state icon
-
పంజాబ్ ‘స్టేట్ ఐకాన్’గా గిల్ నియామకం
త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్రంలో ఓటు శాతం పెంచేందుకు ... ఆ రాష్ట్రానికి చెందిన భారత స్టార్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌ను ‘స్టేట్ ఐకాన్’గా నియమించారు. యువతలో ఎంతో క్రేజ్ ఉన్న గిల్ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తాడని పంజాబ్ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ సిబిన్ తెలిపారు. గత 2019 ఎన్నికల్లో 65.96 శాతం ఓటింగ్ నమోదు కాగా... ఈసారి 70 శాతానికి పైగా పెంచాలనే లక్ష్యంతో ముందుకెళ్తామని సిబిన్ చెప్పారు. -
ఆ రాష్ట్ర ఐకాన్‌గా ఫోక్ సింగర్.. 22 ఏళ్లకే అరుదైన ఘనత..
పాట్నా: బిహార్ రాష్ట్ర ఐకాన్‌గా ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్‌ను(22) నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి సోమవారం వెల్లడించారు. బిహార్ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా మైథిలి ఉండనున్నారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. 22 ఏళ్ల మైథిలి ఠాకూర్ ఇండియన్ క్లాసికల్, ఫోక్ మ్యూజిక్‌లో శిక్షణ పొందారు. 2021లో బిహార్ జానపద సంగీతానికి తనవంతు భాగస్వామ్యం అందించినందుకు సంగీత్ నాటక్ అకాడెమీ ఆమెను 'ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్'తో సన్మానించింది. బిహార్ మధుబనిలో జన్మించిన మైథిలికి ఆమె తండ్రి, తాత చిన్నతనం నుంచే జానపదం, హిందుస్తానీ క్లాసికల్ సంగీతం, హార్మోనియం, తబ్లాలో శిక్షణ ఇచ్చారు. దీంతో ఆమె ఫోక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తర బిహార్ ప్రాంతీయ భాష అయిన మైథిలితో పాటు హిందీ, భోజ్‌పురిలో జానపద పాటలు పాడి పాపులర్ అయ్యారు. తన కూతురుకు ఈ అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందని మైథిలి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. ఓటు హక్కు వినియోగంపై ప్రచారం చేసి ఓటింగ్ శాతం పెంచేందుకు తన కూతురు కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: 'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి' -
పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా ‘రియల్ హీరో’
-
సోనూ సూద్‌కు మరో అరుదైన గౌరవం
చండీగఢ్: రీల్లో ఎవరైనా హీరో అవ్వొచ్చు.. రియల్‌గా హీరో కావాలంటే మాత్రం మంచి మనసు.. స్పందించే హృదయం ఉండాలి. ఈ రెండు నటుడు సోనూ సూద్‌కు ఉన్నాయి. కరోనా కష్టకాలంలో ఎందరికో సాయం చేస్తూ.. రియాల్ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్. ఇప్పటికే ఆయన దాతృత్వానికి ఎన్నో ప్రశంసలు, అవార్డులు లభించాయి. తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు సోనూ సూద్. ఆయనను పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా నియమిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ప్రజల చేత రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్‌ని ప్రస్తుతం పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా నియమించాం’ అంటూ ట్వీట్ చేశారు. సోనూ సూద్ స్వస్థలం పంజాబ్‌లోని మోగా అన్న విషయం తెలిసిందే. కోవిడ్ సంక్షోభ సమయంలో సోనూ సూద్ ఎందరికో సాయం చేశారు. వలస కార్మికులు సొంత ఊరికి చేరుకోవడానికి సాయం చేశారు. వారికి ఆహారం, ఆశ్రయం కల్పించారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. (చదవండి: వైరల్ అవుతున్న సోనూసూద్ వీడియో) ఇంతకుముందు పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సోనూ సూద్ ఆటోబయోగ్రఫీ రాస్తున్నట్లు ప్రకటించింది. మహమ్మారి సమయంలో ఆయన చేసిన సేవలను ఇందులో పంచుకోనున్నారు. మీనా అయ్యర్ సహా రచయితగా వ్యవహరిస్తున్నారు. ‘‘ ‘ఐయామ్ నో మెసయ్య’ (నేను రక్షకుడిని/కాపాడేవాడిని కాదు అని అర్థం)’’ పేరుతో ఈ ఆటోబయోగ్రఫీ ఈ ఏడాది డిసెంబర్లో వెలువడనుంది. ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ.. ‘ప్రజలు నా మీద ప్రేమతో ‘మెసయ్య’ అని పిలుస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే నేను రక్షకుడిని కాదు. నా మనసు ఏం చెప్పిందో అదే నేను చేశాను. మనుషులుగా ఇది మన బాధ్యత. ఒకరి పట్ల ఒకరం కరుణతో ఉండాలి.. సాయం చేసుకోవాలి’ అన్నారు. ఇక మహమ్మారి సమయంలో తాను ఎందరినో కలిశానని.. వారి బాధలు విన్నానని తెలిపారు. ఇది తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చిందని.. జీవితాన్ని చూసే విధానాన్ని మార్చిందని తెలిపారు. ఇది తన ఒక్కడి కథ మాత్రమే కాదు.. ఎందరో వలస కార్మికులది కూడా అన్నారు సోనూ సూద్. -
జయశంకర్ సార్ స్ఫూర్తి ప్రదాత
నివాళ్లుర్పించిన స్పీకర్, మంత్రి, డిప్యూటీ స్పీకర్ సిద్దిపేటలో జయశంకర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ సిద్దిపేట జోన్: తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత, మార్గనిర్దేశకుడు ప్రొఫెసర్ జయశంకర్ అని, ఆయన ఉద్యమ సారధి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచారని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ముస్తాబాద్ చౌరస్తా వద్ద నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ దేశంలో జాతిని ప్రభావితం చేయగల వ్యక్తుల్లో జయశంకర్ రెండవ వారన్నారు. చరిత్రలో జాతిని ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరేనని వారిలో ఒకరు జాతిపిత మహాత్మాగాంధీ కాగా మరొకరు ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. సాధారణ జీవితం గడిపిన జయశంకర్ సార్ నిరాంబడరుడు, గొప్ప మేధావి అని ఆయనతో తనకు సాన్నిహిత్యం ఉండేదన్నారు. గురువుగా, మార్గదర్శకునిగా విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి జయశంకర్ అని స్పీకర్ కొనియాడారు. ఉద్యమంలో నిరాశానిస్పృహలతో ఉన్న సమయంలో ఉద్యమ సారధి కేసీఆర్ ధైర్యం నూరిపోసి ముందుకు నడిపించారన్నారు. రాష్ట్రాన్ని సాధించుకోవడం ఎంత ముఖ్యమో బంగారు తెలంగాణ నిర్మించుకోవడం అంతే ముఖ్యమని భవిష్యత్తు ప్రణాళికను రూపొందించరన్నారు. వరంగల్, సిద్దిపేట , ప్రాంతాలకు చెందిన వారు ఎంతో అదృష్టవంతులని జయశంకర్, కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తులు ఈ గడ్డపై జన్మించారన్నారు. అంతకు ముందు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రస్తుతం జయశంకర్‌సార్ జీవించి ఉంటే ఎంతో సంతోషించేవారన్నారు. దురదృష్టవశాత్తు ఆయన మన మధ్యలో లేడన్నారు. జయశంకర్ కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అదిశగా బంగారు తెలంగాణ నిర్మాణానికి కంకణబద్ధులమై ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామన్నారు. 1330 టీఎంసీల గోదావరి , కృష్టా నది జాలాల్లో నీటి వాటాను వాడుకోని తెలంగాణలో కోటి ఎకరాల మాగాణిని సస్యశ్యామలం చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధికి 45 శాతం నిధులు కూడా బడ్జెట్లో కేటాయించలేదని గడిచిన రెండేళ్లలో వేలాది కోట్లతో రాష్ట్రం అభివృద్ధివైపు పరుగులు తీస్తోందన్నారు. జయశంకర్ సార్ గుర్తుగా సిద్దిపేటలో నిర్మించిన మినీ స్టేడియానికి ఆయన పేరు పెడుతున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమాజానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్పవ్యక్తి జయశంకర్‌సార్ అన్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, నంది అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి, ఉన్నత విద్యామండలి సభ్యులు పాపయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్ పటేల్ కౌన్సిలర్ మచ్చవేణుగోపాల్‌రెడ్డి, సాకి అనంద్, ప్రవీణ్, దీప్తి నాగరాజు లోక లక్ష్మిరాజం. , ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, టీఎన్జీవో నాయకులు శ్రీహరి, అశ్వక్, టీపీటీఎప్ రాష్ట్రనాయకులు తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.