విద్యార్థి దశ నుంచే శాస్త్రవేత్త ఎదిగేందుకు కృషి చేయాలి
శ్రీ ప్రకాష్ టింకరింగ్ ల్యాబ్ అభినందన సభలో మంత్రి రాజప్ప
పెద్దాపురం : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన 'మై క్లీన్ ఇండియా' కలలకు సాకారం అందించిన ఘనత పెద్దాపురం శ్రీ ప్రకాష్ విద్యా సంస్థకే దక్కిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. నీతి ఆయోగ్ కమిషన్ ఆదేశంతో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నిర్వహించిన ఇన్నోవేషన్ చాలంజెస్‌లో దేశంలోని 12 వేల పాఠశాలలు దరఖాస్తు చేయగా నవాంధ్ర నుంచి 1207 పాఠశాలలు ఆసక్తి కనబరిచాయి. వీటిలో ఏపీలో 8 పాఠశాలలు ఎంపిక కాగా జిల్లాలో రెండు పాఠశాలలు శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాల (పెద్దాపురం), శ్రీప్రకాష్ విద్యానికేతన్ (పాయకరరావుపేట) ఎంపిక కావడం గర్వకారణం. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు అధ్యక్షతన జరిగిన సభకు మంత్రి రాజప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ల్యాబ్‌ల ఎంపికకు కృషి చేసిన విద్యార్థులను, పాఠశాల డైరెక్టర్ విజయ్‌ప్రకాష్‌ను అభినందించారు. పాఠశాల ¿¶భౌతిక శాస్త్ర విభాగాధిపతి పీవీఎస్‌బీ చలపతి పర్యవేక్షణలో విద్యార్థులు అభ్యుదయ ప్రోమా, అపురూప్‌రాజ్ వర్థన్, గ్రీష్మణిలు పాల్గొని పెద్దాపురం పట్టణ పరి«ధిలోని జల కాలుష్య నివారణ, యంత్రశక్తిని విద్యుత్ శక్తిగా మార్చి రెండు వాట్స్ ఎల్ఈడీ బల్బు వెలిగేలా యంత్రాన్ని రూపొందించిన తీరు తెన్నులను వారు మంత్రి సమక్షంలో వివరించారు. ‘మై క్లీన్ ఇండియా'లో భాగంగా జిల్లా నుండి రెండు పాఠశాలలకు స్థాçనం లభించిందని పాఠశాల డైరెక్టర్ విజయ్ ప్రకాష్ అన్నారు. అనంతరం మంత్రి రాజప్ప మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పెద్దాపురానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన విద్యార్థులను, శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలు ఎప్పటికీ మరువరని, అటువంటి స్పూర్తితోనే ప్రతీ విద్యార్థి మేధస్సుతో ముందుకు ఎదగాలన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఏఎంసీ చైర్మన్ ముత్యాల రాజబ్బాయిలు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ల్యాబ్ పెద్దాపురం పట్టణానికి రావడం గర్వకారణమన్నారు. అనంతరం ప్రాజెక్టుకు కీలక పాత్ర పోషించిన నవోదయ రిటైర్డ్ ప్రిన్సిపాల్, శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల ఎడ్యుకేషనల్ కో–ఆర్డినేటర్ ఎఎస్ఎన్ మూర్తిని మంత్రి రాజప్ప సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల డీన్ రాజేశ్వరి, అకడిమిక్ కో–ఆర్డినేటర్ పీఏ రాజు, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, లైజాన్ ఆఫీసర్ ఎం.సతీష్, బొడ్డు బంగారుబాబు, గుమ్మళ్ళ రామకృష్ణ, అడబాల కుమారస్వామి, రోటరీ కార్యదర్శి పాణింగపల్లి చలపతిరావు (నాని), డాక్టర్ పతివాడ రాజేష్‌బాబు, డాక్టర్ పతివాడ శ్రీలక్ష్మి, ఆత్మ చైర్మన్ కలకపల్లి రాంబాబు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.