statue foundation
-
గుర్తింపు తెచ్చేలా అంబేడ్కర్ స్మృతివనం
సాక్షి, తాడేపల్లి: విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహం, స్మృతివనం పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. స్మృతివనంతో పాటు విగ్రహం నిర్మాణ పనులపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయన్న అధికారులు.. అన్ని స్లాబ్ వర్కులు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని తెలిపారు. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా వస్తుందని, విగ్రహ విడిభాగాలు ఇప్పిటికే సిద్ధంగా ఉన్నాయని, ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని అధికారులు వివరించారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. విగ్రహం తయారీతో పాటు దాని చుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే పనులను అధికారులు.. సీఎంకు వివరించారు. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు శాశ్వతమైన ప్రాజెక్టు అని, పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలని సీఎం జగన్ అన్నారు. ‘‘విజయవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా నిర్మాణాలు ఉండాలి. స్మృతివనంలో ఏర్పాటవుతున్న కన్వెన్షన్ సెంటర్‌కూడా అత్యంత ప్రధానమైనది. నిర్మాణంలో నాణ్యతతో పాటు, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అధికారులు పనులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి. పనుల పర్యవేక్షణకోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి’’ అని సీఎం జగన్ సూచించారు. చదవండి: సీఎం జగన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు: సజ్జల ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ప్లానింగ్ ఎక్స్ అఫిషియో సెక్రటరీ జి విజయ్ కుమార్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ హర్షవర్ధన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జి సృజన, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కల్లుకు పూర్వ వైభవం తీసుకువస్తాం
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: దేవతలు సురాపాకంగా భావించి సేవించిన కల్లు అమృతంలాంటిదని ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కల్లుకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు తనవంతు కృషిచేస్తానని చెప్పారు. సోమవారం చిక్కడపల్లిలో తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బహుజన విప్లవ వీరుడు సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న నూతన విగ్రహాన్ని శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బానిస బతుకులకు విముక్తి కల్పించేందుకు పాపన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఒక గౌడ కులానికే కాకుండా బడుగు, బలహీన వర్గాల విముక్తి కోసం ఆయన ఎంతగానో కృషిచేశారన్నారు. కొంతమంది కల్లు మంచిది కాదని దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక కల్లుకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నామని, నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో నీరా స్టాల్స్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కన్వీనర్ వెంకన్నగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్‌కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ గౌడ్, రమణ, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎంపీలు నర్సయ్యగౌడ్, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి సత్యనారాయణ, అజన్‌కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, రాజేంద్రప్రసాద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంది: బీజేపీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని జుమ్మెరాత్ బజార్లో రాణి అవంతి విగ్రహ ఏర్పాటుపై బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకోవడంతో పాటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై లాఠీచార్జ్ విధించారు. ఈ సంఘటనపై బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రామచంద్ర రావు అడిషినల్ డీజీపీ జితేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలలో రాణి అవంతి భాయి విగ్రహాలు అనేకం ఉన్నాయని, పోలీసులు కావాలనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై దాడి చేశారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్ఐఎమ్తో దోస్తీ కట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుడా రాష్ట్రంలో బీజేపీని అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యూమెరాత్ బజార్లో 2009 లోనే రాణి అవంతి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, గడిచిన పది సంవత్సరాలలో మూడు సార్లు విగ్రహాన్ని మార్చారని మండిపడ్డారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నందుకు రేపు గోషామహల్ నియోజకవర్గంలో బంద్ నిర్వహిస్తున్నామని, ఎట్టిపరిస్థితుల్లోనూ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని రామచంద్ర రావు స్పష్టం చేశారు. -
'అంబేద్కర్ కు తెలంగాణ రుణపడి ఉంది'
హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌కు తెలంగాణ రాష్ట్రం రుణపడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం గురువారం ఘనంగా నిర్వహించింది. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సీఎం కేసీఆర్ పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ... అంబేద్కర్ రూపొందించిన చట్టం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదని కేసీఆర్ అన్నారు. ఈ ఏడాది నుంచి దళిత విద్యార్థుల కోసం 100 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, 25 బాలికల, 5 బాలుర రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. గిరిజన విద్యార్థుల కోసం 50 రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. దళిత విద్యార్థులకు కేటాయించే ఫారెన్ స్కాలర్ షిప్ రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. అంతకుముందు లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ టవర్స్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనానికి, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి, కేసీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.