కర్నాటక నుంచి విద్యుత్ కోనుగోలు చేసిన ఏపీ
సాక్షి, హైదరాబాద్: కర్నాటక నుంచి 100 మెగావాట్ల విద్యుత్‌ను ఆంద్రప్రదేశ్ కొనుగోలు చేసింది. జూలై 1 నుంచి ఈ విద్యుత్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఇంధన పొదుపు మిషన్ (ఎస్ఈసీఎం) సీఈవో చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ ఆదాపై త్వరలో ప్రత్యేక సమావేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించే అవకాశం ఉందన్నారు.
ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వశాఖలు పాటించాల్సిన పొదుపు ప్రణాళికను సీఎం నిర్దేషించనున్నారు. అన్ని మునిసిపాలిటీలల్లో విద్యుత్ చర్యల్లో భాగంగా ఎల్ఈడీ లైట్లను అమర్చుకోవాలని రాష్ట్ర సీఎస్, ఎస్ఈసీఎం చైర్పర్సన్ ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారు.