srinivasachari
-
పాఠశాలల్లో ‘తెలంగాణ పటం’
ఆర్మూర్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఎంఈఓ కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ చిత్ర పటాల స్థానంలో తెలంగాణ రాష్ట్ర చిత్రపటాన్ని వేయించాలని డీఈఓ శ్రీనివాసాచారి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 36 ఎంఈఓ కార్యాలయాలతో పాటు 25 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 461 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 265 ప్రాథమికోన్నత పాఠశాలల్లో, 1,573 ప్రాథమిక పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర పటాన్ని వేయించాలని ఎంఈఓలకు ఆదేశాలు అందాయి. -
అనుమతి లేని స్కూళ్లపై కొరడా
నిజామాబాద్ అర్బన్ : ఎట్టకేలకు అనుమతిలేని పాఠశాలలపై విద్యాశాఖ స్పందించింది. జిల్లాలోని 2014-15 విద్యాసంవత్సరానికి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసాచారి బుధవారం ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజులుగా ప్రభుత్వ అనుమతి లేకుండా, ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. కలెక్టరేట్, విద్యాశాఖ కార్యాలయాల ఎదుట ధర్నాలూ నిర్వహించాయి. నిరసనలు హోరెత్తుతున్న సమయంలో స్పందించిన అధికారులు గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 17 అనుమతి లేని పాఠశాలలను సీజ్ చేయాలని డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. అనుమతిలేనివి ఇంకా మరెన్నో.. 17 పాఠశాలలే కాకుండా జిల్లాలో చాలా వరకు పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. కంఠేశ్వర్‌లోని బైపాస్‌రోడ్డు, చంద్రశేఖర్‌కాలనీలో మూడు పాఠశాలలు, వినాయక్‌నగర్‌లో ఐదు పాఠశాలలు, ఖలీల్వాడిలో రెండు పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. 8 పాఠశాలలు ఎలాంటి అనుమతి లేకుండానే ఇతర ప్రాంతాలకు మార్పు చేశాయి. ఇలా జిల్లాలోని 86 వరకు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. వీటిపై కూడా అధికారులు దృష్టిసారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రక్షించేందుకు స్థానిక విద్యాశాఖ అధికారుల ప్రయత్నం! ఇదిలా ఉండగా అనుమతి లేని పాఠశాలలకు స్థానిక విద్యాశాఖ అధికారులే రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్మూర్‌లో పదకొండు పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. వీటిపై అధికారులు దృష్టిసారించలేదు. కొందరు అధికారులు పాఠశాల యాజమాన్యాలతో కుమ్ముక్కై వీటిని తప్పించినట్లు తెలుస్తోంది. జిల్లా శాఖ అధికారులు వీటిపై దృష్టిసారిస్తే మరిన్ని గుర్తింపులేని పాఠశాలలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
జర ‘పది’లం సారూ!
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. వారు ఈ మేరకు రంగంలోకి దిగారు. ఇటీవల జరిగిన అర్ధవార్షిక పరీక్షల జవాబు పత్రాలలో ప్రతి సబ్జెక్టు నుంచి పది పేపర్ల చొప్పున ఎంపిక చేసుకున్నారు. వాటిని ప్రత్యేకంగా వాల్యుయేషన్ చేస్తున్నారు. ఇందుకు ఆయా సబ్జెక్టులలో నిపుణులైన 50 మంది టీచర్లను వినియోగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌లో గల ఎంఎస్ఆర్ పాఠశాలలో వారం రోజుల నుంచి ఈ వాల్యుయేషన్ ప్ర క్రియ కొనసాగుతోంది. ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగా విద్యార్థుల మెరిట్‌ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని పాఠశాలలలో సంబంధిత టీచర్లే జవాబు పత్రాలను దిద్ది అనుకూలంగా మార్కులు వేయడంలాంటి చర్యలను గుర్తిస్తున్నారు. ఇటువంటి వాటికి చెక్‌పెట్టి విద్యార్థుల ప్రతిభను స్వయంగా గుర్తించాలని కలెక్టర్ నిర్ణయించుకున్నారు. ఇతర టీచర్లచే వాల్యుయేషన్ చేయిస్తే సరైన ఫలి తా లు రాబట్టవచ్చునని అభిప్రాయపడుతున్నారు. మరో వారం రోజుల్లో ఈ వాల్యుయేషన్ పూర్తి చేసి మిగిలిన 55 రోజులలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిం చేందుకు వారిని ఎలా సన్నద్ధం చేయాలో ప్రణాళిక రూపొందించనున్నారు. దీం తో మెరుగైన ఫలితాలు రాబట్టే ఆవకాశం ఉంది. వీటి ఆధారంగా వెనకబడిన పా ఠశాల లోపాలు తెలుసుకొని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గత వైభవం కోసం గతంలో పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలో వరుసగా మూడుసార్లు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత జిల్లా 18, 21 స్థానాలకు పడిపోయింది. గతంలో వరుసగా జిల్లా నంబర్ వన్ రావడంతో పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై జిల్లా మంత్రి కూడా స్పందించారు.ప్రతిభతో కూడి న మెరుగైన ఫలితాలు మాత్రమే రావాలని విద్యాశాఖ అధికారులను ఆదేశిం చా రు. జిల్లా కలెక్టర్ సైతం ఫలితాలపై దృష్టి పెట్టడంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాగైనా మంచి ఫలితాలు రాబట్టాలని ప్రధానోపాధ్యాయులకు, ఎంఈఓలకు నిత్యం సూచనలు జారీ చేస్తున్నారు. వాల్యుయేషన్ జరుగుతోంది. - శ్రీనివాసాచారి, జిల్లా విద్యాశాఖ అధికారి అర్ధవార్షిక పరీక్షల జవాబు పత్రాలను ప్రత్యేకంగా వాల్యుయేషన్ చేస్తున్నాం. జిల్లాలో 40 పాఠశాలల నుంచి జవాబు పత్రాలు తెప్పించాం. జిల్లా కలెక్టర్ ఆదేశాను సారంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఫలితాల ఆధారంగా మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తాం.