Srinivasa Yadav
-
టీఆర్ఎస్ విద్యాభివృద్ధికి పాటుపడింది
సాక్షి, కామారెడ్డి టౌన్: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పాటుపడిందని, టీఆర్ఎస్ను మళ్లీ గెలిపించాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీనివాస్‌యాదవ్ అన్నా రు. గురువారం జిల్లా కేంద్రంలో బాబాగౌడ్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన విద్యార్థుల కృతజ్ఞత సభ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా విద్యాభివృద్ధికి పాటు పడింది కేసీఆర్ అన్నారు. నియోజకవర్గానికో గురుకుల విద్యాలయాలు, రెడిడెన్షియల్ పాఠశాలలు, సం క్షేమ హస్ట ళ్లు, ఆదర్శ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పేద విద్యార్థులకు ఉన్నత చదువులకోసం పాటు పడుతున్నారన్నారు. అంతేకాక అంగన్వాడీలు, హస్టల్లలో సన్నబియ్యంతో పౌష్టికాహారం అందుతుందన్నారు. ఆసరా పింఛన్లు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వి జిల్లా కో ఆర్టినేటర్ చందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్, నాయకులు వెంకటేశ్, విజయ్, రాజేశ్, అఖిల్, అంజు, ప్రసాద్, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
టీటీడీ నుంచి గొల్లవారిని తొలగిస్తే సహించేదిలేదు
తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజూ శ్రీవారి మొదటి దర్శనం చేసే గొల్లవారిని సాగనంపేందుకు టీటీడీ బోర్డు ప్రయత్నిస్తే సహించేది లేదని యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలిగేపల్లి శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా గొల్లవారు శ్రీవారి మొదటి దర్శనం చేసుకునే ఆనవాయితీ కొనసాగుతుందని.. పదవీ విరమణ పేరుతో గొల్లలను సాగనంపేందుకు టీటీడీ బోర్డు చర్యలు చేపడుతుందన్నారు. యాదవులకు అన్యాయం చేస్తే ఊరుకోమన్నారు. ఇప్పటికైనా టీడీడీ బోర్డు అధికారులు అర్చకుల మాదిరిగానే యాదవులను కొనసాగించాలన్నారు. లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. -
'చంద్రబాబు తప్పు మీద తప్పులు చేస్తున్నాడు'
ఖమ్మం(పాల్వంచ): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు మీద తప్పులు చేస్తున్నాడని సినిమా ఆటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విమర్శించారు. ఖమ్మం జిల్లా పాల్వంచలోని స్థానిక కాంట్రాక్టు కాలనీలో 1104 యూనియన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎస్. జంగయ్య నివాసానికి మంత్రి ఆదివారం సాయంత్రం వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ మరిన్ని తప్పుడు పనులు చేస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు నిర్లక్ష్యం, ప్రచార ఆర్భాటం కారణంగా రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలకు వెళ్లిన భక్తులు ప్రాణాలు విడవాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలో గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కిన్నెరసానిని అభివృద్ధి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ప్రియుడు సహా టీడీపీ నేత భార్య ఆత్మహత్య
► విషం తాగి 12 ఏళ్ల కుమారుడూ మృతి ►కన్యాకుమారి లాడ్జీలో ముగ్గురి మృతదేహాలు సాక్షి ప్రతినిధి,చెన్నై: వివాహేతర సంబంధం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త ఆకస్మిక మృతి, ఉరివేసుకుని భార్య, విష ప్రభావంతో కుమారుడు ప్రాణాలు విడిచారు. వీరితోపాటు మరో వ్యక్తి ఉరివేసుకుని తమిళనాడు, కన్యాకుమారిలోని ఒక లాడ్జీలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతులంతా విజయవాడకు చెందిన వారు కాగా, మృతుల్లో ఇద్దరు మాచవరం తెలుగుదేశం పార్టీ నగర కార్యదర్శి దివంగత శ్రీనివాస యాదవ్ భార్య కల్యాణి, కుమారుడు ఉజ్వల్ కృష్ణ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. కన్యాకుమారి వివేకానందపురం కూడలిలోని ఒక లాడ్జీకి ఈనెల 4వ తేదీన వచ్చిన వ్యక్తి తన పేరు అనిల్‌కుమార్ చౌదరి అని, కన్యాకుమారిని సందర్శించేందుకు తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ సమీపం మంచాలుదురై నుంచి వచ్చామని పరిచయం చేసుకున్నాడు. తనతో ఉన్నవారిని భార్య, కుమారుడి (12)గా పరిచయం చేశాడు. 5వ తేదీన కన్యాకుమారిలో తిరిగి రాత్రి రూముకు చేరుకున్నారు. మరుసటి రోజు తలుపులు తెరవకపోవడంతో అనుమానించిన లాడ్జీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలుపులు తెరిచి చూడగా పెద్దవాళ్లిద్దరూ ఉరి వేసుకుని వేలాడుతుండగా, 12 ఏళ్ల బాలుడు విషంసేవించి నేలపైన శవాలుగా పడిఉన్నారు. వారికి సమీపంలో దొరికిన ఉత్తరంలో వ్యాపారంలో వచ్చిన నష్టం కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డామని, తమ అం త్యక్రియలు కన్యాకుమారీలోనే జరిపించాల్సిం దిగా పేర్కొన్నారు. అంత్యక్రియల ఖర్చుకు త మ వద్ద నున్న నగలను వాడుకోవాలని, తమ బలవన్మరణాలను బంధువులకు తెలపవద్దని వేడుకున్నారు. పోలీసులు మృతదేహాలను స్వా ధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. అ లాగే వారి ఫొటోలను ఆంధ్రప్రదేశ్ పోలీసులకు పంపి వివరాలు సేకరించాల్సిందిగా కోరారు. మృతురాలు దేశం నేత భార్య మృతుల ఫొటోలు చూసిన ఏపీ పోలీసులు ఇచ్చిన సమాచారంతో కన్యాకుమారి పోలీసులు ఖంగుతిన్నారు. మృతుడు అనిల్‌కుమార్ చౌదరి అసలుపేరు అనిల్‌కుమార్ యాదవ్ (35), అతనితోపాటు వచ్చిన మహిళ పేరు కల్యాణి (35). వీరిది విజయవాడ సమీపంలోని మాచవరం. మారుతీనగర్ కాట్టూరులారీ వీధిలో నివసిస్తున్నారు. కల్యాణి భర్త ఉమ్మిడి శ్రీనివాస యాదవ్. ఈ దంపతులకు ఉజ్వల్ కృష్ణయాదవ్ (12) అనే కుమారుడు ఉన్నాడు. శ్రీనివాస యాదవ్ మాచవరం తెలుగుదేశం పార్టీ నగర కార్యదర్శిగా ఉండేవారు. వడ్డీ వ్యాపారి. గత ఏడాది శ్రీనివాసయాదవ్ అకస్మాత్తుగా చనిపోగా, సహాయకునిగా ఉండిన పడాల కనకారావు అలియాస్ కన్న వ్యాపారాన్ని కొనసాగించాడు. కనకారావుకు, కల్యాణీకి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్న బంధువులు కల్యాణీని హెచ్చరించారు. కల్యాణి కనకారావును కలవడం మానివేసి అదే ప్రాంతానికి చెందిన చిన్ని అనిల్‌కుమార్ యాదవ్‌తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంది. గత నెల 25వ తేదీన కనకారావు సైతం అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనిల్‌కుమార్‌తో కల్యాణి సాగిస్తున్న వివాహేతర సంబంధం కనకారావుకు తెలిసిపోవడం వల్ల ఇద్దరూ కలిసి హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. గతనెలలో కల్యాణిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించి పంపివేశారు. అదేనెల 27వ తేదీన మరోసారి విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. అయితే ఈ తరుణంలో కుమారుడు సహా కల్యాణి ఇంటి నుంచి మాయమైంది. మాచవరం పోలీసులు కల్యాణి కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణి, ఆమె ప్రియుడు అనిల్‌కుమార్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్న సమాచారాన్ని కన్యాకుమారి పోలీసులు పంపిన ఫొటోల ద్వారా తెలుసుకున్నారు. కన్యాకుమారి పోలీసులు పంపిన ఫొటోల ఆధారంగా మృతులు కల్యాణి, కుమారుడు కృష్ణ, అనిల్‌కుమార్ యాదవ్‌గా బంధువులు గుర్తించారు. గురువారం కన్యాకుమారి చేరుకున్న బంధువులు ఇచ్చిన సమాచారం వల్ల వివాహేతర సంబంధాల బాగోతం బైటపడింది. ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక అనిల్‌కుమార్ తల్లి, కుమారుడిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడా పోస్టుమార్టం రిపోర్టు వస్తేగానీ తెలియదని పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం పూర్తయిన తరువాతనే మృతదేహాలను అప్పగిస్తామని బంధువులకు చెప్పారు. -
రెండో రణం!
గోపీచంద్ ‘రణం’ చిత్రానికి దర్శకత్వం వహించిన ‘అమ్మ’ రాజశేఖర్, ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘రణం-2’ చేశారు. గోపనబోయిన శ్రీనివాసయాదవ్ నిర్మాత. ‘అమ్మ’ రాజశేఖర్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సినిమాను పూర్తిచేశాం. ఇందులో స్వర్గీయ శ్రీహరిగారి పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది’’ అని చెప్పారు. -
సీఎం అనామకుడు.. అందుకే హైకమాండ్ పక్కన పెట్టింది: శ్రీనివాసయాదవ్
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనామకుడు కాబట్టే అతన్ని కాంగ్రెస్ హైకమాండ్ పక్కనపెట్టింది అని టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన అంశంలో హైకమాండ్ నిర్ణయాన్ని సీఎం కిరణ్ తప్పుపట్టినందున ఆయన ఏపార్టీలో కొనసాగుతున్నారో తెలపాలని తలసాని డిమాండ్ చేశారు. అంతేకాక సీఎం కిరణ్ తాడు, బొంగరం లేనివాడు.. అందుకే అధిష్టానం పట్టించుకోలేదు అని, సీఎంకు ఏమాత్రం సిగ్గు, శరం ఉన్నా తక్షణమే రాజీనామా చేయాలి తలసాని తీవ్రమైన విమర్శలను చేశాడు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని వ్యతిరేకించకపోవడం ఆయన చేతగానితనానికి నిదర్శనమని, విభజనతో తలెత్తే సమస్యలను అసెంబ్లీలో చర్చించాలంటున్న సీఎం.. సభను సమావేశపరిచే అధికారం తనకే ఉందన్న సంగతి మరిచారా అని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడ్డ 10 రోజులకు సీఎం స్పందించడం ఆయన అసమర్థతే అని అన్నారు.