మీరే... నిజం!
ఒక్కోసారి కళ్లు వునల్ని మోసం చేస్తారుు. అందుకే కళ్లతో చూసిందల్లా నిజమేనుకోకూడదు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక కళ్లతో చూసే దృశ్యానికి, వాస్తవానికి బోలెడంత వ్యత్యాసం ఉంటోంది. దీనికి నిదర్శనమే..augmented reality! వాస్తవానికి వర్చువల్ టెక్నాలజీని తోడు చేసి అద్భుతాలు సృష్టిస్తున్నారు.. నగరవాసి హేమంత్ సత్యనారాయణ.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని augmented reality లో వినియోగించి imaginate సంస్థ ఫౌండర్, సీఈవో హేమంత్ పలు రంగాలకు పనికొచ్చే యాప్స్ రూపొందించారు. ఆయన రూపొందించిన యాప్స్, వాటి విశేషాలు...
ఆర్మీ శిక్షణంతా గదిలోనే (ShootAR)
ఆర్మీ ట్రెయినీలకు షూటింగ్ శిక్షణ కోసం ShootAR రూపొందించారు. ట్రెయినీ కళ్లకు సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కళ్లద్దాలను అమర్చుతారు. అప్పుడు ట్రెయినీకి అసలు ప్రపంచంతో పాటు వర్చువల్ వరల్డ్ కూడా కనిపిస్తుంది. అప్పుడు ట్రెయినీ డమ్మీ మనిషిని ఏ దిశలో కాల్చాడు, ఆ సమయంలో అతడి కంటి చూపు ఎలా ఉంది వంటి అంశాలన్నీ రికార్డవుతాయి. దీని ఆధారంగా ట్రెయినీలు తమ పొరపాట్లను దిద్దుకునే వీలుంటుంది. దీనిని వీడియో కూడా తీసుకోవచ్చు. మన ఆర్మీలో దీనిని వాడుతున్నారు.
గైడ్ లేకుండానే టూంబ్స్ చూసేయొచ్చు...
GiftAR ను ‘టూర్‌గైడ్’గా కూడా వాడుకోవచ్చు. ఇటీవలే ఆగాఖాన్ ఫౌండేషన్ ఈ యాప్‌ను కొనుగోలు చేసింది. ఈ యాప్‌లో ముందుగా చారిత్రక కట్టడాల గురించిన సమాచారాన్ని మొబైల్ యాప్‌లో క్రియేట్ చేసిపెట్టుకోవాలి. సెల్‌ఫోన్‌ను చారిత్రక కట్టడం ముందు ఉంచగానే ఆటోమేటిక్‌గా దానికి సంబంధించిన వివరాలు మొబైల్లో ప్రత్యక్షమవుతాయి. కులీకుతుబ్ షాహీ టూంబ్స్‌లో తొలిసారిగా దీన్ని ప్రారంభించేందుకు ఆగాఖాన్ ఫౌండేషన్ సన్నాహాలు చేస్తోంది.
చీర సింగారం తెరపై ప్రత్యక్షం TrialAR
షోరూమ్‌కు వెళ్లి గానీ, ఆన్లైన్లో గానీ కచ్చితమైన కొలతలతో మనకు నప్పే దుస్తులను కొనుగోలు చేయడం కాస్త కష్టమే. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు TrialAR, DRES.SYవంటి యాప్స్ రూపొందించారు. వీటి సాయంతో మనకు నప్పే దుస్తులను ఎంచక్కా ఎంపిక చేసుకోవచ్చు.
ఎప్పుడు కావాలంటే అప్పుడే గిఫ్ట్ (GiftAR)
కోరుకున్నప్పుడే కావలసిన వారికి గిఫ్ట్ ఇచ్చేందుకు రూపొందించిన GiftAR సాయంతో సెల్‌ఫోన్ ద్వారానే బహుమతి అందించవచ్చు. దీనిని ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. బహుమతి ఇవ్వదలచిన వారి కోసం సెల్ఫోన్లో మెసేజ్ లేదా వీడియోను ముందుగానే క్రియేట్ చేసుకోవాలి. బహుమతి అందుకున్న వ్యక్తి దానిని ఓపెన్ చేయాలంటే, ముందుగా మనం పెట్టుకున్న లాక్ ముందు సెల్‌ఫోన్ పెడితే చాలు, ఆటోమేటిక్‌గా అది ఓపెన్ అవుతుంది. వెంటనే మనం క్రియేట్ చేసిన మెసేజ్ లేదా వీడియో ప్రత్యక్షమై ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ యాప్‌ను గూగుల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
imaginate గురించి క్లుప్తంగా..
2012లో ‘ఐబీఎం స్మార్ట్ క్యాంప్ కిక్‌స్టార్’, ఎంఐటీ టీఆర్ 35 ఇన్నోవేటర్ ఆఫ్ ది ఇయర్-2012 అవార్డ్లు .
2012లో ఐటీఏపీ ప్రొడక్ట్, స్టార్ట్అప్ ఫైనలిస్ట్, సార్ట్ అప్ చిలీ గ్లోబల్.. 2011లో దేశం నుంచి నాస్కామ్ ఎంపిక చేసిన టాప్-10 ఇన్నోవేటివ్స్లో కూడా imaginateస్థానం సంపాదించుకుంది.
- శ్రీనాథ్.ఎ