Strict Conditions
-
క్రెడిట్ కార్డు.. కొంచెం కష్టమే!
ముంబై: క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణ మంజూరీల వంటి అన్సెక్యూర్డ్ రుణాలు ఇకపై మరింత కఠినతరం కానున్నాయి. ఈ విషయమై బ్యాంకులకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) నిబంధనలను కఠినతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణ మంజూరీలు ఇటీవలి కాలంలో పెరుగుతుండడం, ఈ నేపథ్యంలో ఆయా రుణ మంజూరీ పట్ల బ్యాంకింగ్ జాగరూకత పాటించడం ఆర్బీఐ తాజా ఆదేశాల లక్ష్యం. హై రిస్క్ వెయిటేజ్ అన్సెక్యూర్డ్ వినియోగ రుణాలపై 25 శాతం పెంచాలన్నది ఈ ఆదేశాల ప్రధానాంశం. అంటే కొన్ని వ్యక్తిగత రుణాల విషయంలో బ్యాంకింగ్ కేటాయింపులు మరింత పెంచాల్సి ఉంటుందన్నమాట. అటువంటి క్రెడిట్ మరింత ఖరీదైనదిగా మారడంతో ఇది బ్యాంకుల రుణ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. తాజా నిర్ణయం వల్ల క్రెడిట్ కార్డ్ రుణాలపై రిస్క్ వెయిటేజ్ బ్యాంకులపై 150 శాతానికి, ఎన్బీఎఫ్సీలపై 125 శాతానికి పెరుగుతుంది. కాగా గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, బంగారం, బంగారు ఆభరణాల ద్వారా పొందే రుణాలపై కొత్త నిబంధనలు వర్తించవని రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. 2023 సెపె్టంబర్ చివరి నాటికి పర్సనల్ లోన్ల విభాగంలో బ్యాంక్ రుణ బకాయిలు రూ. 48,26,833 కోట్లు. ఇది 2022 అదే నెలతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరిగింది. -
లాక్డౌన్.. ఎవరు బెస్ట్?
కరోనా టైంలో చాలా దేశాల్లో లాక్డౌన్ పెట్టారు.. మన దగ్గరా పెట్టారు.. ఇంతకీ ఈ ఉపద్రవం సమయంలో అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేసిందెవరు? దీనిపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఓ భారీ అధ్యయనం నిర్వహించింది. మొత్తం 180 దేశాల్లో లాక్‌డౌన్‌ను పరిశీలించిన అనంతరం 100కు ఇన్ని మార్కులు అని వేసింది.. ఎక్కువ మార్కులు వచ్చిన దేశాలు సమర్థంగా లాక్‌డౌన్‌ను అమలు చేసినట్లు అన్నమాట. అలాగని లాక్డౌన్ అనేసరికి.. ఒక్క కర్ఫ్యూ విధించడం ఒక్కదాన్నే పరిగణనలోకి తీసుకోలేదు. అనేక ఇతర అంశాలను పరిశీలించింది. పాఠశాలలు, ఆఫీసులను మూసేయడం.. బహిరంగ సమావేశాలపై నిషేధం, వృద్ధుల సంరక్షణ, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం, వైద్య రంగంలో పెట్టుబడి, మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చూడటం, ఆర్థికపరమైన ప్యాకేజీలు, ఆదాయం కోల్పోయినవారికి ఆసరాగా నిలవడం, వ్యాక్సిన్లపై ఖర్చు, కాంటాక్ట్ ట్రేసింగ్, లాక్డౌన్ దశలవారీగా ఉపసంహరణ ఇలా అనేక అంశాలను గమనించి.. ఈ ర్యాంకులను విడుదల చేసింది. ఈ అధ్యయనం ప్రకారం.. ప్రపంచంలో అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేసిన దేశం క్యూబా (90.74).. తర్వాతి స్థానాల్లో ఎరిత్రియా(89.81), ఐర్లాండ్(87.96), హొండూరస్(87.96), లెబనాన్(87.04), బ్రిటన్, పెరూ(86.11) ఉన్నాయి. మన విషయానికొస్తే.. భారత్‌కు 68.98 పాయింట్లు రాగా.. చైనాకు 78.24, అమెరికాకు 71.76, ఫ్రాన్స్‌కు 63.89 వచ్చాయి. లాక్డౌన్ మార్కుల స్కేల్‌పై వివిధ దేశాల పరిస్థితి ఎలా ఉందో ఓసారి పరిశీలిస్తే.. -
అక్రమార్కులపై పీడీ పంజా!
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే–అవుట్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. పీడీ అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా అక్రమార్కులకు ముకుతాడు వేయనుంది. అనుమతుల్లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెంచర్లను నియంత్రించడానికి కఠిన చర్యలు తప్పవని భావించిన సర్కారు.. పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా పదేపదే అనధికార లే–అవుట్లు చేస్తున్న డెవలపర్లు/భూ యజమానులపై ఈ చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా ఆలోచన చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ... ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయనుంది. లే–అవుట్లకు అనుమతిలో గ్రామ పంచాయతీలకు ఎలాంటి పాత్ర ఉండదు. పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ (డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్)కి మాత్రమే లే–అవుట్లను మంజూరు చేసే అధికారం ఉంటుంది. అయితే, ఈ నిబంధనలను పట్టించుకోని రియల్టర్లు.. పంచాయతీల పాలకవర్గాలతో కుమ్మక్కైఅడ్డగోలుగా వెంచర్లను అభివృద్ధి చేస్తున్నారు. డీటీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థలు అనుమతులు జారీ చేసే లే–అవుట్లతో పోలిస్తే.. ఇందులో స్థలాల ధరలు చౌకగా ఉండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా ఇబ్బడిముబ్బడిగా అనధికార లే–అవుట్లు వెలుస్తున్నాయి. దాదాపు 3 వేల పైచిలుకే..! రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా అక్రమ లే–అవుట్లు ఉన్నట్లు పంచాయతీరాజ్‌శాఖ లెక్క తేల్చింది. నిబంధనలు ఉల్లంఘించి అనధికార లే–అవుట్లు చేసిన రియల్టర్లపై పీడీ చట్టం మేరకు కేసులు నమోదు చేసే అధికారాన్ని పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వనుంది. ఈ అంశంపై పోలీసుశాఖతో కూడా చర్చించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి ‘సాక్షి’కి తెలిపారు. -
గ్రీస్ కొత్త ప్రతిపాదనలకు యూరో గ్రూప్ ఓకే!
బ్రసెల్స్: ఇప్పటికే దివాలా తీసి ఆర్థికంగా కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న గ్రీస్.. ఈ ఉపద్రవం నుంచి తప్పించుకోవడానికి రుణదాతల కఠిన షరతులకు తలొగ్గింది. కొత్తగా బెయిలవుట్ ప్యాకేజీ కోరుతూ సవివర ప్రతిపాదనలను యూరోజోన్ నేతలకు అందజేసింది. ఇందులో ముఖ్యంగా పెన్షన్ల తగ్గింపు, విలువాధారిత పన్ను(వ్యాట్) పెంపు వంటి కీలక సంస్కరణ చర్యలు ఉన్నాయి. ప్రతిపాదనల సమర్పణకు గురువారం అర్ధరాత్రిని డెడ్‌లైన్‌గా విధించగా.. దీనికి రెండు గంటల ముందు గ్రీస్ వీటిని యూరో గ్రూప్ ప్రెసిడెంట్ జెరోన్ దిసెల్బ్లోయెమ్కు అందించింది. కాగా, గ్రీస్ సంస్కరణ ప్రతిపాదనలకు ప్రాథమికంగా యూరో గ్రూప్ వర్గాలు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, నేడు(శనివారం) యూరోజోన్ ఆర్థిక మంత్రుల సమావేశంలో దీనిపై కూలంకషంగా చర్చించనున్నారు. ఆ తర్వాత ఆది వారం జరిగే కీలకమైన 28 దేశాల యూరోపియన్ యూనియన్(ఈయూ) అధినేతల సదస్సులో బెయిలవుట్ ఇవ్వాలా, వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.