Srinivasa Rao ganta
-
మీ ఉద్యోగాలు పోతాయ్
-
మీ ఉద్యోగాలు పోతాయ్
మంత్రులు గంటా, అయ్యన్నలకు సీఎం హెచ్చరిక విశాఖలో టీడీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం విశాఖపట్నం: ‘‘చెప్పుడు మాటలు నమ్మితే మీ ఉద్యోగాలు పోతాయ్.. ఒక్కరికే పదవి ఇచ్చేవాడ్ని. కానీ ఇద్దరూ సమర్థులనే ఇచ్చాను. కలసికట్టుగా ఉండాలి’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందలాదిమంది కార్యకర్తల సమక్షంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడులను హెచ్చరించారు. టీడీపీ అధికారం చేపట్టాక కార్యకర్తల తొలి విస్తృత స్థాయి సమావేశం విశాఖలో బుధవారం జరిగింది. జిల్లాకు చెందిన మంత్రులిద్దరూ ఎడమొఖం, పెడమొఖంగా ఉండటంతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని పార్టీ నగరశాఖ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ సభాముఖంగా తన దృష్టికి తీసుకురావడంతో చంద్రబాబు స్పందించారు. కొందరు కార్యకర్తలు లేనిపోనివి చెబుతున్నప్పుడు వాటిని నమ్మరాదని, ఇద్దరు మంత్రులూ కలిసే ఏ కార్యక్రమానికైనా వెళ్లాలని ఆయన సూచించారు. ఒకరి నియోజకవర్గంలో ఇంకొకరు తలదూర్చవద్దని సూచించారు. తెలంగాణలో మిగులు బడ్జెట్ రావడానికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే కారణమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. పద్ధతి లేకుండా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌పై కసితో ప్రజలు టీడీపీకి పట్టం గట్టారని, వారు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని కార్యకర్తలకు, నాయకులకు ఆయన సూచించారు. రాష్ర్టంలో రూ.15,500 కోట్ల రెవెన్యూ లోటు ఉందని, ఐదేళ్లలో ఇది మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటును పూడ్చినట్టు చెప్పారు. మే నెలలో మహానాడు నిర్వహించి తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించనివాళ్లు నామినేటెడ్ పదవులకోసం పాకులాడటం మంచిది కాదన్నారు. బాబుకు తమ్ముళ్ల షాక్ సమావేశంలో పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ.. రుణమాఫీ, పింఛన్ల విషయంలో జనానికి సమాధానం చెప్పలేకపోతున్నామంటూ నిర్మొహమాటంగా చెప్పడంతో చంద్రబాబు షాక్‌కు గురయ్యారు. రుణమాఫీ చాలామందికి కాలేదని, పింఛన్లు రావడం లేదని తమను నిలదీస్తున్నారని వారు చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. రుణమాఫీ అందరికీ చేశామని, ఎవరైనా ఎక్కువ రుణం తీసుకున్నవారు 4 శాతం మంది ఉంటే వారికి మాఫీ కాకపోవచ్చని, అలాంటి వారిలోనూ అర్హులుంటే తప్పకుండా మాఫీ చేస్తామని చెప్పారు. -
గంటాపై గవిరెడ్డి నిప్పులు
ఆడారితో కలిసి మంత్రి పోకడలపై ఆగ్రహం సీఎంకు ఫిర్యాదు చేస్తానని ప్రకటన జిల్లా టీడీపీలో మరో వివాదం మంత్రుల ఆధిపత్య పోరుతో ఇప్పటికే అట్టుడుకుతున్న జిల్లా అధికార పార్టీలో మరో వివాదం రాజుకుంది. దీనికి స్వయానా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు కేంద్ర బిందువు కావడం విశేషం. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ సీనియర్ నాయకుడు, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావే తన ఓటమి కారకుడంటూ కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఇప్పుడు ఏకంగా మంత్రి గంటా శ్రీనివాసరావుపైనే ధ్వజమెత్తడం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. చోడవరం/కె.కోటపాడు: విశాఖ డెయిరీ నిధులతో కె.కోటపాడు మండలంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తులసీరావుతో కలిసి మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల హాజరయ్యారు. ఇదే పార్టీలో వివాదానికి మరోసారి కారణమైంది. జిల్లా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు ఎడముఖం పెడముఖంగా ఉన్న విషయం తెలిసిందే. అయ్యన్నకు సన్నిహితుడిగా ఉంటున్న గవిరెడ్డి రామానాయుడు ఏకంగా కె.కోటపాడులో సోమవారం ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటుచేసి మంత్రి గంటా, డెయిరీ చైర్మన్ తులసీరావులపై ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా అధ్యక్షుడినైన తన నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు కనీసం తనతో సంప్రదించాలన్న ఆలోచన మంత్రికి లేకపోవడం విచారకమని వాపోయారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఆడారి తులసీరావు రమ్మంటే వచ్చేయడమేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిపోకడ, తులసీరావు విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని సమావేశంలో ఆవేశంగా పేర్కొన్నారు. రైతుల డబ్బుతో అధికారం అనుభవిస్తూ అన్నీ తానే చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్న డెయిరీ చైర్మన్ తీరుపై ఇప్పటికే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశానన్నారు. ఇలా పార్టీ జిల్లా అధ్యక్షుడి వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అధికార పార్టీలో తీవ్ర చర్చకు తెరతీశాయి. గంటా వర్గీయుల్లో ఆగ్రహావేశాలు రేపాయి. అవిర్భావం నుంచి పార్టీని వెన్నంటి ఉన్న విశాఖడెయిరీ చైర్మన్‌ను, మంత్రి గంటాను బహిరంగంగా గవిరెడ్డి విమర్శించడాన్ని ఆ పార్టీకి చెందిన కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలోని అంతర్గత సమస్యలను ఇలా బహిరంగపరచడం జిల్లా అధ్యక్షుడిగా అతనికి తగదని పలువురు సీనియర్లు పేర్కొంటున్నారు. ఈ వివాదం ఏ స్థాయికి వెళుతుందో చూడాలి. -
శాసనమండలి ప్రశ్నోత్తరాలు
మధ్యాహ్న భోజనంలో గౌరవ వేతనం పెంపు లేదు: గంటా హైదరాబాద్: మధ్యాహ్న భోజన పథకంలో వంట వారికి చెల్లిస్తున్న వెయ్యి రూపాయల గౌరవవేతనం పెంపు ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం శాసనమండలికి తెలిపారు. 2.51 లక్షల మందికి పంటల బీమా: ప్రత్తిపాటి ఏపీలో ఈ ఆర్థిక ఏడాదిలో 2.51 లక్షల మంది రైతులు పంటల బీమా సదుపాయం వినియోగించుకున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న 2.31 లక్షల మంది పంట లను బీమా చేయించుకున్నారని చెప్పారు. అమ్మహస్తం కొనసాగించడం లేదు: మంత్రి సునీత అమ్మ హస్తం పథకం ద్వారా 9 రకాల సరుకులు అందించే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగించడం లేదని మంత్రి పరిటాల సునీత చెప్పారు. శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ఇసుక సీనరేజీ రూ. 5.07 కోట్లు కొత్త ఇసుక విధానం ప్రకటించాక అమ్మకాలపై ఈ నెల 17వరకు రూ.5.07 కోట్లు సీనరేజీ రూపేణా వసూలైనట్లు మంత్రి పీతల సుజాత శాసనమండలికి తెలిపారు. -
చేరికలోనూ.. చెరోవైపు
⇒ ఆధిపత్యం కోసం మంత్రుల అమీతుమీ ⇒ కొణతాల కోసం అయ్యన్న ఆరాటం ⇒ దాడి కోసం గంటా పోరాటం ⇒ టీడీపీలో మండుతున్న విభేదాల కుంపటి విశాఖపట్నం కాదేదీ ఆధిపత్యపోరుకు అనర్హం అన్నరీతిలో టీడీపీలో మంత్రులు అయ్యన్న, గంటాల మధ్య వర్గపోరు భగ్గుమంటోంది. ఇప్పటికే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి చోటామోటా నేతల వరకు ఇరువర్గాలుగా చీలిపోయారు. అంతటితో సరిపోలేదనుకున్నారేమో మంత్రులు ఇద్దరూ ప్రస్తుతం ఏ పార్టీలో లేని నేతలకు కూడా గాలం వేస్తూ తమ వర్గబలాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు. గంటా వర్గం ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు అయ్యన్న కొణతాలకు స్వాగతహస్తం చాస్తుండగా... అయ్యన్నకు పక్కలో బల్లెంలా తయారు చేసేందుకు దాడి పార్టీలో చేరికకు మార్గం సుగమం చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఒకరి ఎత్తును చిత్తు చేసేందుకు మరొకరు తమ అనుచరవర్గంతో వీధి పోరాటాలు చేయిస్తున్నారు. గంటా ఆధిపత్యంపై కొణతాల అస్త్రం.. - అయ్యన్న ఎత్తుగడ పదేళ్ల తరువాత పార్టీ అధికారం చేపట్టినప్పటికీ జీవీఎంసీ పరిధిలో పట్టులేకపోవడం అయ్యన్నకు అసంతృప్తిగా ఉంది. జీవీఎంసీ పరిధిలోని ఎంపీ అవంతితోపాటు ఎక్కువమంది ఎమ్మెల్యేలు గంటా వర్గంగా కొనసాగుతుండటం ఆయనకు కంటగింపుగా మారింది. ప్రధానంగా పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎంపీ అవంతి పూర్తిగా గంటాకు వర్గీయులుగా ఉన్నారు. ఇటీవల ఆర్డీవోల బదిలీ వ్యవహారంతోసహా పలు కీలక విషయాల్లో అయ్యన్నను తీవ్రంగా వ్యతిరేకించి ఢీ అంటే ఢీ అన్నారు. దాంతో కొణతాల రామకృష్ణను పార్టీలోకి తీసుకురావడం ద్వారా జీవీఎంసీ పరిధిలో గంటా ఆధిపత్యానికి గండికొట్టాలని భావించారు. ఈమేరకు కొన్ని రోజులుగా తెరవెనుక మంతనాలు ముమ్మరం చేశారు. కొణతాలను ఒప్పించేందుకు ఆయన ప్రధాన అనుచరుడు గండిబాబ్జీ ద్వారా పావులు కదిపారు. బాబ్జీకి అవసరమైన పనులు చేస్తామని ఎర వేయడం ద్వారా కొణతాలను పార్టీలోకి రప్పించాలన్నది అయ్యన్న వ్యూహంగా ఉంది. అయ్యన్నపై ‘దాడి’ - గంటా ప్రతివ్యూహం మరోవైపు రూరల్ జిల్లాపై అయ్యన్న ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు మంత్రి గంటా చకాచకా పావులు కదుపుతున్నారు. అందుకే కొన్ని రోజులుగా దాడి వీరభద్రరావుతో మంతనాలు సాగిస్తున్నారు. ఎందుకంటే గతంలో టీడీపీలో 25ఏళ్లు అయ్యన్న వ్యతిరేకవర్గానికి నేతృత్వం వహించిన చరిత్ర దాడికి ఉంది. గతంలో ఎన్టీరామారావు మంత్రివర్గంలో ఉన్నప్పటి నుంచి వీరిద్దరూ ఉప్పూనిప్పులా ఉండేవారన్నది బహిరంగ రహస్యమే. అందుకే మరోసారి అయ్యన్న ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ‘దాడి’ని ప్రయోగించాలని గంటా భావిస్తున్నారు. దాడి ఇటీవల పలుసార్లు మంత్రి గంటాతో సమావేశం కావడం టీడీపీలో చర్చనీయాంశమైంది. దాడికి మార్గం సుగమం చేస్తే కొణతాల పార్టీలోకి వచ్చే ఆలోచనను విరమించుకుంటారన్నది గంటా వర్గం వ్యూహంగా ఉంది. సై అంటే సై కొణతాల, దాడి చేరికల అంశంలో తమ పంతం నెగ్గించుకునేందుకు గంటా, అయ్యన్న వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కొణతాల చేరికకు లైన్ క్లియర్ అవుతోందన్న సమాచారం లీక్ కావడంతో గంటా వర్గం తీవ్రంగా స్పందించింది. అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల్లో గంటా వర్గీయులు కొణతాల దిష్టిబొమ్మలను దహనం చేయడం ద్వారా తమ ఆగ్రహావేశాలను వెళ్లగక్కారు. కొణతాలను చేర్చుకోవాలని నిర్ణయిస్తే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని సీఎం చంద్రబాబుకు పరోక్షంగా హెచ్చరించారు. మరోవైపు అయ్యన్న కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి సిద్ధపడుతోంది. దాడి చేరికను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేస్తోంది. అందుకోసం విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, ఈస్టు ఎమ్మెల్యే వెలగపూడిలతోసహా అయ్యన్న హైదరాబాద్‌లోనే అమీతుమీ తేల్చుకుంటామని సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో వర్గపోరు మరోసారి బజారున పడుతోంది. మునుముందు పరిణామలు ఎలా ఉంటాయోనని టీడీపీవర్గాలు చర్చించుకుంటున్నాయి. -
అయ్యన్న ఆగ్రహం
సీఎం కార్యదర్శిపై సీరియస్ గంటా పెత్తనాన్ని సహించేది లేదని స్పష్టీకరణ సొంతింట్లోనూ విద్యామంత్రికి పొగబెట్టే ఎత్తుగడ పతాక స్థాయికి మంత్రుల మధ్య విభేదాలు ‘ఆర్డీవోల బదిలీలు ఆపాలని చెప్పడానికి ఆయనెవరు?... ఆయన చెబితే ఆపాలని ఆదేశించడానికి మీరెవరు?...పూటకో పార్టీ మారేవారా మా ప్రభుత్వంలో నిర్ణయాలను శాసించేది. ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఆ ఆర్డీవోలను జాయిన్ చేసుకోండి. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం చంద్రబాబు ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్రను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆర్డీవోల బదిలీ వ్యవహారంతో జిల్లా మంత్రుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇక మంత్రి గంటాతో తాడోపేడో తేల్చుకోవ డానికే అయ్యన్న సంసిద్ధమయ్యారు. విశాఖపట్నం : వ్యూహత్మకంగా జిల్లాలో మంత్రి గంటా శ్రీని వాసరావు ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ వచ్చి న మరో మంత్రి అయ్యన్నపాత్రుడు ఇక నేరుగా ఢీ అంటే ఢీ అనడానికి ఉ ద్యుక్తమయ్యారు. మరోవైపు గంటా కు సొంత నియోజకవర్గంలోనే ఆయనపై తిరుగుబాటుకు ఆజ్యం పోశారు. తా ను ఇతర జిల్లాల మంత్రులు వ్యూ హా త్మకంగా ఆర్డీవోల బదిలీలు చేయి స్తే మంత్రి గంటా అభ్యంతరం తెలపడా న్ని అయ్యన్న సహించలేకపోయారు. మంత్రి గంటా ఒత్తిడితో సీఎం కార్యాలయ అధికారులు కొత్తగా నియమితులైన ఆర్డీవోలను విధుల్లో చేర్చుకోవద్దని కలెక్టర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దాంతో గంటా వర్గం మళ్లీ పెచైయ్యి సాధించిందని అంతా భావించారు. కానీ దీన్ని అయ్యన్న ఏమాత్రం సహించలేకపోయారు. తీవ్రంగా ఆగ్రహించిన ఆయన అదే స్థాయిలో స్పందించారు. కొత్త ఆర్డీవోలను గురువారం విధుల్లో చేర్చుకోకపోవడంపై మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రంగా పరిగణించారు. ఆయన ఏకంగా సీఎం ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్రకు ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదే సమయంలో మంత్రి గంటా వ్యవహార శైలిని కూడా సతీష్ చంద్ర వద్ద కడిగిపారేశారు. ‘ఆర్డీవో బదిలీలను నిలిపివేయమనడానికి ఆయనెవరు?... ఆయన చెబితే ఆపేయడానికి మీరెవరు?... ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చిన తరువాత వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద లేదా?... మీరే నిర్ణయాలు తీసుకుంటారా?.... అలా అయితే మేమెందుకు?... పూటకోపార్టీ మారేవారి మాటలు విని మమ్మల్ని అవమానపరుస్తారా?’అని తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు సమాచారం. ఈ వ్యవహారం కాస్త సీఎం కార్యాల యంలో కలకలం సృష్టించింది. ఆ తరు వా ఏమైందో తెలియదు గానీ అనకాపల్లి ఆర్డీవోగా నియమితులైన బి.పద్మావతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించ డం గమనార్హం. మంత్రి గంటా, పెందు ర్తి ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణ మూర్తి తదితరులు తీవ్రంగా వ్యతిరేకత ను బేఖాతరు చేస్తూ ఉన్నతాధికారులు ఆమె జాయినింగ్‌కు పచ్చజెండా ఊపా రు. కాగా విశాఖపట్నం ఆర్డీవోగా నియమితులైన రామచంద్రారెడ్డి మాత్రం ఇం కా విధుల్లో చేరకపోవడం గమనార్హం. గంటాకు సొంతింట్లోనే పొగ ఓ వైపు జిల్లాలో మంత్రి గంటా మాటకు విలువలేకుండా చేస్తూనే మరోవైపు ఆయనకు సొంతింట్లోనే పొగబెట్టడానికి అయ్యన్న వర్గం పావులు కదుపుతోంది. భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండలం ఇందుకు వేదికగా నిలిచింది. మంత్రి గంటా నియోజకవర్గాన్ని పట్టిం చుకోవడం లేదని ఆ మండలంలోని టీడీపీ నేతలు శుక్రవారం అసమ్మతి జెండా ఎగురవేశారు. మంత్రి తీరుకు నిరసగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారం వెనుక మంత్రి అయ్యన్న వర్గం హస్తం ఉందన్నది బహిరంగ రహస్యమే. ఈ పరిణామాలతో జిల్లాలో మంత్రులు అయ్యన్న, గంటాల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నట్లే! దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.