ఏడు ఏనుగులకు తప్పిన ముప్పు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఏడు ఏనుగులు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాయి. కాలువలో చిక్కుకున్న వాటిని అటవీ శాఖ అధికారులు గంటపాటు శ్రమపడి వాటిని రక్షించారు. బెంగాల్ లోని జల్పాయ్ గురి నగరంలో వర్షాల కారణంగా అక్కడి నదులు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. అందులో ఒక నదికి అనుసంధానంగా ఉన్న కాలువలో ఏనుగులు ఉండటం కొంతమంది జాలర్లు గమనించారు.
నీటి ప్రవాహానికి అవి తడబడుతుండటం చూసి అటవీ శాఖ అధికారులకు చేరవేశారు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది గంటపాటు శ్రమించి ఐదు పెద్ద ఏనుగులను, రెండు గున్న ఏనుగులను రక్షించారు. ఏనుగులు కూడా నిల్చోలేనంత వేగమైన ప్రవాహంతో అక్కడి కాలువలు పొంగుతున్నాయి.