Steering Committee
-
ఓటీటీ .. పరిశ్రమ సూపర్ హిట్.. ఆదాయంలో దక్షిణాది సినిమాల జోరు!
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) కంటెంట్ పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ విలువ రూ.10,000 కోట్లుగా ఉంటే, 2030 నాటికి రూ.30,000 కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2024 మార్చి నాటికి రూ.12,000 కోట్లకు చేరుకుంటుందని, ఏటా 20 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఐఎన్10మీడియా సీవోవో, సీఐఐ దక్షిణ్ స్టీరింగ్ కమిటీ సభ్యుడైన అనూప్ చంద్రశేఖరన్ తెలిపారు. ఓటీటీ పరిశ్రమపై చెన్నైలో దక్షిణాది మీడియా, ఎంటర్టైన్మెంట్ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సీఐఐ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలవుతున్న వాటితో పోలిస్తే.. వచ్చే 12 నెలల్లో దక్షిణాది భాషల్లో పెద్ద సంఖ్యలో వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి’’అని స్టార్/డిస్నీ ఇండియా బిజినెస్ హెడ్ కృష్ణన్ కుట్టి తెలిపారు. దక్షిణాది సినిమాల జోరు దేశం మొత్తం మీద దక్షిణాది సినిమాలు అత్యధిక ఆదాయాన్ని సృష్టిస్తున్నాయి. 2022లో దక్షిణాది సినిమాలు రూ.7,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. అంతకుముందు ఏడాది ఆదాయంతో పోలిస్తే రెట్టింపు అయింది. అంతేకాదు గతేడాది దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ ఆదాయంలో దక్షిణాది సినిమాల వాటాయే 50 శాతంగా ఉండడం గమనార్హం. ఈ వివరాలను సీఐఐ దక్షిణాది విభాగం రూపొందించిన నివేదికలో పేర్కొంది. ‘తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంతో కూడిన దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆదాయం 2022లో రూ.7,836 కోట్లుగా ఉంది. 2021లో ఆదాయం రూ.3,988 కోట్టే. 2022లో మొత్తం భారత సినీ పరిశ్రమ ఆదాయం రూ.15,000 కోట్లు. దక్షిణాదిలోనూ తమిళ సినిమా రూ.2,950 కోట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రూ.2,500 కోట్లతో తెలుగు సినీ పరిశ్రమ ఉంటే, కన్నడ పరిశ్రమ ఆదాయం రూ.1,570 కోట్లు, మలయాళ పరిశ్రమ ఆదాయం రూ.816 కోట్లు. ముఖ్యంగా కన్నడ నాట కేజీఎఫ్:చాప్టర్ 1, కాంతార సినిమాలు బంపర్ వసూళ్లతో పరిశ్రమ రూపాన్ని మార్చేశాయి’అని నివేదిక తెలిపింది. మలయాళ పరిశ్రమ స్థానికంగా, విదేశాల్లోనూ ఆదాయాన్ని పెంచుకుంది. దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ఒక్కటే రూ. 1,200 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కమల్ హాసన్ విక్రమ్, మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాలు తమిళనాట ఆదాయాన్ని పెంచాయి. 2022 లో దక్షిణాదిన 916 సినిమాలు విడుదలయ్యాయి. థియేటర్, ఓటీటీలో విడుదలైనవీ ఇందులో ఉన్నాయి. కంటెంట్‌కు డిమాండ్ స్క్రిప్ట్‌ను అందించేందుకు తాము ఒక నెల సమయం తీసుకుంటున్నామని అర్హ మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ సహ వ్యవస్థాపకుడు అజిత్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం ఏటా వివిధ ప్లాట్‌ఫామ్‌ల కోసం 60 ఒరిజినల్స్ అవసరం ఉంటోందన్నారు. నిర్మాతలు దీన్ని అవకాశంగా తీసుకోవాలని కోరారు. ‘‘తమిళం, తెలుగు ఓటీటీపైనే జీ ఓటీటీ ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించింది. ప్రస్తుతం కన్నడ ఓటీటీ మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. మలయాళం ఓటీటీ పరిశ్రమకు కావాల్సిన కంటెంట్‌ను ప్రస్తుతం నిర్మాతలు అందించే స్థితిలో ఉన్నారు’’అని జీ5 ఓటీటీ చీఫ్ క్లస్టర్ ఆఫీసర్ సిజు ప్రభాకరన్ వివరించారు. -
Congress Party: స్టీరింగ్ ఎటు వైపు తిరిగింది?
ఖర్గే కూడా మొండిచేయే చూపించారా? కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలుగు ప్రజలంటే చిన్నచూపే అన్న విమర్శ దశాబ్దాలుగా ఉన్నదే. కీలకమైన వర్కింగ్ కమిటీలో కూడా అరకొర ప్రాధాన్యతే. కొత్త అధ్యక్షుడు వేసిన స్టీరింగ్ కమిటీలో కూడా తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీడబ్ల్యూసీ ఏర్పాటులో అయినా న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. స్టీరింగ్ ఎటు వైపు తిరిగింది? కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చారు. అన్ని కమిటీలు రద్దయి, కొత్తగా స్టీరింగ్ కమిటీ పేరుతో తాత్కాలిక ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇందులో మాజీ ఎంపీ తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి మినహా తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులెవరికీ అవకాశం దక్కలేదు. కొత్త అధ్యక్షుడికి తన సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అందుక వీలుగానే ఏఐసీసీ, సీడబ్ల్యూసీలు రద్దయ్యాయి. పాత సీడబ్ల్యూసీ నుంచే కొత్తగా స్టీరింగ్ కమిటీ వేశారని, త్వరలోనే అన్ని కమిటీలను తిరిగి ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. గతం నుంచి తెలుగు రాష్ట్రాల పట్ల చిన్నచూపే ఉందన్న విషయం తెలిసిందే. దీనిపై గతంలోనూ అనేక విమర్శలు ఎదుర్కొంది కాంగ్రెస్ హైకమాండ్. తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు ఇచ్చే ప్రాధాన్యత.. ఉన్నత స్థాయి కమిటీల్లో ఎప్పుడూ తెలుగువారికి చోటు ఉండదు. చేయి విదల్చేది కొందరికేనా? తాత్కాలికమే అయినా స్టీరింగ్ కమిటీలో తెలుగు నాయకులకు చోటు లేకపోవడంపై చర్చ సాగుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటూ... రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలకు జాతీయ స్థాయిలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడంలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో పీవీ నరసింహరావు ప్రధానిగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి, మల్లు అనంతరాములు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులుగా తమ సమర్థత చూపించారు. ఆ తర్వాత ప్రధానకార్యదర్శి స్థాయి పదవికి తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరినీ ఎంపిక చేయలేదు. యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్ళ కాలంలో కూడా కేంద్ర కేబినెట్లో ముఖ్య పదవులేమీ ఇవ్వలేదు. కార్యదర్శి స్థాయి పదవులు మినహా కేంద్ర పార్టీలో ఏనాడూ కీలక పదవులు పొందిన తెలుగు నాయకులు లేరు. ఖర్గే గారు.. కనిపించడం లేదా? తాజాగా కర్నాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికైనందున ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తారా.. ఇవ్వరా అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఖర్గే ఏర్పాటు చేసే కొత్త టీమ్‌లో ప్రధాన కార్యదర్శులు కావాలని తెలంగాణ నుంచి పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్, మల్లు రవి వంటి సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఏపీ నుంచి వర్కింగ్ కమిటీ పదవి కోసం కేవీపీ రామచంద్రరావు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఉన్నారు. అందువల్ల కమిటీల్లో పదవులు భర్తీ చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా తెలంగాణ నేతలు ప్రధాన కార్యదర్శుల పదవుల కోసం ఖర్గేను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
కాంగ్రెస్‌లో ఖర్గే మార్క్.. సీడబ్ల్యూసీ కనుమరుగు!
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు చేపట్టారు సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే. తొలి రోజే తన మార్క్‌ను చూపించేలా నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో అంతర్గత మార్పులకు నాంది పలుకుతూ.. సీడబ్ల్యూసీ స్థానంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ సహా మొత్తం 47 మందితో స్టీరింగ్ కమిటీని నియమించారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) స్థానంలో ఈ స్టీరింగ్ కమిటీ పని చేయనుంది. బుధవారం ఉదయమే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులు రాజీనామా చేశారు. ‘సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీలు, ఇంఛార్జులు తమ రాజీనామాలను కాంగ్రెస్ అధ్యక్షుడికి అందించారు.’ అని తెలిపారు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్. ప్లీనరీ సెషన్ నిర్వహించే వరకు స్టీరింగ్ కమిటీ కొనసాగనుందని, తదుపరి ఏఐసీసీ(ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) సెషన్లో వర్కింగ్ కమిటీ కొత్త సభ్యులను ఎన్నుకోనున్నారని సమాచారం. ఇదీ చదవండి: కాంగ్రెస్ కొత్త సారథిగా ఖర్గే.. అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సోనియా.. -
Munugode Politics: మునుగోడుపై కమలనాథుల వ్యూహమేంటీ?
సాక్షి, హైదరాబాద్/నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా వివేక్‌ను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. 16 మందితో స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. స్థానికుడైన గంగిడి మనోహర్‌రెడ్డికి కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించారు. చదవండి: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల! సభ్యులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, విజయశాంతి, రవీంద్ర నాయక్, రాపోలు ఆనంద్ భాస్కర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీ నారాయణ, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ నేషనల్ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి, దాసోజు శ్రవణ్‌ను నియమించారు. దుబ్బాక, హుజురాబాద్ తరహాలో ఉప ఎన్నిక ఇంచార్జీ అని కాకుండా స్టీరింగ్ కమిటీ అని ప్రకటించడం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్ కోసం నేతలు పోటీ పడ్డారు. కానీ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మాత్రం వివేక్ పేరు ప్రతిపాదించారు. ఇతర నేతలను నారాజ్ చేయకుండా స్టీరింగ్ కమిటీ పేరుతో 16 మంది టీం ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా ఇంచార్జ్‌లను ప్రకటించనున్నారు. వచ్చే వారంలో ప్రతి గ్రామానికి ఇంచార్జ్‌ని నియమించి బూత్ స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ చేయడానికి బీజేపీ పటిష్ట కార్యాచరణ రూపొందిస్తోంది. -
ప్లీజ్ తప్పుకుంటున్నాను.. సోనియాకు షాకిచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత!
దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని వరుస షాక్‌లు తగులుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ(69).. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ట్విస్ట్ ఇచ్చారు. తాను.. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆనంద్ శర్మ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసినట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నా ఆత్మగౌరవంతోనే తాను బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. దీంతో, సోనియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. Anand Sharma Quits Himachal Congress Post Days After Kashmir Party Revolt https://t.co/Quv6xQMTWy NDTV's Sunil Prabhu reports pic.twitter.com/cOoSGKP6VD — NDTV (@ndtv) August 21, 2022 ఇదిలా ఉండగా.. ఇటీవలే కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గట్టి షాకిచ్చారు. ఆయనను జమ్మూకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోగా.. ఆ బాధ్యత స్వీకరించేందుకు నిరాకరించారు. అలాగే.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు. అయితే, కొన్నేళ్లుగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్ నేతల జీ23 గ్రూప్‌లో ఆజాద్ ప్రముఖుడు. ఇటీవలే రాజ్యసభ పదవీకాలం ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా చదవండి: బీజేపీ సంచలన నిర్ణయం.. ఉమాభారతి సన్నిహితుడికి షాక్! -
విద్యుత్తు సామర్థ్యం పెంపునకు కమిటీలు ఏర్పాటు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరులే కాకుండా అదనంగా బయోమాస్, హరిత విద్యుత్‌లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కేసింగ్ పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లకు కేంద్రమంత్రి ఆర్కే సింగ్ బుధవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ తరహా కమిటీలు ఏర్పాటు చేశాయని లేఖలో ఆయన గుర్తు చేశారు. 2005తో పోలిస్తే 2030 నాటికి 45 శాతం ఉద్గార తీవ్రత తగ్గింపు విజయవంతంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకమని కేంద్ర మంత్రి తెలిపారు. స్టీరింగ్ కమిటీల్లో విద్యుత్తు, పునరుత్పాదక ఇంధనం, రవాణా, పరిశ్రమలు, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ప్రజా పనుల శాఖలు, వాటి ప్రధాన కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారని మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. -
సంతకాలు పెట్టి.. బయటకు వెళ్లాక మాట మారుస్తారా?
సాక్షి, అమరావతి: చర్చల్లో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాలు అన్ని అంశాలు అంగీకరించాక బయటకు వెళ్లి వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. పీఆర్సీ సాధన సమితితో కలిసి ఉమ్మడి మీడియా సమావేశం ముగిసిన తర్వాత కొందరు ఉపాధ్యాయ సంఘాలు చర్చలను తప్పుపట్టడంపై ఆయన స్పందించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రతి అంశంపైనా మాట్లాడారు. ఉపాధ్యాయుల గురించి వారు అడగడంవల్లే గ్రామాల్లో హెచ్ఆర్ఏను 9 శాతం నుంచి 10 శాతానికి పెంచి రూ.10 వేల సీలింగ్‌ను రూ.11 వేలకు పెంచామని తెలిపారు. ఫిట్మెంట్ ఇంకా పెంచాలని అడిగినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి వారందరినీ ఒప్పించామన్నారు. ఆ సమయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులుగా ఉన్న స్టీరింగ్ కమిటీ సభ్యులు కూడా అంగీకారం తెలిపారు. ఫిట్‌మెంట్‌పై అప్పుడే అభ్యంతరం చెప్పి ఉంటే దానిపైనా చర్చించే వారమని సజ్జల తెలిపారు. చివరి నిమిషం వరకు చర్చల్లో ఉండి అన్నింటికీ ఒప్పుకుని మినిట్స్‌లో సంతకాలు కూడా పెట్టి సమ్మె విరమిస్తామని చెప్పారని తెలిపారు. అంతా అయిపోయాక సంతకాలు పెట్టి బయటకు వెళ్లిన కొందరు ఉపాధ్యాయ సంఘ నేతలు చర్చలకు వ్యతిరేకంగా మాట్లాడడం మంచి సంప్రదాయం కాదన్నారు. బయటకు వెళ్లి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని బట్టి ఏవో రాజకీయ శక్తులు వారిని బయట నుంచి నడిపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. -
జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధికి చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధి కోసం ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ నేతృత్వంలో జాతీయ స్టీరింగ్ కమిటీని కేంద్ర విద్యాశాఖ మంగళవారం ఏర్పాటు చేసింది. ఆయన గతంలో జాతీయ విద్యా విధానం–2020 డ్రాఫ్టింగ్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. కాగా మూడేళ్ళ కాలపరిమితితో నిర్ణయించిన ఈ నూతన కమిటీ జాతీయ విద్యావిధానం 2020 దృక్పథాల ప్రకారం నాలుగు జాతీయ పాఠ్యాంశాల ముసాయిదాలను అభివృద్ధి చేస్తుంది. పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా, ప్రారంభ బాల్య సంరక్షణ, విద్య కోసం జాతీయ పాఠ్యాంశాలు, ఉపాధ్యాయ విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక, వయోజన విద్య కోసం జాతీయ పాఠ్యాంశాల ముసాయిదాలను ఈ కమిటీలోని మొత్తం 12మంది సభ్యులు సిద్ధం చేయనున్నారు. ప్రతిపాదనలు.. సలహాలు.. ఎన్ఈపీ–2020 అన్ని సిఫార్సులను పాఠశాల విద్య, ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ), టీచర్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్‌కు సం బంధించిన పాఠ్యాంశాల సంస్కరణలను ఈ కమి టీ ప్రతిపాదిస్తుంది. జాతీయ పాఠ్యాంశాల ముసా యిదా కోసం టెక్ ప్లాట్‌ఫారమ్‌లో అందుకున్న రాష్ట్ర పాఠ్యాంశాల ముసాయిదా నుంచి కమిటీ ఇన్పుట్లను తీసుకుంటుంది. అంతేగాక జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా తయారీలో వాటాదారులైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందుకున్న సలహాలతో పాటు ఎన్సీఈఆరీ్టకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ, జనరల్ బాడీ, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ సమా వేశాల్లో సూచనలను చేర్చిన తర్వాత కమిటీ జాతీ య పాఠ్యాంశాల ఫ్రేమ్‌వర్క్‌లను ఖరారు చేస్తుంది. పలువురు సభ్యులు.. జాతీయ స్టీరింగ్ కమిటీకి భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త కె.కస్తూరిరంగన్ నేతృత్వం వహిస్తుండగా, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుత ఛాన్సలర్ మహేష్ చంద్ర పంత్, నేషనల్ బుక్ ట్రస్ట్ ఛైర్మన్ గోవింద్ ప్రసాద్ శర్మ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ నజ్మా అక్తర్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి వైస్–ఛాన్సలర్ టి వి కత్తిమణి, పద్మశ్రీ మిచెల్ డానినో, జమ్మూ ఐఐఎం చైర్పర్సన్ మిలింద్ కాంబ్లే, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జగ్బీర్ సింగ్, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ గణిత శాస్త్రవేత్త మంజుల్ భార్గవ, ఎన్ఈపీ–2020 డ్రాఫ్ట్ కమిటీ సభ్యుడు ఎంకె శ్రీధర్, మాజీ ఐఏఎస్ అధికారి ధీర్ జింగ్రాన్, ఏక్ స్టెప్ ఫౌండేషన్ సీఈఓ శంకర్ మరువాడలు సభ్యులుగా వ్యవహరించనున్నారు. -
సీడబ్ల్యూసీని రద్దు చేసిన రాహుల్
న్యూఢిల్లీ: సోనియా హయాంలో ఏర్పాటైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ రద్దు చేశారు. దాని స్థానంలో 34 మంది సభ్యులుండే తాత్కాలిక స్టీరింగ్ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ త్వరలో నిర్వహించే పార్టీ ప్లీనరీకి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. సీడబ్ల్యూసీ సభ్యులందరూ స్టీరింగ్ కమిటీలోనూ ఉన్నారు. శాశ్వత ఆహ్వానితులుగా ఉన్న అమరిందర్ సింగ్, విలాస్ ముత్తెంవార్, ఆర్కే ధావన్, శివాజీరావ్ దేశ్‌ముఖ్,, ఎంవీ రాజశేఖరన్, మొహ్సినా కిద్వాయితోపాటు ప్రత్యేక ఆహ్వానితులను కమిటీ నుంచి మినహాయించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో కూడిన స్టీరింగ్ కమిటీ శనివారం సమావేశమై ప్లీనరీ షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ నియామకాన్ని ప్లీనరీ లాంఛనంగా ఆమోదించటంతో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లవుతుంది. ప్లీనరీ మార్చి 16 లేదా 17 తేదీల్లో ఉంటుందని భావిస్తున్నారు. ప్లీనరీ ముగిశాక తిరిగి కొత్త సీడబ్ల్యూసీ ఏర్పాటవుతుంది. దీనిని ప్లీనరీలో కానీ, ఆ తర్వాత కానీ ఎన్నుకుంటారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం సీడబ్ల్యూసీలోని 25 మంది సభ్యుల్లో ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ కాకుండా 12 మందిని ఎన్నుకుంటారు. -
స్టీరింగ్ కమిటీకి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సభ్యత్వ నమోదు విజయవంతం చేసేందుకు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో జిల్లా బాధ్యతలు అప్పజెప్పారు. ఈ మేరకు టీఆర్ఎస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఒక ప్రకటనలో వీరి వివరాలు తెలియజేశారు. బొంతు రామ్మోహన్‌కు హైదరాబాద్ ఆఫీసు సమన్వయ బాధ్యతలు అప్పజెప్పారు. జీహెచ్ఎంసీ (హైదరాబాద్) - పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆదిలాబాద్ - సయ్యద్ అక్బర్, నిజామాబాద్ - రూప్సింగ్, కరీంనగర్ - కె.రాజయ్య యాదవ్, మెదక్ - మందుల సామేలు, మహబూబ్‌నగర్ - జెల్లా మార్కండేయులు, నల్లగొండ - రావుల శ్రావణ్ కుమార్‌రెడ్డి, వరంగల్ - గ్యాదరి బాలమల్లు, ఖమ్మం - సత్యవతి రాథోడ్, రంగారెడ్డి రూరల్ - పురాణం సతీష్ -
ఇక.. సంస్థాగత బాట
ఈనెల 20వరకు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు నియోజకవర్గానికి 30వేల సభ్యత్వం లక్ష్యం పార్టీ కమిటీలన్నీ రద్దు.. ఏప్రిల్‌లో కొత్త జిల్లా కమిటీ వార్డు స్థాయి నుంచి అన్ని కమిటీలూ కొత్తవే సభ్యత్వ నమోదు రాష్ట్ర బాధ్యతలు రాజేశ్వరరెడ్డికి జిల్లా నుంచి జెల్లా, సామేలుకు చోటు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్లో సంస్థాగత నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసుకునే దిశలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను అమలుపర్చేందుకు జిల్లా నాయకత్వం సంసిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదును వెంటనే ప్రారంభించి, జిల్లా వ్యాప్తంగా 3.60లక్షల మంది పార్టీ సభ్యులను చేర్చుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు పార్టీ నేతలు. అయితే, పార్టీ సభ్యత్వ నమోదు రాష్ట్ర బాధ్యతలను జిల్లాకు చెందిన నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డికి అప్పగించారు. సభ్యత్వ నమోదు స్టీరింగ్ కమిటీ కన్వీనర్‌గా ఆయనను నియమించారు. ఆయనతోపాటు మొత్తం 11 మంది సభ్యులున్న ఈ కమిటీలో జిల్లా నుంచి జెల్లా మార్కండేయులు, మందుల సామేలుకు స్థానం దక్కింది. 25వేలు సాధారణ, 5వేలు క్రియాశీలక.. పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో యుద్ధప్రాతిపదికన సభ్యత్వ నమోదు చేస్తామని జిల్లా నాయకులంటున్నారు. నియోజకవర్గానికి 25వేల మంది సాధారణ సభ్యులను, 5వేల మంది క్రియాశీల సభ్యులను చేర్పించాల్సి ఉంది. అంటే జిల్లా వ్యాప్తంగా మొత్తం 3.6లక్షల మందిని టీఆర్ఎస్ సభ్యులుగా చేర్చనున్నారన్నమాట. అదే విధంగా ప్రస్తుతం ఉన్న పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేస్తూ రాష్ట్రస్థాయి సమావేశంలో తీర్మానం చేయడంతో ఇప్పుడున్న కమిటీలన్నీ రద్దయినట్టే. వార్డు స్థాయి నుంచి జిల్లా కమిటీ వరకు కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. మార్చి1 నుంచి 10వ తేదీ వరకు వార్డు, గ్రామ స్థాయి కమిటీలు, ఆ తర్వాత 20వరకు మండల, మున్సిపల్ కమిటీలను నియమించనున్నారు. ఏప్రిల్‌లో జిల్లాకు కూడా కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర సమావేశంలో నిర్ణయించారు. ఇంకా తేదీ ప్రకటించలేదు. అన్ని స్థాయిల్లో పార్టీని బలోపేతం చేసేలా ఈ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటామని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, జిల్లాలో ఎమ్మెల్యేలు లేని చోట్ల పార్టీని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు లేని చోట్ల బహునాయకత్వం సమస్య పార్టీకి ఉంది. కోదాడ, హుజూర్నగర్, దేవరకొండల్లో ఈ విషయంలో కొంత సమస్య ఉందనేది పార్టీ నేతల అభిప్రాయం. దీనికి సంబంధించి అందరూ కలిసి పనిచేయాలని, నియోజకవర్గాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నందున అందరికీ అవకాశం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా అందరికీ తగిన ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నేటి నుంచే సభ్యత్వ నమోదు : పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం నుంచి ప్రారంభిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి చెప్పారు. సమావేశం అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఉపయోగించుకుంటామన్నారు. ఆది నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారిని, కొత్తగా వచ్చి న వారికి కలుపుకుని వెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ శ్రేణులందరూ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో చురుకుగా పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. -
హెల్త్‌కార్డుల స్టీరింగ్ కమిటీలో ప్రభుత్వానికే ఆధిపత్యం!
సాక్షి, హైదరాబాద్: హెల్త్‌కార్డుల పథకం అమలును పర్యవేక్షించడానికి వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేయనున్న స్టీరింగ్ కమిటీలో ప్రభుత్వానికే ఆధిపత్యం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు కమిటీ కూర్పు ప్రతిపాదన రూపొందించి శుక్రవారం ఉద్యోగ సంఘాల ముందు పెట్టింది. ప్రభుత్వ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జీఏడీ కార్యదర్శి ఎస్.కె.సిన్హా శుక్రవారం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. 18 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నామని, అందులో 11 మంది అధికారులు, ఏడుగురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు చోటు కల్పించనున్నామని సిన్హా తెలిపారు. ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 12 శాశ్వత సభ్య సంఘాలు, ఇద్దరు పెన్షనర్ల ప్రతినిధులు, ఇద్దరు గెజిటెడ్ అధికారుల సంఘాల ప్రతినిధులకు చోటు కల్పిస్తామని గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేశాయి. హెల్త్‌కార్డుల పథకం పూర్తిస్థాయిలో అమలు చేయాలని, తర్వాతే స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. ఉద్యోగుల డిమాండ్‌ను పరిశీలిస్తానని సిన్హా హామీ ఇచ్చారు. ఎస్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, డ్రైవర్ల సంఘం, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో భద్రత పెంపు శంషాబాద్, న్యూస్‌లైన్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం అధికారులు బందోబస్తును పటిష్టం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చే ఓ విమానాన్ని పేల్చివేస్తామంటూ విమానాశ్రయానికి ఓ అగంతకుడి నుంచి లేఖ వచ్చినట్లు మొదట్లో ప్రచారం జరిగింది. అయితే ఎయిర్‌పోర్టు అధికార వర్గాలు, పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. దిల్సుఖ్నగర్ పేలుళ్లు జరిగి ఏడాదైన సందర్భంగా ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనే బందోబస్తును పటిష్టం చేసినట్లు సమాచారం. -
స్టీరింగ్ కమిటీయే
సాక్షి, హైదరాబాద్: స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తేనే హెల్త్‌కార్డుల సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశారుు. హెల్త్‌కార్డుల పథకంలో ఉన్న లోపాలు సవరించకుంటే తమకు హెల్త్కార్డులే అక్కర్లేదని ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి. ఇప్పటివరకు 27 సమావేశాలు జరిగినా ఫలితం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. హెల్త్‌కార్డుల పథకంలో ఉన్న లోపాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. ఆర్థిక, జీఏడీ, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు, దాదాపు 25 సంఘాల నేతలు పాల్గొన్నారు. కేవలం సమావేశాలతో కాలం గడిపేయకుండా సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు కోరారుు. స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని భాగస్వామ్య సంఘాలతో పాటు ఇరుప్రాంతాల గెజిటెడ్ అధికారులు, పెన్షనర్ల సంఘాలకూ స్టీరింగ్ కమిటీలో చోటు కల్పించాలని సూచించాయి. కమిటీలో 60 శాతం ఉద్యోగులు, 40 శాతం అధికారులు ఉండే విధంగా కూర్పు ఉండాలన్నాయి. స్టీరింగ్ కమిటీ ఏర్పాటుకు సీఎస్ సూత్రప్రాయంగా అంగీకరించారు. అన్ని విషయాలను ముఖ్యమంత్రికి వివరించిన తర్వాత స్పష్టమైన ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నరసింహారెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, కార్యదర్శి పద్మాచారి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రెండు గంటలకుపైగా ఈ భేటీ కొనసాగింది. ఇదీ చర్చల తీరు.. ఉద్యోగ సంఘాలు: అన్ని రెఫరల్ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ (ఓపీ) సౌకర్యం కల్పించాలి. అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు మందులు ఇవ్వాలి. సీఎస్: ఓపీ సౌకర్యం కల్పించడం వల్ల ప్రైవేటు ఆసుపత్రుల్లో అనవసర పరీక్షలు చేసి భారీగా బిల్లులు సమర్పిస్తారు. అందుకనే కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఓపీ సౌకర్యం కల్పించాం. అత్యవసర పరిస్థితుల్లో ఏ రెఫరల్ ఆసుపత్రిలో అయినా వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంది. 25 దీర్ఘకాలిక వ్యాధులకు మందులు ఇస్తేనే ఏటా రూ.70 కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతకు మించితే భారం ఎక్కువవుతుంది. అన్ని జబ్బులకు మందులు ఇవ్వడం సాధ్యం కాదు. సంఘాలు: 750 రెఫరెల్ ఆసుపత్రుల్లో చికిత్సకు అవకాశం కల్పిస్తామని గతంలో పలు సమావేశాల్లో అధికారులు చెప్పారు. తీరా పథకం అమల్లోకి వచ్చే సమయంలో 457 ఆసుపత్రులే జాబితాలో ఉన్నాయి. అందులో 152 ప్రభుత్వాసుపత్రులే. 347 రకాల చికిత్సలను ప్రభుత్వాసుపత్రుల్లోనే చేయించుకోవాలనే నిబంధన పెట్టారు. కాన్పులు కూడా అక్కడే చేయించుకోవాలనడం అన్యాయం. సీఎస్: రెఫరల్ ఆసుపత్రుల సంఖ్య పెంచడానికి చర్యలు చేపడతాం. 23 ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులు ప్యాకేజీలు నచ్చక ఈ పథకంలో చేరలేదు. వాటితో చర్చిస్తున్నాం. సంఘాలు: ఉద్యోగుల డేటా నమోదుకు ఆరోగ్యశ్రీ, ఆర్థిక శాఖ వేర్వేరుగా పోర్టల్స్ ఏర్పాటు చేశాయి. దేంట్లో నమోదు చేసుకోవాలనే విషయంలో ఉద్యోగుల్లో అయోమయం ఉంది. ఆరోగ్యశ్రీ పోర్టల్‌లో ఎస్ఆర్ స్కాన్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులను ప్రభుత్వం దొంగలుగా చూస్తోంది. సీఎస్: ఏ పోర్టల్‌లో అయినా నమోదు చేసుకోవచ్చు. డేటా బదిలీ చేసుకొనే అవకాశం ఉంది. సంఘాలు: దంపతులు ఇద్దరూ ఉద్యోగులైతే తల్లిదండ్రులతో పాటు అత్తమామలకూ పథకం వర్తిస్తుందని 174 జీవోలో పేర్కొన్నారు. ఆర్థిక శాఖ జారీ చేసిన 331, 334 జీవోల్లో ఒకరి తల్లిదండ్రులకే అవకాశం అని పేర్కొన్నారు. అత్తమామలకూ వర్తింపజేయాలి. సీఎస్: ఇద్దరూ ప్రీమియం చెల్లిస్తే వారికీ వర్తింపజేస్తాం. సంఘాలు: హెల్త్‌కార్డుల పథకం పూర్తిస్థాయిలో అమలయ్యే వరకు మెడికల్ రీయింబర్స్మెంట్నూ కొనసాగించాలి. సీఎస్: రీయింబర్స్మెంట్ కొనసాగుతుంది. సంఘాలు: డిప్యుటేషన్, సస్పెన్షన్‌లో ఉన్న ఉద్యోగుల డేటా నమోదుకు అవకాశం లేదు. ఈ ఏడాది మార్చి తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగుల డేటా నమోదు కూడా సాధ్యం కావడం లేదు. సర్వీసు రిజిస్టర్లో ఉన్న పేరు కంటే ఆధార్ కార్డులో భిన్నంగా ఉంటే డేటా తీసుకోవడం లేదు. పలు జిల్లాల్లో డీడీవో కోడ్స్ పోర్టల్‌లో కనిపించడం లేదు. సీఎస్: అన్ని రకాల సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం.