లాభంలో 2 శాతం సామాజిక కార్యక్రమాలకే
ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి
జైపూర్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలకు ప్రతి ఏటా నికర లాభంలో రెండు శాతానికి పైగా ఖర్చు చేయడమే స్టేట్ బ్యాంక్ గ్రూప్ ఉద్దేశమని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. గతంలో లాభంలో ఒక శాతాన్ని సామాజిక కార్యక్రమాలకు వినియోగించామని చెప్పారు. సీఎస్ఆర్లో భాగంగా స్కూలు బస్సు, అంబులెన్సు, సోలార్ ప్యానెళ్లను అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానెర్ అండ్ జైపూర్ సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. సమాజ సేవకు నికర లాభంలో రెండు శాతానికిపైగా ఈ ఏడాది నుంచే ఖర్చు చేస్తామని తెలిపారు.