Srinivasa chary
-
కళ్లు తెరుస్తారా బాబూ!
కష్టార్జితమైన కరెన్సీని చెల్లుబాటు చేసుకోవడానికి నిరుపేద, మధ్యతరగతి జనం పడుతున్న యాతనలను మీడియా హోరెత్తిస్తుండగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఉదంతం మాన వతావాదులందరినీ కలవరపరుస్తుంది. తీవ్ర అనారోగ్యంపాలై, నడవలేని స్థితిలో ఉన్న శ్రీనివాసాచారి అనే వ్యక్తిని మొదటి అంతస్తులో ఉన్న వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లడానికి ఆయన భార్య పడిన ఇక్కట్లు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. శ్రీనివాసా చారిని సాధ్యమైనంత వేగంగా, క్షేమంగా వైద్యుని వద్దకు చేర్చడానికి అవసరమైన స్ట్రెచర్గానీ, చక్రాల కుర్చీగానీ సమకూర్చకపోవడంతో భర్తను రెక్క పట్టుకుని ఈడ్చుకెళ్లాల్సివచ్చింది. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఎక్కడో హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ హఠాత్తుగా అనారోగ్యం చుట్టు ముట్టి తప్పనిసరై స్వస్థలానికి వచ్చాడాయన. గుంతకల్లు మారుమూల గ్రామ మేమీ కాదు. ఆ ఆసుపత్రి ఎలాంటి సౌకర్యాలూ లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రమూ కాదు. శ్రీనివాసాచారి భార్య అడిగింది గొంతెమ్మ కోర్కె అంతకన్నా కాదు. అత్యవసరంగా వైద్య సాయం అందాల్సిన రోగిని వెంటనే చేరేయమని మాత్రమే ఆమె వేడుకున్నారు. జనం కట్టే పన్నులతో నెలొచ్చేసరికి వేలాది రూపాయలు జీతాలు అందు కుంటున్నవారిలో ఒక్కరంటే ఒక్కరు అది తమ కర్తవ్యమని భావిం చలేకపోయారు. బాధ్యతలు, కర్తవ్యాల సంగతలా ఉంచి కనీసం మనుషులు గానైనా స్పందించాలనుకోలేదు. సిగ్గుతో తలొంచుకోవాల్సిన ఈ ఉదంతంపై 24 గంటలు గడుస్తున్నా... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగానీ, ఆరోగ్యమంత్రి కామినేని శ్రీని వాస్గానీ స్పందించిన దాఖలాలు లేవు. అధికారుల విచారణ మొదలైంది. కానీ ఇవి కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోతాయని, చివరకు జరిగేదేమీ ఉండదని గత అనుభవాలు చెబుతున్నాయి. సరిగ్గా ఏడాదిక్రితం గుంటూరులో ఏమైంది? అక్కడి ప్రధాన ఆసుపత్రిలోని ఐసీయూలో ఒక నవజాత శిశువును ఎలుకలు కొరికి చంపేశాయి. మొన్న మే నెలలో విజయవాడ ప్రభు త్వాసుపత్రిలో మరో నవజాత శిశువు చీమలు కుట్టి చనిపోయింది. ఈ రెండు ఘటనల సమయంలోనూ విచారణలు జరిగాయి. బాధ్యులపై చర్యలు తీసుకుం టామన్నారు. తీసుకున్నామని మరి కొన్నాళ్లకు చెప్పారు. కానీ జరిగిందేమిటి? గుంటూరు ఆసుపత్రి ఘటన సమయంలో కనీసం చంద్రబాబు, కామినేని నోరు విప్పారు. బాధపడుతున్నట్టు కనబడటానికి ప్రయత్నించారు. ఇకపై ఇలాంటివి జరగనివ్వబోమని చెప్పారు. కానీ వీటిని ఆపడం తమ శక్తికి మించిన పని అను కున్నారో, ఇలాంటివాటికి అలవాటు పడ్డారో... విజయవాడ ఘటన నాటికే వారి ద్దరూ మౌనం పాటించారు. ఆ తర్వాత సైతం ప్రభుత్వాసుపత్రులు నరకాలుగా మారి నిరుపేద రోగుల్ని హింసిస్తున్న తీరును ‘సాక్షి’ దినపత్రిక ధారావాహికంగా వెలువరించింది. అయినా కదలిక లేదు. ప్రసూతి మరణాలు, నవజాత శిశు మరణాలపై ప్రపంచ బ్యాంకు నిరుడు వెలువరించిన నివేదిక మన దేశంలోని ఆసుపత్రుల గురించి ఎన్నో దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలను వెల్లడించింది. ఆ రెండు అంశాల్లోనూ తెలుగు రాష్ట్రాలు వెనుకబడిన దేశాలైన కంబోడియా, డొమినికన్ రిపబ్లిక్లతో పోల్చినా తీసికట్టుగా ఉన్నాయని తేల్చింది. దిద్దుబాటు చర్యల్ని సూచించింది. వాటర్ ఎయిడ్ అనే మరో సంస్థ గత రెండేళ్లుగా తెలుగు రాష్ట్రాలతోపాటు యూపీ, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటకల్లోని 12 జిల్లాలను ఎంచుకుని చేసిన సర్వేలో అత్యంత అధ్వా న్నమైన స్థితిలో ప్రభుత్వాసుపత్రులు ఉన్నాయని వెల్లడించింది. మరుగుదొడ్లు, మంచినీటి సదు పాయం వంటివి చాలా చోట్ల లేవని, కనీసం వాష్ బేసిన్లు కూడా ఏర్పాటు చేయ లేదని పేర్కొంది. ఇక స్ట్రెచర్లు, వీల్చైర్ల సంగతి చెప్పేదేముంది? అవసరమైన సిబ్బందిని తీసుకోకపోవడం, చాలా సేవలను ఔట్ సోర్సింగ్‌కు అప్ప జెప్పి పేద రోగులను వారి దయాదాక్షిణ్యాలకు వదిలేయడం గత కొన్నేళ్లుగా ఎక్కువైంది. శ్రీమంతులు, పలుకుబడి ఉన్నవారు, రాజకీయ నాయకులు జబ్బు చేస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగెడతారు. ఆర్ధిక స్తోమత లేని శ్రీనివాసాచారి వంటి నిరుపేదలు ప్రభుత్వాసుపత్రులకు వెళ్తారు. అక్కడ జరుగుతున్నదేమిటో, పేద రోగులకు నిత్యం ఎదురవుతున్న ఇబ్బందులేమిటో ఎవరూ ఆరా తీయరు. గుంతకల్లు ఆసుపత్రిలో కనీసం ర్యాంపు ఉన్నది గనుక ఆ అభాగ్యుడి భార్య ఎంత కష్టాన్నయినా ఓర్చుకుని ఆయనను ఈడ్చుకెళ్లగలిగింది. సకాలంలో వైద్యుడి చెంతకు చేర్చగలిగింది. పై అంతస్తుకు వెళ్లేందుకు మెట్లు తప్ప గత్యంతరం లేక పోతే వారి పరిస్థితేమిటి? ఊహించడానికి కూడా భయం వేస్తుంది. ఆరోగ్య సమాజాన్ని సాధించిన దేశం అనేక విధాల అభివృద్ధి సాధిస్తుందని నిపుణులు చెబుతారు. జనాభా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉత్పాదకత పెరుగు తుందని, అక్షరాస్యత వృద్ధి చెందుతుందని... అలాంటివి దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయంటారు. కానీ ఆరోగ్య రంగాన్ని మన దేశం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరుడు వెలువరించిన గణాంకాలు వెల్ల డించాయి. ఆరోగ్యం కోసం మన దేశం వెచ్చిస్తున్నది దేశీయ ఉత్పాదకత (జీడీపీ)లో కేవలం 1.6 శాతం మాత్రమే. ఇది కనీసం 5శాతం ఉంటే తప్ప ప్రయోజనం ఉండదు. మెక్సికోలాంటి చిన్న దేశంలో కూడా తలసరి ఆరోగ్య వ్యయం 1,045 డాలర్లుంటే మన దేశంలో అది 214 డాలర్లు మించడం లేదని ఆ గణాంకాలు తెలిపాయి. దాదాపు అయిదు దశాబ్దాల క్రితం ఆరోగ్యరంగంపై జీడీపీలో 2.5 శాతాన్ని వ్యయం చేసిన చైనా ఇప్పుడు దాన్ని రెట్టింపు కంటే ఎక్కువ చేసింది. వారిని చూసైనా మన ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకోవాలి. గుంతకల్లు ఉదంతంలో సిబ్బంది నిర్లక్ష్యంతోపాటు పర్యవేక్షణ లోపం కూడా కనిపిస్తోంది. కనీసం ఇప్ప టికైనా బాబు ప్రభుత్వం మేల్కొని సర్కారీ ఆసుపత్రుల ప్రక్షాళనకు పూనుకోవాలి. ఆరోగ్యరంగంపై అవసరమైన నిధుల్ని వెచ్చించడం, సిబ్బందిలో జవాబుదారీ తనాన్ని పెంచడం తక్షణావసరాలని గుర్తించాలి. వృ«థా మాటలతో పొద్దు పుచ్చడం మానుకోవాలి. -
ఉంటావో.. వెళ్తావో తేల్చుకో..!
డీఈవో శ్రీనివాసాచారిపైఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఆగ్రహం సెలవులో వెళ్లిన డీఈవో.. అదేబాటలో ఏడీ ఇన్చార్జి డీఈవోగా జెడ్పీ ఉప విద్యాధికారి కట్టా ఆనందం కరీంనగర్ : జిల్లా విద్యాశాఖ అధికారులపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో తన నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులను తిరిగి యథాస్థానాల్లో కొనసాగించాలని డీఈవోను ఆదేశించినట్టు తెలిసింది. డీఈవో అందుకు ససేమిరా అనడంతో సదరు ప్రజాప్రతినిధి తన మాటే వినడం లేదని తీవ్రంగా మండిపడ్డట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే డీఈవో బదిలీపై వెళ్లినట్లు విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లా విద్యాశాఖ అధికారిగా జూన్ 19న బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసాచారి వచ్చి రాగానే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, రేషనలైజేషన్ షెడ్యూల్ వెలువడడంతో ప్రజాప్రతినిధుల ఒత్తిడి తాకిడి అక్కడి నుంచే మొదలైంది. ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలకు తలొగ్గకుండా నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియను ముగించారు. రేషనలైజేషన్ ద్వారా ఉన్న చోట నుంచి దూరప్రాంత పాఠశాలలకు బదిలీ అయిన ఉపాధ్యాయులను యథా స్థానాల్లోనే కొనసాగించాలని ఒత్తిళ్లు రావడం, డీఈఓ అందుకు ససేమిరా అనడంతో వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. చివరకు డీఈవో సెలవుపై వెళ్లేంత వరకు వెళ్లింది. విశ్వసనీయ సమాచారం మేరకు... ఓ ముఖ్య ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో ఒకరు మహదేవపూర్‌కు, మరొకరు మెట్‌పల్లికి, ఇంకొకరు కథలాపూర్ మండలానికి బదిలీ అయ్యారు. సదరు ప్రజాప్రతినిధి ఈ ఉపాధ్యాయులు యథా స్థానంలోనే కొనసాగేలా కొద్దిరోజులుగా చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టడంతో డీఈఓపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక దశలో 'నేను చెబితే పని చెయ్యవా... ఉంటావో.. వెళ్తావో తేల్చుకో... రెండు రోజుల్లో వారి బదిలీని రద్దు చేసి యథా స్థానాలకు పంపాలి..'అంటూ హుకుం జారీ చేశారని తెలిసింది. దీనికి డీఈఓ తలొగ్గకపోవడంతో 'బ్లడీపూల్... నేను చెబితే చెయ్యవా..'అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక చేసేదేమీ లేక డీఈవో సెలవు పెట్టి అధికారిక సిమ్‌కార్డు, సెల్‌ఫోన్‌ను సైతం వదిలివెళ్లడం గమనార్హం. డీఈఓ శ్రీనివాసాచారికి కొద్దిరోజుల్లోనే ఆర్జేడీగా ప్రమోషన్ వచ్చే ఆవకాశం ఉండడంతో ఇలాంటి తప్పిదాలకు పాల్పడి ఆనవసర వివాదాల్లో తలదూర్చడం కన్నా కొద్దిరోజుల పాటు సెలవులో ఉండడమే మంచిదని తన సన్నిహితులతో చెప్పి సెలవులో వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం నాలుగు రోజులే సెలవు పెట్టినా మళ్లీ సెలవులను పొడగించుకొని ఇక్కడికి రాకుండా ఉండేందుకే హైదరాబాద్ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే అధికారులపై ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏడీ కూడా సెలవులోనే... అంతా ఇన్‌చార్జీలే... డీఈఓ తరువాత విద్యాశాఖలో కీలకంగా ఉండే ఏడీ ప్రసాద్ కూడా ఐదు రోజుల క్రితమే సెలవు పెట్టి కరీంనగర్ నుంచి బదిలీ చేయించుకునే ప్రయత్నాల్లో హైదరాబాద్ ఉన్నట్లు సమాచారం. దీంతో విద్యాశాఖను గాడిలో పెట్టాల్సిన డీఈఓ, ఏడీలు లేకపోవడంతో విద్యాశాఖ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అటు ఉప విద్యాధికారులు ఆరుగురు, ఇటు మండల విద్యాధికారులు 54 మంది ఇన్‌చార్జీలే కావడంతో విద్యాశాఖ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. ఇన్చార్జి డీఈఓగా కట్టా ఆనందం... జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారిగా జెడ్పీ ఉప విద్యాధికారిగా పనిచేస్తున్న కట్టా ఆనందం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే ఆనందంకు హుజూరాబాద్ ఉప విద్యాధికారిగా, జెడ్పీ ఉప విద్యాధికారిగా, కరీంనగర్ ఉప విద్యాధికారిగా, ఇటు ఇన్చార్జి డీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తుండడంతో ఏ మేరకు విద్యాశాఖకు న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే. -
‘పది’లమేనా!
ఉత్తమ ఫలితాల కోసం కసరత్తు సన్నాహాలు చేస్తున్న విద్యాశాఖ ప్రత్యేక బృందాల ఏర్పాటు వేధిస్తున్న ఖాళీల కొరత చాలా వరకు ఇన్చార్జి అధికారులే నిజామాబాద్ అర్బన్ : పదవ తరగతిలో మెరుగైన ఫలితాల కోసం విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల కు ఓ ప్రణాళికను రూపొందించింది. వచ్చేనెలలో పరీక్షలు ప్రారంభం కానున్నందున ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉం డాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాసాచారి అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు. గత ఏడాది ఆశించినంతగా ఫలితాలు సాధించలేకపోయారు. అయినా, వందకు పైగా పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించా యి. ఈ క్రమంలో ఈ ఏడు మరింతగా మంచి ఫలితాలు సాధించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదీ పరిస్థితి జిల్లాలో 465 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 530 ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది 36,615 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. ఇందులో బాలురు 18,323, బాలికలు 18,292 మంది ఉన్నారు. ప్రయివేటుగా 1642 మంది బాలురు, 671 మంది బాలికలు పరీక్షలను రాయబోతున్నా రు. రెగ్యులర్ విద్యార్థుల కోసం 194, ప్రయివే టు విద్యార్థుల కోసం 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఆరు కేంద్రాలను తగ్గించారు. మార్చి 25 నుం చి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకు విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకుంది. ప్రత్యేక పరీక్షలను నిర్వహించింది. పాఠశాలలలో సాయంత్రం వరకు అదనపు తరగతులను ఏర్పా టు చేసింది. విద్యార్థులు ప్రతిభను పరిశీలిస్తూ వారి నిపుణులచే తగు సూచనలు ఇప్పించింది. ప్రభుత్వ పాఠశాలల లో విద్యాబోధనను, విద్యార్థుల ప్రతిభను పరిశీలించేందు కు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఒక ప్రధానోపాధ్యాయుడు, ఓ భాషా పండితుడు, ఒక ఉ పాధ్యాయుడు, సంబంధిత సబ్జెక్టు టీచర్ ఉంటారు. ఒక్కో బృందానికి ఐదు పాఠశాలలను కేటాయించారు. వీరు సం బంధిత పాఠశాలలను పరిశీలన చేసి విద్యాబోధన, విద్యా ర్థుల ప్రతిభను పరిశీలిస్తారు. వెనుకబడిన విద్యార్థుల కో సం సలహాలు, సూచనలు అందిస్తారు. విద్యాబోధనకు సంబంధించి టీచర్లను అ ప్రమత్తం చే స్తారు. సన్నాహక పరీక్షల లో వీరి ప్రతి భను మెరుగు పరిచి వార్షిక పరీక్షలకు సిద్ధం చేస్తారు. కలవరపెడుతున్న ఖాళీల కొరత జిల్లా విద్యా శాఖను ఖాళీల కొరత వేధిస్తోంది. 36 మండలాలకు ఒక్కరు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓ ఉన్నారు. 35 మంది ఎంఈఓలు ఇన్చార్జులుగా ఉన్నారు. కామారెడ్డి, నిజామాబాద్, బోధన్ ఉప విద్యాధికారులు ఇన్చార్జిగానే కొనసాగుతున్నారు. దీంతో పాఠశాలల పరిశీలన సక్రమం గా జరుగడం లేదు. సీనియర్ ప్రధానోపాధ్యా యులనే ఎం ఈవోలుగా నియమించడంతో చాలా చోట్ల వారి ఆజామాయిషీ చెల్లడం లేదు. ఫలితంగా కొన్ని పాఠశాలలలో టీచర్ల పనితీరు బాగా లేదు. జుక్కల్, బాన్సువాడ ప్రాంతాల పా ఠశాలలకు నేటికి టీచర్ల గైర్హాజరు కొనసాగుతోంది. కొం దరు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో విద్యాశాఖ అధికారులపై ఓత్తిడి తీసుకరాగా మరికొందరు ఏలాంటి సమాచారం లేకుండా గైర్హాజరవుతున్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తాం.... ఈ ఏడాది పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అందుకోసం సిద్ధం చేస్తున్నాం. టీచర్లను కూడా అప్రమత్తం చేశాం. మె రుగైన ఫలితాలు తీసుకు రావడం మా లక్ష్యం. అందుకు తగ్గట్లుగానే ప్రయత్నాలు చేస్తున్నాం. - శ్రీనివాసాచారి, డీఈఓ