Sri Raja Rajeshwara swamy
-
రాజన్న సన్నిధిలో రామన్న కల్యాణం
వేములవాడ: హరిహరక్షేత్రంగా వెలుగొందుతూ దక్షిణకాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీసీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహాజా తరను తలపించేలా దాదాపు లక్షన్నరకు పైగా భక్తులు ఈ వేడుకలకు హాజరయ్యారు. శివపార్వతులు (జోగినులు, హిజ్రాలు) చేతిలో త్రిశూలం పట్టుకుని రాజన్నను వివాహమాడారు. -
వైభవంగా రాజన్న కల్యాణోత్సవం
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో పార్వతీరాజరాజేశ్వరుల కల్యాణం సోమవారం వైభవంగా జరిగింది. 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు కల్యాణోత్సవానికి మున్సిపాలిటీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కమిషనర్ శ్యాంసుందర్‌రావు పట్టువస్త్రాలు, ఆలయ ఈవో రమాదేవి తలంబ్రాలు సమర్పించారు. స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు, బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణాల మధ్య రెండున్నర గంటల పాటు కల్యాణం కనులపండువగా సాగింది. ఎదుర్కోళ్ల సమయంలో వరుడి తరఫున స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, వధువు పక్షాన ఈవో రమాదేవి కట్నకానుకలు మాట్లాడుకున్నారు. అనంతరం స్వామివారిని పెద్దసేవపై ఊరేగించారు. కల్యాణ వేడుక ఆలయంలో నిర్వహించడం తో చాలామంది భక్తులు ఆలయం బయటే ఎండలో ఉండిపోయారు. ఎల్ఈడీ టీవీలు పనిచేయకపోవడంతో శివపార్వతులు గోల గోల చేశారు. కన్యాదాతలుగా గోపన్నగారి వసంత్–సరిత దంపతులు, వ్యాఖ్యాతగా తిగుళ్ల శ్రీహరిశర్మ, చంద్రగిరిశరత్ వ్యవహరించారు. కల్యాణోత్సవానికి లక్షమంది కిపైగా తరలివచ్చారు. 23న మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం జరగనుంది. -
కన్నులపండువగా రాజన్న కళ్యాణం
కరీంనగర్ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి కళ్యాణం శనివారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి లక్షల సంఖ్యలో భక్తులు హజరయ్యారు. దీంతో ఆలయం లోపల తోపులాటకు దారితీసింది. ఆలయ ప్రాంగణంలో భక్తులతో నిండిపోవడంతో...బయట ఎండ ఎక్కువగా ఉండటంతో.. భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఆలయాధికారులు ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రాజన్నకు కల్యాణశోభ
వేములవాడ అర్బన్ : శ్రీరాజరాజేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యూరుు. ఉదయం 8.15కు ఈవో దూస రాజేశ్వర్, ఏఈవోలు గౌరినాథ్, ఉమారాణి ఉత్సవాలను ప్రారంభించారు. అర్చకులకు దేవస్థానం పక్షాన వర్ని- దీక్షా వస్త్రాలు అందించారు. శివభగత్పుణ్యాహవచనము, పంచగవ్య మిశ్రణ ము, దీక్షాధారణము, రుత్విక్ వరణము, మంటప ప్రతిష్ఠ, నవగ్రహ ప్రతిష్ఠ, గౌరీ షోడశ మాతృకా ప్రతిష్ఠ, అంకురార్పణము, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము తదితర కార్యక్రమాలు నిర్వహిం చారు. స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్యశర్మ సారథ్యంలో అర్చక బృందం కల్యాణ మండపంలో భేరీ పూజ, దేవతాహ్వానము పూజలు చేపట్టారు. నేడు ఆదిదేవుల కల్యాణం రాజన్న ఆలయంలో ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే శివకల్యాణోత్సవం ఆది వారం జరగనుంది. ఉదయం 10.20కు అభిజిత్ లగ్న ముహూర్తమున పార్వతీరాజరాజేశ్వర స్వామి వారల కల్యాణం ఘనంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యూరుు. సాయంత్రం 4 గంటలకు శివపురాణ ప్రవచనము, 5 గంటలకు ప్రధాన హోమము సప్తపది, లాజాహోమము, ఔపాసనము, బలిహరణము అనంతరం రాత్రి 8 గంటల కు పెద్ద సేవపై ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. శివకల్యాణోత్సవాన్ని తిలకించేందుకు ఇప్పటికే 50 వేలకు పైగా భక్తులు చేరుకున్నారు. నగరపంచాయతీ పక్షాన పట్టువస్త్రాలు రాజన్న పెళ్లికి స్థానిక నగరపంచాయతీ పక్షాన పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చైర్పర్సన్ నామాల ఉమ-లక్ష్మీరాజం, వైస్‌చైర్మన్ ప్రతాప రామకృష్ణ, కమిషనర్ శ్రీహరి తెలిపారు. ఉదయం 9 గంటలకు కార్యాలయం నుంచి ఊరేగింపుగా రాజన్న ఆలయానికి చేరుకుని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తామన్నారు. రాజన్న సేవలో ఉన్నత విద్యామండలి చైర్మన్ వేములవాడ అర్బన్ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి పీఆర్వో విభాగం సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్న పాపిరెడ్డి కుటుంబసభ్యులు రాజన్నకు కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఈవో దూస రాజేశ్వర్, ఏఈవో గౌరినాథ్, పీఆర్వో తిరుపతిరావు, ఏపీఆర్వో చంద్రశేఖర్, అర్చకులు పాల్గొన్నారు.