రేణుక చౌదరి భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ఖమ్మం: కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి భర్త శ్రీధర్ చౌదరి భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాలు.... ప్రెస్ క్లబ్లో డాక్టర్ రాంజీ భార్య కళావతి విలేకరులతో మాట్లాడుతుండగా... రేణుక చౌదరి భర్త శ్రీధర్ చౌదరి ప్రోత్సహంతో రేణుక చౌదరి అనుచరులు నాగెండ్ల దీపక్ చౌదరి, పులిపాటి వెంకయ్య, నున్నా రవి, సిరిపురపు సుదర్శన్, పొరంపల్లి రామారావు, పుల్లయ్య, శేషు రాం నాయక్, సైదులు నాయక్ మరికొంత మంది గిరిజన మహిళ అని చూడకుండా కులం పేరుతో దూషిస్తూ, చంపుతామని బెదిరించారని కళావతి తన ఫిర్యాదులో పేర్కోన్నారు. ఆమె పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.