ్నాల రీత్యా పరిశీలిస్తే రాజు,మంత్రి చంద్రుడు కావడం శుభకరమైనా ఆర్థిక సంక్షోభాలు తప్పకపోవచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. తెల్లటి పంటలు, వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగవచ్చు. భూముల ధరలు ఆకాశాన్నంటుతాయి. సేనాధిపతి రవి అష్టమాధిపతి చంద్రునితో కలయిక వల్ల పాలకులు, రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొంటాయి. కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారే అవకాశం. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పాలకులు ఇబ్బందులు అధిగమించి ప్రజారంజక పాలనతో ప్రజలను ఆకట్టుకుంటారు. అయితే కొన్ని పార్టీల ఉనికి ప్రశ్నార్థకం కాగల అవకాశాలున్నాయి. సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు కావడం వల్ల పంటల దిగుబడి బాగుంటుంది. వ్యవసాయదారులకు అనుకూల కాలం. తూర్పు, ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో అధిక వర్షాలు, మధ్యప్రాంతంలో కరువుకాటకాలు. నవంబర్ నుంచి శని వృశ్చిక రాశిలో సంచారంతో ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల వల్ల జన,ఆస్తి, పంటనష్టాలు సంభవించవచ్చు. మహిళలకు ప్రాధాన్యం పెరుగుతుంది. పరిశోధకులకు విశేషంగా కలిసివస్తుంది. క్రీడాకారులకు మంచి గుర్తింపు. వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు దక్కుతాయి. కళాకారులు, పత్రికా రంగం వారు ఈ ఏడాది కొత్త అవకాశాలతో బిజీగా మారతారు. వైద్యులు, న్యాయవాద వృత్తుల్లోని వారు నైపుణ్యాన్ని చాటుకుని గుర్తింపు పొందుతారు. శాస్త్ర, సాంకేతిక రంగాలు మరింత అభివృద్ధి సాధిస్తాయి. పారిశ్రామికరంగం కొంత ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకూ కుజుడు తులారాశిలో శనితో కలయిక వల్ల ఉగ్రవాదుల చర్యలు, భూకంపాది ప్రమాదాలు, విచిత్రమైన వ్యాధులు ప్రబలే అవకాశం. మొత్తం మీద గత ఏడాది కంటే అనుకూలమనే చెప్పాలి. గురుడు కర్కాటక రాశిలో ఉచ్ఛస్థితి పొందడం వల్ల శ్రావణ మాసం నుంచి సస్యానుకూలత, సుభిక్షం, రాజకీయ సుస్థిరత ఉంటాయి. 22.06.14తేదీ జ్యేష్ట బహుళ దశమి తత్కాల ఏకాదశి ఆదివారం సా.6.22గంటలకు అశ్వని నక్షత్రం, అతిగండ యోగం, వణజి కరణం, ధనుర్లగ్నంలో రవి ఆరుద్రా నక్షత్ర ప్రవేశం. దీనివల్ల పంటలు అధికంగా ఉంటాయి. సుభిక్షం, పశువులకు కొంతవరకూ హాని, యుద్ధభయాలు, పశుపాలకుడు శ్రీకృష్ణుడు కావడం వల్ల పశువృద్ధి. పాడిపరిశ్రమకు మంచిరోజులు. అయితే సంరక్షకుడు యముడు కావడం వల్ల కొంత నష్టంతో పాటు, పాడిపంటల ధరలు మధ్యమంగా ఉంటాయి. ఈ ఏడాది ఉగాది నుంచి నవంబర్ 2వ తేదీ వరకూ వృద్ధగోపపాలకుని చేతిలోనూ, తదుపరి బాలగోపపాలకుని చేతిలోనూ అఢకం(వర్షకుంచం) ఉంటుంది. దీనివల్ల సుభిక్షం, తగినంతగా వర్షాలు, సస్యానుకూలం. జ్యేష్ట బహుళ సప్తమి, గురువారం అనగా 19.06.14వ తేదీ ఉ.8.52 గంటలకు గురుడు కర్కాటక రాశిలో ప్రవేశం. ఈరోజు నుంచి 30.06.14తేదీ వరకూ యమునానదీ పుష్కరాలు జరుగుతాయి. ఈ సమయంలో నదిలో స్నానాదులు, పిండప్రదానం, దానధర్మాలు నిర్వహించడం మంచిది. ఈ సంవత్సరం రాష్ట్రంలో కనిపించే గ్రహణాలు లేవు. నవనాయకుల ఫలితాలు... రాజు - చంద్రుడు... పరిపాలన సాఫీగా సాగుతుంది. గోధుమలు, వరి,చెరకు పంటలు బాగా పండుతాయి. పాడిపంటలకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి. తెల్లటి వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. మంత్రి - చంద్రుడు... రాజకీయ రంగంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ప్రజలు, పాలకులు పరస్పరం సహకారంతో మెలుగుతారు. నిత్యావసర వస్తువులు, భూముల ధరలు పెరుగుతాయి. సేనాధిపతి - రవి... రాష్ట్రాల మధ్య పరస్పర వివాదాలు. పొరుగుదేశాల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. సైన్యానికి ప్రాధాన్యం పెరుగుతుంది. సస్యాధిపతి - గురుడు... గోధుమలు, సెనగ పంట బాగా పండుతుంది. వీటి తో పాటు, బంగారం, పసుపు పంటలకు గిరాకీ పెరుగుతుంది. తగినంతగా వర్షాలు కురిసి పంటలకు ఉపయోగకరంగా ఉంటాయి. ధాన్యాధిపతి - కుజుడు... ఎరుపు భూములు ఫలవంతమవుతాయి. కందులు, బొబ్బర్లు, మిర్చి పంటలకు గిరాకీ పెరుగుతుంది. వీటితో పాటు, బెల్లం, నెయ్యి, పంచదార ధరలు పెరుగుతాయి. ఆర్ఘాధిపతి - రవి... పాలకులమధ్య కలహాలు, ప్రజల్లో అభద్రతాభావం. యుద్ధభయాలు, రోగభయాలు. మిరియాలు, మిర్చి, ఎరుపు వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. మేఘాధిపతి - రవి... ఎర్ర ని పంటలు బాగా పండుతాయి. ప్రజల మధ్య కలహాలు. వర్షాలు కొన్నిచోట్ల అధికం. మొత్తం మీద పంటలకు ఉపకరించే రీతిలో వర్షాలు కురుస్తాయి. రసాధిపతి - శని... నూనెలు,నువ్వులు, ఉలవలు, నల్లనిధాన్యాలకుకొంతవరకూ గిరాకీ పెరుగుతుంది. నవ ంబర్ నుంచి ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడతారు. నీరసాధిపతి - బుధుడు... కళాకారులు, వృత్తిదారులు, వైద్యులకు అనుకూలం. సుగంధ ద్రవ్యాలు, ఆకుపచ్చని పంటల దిగుబడితో పాటు, గిరాకీ పెరుగుతుంది.