రాష్ట్ర ప్రణాళికకు ఆమోదం అవసరం లేకపోవచ్చు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రణాళిక ఆమోదానికి ఢిల్లీ వెళ్లి ప్రణాళిక సంఘంతో ఆమోదం వేయించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలతోపాటు, ముఖ్యమంత్రి చంద్ర శేఖర్‌రావు భావిస్తున్నారు. కేంద్రంలో ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించడం ఒకటైతే.. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు పూర్తయి, ప్రణాళిక ఎంతో తెలిసిన తరువాతే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రణాళిక సంఘంతో సమావేశమై అందుకు ఆమోదం పొందాల్సి ఉంటుంది. కానీ ఈసారి ఆ అవసరం ఉండదని అధికార వర్గాలు వివరించాయి.
కాగా, రాష్ట్రాలకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రణాళిక సంఘం వివిధ పథకాల కింద ఇచ్చే ఆర్థికసాయాన్ని ఖరారు చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సాయం, ప్రస్తుత రెవెన్యూ మిగులు వివరాలతోపాటు, కేంద్రం ఇదివరకు అనుమతించిన అప్పులు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, వివిధ పథకాల కింద కేంద్రంనుంచి వచ్చే సాయంపై అంచనా వివరాలందించాలని ప్రణాళిక సంఘం కోరింది.