నవంబర్‌లోపు పూర్తిస్థాయి వైద్య సేవలు
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ మెడికల్ కళాశాలలో నవంబర్ లోపు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని డీఎంఈ (డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్) పుట్ట శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన మెడికల్ కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. పూర్తి స్థాయిలో వైద్యుల ను, సిబ్బందిని నియమించి మెరుగైన వైద్యసేవలందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో చిన్న చిన్న ఇబ్బందులను తొలగిస్తామన్నారు. ఖాళీలను కూడా భర్తీ చేస్తామన్నారు.
ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే, అ క్టోబర్ చివరిలోపు నియా మకాలను పూర్తి చేస్తామన్నారు. ఈ విషయమై ఇది వరకే ప్రభుత్వంతో చర్చిం చామన్నారు. అవసరమైతే గాంధీ, ఉస్మానియా వైద్య కళాశాలల నుంచి ప్రొఫెసర్లను, వైద్యులను ఇక్కడికి తీసుకువస్తామన్నారు. కళాశాలలో డీఎన్బీ కోర్సుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వైద్య విద్యా బోధనను మెరుగుపరుస్తామన్నారు. గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై చర్యలు తప్పవన్నారు. ఆయా ప్రొఫెసర్ల వివరాలను తనకు అందజేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. వైద్య విధాన పరి షత్, కళాశాల వైద్యుల మధ్య పొరపొచ్చాలు ఉన్నాయని వీటిని పరిష్కరిస్తామన్నారు.