
‘పది’లమేనా!
పదవ తరగతిలో మెరుగైన ఫలితాల కోసం విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల కు ఓ ప్రణాళికను రూపొందించింది.
ఉత్తమ ఫలితాల కోసం కసరత్తు
సన్నాహాలు చేస్తున్న విద్యాశాఖ
ప్రత్యేక బృందాల ఏర్పాటు
వేధిస్తున్న ఖాళీల కొరత
చాలా వరకు ఇన్‌చార్జి అధికారులే
నిజామాబాద్ అర్బన్ : పదవ తరగతిలో మెరుగైన ఫలితాల కోసం విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల కు ఓ ప్రణాళికను రూపొందించింది. వచ్చేనెలలో పరీక్షలు ప్రారంభం కానున్నందున ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉం డాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాసాచారి అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు. గత ఏడాది ఆశించినంతగా ఫలితాలు సాధించలేకపోయారు. అయినా, వందకు పైగా పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించా యి. ఈ క్రమంలో ఈ ఏడు మరింతగా మంచి ఫలితాలు సాధించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 465 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 530 ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది 36,615 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. ఇందులో బాలురు 18,323, బాలికలు 18,292 మంది ఉన్నారు. ప్రయివేటుగా 1642 మంది బాలురు, 671 మంది బాలికలు పరీక్షలను రాయబోతున్నా రు. రెగ్యులర్ విద్యార్థుల కోసం 194, ప్రయివే టు విద్యార్థుల కోసం 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఆరు కేంద్రాలను తగ్గించారు. మార్చి 25 నుం చి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకు విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకుంది. ప్రత్యేక పరీక్షలను నిర్వహించింది. పాఠశాలలలో సాయంత్రం వరకు అదనపు తరగతులను ఏర్పా టు చేసింది. విద్యార్థులు ప్రతిభను పరిశీలిస్తూ వారి నిపుణులచే తగు సూచనలు ఇప్పించింది. ప్రభుత్వ పాఠశాలల లో విద్యాబోధనను, విద్యార్థుల ప్రతిభను పరిశీలించేందు కు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఒక ప్రధానోపాధ్యాయుడు, ఓ భాషా పండితుడు, ఒక ఉ పాధ్యాయుడు, సంబంధిత సబ్జెక్టు టీచర్ ఉంటారు. ఒక్కో బృందానికి ఐదు పాఠశాలలను కేటాయించారు. వీరు సం బంధిత పాఠశాలలను పరిశీలన చేసి విద్యాబోధన, విద్యా ర్థుల ప్రతిభను పరిశీలిస్తారు. వెనుకబడిన విద్యార్థుల కో సం సలహాలు, సూచనలు అందిస్తారు. విద్యాబోధనకు సంబంధించి టీచర్లను అ ప్రమత్తం చే స్తారు. సన్నాహక పరీక్షల లో వీరి ప్రతి భను మెరుగు పరిచి వార్షిక పరీక్షలకు సిద్ధం చేస్తారు.
కలవరపెడుతున్న ఖాళీల కొరత
జిల్లా విద్యా శాఖను ఖాళీల కొరత వేధిస్తోంది. 36 మండలాలకు ఒక్కరు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓ ఉన్నారు. 35 మంది ఎంఈఓలు ఇన్‌చార్జులుగా ఉన్నారు. కామారెడ్డి, నిజామాబాద్, బోధన్ ఉప విద్యాధికారులు ఇన్‌చార్జిగానే కొనసాగుతున్నారు. దీంతో పాఠశాలల పరిశీలన సక్రమం గా జరుగడం లేదు. సీనియర్ ప్రధానోపాధ్యా యులనే ఎం ఈవోలుగా నియమించడంతో చాలా చోట్ల వారి ఆజామాయిషీ చెల్లడం లేదు. ఫలితంగా కొన్ని పాఠశాలలలో టీచర్ల పనితీరు బాగా లేదు. జుక్కల్, బాన్సువాడ ప్రాంతాల పా ఠశాలలకు నేటికి టీచర్ల గైర్హాజరు కొనసాగుతోంది. కొం దరు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో విద్యాశాఖ అధికారులపై ఓత్తిడి తీసుకరాగా మరికొందరు ఏలాంటి సమాచారం లేకుండా గైర్హాజరవుతున్నారు.
ఉత్తమ ఫలితాలు సాధిస్తాం....
ఈ ఏడాది పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అందుకోసం సిద్ధం చేస్తున్నాం. టీచర్లను కూడా అప్రమత్తం చేశాం. మె రుగైన ఫలితాలు తీసుకు రావడం మా లక్ష్యం. అందుకు తగ్గట్లుగానే ప్రయత్నాలు చేస్తున్నాం.
- శ్రీనివాసాచారి, డీఈఓ