శ్రీకంఠమహేశ్వరుడి సన్నిధిలో మంత్రి పూజలు
ఆత్మకూర్ (ఎస్) : మండల కేంద్రంలోని శ్రీకంఠమమహేశ్వరస్వామి ద్వితీయ కల్యాణ మహోత్సవంలో భాగంగా శనివారం విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక గౌడ కులస్తులు ఈ సందర్భంగా మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం కంఠమహేశ్వరస్వామి-సురమాంబదేవిల సన్నిధిలో పూజలు చేసిన తర్వాత మంత్రిని పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. దీంట్లోభాగంగా స్థానికులు స్వామివారికి బోనాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కసగాని లక్ష్మిబ్రహ్మంగౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తేరా చిన్నపరెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, వై.వెంకటేశ్వర్లు, కాకి దయాకర్‌రెడ్డి, కృపాకర్‌రెడ్డి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గునగంటి శ్రీను, బట్టిపెల్లి వెంకన్న, వెంకట్రాములు, గునగంటి వెంకన్న, భిక్షం తదితరులు పాల్గొన్నారు.