srikanth sharma
-
ఇక కరెంటు బిల్లుల బకాయిలు ఉండవ్..
లక్నో : వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు పేరుకుపోవడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రముఖుల ఇళ్లలో ప్రీపెయిడ్ ఎలక్ట్రిక్ విద్యుత్ మీటర్లను బిగించాలని నడుం కట్టింది. దానిలో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ శుక్రవారం తన ఇంట్లో 25 కేవీ కెపాసిటీ గల ప్రీపెయిడ్ ఎలక్ట్రిక్ విద్యుత్ మీటర్ బిగించారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఇదే పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ డ్రైవ్‌ను తన ఇంటి నుంచి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖుల నివాసాలు, ఉన్నతాధికారుల ఇళ్లు, ప్రభుత్వ బంగళాల్లో దాదాపు రూ.13 వేల కోట్లు విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. ఇది ఇలాగే కొనసాగితే విద్యుత్ సంస్థల మనుగడ కష్టం అవుతుంది. ప్రీపెయిడ్ ఎలక్ట్రిక్ విద్యుత్ మీటర్లతో బకాయిలకు అవకాశమే ఉండదు. మీటర్లో బ్యాలెన్స్ అయిపోగానే ఆటోమేటిక్‌గా కరెంట్ సరఫరా నిలిచిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి మీటర్లను లక్ష వరకు బిగించాలని అక్టోబర్ 29నే నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో సామాన్య జనం కూడా భాగం కావాలి. భారీగా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు విడతల వారీగా చెల్లించేందుకు అవకాశమిస్తున్నాం. విద్యుత్ చౌర్యం జరగకుండా పోలీస్ శాఖ సేవలు వినియోగించుకుంటాం’అన్నారు. -
లంచం అడిగితే వీడియో తీసి పంపండి
దరువు సినిమాలో రెండో రవితేజ (బుల్లెట్ రాజా) అవినీతిపరుల ఆట కట్టించడానికి 'ఎంఎంఎస్ పెట్టు.. బహుమతి కొట్టు' అనే కొత్త పథకాన్ని ప్రవేశపెడతారు. దాని ప్రకారం ఎవరైనా లంచం అడిగితే.. వీడియో తీసి ఎంఎంఎస్ చేయాలి. అప్పుడు వాళ్ల విషయం ఉన్నతాధికారులు చూసుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ కూడా సరిగ్గా ఇలాగే చెబుతున్నారు. అవినీతిని కూకటివేళ్లతో సహా పీకిపారేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందువల్ల ఎవరైనా లంచం అడిగితే అస్సలు ఊరుకోవద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వోద్యోగులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే వీడియో క్లిప్ తీయాలని చెప్పారు. బృందావనంలోని గోవిందవిహార్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆయనీ విషయం తెలిపారు. యూపీలో నెల రోజుల బీజేపీ పాలన గురించి మాట్లాడుతూ, ''ఇప్పటికి ట్రైలర్ మాత్రమే చూశారు, సినిమా ఇంకా ముందుంది'' అని చెప్పారు. రాష్ట్రం నుంచి అవినీతిని తరిమేయడానికి, అభివృద్ధిని సాధించడానికే ఒక సన్యాసిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధాని మోదీ ఎన్నుకున్నారన్నారు. మథురకు త్వరలోనే మెట్రో కనెక్టివిటీ వస్తుందని, బ్రిజ్ చౌరాసి కోస్ పరిక్రమ ప్రాంతానికి త్వరలోనే తాగునీరు అందిస్తామని మంత్రి శ్రీకాంత్ శర్మ తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌ను ఉత్తమ ప్రదేశ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మరో మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌదరి అన్నారు. యమునానదిని ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. -
'ఇప్పుడేమంటారు.. సోనియా క్షమాపణ చెప్పి తీరాలి'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికైనా తమకు క్షమాపణ చెప్పితీరాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇష్ర్రాత్ జహాన్ కూడా ఓ ఉగ్రవాదేనని లష్కరే ఈ తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ చెప్పిన నేపథ్యంలో గతంలో తమపై అనవసరంగా ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాల్సిందనన్నారు. 'ఉగ్రవాది ఇష్రాత్ జహాన్‌ను హతమార్చిన నాటి పోలీసు హీరోలకు, దేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి' అని బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ అన్నారు. 2014లో జూన్ 15న గుజరాత్ లోని అహ్మదాబాద్ శివారుల్లో పోలీసులకు కొందరు అనుమానితులపై జరిపిన కాల్పుల్లో ఇష్రత్ జహాన్ ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఓ ఉగ్రవాదిని మట్టుపెట్టిన ఇలాంటి సంఘటనపట్ల హర్షం వ్యక్తం చేయకుండా నాటి పోలీసులను అభినందించకుడా అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రశ్నలు లేవనెత్తిందని, కొందరిని జైలులో పెట్టిందని శ్రీకాంత్ శర్మ మండిపడ్డారు. -
'జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండండి'
-
'సీఎం గారూ.. జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండండి'
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం కేసులో అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ సూచించారు. రాజ్యాంగ విరుద్ధమైన పనులను కేజ్రీవాల్ ఒకదాని తరువాత మరొకటి చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పూర్తిగా విఫలమయ్యారని, తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే తమ పార్టీ నేతలపై విమర్శలకు దిగుతున్నారని శ్రీకాంత్ శర్మ విమర్శించారు. కేజ్రీవాల్, ఆయన అనుచరులు డీడీసీఏ విషయంలో తీసుకున్నటువంటి రాజ్యాంగేతర నిర్ణయాలకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బీజేపీ హెచ్చరించింది.