Strict measures
-
పాషాణ ప్రభుత్వం.. దుర్మార్గ రాజ్యం
అక్కచెల్లెళ్ల మానానికి రక్షణ లేదు.. పసిబిడ్డల ప్రాణాలకు విలువలేదు. హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యం. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఓ మూల ఓ అభాగ్యురాలి గావుకేక.. పట్టించుకునేవారులేక ఓ చిట్టితల్లి ఘోష బదిర శంఖారావమై ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. వ్యవస్థల కాళ్లూచేతులు కట్టి వ్యక్తిగత అజెండా అమలుకు వినియోగించుకుంటున్న పాలకుల చేతుల్లో రాష్ట్రంలో మధ్యయుగాలనాటి సంస్కృతి జడలు విప్పుతోంది.హత్యలు, అత్యాచారాలూ పట్టించుకునేంత పెద్ద నేరాలుగా కనిపించని ప్రభుత్వ పెద్దలు రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదుచేయకపోతే సహించేది లేదని పోలీసులకు తేలి్చచెబుతున్నారు. వేధించని అధికారులపై వేటేస్తున్నారు. బాబు మార్కుపాలనపై విశ్లేషకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.సాక్షి, అమరావతి: వరుస హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అట్టుడుకుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు కూడా అనిపించడంలేదు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన నాలుగు నెలల్లోనే రికార్డుస్థాయిలో హత్యలు, అత్యాచారాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వరుస దాడులు, దౌర్జన్యాలతో విధ్వంసకాండ యథేచ్ఛగా సాగుతోంది. టీడీపీ గూండాలు కర్రలు, కత్తులతో గ్రామాలపై పడి బీభత్సం సృష్టిస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 177 మందిని హత్య చేశారు. 500కుపైగా హత్యాయత్నాలకు తెగబడ్డారు.2 వేలకుపైగా దాడులతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. టీడీపీ గూండాల దాడులతో భీతిల్లి దాదాపు 3 వేల కుటుంబాలు గ్రామాలు విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాయి. ఇక రాష్ట్రంలో అత్యాచార పర్వానికి అంతూపొంతూ లేకుండా పోతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఆశించినస్థాయిలో స్పందన లేకపోవడం విభ్రాంతి కలిగిస్తోంది. ఇళ్లల్లో ఉండే చిన్నారులు, పాఠశాలకు వెళ్లే విద్యారి్థనులు, యువతులపై అత్యాచారాలతో రాష్ట్రంలో జరుగుతున్న అరాచక కాండతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 110 మందిపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. వారిలో 11 మందిని అత్యాచారం చేసి హత్య చేశారు. అయినా సరే శాంతిభద్రతల పరిస్థితి తమకేం పట్టనట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలను అరికట్టేందుకు ఆయన పోలీసు శాఖకు స్పష్టమైన మార్గనిర్దేశం కూడా చేయలేదు. పోలీసుల వైఫల్యంపై సమీక్షించలేదు...ఒక్క ఉదంతంలో కూడా బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోలేదు. ⇒ చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ముస్లిం బాలికను అపహరించుకుపోయిన ఉదంతంలో పోలీసు వైఫల్యం స్పష్టమైంది. కేవలం పుంగనూరు వరకే గాలింపు చర్యలు చేపట్టి పోలీసులు మిన్నకుండిపోయారు. నాలుగు రోజుల తరువాత పుంగనూరుకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆ చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. పుంగనూరుకు 5 కిలోమీటర్ల పరిధిలో గాలింపు చర్యలు చేపట్టి ఉంటే ఆ చిన్నారిని రక్షించగలిగేవారు.కానీ పోలీసులకు ఆ ఆలోచనే తట్ట లేదు. అయినా సరే ఆ పోలీసు అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎందుకంటే తమ రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు ఏరికోరి నియమించుకున్న పోలీసు అధికారులు వారు. కాబట్టి ప్రజల ప్రాణాలు రక్షించలేకపోయినా ఫర్వాలేదన్నది ప్రభుత్వ ఉద్దేశం. ⇒ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ⇒ అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ కుటుంబం ఆందోళన చేయడంతో ఎనిమిది రోజుల తర్వాత ఆగస్టు 2న పోలీసులు కేసు నమోదు చేశారు.కానీ కేసు ఉపసంహరించుకోవాలని బాధితురాలి కుటుంబాన్ని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. పోలీసుల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినా సరే వారిపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎందుకంటే అత్యాచారానికి పాల్పడింది టీడీపీ వర్గీయుడు కాబట్టి. ⇒ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె జూన్ 14న మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దాంతో పోలీసులు జూన్ 16న కేసు నమోదు చేశారు. ఈ ఉదంతంలోనూ సంబంధిత పోలీసు అధికారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేదు. ⇒ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్ రూమ్‌లలో రహస్య కెమెరాలతో విద్యార్థినుల వీడియోలు తీసిన ఘటనతో యావత్ రాష్ట్రం హడలెత్తిపోయింది. వందలాది మంది విద్యారి్థనులు అర్ధరాత్రి ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. అంతటి తీవ్రమైన ఉదంతాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేసింది. నిందితులను గుర్తించనే లేదు.అక్రమ కేసులు పెట్టకపోతే కఠిన చర్యలేహత్యలు, అత్యాచారాలు యథేచ్ఛగా జరుగుతున్నా స్పందించని చంద్రబాబు ప్రభుత్వం... సోషల్ మీడియా యాక్టివిస్టులపై మాత్రం అక్రమ కేసులు నమోదు చేయాల్సిందేనని పోలీసులకు స్పష్టం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ మరీ అక్రమ కేసులు నమోదు ప్రక్రియను ప్రభుత్వ పెద్దలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దాంతో పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే 106 అక్రమ కేసులు నమోదు చేశారు. తాము చెప్పినవారిపై అక్రమ కేసులు నమోదు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏకంగా మంత్రిమండలి సమావేశం వేదికగా వ్యాఖ్యానించడం గమనార్హం.టీడీపీ నేతలు చెప్పినట్టుగా అక్రమ కేసులు నమోదు చేయని వైఎస్సార్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం 24 గంటల్లోనే బదిలీ చేయడంతోపాటు ఓ సీఐని సస్పెండ్ చేసింది. టీడీపీ పెద్దలకు వీర విధేయ పోలీసు అధికారి, కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ను హుటాహుటిన కడపకు పంపించి మరీ అక్రమ కేసులు నమోదు బాధ్యతను పర్యవేక్షించమని ఆదేశించింది. తద్వారా శాంతిభద్రతల పరిరక్షణ కంటే అక్రమ కేసుల నమోదే తమ ప్రాధాన్యమని చంద్రబాబు ప్రభుత్వం తన దురీ్నతిని నిర్భీతిగా వెల్లడించింది. -
PM Narendra Modi: వచ్చే ఐదేళ్లు అవినీతిపై యుద్ధమే
సిసాయ్/దర్భంగా: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అవినీతిపరుల ముసుగు తొలగించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే ఐదేళ్లలో అవినీతిపై యుద్ధం సాగిస్తామని, అవినీతి తిమింగలాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం తథ్యమని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు ఇక తప్పించుకోలేరని తేలి్చచెప్పారు. శనివారం జార్ఖండ్‌లోని సిసాయ్, పాలాము, బిహార్‌లోని దర్భంగాలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు అవినీతిపరులకు మద్దతుగా రాంచీలో, ఢిల్లీలో ర్యాలీలు నిర్వహించారని మండిపడ్డారు. జనం సొమ్ము దోచుకున్నవారికి మద్దతుగా మాట్లాడారని, వారి ఆసలు రంగు బయటపడిందని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేసినందుకే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి(హేమంత్ సోరెన్) ఇప్పుడు జైలులో ఊచలు లెక్కిస్తున్నాడని చెప్పారు. అవినీతి భూతాన్ని భూస్థాపితం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఎన్నికల సభల్లో నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. యూపీఏ పాలనలో ఆకలి చావులు ‘‘అభివృద్ధిలో గిరిజన ప్రాంతాలు వెనుకంజలోనే ఉండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం. 2004 నుంచి 2014 దాకా యూపీఏ ప్రభుత్వ పాలనలో ఆహార ధాన్యాలు గోదాముల్లో పందికొక్కుల పాలయ్యాయి. అప్పట్లో ఎంతోమంది గిరిజనుల బిడ్డలు తగిన ఆహారం లేక ఆకలితో మాడిపోయారు. సోనియా గాంధీ–మన్మోహన్సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ రాచరిక పాలనలో గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. మేము అధికారంలోక వచ్చాక పరిస్థితి మారిపోయింది. పేదలకు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వకుండా ప్రపంచంలోని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ఇది మోదీ గ్యారంటీ. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇంటర్నెట్ సౌకర్యం కలి్పంచడాన్ని అప్పటి పాలకులు వ్యతిరేకించారు. కేవలం సంపన్నులకే ఆ సదుపాయం ఉండేది. మేమొచ్చాక మారుమూల ప్రాంతాల్లోనూ అందరికీ ఇంటర్నెట్ అందుతోంది. డేటాను చౌకగా అందుబాటులోకి తీసుకొచ్చాం. నేడు సోషల్ మీడియాలో యువత హీరోలుగా గుర్తింపు పొందుతున్నారు. గోద్రా ఘటనపై బోగస్ నివేదిక 20 ఏళ్ల క్రితం గుజరాత్లో గోద్రా రైలు దహనం ఘటనకు బాధ్యులైన వారిని కాపాడేందుకు ఆర్జేడీ అధ్యక్షుడు(లాలూ ప్రసాద్ యాదవ్) ప్రయతి్నంచారు. కరసేవలకుపైనే నింద మోపారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో ఆయన సహవాసం చేశారు. సోనియా మేడమ్ హయాంలోనే గోద్రా రైలు దహనం జరిగింది. 60 మందికిపైగా కరసేవకులు మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి నియమించిన బెనర్జీ కమిషన్‌పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. బోగస్ నివేదిక సమరి్పంచేలా జాగ్రత్తపడ్డారు. అసలు దోషులను కాపాడుతూ కరసేవకులనే బాధ్యులుగా చిత్రీకరించారు. ఆ నివేదికను న్యాయస్థానం చెత్తబుట్టలో పడేసింది. అసలు దోషులను గుర్తించి శిక్ష విధించింది. కొందరికి మరణశిక్ష పడింది’’ అని ప్రధాని మోదీ వివరించారు. సాధారణ జీవితం గడుపుతున్నా.. ‘‘కాంగ్రెస్ రాజకుమారుడు నోట్లో వెండి చెంచాతో పుట్టాడు. పేదల ఇళ్లను సందర్శిస్తూ కెమెరాలకు పోజులిస్తున్నాడు. నేను సాధారణ జీవితమే గడుపుతున్నా. పేదల కష్టాలు నాకు తెలుసు కాబట్టి వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రారంభించా. దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలన్నదే నా లక్ష్యం. నేను గత 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పదవుల్లో ఉన్నప్పటికీ నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. నాకు సొంత ఇల్లు, సొంత సైకిలు కూడా లేదు. జార్ఖండ్‌లో కాంగ్రెస్, జేఎంఎం నాయకులు అవినీతికి పాల్పడుతూ తరతరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు’’ గిరిజనులపై అకృత్యాలు సహించం ‘‘మావోయిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడానికి మావోయిస్టుల జోలికి వెళ్లలేదు. నిషేధిత తీవ్రవాద సంస్థలు గిరిజన మహిళలపై అత్యాచారాలకు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. గిరిజనుల భూములను లూటీ చేస్తున్నాయి. ఇలాంటి అకృత్యాలు సహించే ప్రసక్తే లేదు’’ -
రేషన్ బియ్యం రీసైక్లింగ్ ఆగేనా?
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న తీరుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే పౌరసరఫరాల సంస్థ తీరు పై సమీక్షించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... పీడీ ఎస్ బియ్యం సరఫరా తీరుతెన్నుల గురించి ప్రత్యేకంగా వా కబు చేశారు. అయితే ప్రతి నెలా పేదలకు పంపిణీ అవుతు న్న 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో ఏకంగా 70 శా తం వరకు బియ్యం పక్కదారి పడుతోందని అధికారులు మంత్రికి వివరించినట్లు తెలిసింది. పీడీఎస్ బియ్యంలో నాణ్యత లోపించడం వల్లే ఇలా జరుగుతోందని తేల్చిన మంత్రి దీనికి ప్రధాన కారణం మిల్లర్లేనని సమావేశంలోనే చెప్పారు. హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొందరు మిల్లర్ల చేతివాటం గురించి పూర్తి అవగాహన ఉండటంతో ఆయన ఈ అంశాన్ని తొలి ప్రాధాన్యతగా తీసుకున్న ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం హుజూర్‌నగర్‌లోని చౌకధరల దుకాణాన్ని తనిఖీ చేసిన ఆయన... రేషన్ బియ్యం దురి్వనియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన పీడీఎస్ రైస్ సరఫరా చేయడంతోపాటు బియ్యం పక్కదారి పట్టడాన్ని నిలువరించడంపై దృష్టి పెట్టారు. మిల్లర్ల కొనుగోళ్ల చక్రం! రాష్ట్రంలోని 90.14 లక్షల ఆహార భద్రతా కార్డులకుగాను 2.83 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. వారికి ప్రతినెలా 6 కిలోల చొప్పున 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 3,580 కోట్లు రాయితీ కింద వెచ్చిస్తోంది. అంటే నెలకు రూ. 298 కోట్లు. మొత్తంగా కిలో బియ్యానికి సగటున రూ. 39 వెచ్చిస్తూ సరఫరా చేస్తున్న ఈ బియ్యాన్ని కార్డుదారులకు ఒక్కో యూనిట్ (ఒక్కొక్కరికి)కి నెలకు 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. అయితే ఈ బియ్యాన్ని కార్డుదారుల్లో కొందరు తిరిగి రేషన్ దుకాణాల్లోనే విక్రయించే విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. కార్డుదారుల నుంచి కిలోకు రూ. 6–9 వరకు చెల్లించి కొందరు రేషన్ దుకాణదారులు కొంటుండగా వారి నుంచి కిలోకు రూ. 10–13 చెల్లించి దళారులు కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు పంపుతున్నట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ వంటి జిల్లాల్లో రేషన్ డీలర్లు బియ్యాన్ని దళారుల ద్వారా ఆయా రాష్ట్రాల్లో కిలో రూ. 20 చొప్పున అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఈ తతంతంలో కొందరు అవినీతి అధికారుల పాత్ర కూడా ఉందని.. డీలర్లు, దళారుల నుంచి మామూళ్లు తీసుకొని బియ్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎస్ అధికారి నియామకంతో... ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్‌ను ప్రభుత్వం నియమించడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. సీఎం రేవంత్‌తోపాటు మంత్రి ఉత్తమ్ కూడా కమిషనర్‌కు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చౌహాన్‌కు గతంలో ఎఫ్‌సీఐలో పనిచేసిన అనుభవం ఉంది. రీసైక్లింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు మంత్రి ఉత్తమ్ హెచ్చరిక హుజూర్‌నగర్‌లోని ఓ రేషన్ దుకాణం తనిఖీ హుజూర్నగర్: రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం కిలో బియ్యానికి రూ. 39 ఖర్చుపెట్టి కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా ఇస్తోందని, ఆ బియ్యాన్ని మిల్లర్లుగానీ, ఇతరులెవరైనా రీసైక్లింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని 33వ నంబరు రేషన్ షాపును తనిఖీ చేశారు. రేషన్ బియ్యం నాణ్యతను పరిశీలించి డీలర్ల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. కొందరు రేషన్ బియ్యాన్ని కోళ్ల దాణాకు, బీర్ల తయారీకి అమ్ముతున్నారని చెప్పారు. కొన్ని జిల్లాల్లో కొందరు రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని పాలిష్ చేయించి తిరిగి వాటినే ప్రభుత్వ (ప్రొక్యూర్మెంట్) సేకరణకు ఇస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని, మాఫియాలా కొనసాగుతోందని మండిపడ్డారు. ఇక నుంచి రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే నష్టాలు... గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాకం వల్లే పౌరసరఫరాల సంస్థ రూ. 56 వేల కోట్ల అప్పుల్లో, రూ. 11 వేల కోట్ల నష్టాల్లో ఉందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. అప్పులపై ఏటా రూ. 3 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం రైస్ మిల్లర్ల దగ్గర రూ. 22 వేల కోట్ల విలువైన ధాన్యం నిల్వలు పెట్టడంపై సమీక్షిస్తున్నామని... మిల్లర్ల దగ్గర ఉన్న ధాన్యం రికవరీకి తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్ తెలిపారు. ధాన్యం సేకరణ పద్ధతులను, రేషన్ వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మంత్రి వెంట ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న తదితరులు ఉన్నారు. -
బ్యాంకులు, కేంద్ర సంస్థలకు రఘురామ ఎగనామం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోసగించి 3 ఎఫ్ఐఆర్లు దాఖలైన కేసులో ఆ కంపెనీల డైరెక్టర్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన పార్టీ ఎంపీల సంతకాలతో కూడిన లేఖలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు పంపారు. తీవ్రమైన ఆర్థిక మోసాలకు పాల్పడిన ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ, అనుబంధ కంపెనీలు, డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని, పారిపోకుండా ప్రయాణాలపై నిషేధ ఉత్తర్వులివ్వాలని కోరారు. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఇండ్ భారత్ కంపెనీపై సీబీఐ మూడు కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఆ కంపెనీలు దురుద్దేశపూరితంగా బ్యాంకులను, ప్రభుత్వ రంగ సంస్థలను మోసగించిన తీరుకు ఈ మూడు ఎఫ్ఐఆర్లు రుజువని లేఖలో వివరించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు సక్రమంగా లేదని, దీనివల్ల ప్రజలకు దర్యాప్తు సంస్థలపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దురుద్దేశాలను ఒప్పుకుంది.. ఇండ్–భారత్ లిమిటెడ్ 660 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును తమిళనాడులోని ట్యూటికొరిన్‌లో అభివృద్ధి చేసే ప్రతిపాదనతో ప్రభుత్వ సంస్థలు నిధులు సమకూర్చేలా ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అగ్రిమెంట్(టీఆర్ఏ) కుదుర్చుకుందని లేఖలో తెలిపారు. ఇండ్–భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, సంబంధిత కంపెనీలు ప్రభుత్వ ఫైనాన్స్ సంస్థల నుంచి పెట్టుబడి రూపంలో తెచ్చిన మొత్తాన్ని చూపి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.569.43 కోట్ల మేర రుణాన్ని తీసుకున్నాయని 2016లో పీఎఫ్సీకి సమాచారం అందిందన్నారు. 2016 మే 4న ఇండ్–భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ తన దురుద్దేశపూరిత చర్యలను అంగీకరించిందని, అప్పుగా తెచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్లను తాకట్టు పెట్టి స్వల్పకాలిక రుణాలు తెచ్చినట్టు ఒప్పుకుందని వివరించారు. ఈ మోసాలపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసిందని, ఎస్బీఐ కూడా ఫిర్యాదు చేసిందని వివరించారు. బ్యాంకు కన్సార్షియాన్ని ఇండ్–భారత్ మోసగించిందని ఫిర్యాదులో పేర్కొందన్నారు. విజయ్ మాల్యా తరహాలో విదేశాలకు పారిపోకుండా డైరెక్టర్లపై ప్రయాణ నిషేధ ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేశారు. మోసగించిన సొమ్మును రికవరీ చేసి డైరెక్టర్లను, కంపెనీలను బాధ్యులను చేయాలన్నారు. కంపెనీల డైరెక్టర్లపై కస్టోడియల్ విచారణ జరపాలని కోరారు. రూ.941.71 కోట్ల ప్రజాధనం స్వాహా.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ సంస, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌ల నుంచి ఇండ్–భారత్ పవర్(మద్రాస్), దాని మాతృసంస్థ ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఆర్కే ఎనర్జీ (రామేశ్వరం) లిమిటెడ్, ఆ సంస్థ డైరెక్టర్లు కె.రఘురామకృష్ణరాజు, మధుసూదన్‌రెడ్డి, వారి గ్రూప్ కంపెనీలు రూ.941.71 కోట్ల మేర ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు లేఖలో తెలిపారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఢిల్లీ పోలీస్ శాఖ పరిధిలోని ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదు చేసినా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఆ కంపెనీల డైరెక్టర్లు ప్రజాధనంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తెచ్చారు. -
మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం
సాక్షి, న్యూఢిల్లీ: మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం నూతన చట్టాన్ని తీసుకురానుంది. ఈ బిల్లుపై ముసాయిదా విడుదల చేసిన కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ భాగస్వాముల నుంచి సూచనలు సలహాలు కోరింది. 2018లో ముసాయిదా బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో ప్రవేశపెట్టలేదు. ఆ సమయంలో లేవనెత్తిన ఆందోళనలకు నూతన ముసాయిదాలో పరిష్కారం చూపారని నిపుణులు చెబుతున్నారు. భాగస్వాముల నుంచి సూచనలు సలహాలు వచ్చిన అనంతరం కేంద్ర మంత్రివర్గానికి ఆపై పార్లమెంటులోనూ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. మానవ అక్రమ రవాణా చేసే వారికి పదేళ్ల వరకూ జైలు శిక్ష పడేలా కేంద్రం ఈ చట్టాన్ని రూపొందించింది. బాధితులకు పునరావాస చర్యలు ఏ విధంగా తీసుకోవాలో కూడా చట్టం స్పష్టత ఇచ్చింది. చట్టం ప్రకారం నిందితులను దర్యాప్తు చేయడానికిప్రత్యేక ఏజెన్సీనికేంద్రం ఏర్పాటు చేయాలని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రతి జిల్లాలోనూ సెషన్స్ కోర్టులను ప్రత్యేక కోర్టుగా పరిగణించాలి. గెజిటెడ్ అధికారి స్థాయి పోలీసు అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలి. చట్టం అమలుకు ప్రభుత్వాలు యాంటీ ట్రాఫికింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలి. దీన్ని బాధితుల పునరావాసానికి వినియోగించాలి. బాధితులు వేరే జిల్లా,రాష్ట్రానికి చెందిన వారైతే మెరుగైన భద్రత కోసం జిల్లా కమిటీ వారిని అవసరమైతే సొంత ప్రాంతానికి పంపొచ్చు. బాధితులు ఇతర దేశానికి చెందిన వారైతే ఆ సమయంలో ఉన్న చట్టాలు అనుసరించి రాష్ట్ర కమిటీ వారిని వారి దేశానికి పంపొచ్చు. చట్టం అమలుకు సంబంధించి చట్టానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ ద్వారా నిబంధనలు పేర్కొనాలి. అనంతరం రాష్ట్రంలోని ఉభయసభల్లోనూ ఆమోదం పొందాలి. డిస్ట్రిక్ట్ యాంటీ ట్రాఫికింగ్ కమిటీ చైర్పర్సన్: జిల్లా కలెక్టర్ సభ్యుడు/సభ్యురాలు: ముగ్గురిలో ఇద్దరు సామాజిక కార్యకర్తలు. వీరిలో మహిళ సభ్యురాలిని జిల్లా న్యాయమూర్తి నియమించాలి. జిల్లా న్యాయ సేవల అథారిటీ నుంచి ఒకరిని జిల్లా న్యాయమూర్తి నామినేట్ చేయాలి. సామాజిక న్యాయ లేదా మహిళ శిశు అభివృద్ధి విభాగం నుంచి జిల్లా అధికారి సభ్య కార్యదర్శిగా ఉంటారు. ప్రతి నెలా కమిటీ సమావేశం కావాలి. స్టేట్ యాంటీ ట్రాఫికింగ్ కమిటీ చైర్పర్సన్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులు: ఎనిమిది మంది. మహిళ, శిశు అభివృద్ధి, హోం, కార్మిక, ఆరోగ్య విభాగాల కార్యదర్శులు డీజీపీ, రాష్ట్ర న్యాయసేవల అథారిటీ కార్యదర్శిలతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించిన ఇద్దరు సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. సెంట్రల్ యాంటీ ట్రాఫికింగ్ అడ్వైజరీ బోర్డు మహిళ, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ బోర్డు ఏర్పాటు చేయాలి. చట్టం అమలును ఈ బోర్డు పర్యవేక్షించాలి. రక్షణ గృహాలు: బాధితులకు తక్షణ సహాయం అందించడానికి ప్రభుత్వం నేరుగా లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా రక్షణ గృహాలు ఏర్పాటు చేయాలి. బాధితులకు నివాసం, ఆహారం, దుస్తులు, కౌన్సిలింగ్, ఆరోగ్య రక్షణ ఈ గృహాల్లో కల్పించాలి. ప్రత్యేక గృహాలు: దీర్ఘకాలంగా బాధితులకు పునరావాసం కల్పించడానికి జిల్లాకి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రత్యేక గృహాలు వీరి కోసం ఏర్పాటు చేయాలి. రక్షణ, ప్రత్యేక గృహాలను చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలి. బాధితులకు ప్రత్యేంగా లైంగిక దాడులకు గురైన మహిళలకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకురావాలి. నేరం.. శిక్ష ► బాధితులకు ఆశ్రయంకల్పించే విషయంలో రక్షణ, ప్రత్యేక గృహాల ఇన్‌ఛార్జి నిబంధనలు ఉల్లంఘిస్తే ఏడాదిపాటు జైలు, రూ.లక్ష తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. ► చట్టం ప్రకారం బాధితులు, సాక్షుల పేర్లు, ఫొటోలు ఏ మాధ్యమం ద్వారానైనా ప్రచురించిన ప్రసారం చేసినా చర్యలు తీసుకుంటారు. బాధ్యులకు ఆరు నెలల వరకూ జైలు లేదా రూ.లక్షల వరకు జరిమానా లేదా రెండింటిని విధిస్తారు. ► అక్రమ రవాణా చేయడానికి మాదకద్రవ్యాలు, మద్యం, సైకోట్రోపిక్ పదార్ధాలను నిందితులు వినియోగించినట్లు రుజువైతే పదేళ్లు వరకూ జైలు, రూ.లక్ష తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. రసాయనాలు, హర్మోన్ల ఇంజక్షన్లు నిందితులు ఉపయోగించినట్లు తేలితే పదేళ్ల వరకూ జైలు, రూ.లక్ష తక్కువకాకుండా జరిమానా విధిస్తారు. ► ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లైతే వారికి మూడు నెలల వరకూ జైలు, రూ.20 వేల వరకూ జరిమానా లేదారెండు విధించొచ్చు. ► నిందితులు బెయిల్ లేదా సొంత పూచీకత్తుపై విడుదల అవుతుంటే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాన్ని అడ్డుకోవచ్చు. ఈ సమయంలో బెయిలు ఇస్తే నిందితుడు ఎలాంటి నేరానికి పాల్పడే అవకాశం లేదని కోర్టు నమ్మితే బెయిలు ఇవ్వొచ్చు. -
బెంచీకి ఒక్కరే...!
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో బెంచీకి ఒక్కరిని, మొత్తంగా తరగతి గదిలో 20 మందిని మాత్రమే కూర్చోబెట్టాలని, ప్రతి ఇద్దరు విద్యార్థుల మధ్య కనీసం ఆరడుగుల భౌతిక దూరం పాటించాల్సిందేనని పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన స్పష్టం చేశారు. ఈ నిబంధనలను రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. వాటిని అమలు చేయని పాఠశాలలపై అంటువ్యాధుల నియంత్రణ చట్టం ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు. కోవిడ్ నిబంధనలు పాటించని పాఠశాలల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించిన నేపథ్యంలో నిబంధనల అమలు విషయంలో పక్కాగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. గురువారం ఆమెను కలిసిన మీడియా అడిగిన పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10 తరగతుల ప్రత్యక్ష బోధన ప్రారంభించామని, 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన బుధవారం నుంచి ప్రారంభించిన నేపథ్యంలో మరో మూడు, నాలుగు రోజుల్లో సీనియర్ అధికారుల నేతృత్వంలోని బృందాలు పాఠశాలల్లో తనిఖీలు చేస్తాయని వెల్లడించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు కూడా పాఠశాలల నిర్వహణను పర్యవేక్షిస్తాయని తెలిపారు. ప్రతి పాఠశాల నిబంధనలను పాటించాల్సిందేనని, తరగతి గదులు సరిపోకపోతే, విద్యార్థులు ఎక్కువగా ఉంటే షిఫ్ట్ విధానంలో నిర్వహించుకోవచ్చని, జిల్లా కమిటీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. బెంచీకి ముగ్గురు, నలుగురు విద్యార్థులను కూర్చోబెడితే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలతో పాటు, అంటువ్యాధుల నియంత్రణ చట్టం ప్రకారం పాఠశాలలపై చర్యలు తప్పవన్నారు. మరోవైపు 9, 10 తరగతులకు బోధించేందుకు టీచర్లను సర్దుబాటు చేశామని, 6, 7, 8 తరగతులకు విద్యార్థుల హాజరును బట్టి విద్యా వలంటీర్లను తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. బుధవారం 9 శాతమే విద్యార్థుల హాజరు ఉందని, గురువారం 14 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని, ఇంకా పెరిగితే ఆలోచన చేస్తామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 17 శాతం.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం 6, 7, 8 తరగతులు విద్యార్థుల హాజరు 17 శాతం ఉందని తెలిపారు. 8,056 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అన్నింటిలో ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం అయిందన్నారు. మొత్తంగా 5,47,479 మంది విద్యార్థులకు గాను 94,244 మంది విద్యార్థులు హాజరయ్యారని వెల్లడించారు. 9,612 ప్రైవేటు పాఠశాలలకు గాను, 8,404 ప్రైవేటు స్కూళ్లు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. వాటిల్లో 6, 7, 8 తరగతుల విద్యార్థులు 7,57,319 మంది విద్యార్థులు ఉండగా, 1,02,831 మంది విద్యార్థులు (14 శాతం మంది) గురువారం ప్రత్యక్ష బోధనకు హాజరైనట్లు వివరించారు. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, గురుకులాలు కలుపుకొని 18,374 స్కూళ్లలోని 14,14,297 మంది విద్యార్థులకు గాను 2,01,020 మంది (14 శాతం) విద్యార్థులు గురువారం ప్రత్యక్ష బోధనకు హాజరైనట్లు వెల్లడించారు. -
సరుకులు అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు
మంత్రి పల్లె రఘునాథరెడ్డి హెచ్చరిక మడకశిర రూరల్ : కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000నోట్ల రద్దుతో వాటిని మార్చుకోవడానికి జనం ఇబ్బందులు పడుతున్న తరుణంలో దుకాణదారులు ఉప్పు«, నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని గోవిందాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం జనచైతన్యయాత్ర జరిగింది. ఈ యాత్రకు ముఖ్యఅతిథిగా మంత్రి, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారడీ మాటలను ప్రజలు నమ్మరన్నారు. మడకశిర ప్రాంతంలోని చెరువులకు వచ్చే ఏడాది నీరునింపడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మండల ఉపా«ధ్యక్షురాలు ధనలక్ష్మీ, ఎంపీపీ అరుణఆదినారాయణ, మండల టీడీపీ కన్వీనర్ రామాంజినేయులు, తదితరులు పాల్గొన్నారు. -
వర్సిటీల్లో ర్యాగింగ్‌పై నిఘా!
సాక్షి, హైదరాబాద్: గుంటూరు ఆచార్య నాగార్జునవర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు ర్యాగింగ్ వేధింపులే కారణాలుగా తేలిన నేపథ్యంలో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యం, ర్యాగింగ్, తరగతులకు గైర్హాజరు, వర్సిటీ కాలేజీల్లోకి అసాంఘిక శక్తుల ప్రవేశం తదితర చర్యల కట్టడికి ఉపక్రమిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ శుక్రవారం జీఓ నెంబర్ 398 విడుదల చేసింది. దీని ప్రకారం అన్ని యూనివర్సిటీ కాలేజీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. విద్యార్థుల హాజరుకు బయోమెట్రిక్ యంత్రాలు తప్పనిసరిచేయాలి. ఈ మేరకు నిర్ణీత శాతం హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్పులను మంజూరు చేయాలి. బయటి వ్యక్తులు వర్సిటీల్లో ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆగస్టు 31వ తేదీనాటికి పూర్తి కావాలని అన్ని యూనివర్సిటీల ఉపకులపతులను ప్రభుత్వం ఆదేశించింది. -
అవినీతి అధికారులపై కఠిన చర్యలు : మంత్రి పోచారం
అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఆయిల్‌ఫెడ్‌కు చెందిన పామాయిల్ ఫ్యాక్టరీలో అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. పామాయిల్ ఫ్యాక్టరీలో బుధవారం రైతులతో నిర్వహించిన సమావేశంలోమంత్రులు పోచారం, తుమ్మల నాగేశ్వరరావు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ... పామాయిల్ రికవరీ 20 శాతానికి తక్కువ కాకుండా వచ్చేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. గతంలో ఫ్యాక్టరీలో అధికారులు చేసిన అవినీతిపై మాట్లాడుతూ... ప్రత్యేక పైపులైన్ ద్వారా పామాయిల్ మళ్లించి రైతులను దోచుకోవడం తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు. తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేస్తే సరిపోదన్నారు. మరెవరూ అలాంటి తప్పు చేయకుండా భయపడే రీతిలో చర్యలు తీసుకోవాలని ఆయిల్‌ఫెడ్ జాయింట్ డెరైక్టర్ అచ్యుతరావుకు మంత్రి పోచారం సూచించారు. పామాయిల్ రైతులకు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారు. -
స్టేషన్లలో సెటిల్మెంట్లు సహించను
►తప్పుడు ఫిర్యాదులు చేస్తే కౌంటర్ కేసులు ►కొత్త ఎస్పీ కొల్లి రఘురామ్‌రెడ్డి హెచ్చరిక ఏలూరు( ఫైర్‌స్టేషన్ సెంటర్) : స్టేషన్లలో సెటిల్మెంట్లు, దళారులతో కుమ్మక్కు వంటి వ్యవహారాలు చేస్తే సంబంధిత స్టేషన్ అధికారులపై చర్యలు తప్పవని ఆదివారం బాధ్యతలు చేపట్టిన ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామ్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఉదయం ఏఎస్పీ ఎన్.చంద్రశేఖర్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు సన్నగిల్లిన విషయం తెలిసిందని, పోలీసులు వారి విధులను సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఎవరైనా అడ్డదారుల్లో వెళితే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. తప్పుడు ఫిర్యాదుచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వారిపై కౌంటర్ కేసులు పెడతామని చెప్పారు. ప్రాధాన్యతా అంశాలు నాలుగు తాను నాలుగు అంశాలకు ప్రాధాన్యత ఇస్తానని ఎస్పీ తెలిపారు. న్యాయం చేయాలని స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదీ నుంచి ఫిర్యాదును స్వీకరించి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పారు. రాజీపడాలనుకునే కక్షిదారులు లోక్‌అదాలత్‌లో రాజీ చేసుకోవాలన్నా రు. కానీ కేసు నమోదు చేయకుండా సెటిల్మెంట్ చేస్తే సంబంధిత అధికారిపై చర్యలు ఉంటాయన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై దృష్టి సారించి వారికి పూర్తి రక్షణ కల్పించడం తన ధ్యేయమన్నారు. జిల్లా నుంచి మహిళల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్థిక నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుం టామని చెప్పారు. దొంగతనాల కేసుల్లో బాధితులకు సొమ్ము రికవరీ చే సి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని నివారించేందు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకుగాను ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. దొంగనోట్లు, డబ్లింగ్‌కరెన్సీ ముఠాల కార్యకలాపాలను నిర్మూలించటానికి నిఘా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పోలీసుల సంక్షేమానికి కృషి పోలీసుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఎస్పీ తెలిపారు. బాధ్యతల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందిలేకుండా సిబ్బంది అందరికీ సహాయ సహకారాలు అందిస్తానన్నారు. జిల్లాలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, వాటికి మరమ్మతులు చేయించి సిబ్బందికి ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పారు. పోలీస్ శాఖలో పౌర సంబంధాల వ్యవస్థను మెరుగుపరుస్తానని తెలిపారు. శుభాకాంక్షలు.. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రఘరామిరెడ్డిని పలువురు కలిసి శుభాకాంక్షులు తెలిపారు. కలిసిన వారిలో నాయ్యవాది బీవీ కృష్ణారెడ్డి, ఏఎస్డీ రామకృష్ణ, ఏఆర్ డీఎస్పీ కె.కోటేశ్వరరావు, డీటీసీ డీఎస్పీ సరిత, ఏఆర్ ఆర్ఐ వెంకటేశ్వరరావు, ఏలూరు డీఎస్పీ ఎం.సత్తిబాబు, ఏలూరు వన్‌టౌన్ సీఐ సీహెచ్ మురళీకృష్ణ, టూటౌన్ సీఐ వై.సత్య కిషోర్, త్రీటౌన్ సీఐ కె.శ్రీనివాసరావు, పలువురు ఎస్సైలు ఉన్నారు. -
మావోలకు సహకరిస్తే కఠిన చర్యలు: కేంద్రం
న్యూఢిల్లీ: మావోయిస్టులకు సహకరించే స్వచ్ఛంద సంస్థలపై కఠిన చర్యలు చేపట్టనున్నామని కేంద్రం హెచ్చరించింది. ఆయా సంస్థలు చట్టపరంగా విరాళాలు సేకరించి మావోకు అందించడం ద్వారా.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు బుధవారం తెలిపారు. దేశంలోని కొందరు నక్సల్స్ ఫిలిప్పీన్స్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి శిక్షణ పొందినట్లు ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ముంబై దాడుల తర్వాత తీరప్రాంతాల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు రిజిజు తెలిపారు. తూర్పు, పశ్చిమ తీరాల వెంట పెట్రోలింగ్‌ను పెంచామని రాజ్యసభకు చెప్పారు. వివిధ విభాగాలతో సమాచారం పంచుకునేందుకు నావికాదళం ముంబై, విశాఖపట్నం, కొచ్చి, పోర్ట్బ్లెయిర్లో కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ నమోదు చేసిన తీవ్రవాద కేసుల్లో విడుదలవుతున్న వారందరినీ నిర్దోషులని చెప్పలేమని రిజిజు అన్నారు. అనేక కేసుల్లో సాక్ష్యాలు లేకనే నిందితులు విడుదలవుతున్నారన్నారు. -
పైరసీ నిరోధానికి ఉన్నతస్థాయి కమిటీ
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో సినీ పైరసీని అడ్డుకునేందుకు విశ్రాంత ఐపీఎస్ అధికారి బీ.కే శివరాం నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర చలనచిత్ర మండలి అధ్యక్ష గంగరాజు మీడియాకు శనివారం తెలిపారు. పైరసీ నిరోధానికి అనుసరించాల్సిన విధానలపై ఈ కమిటీ ప్రభుత్వంతో పాటు చలనచిత్ర మండలికి సూచనలు ఇస్తుందన్నారు. కాగా, ప్రభుత్వం కూడా పైరసీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గంగరాజు డిమాండ్ చేశారు. -
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
డీఎంహెచ్ఓ ఆమోస్ మిర్యాలగూడ క్రైం : స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఆమోస్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఐఎంఏ భవనంలో స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు, గైనకాలజీ డాక్టర్లకు గర్భస్త పిండ లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్త పిండానికి సంబంధించిన వ్యా ధులను కనుగొనడానికి మాత్రమే స్కానింగ్ నిర్వహించాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఆడ, మగ అని వివరాలు తెలపకూడదని అన్నారు. స్కానింగ్ సెంటర్లలో నిర్వహించే పరీక్షల వివరాలను ప్రతి నెల క్లస్టర్ కార్యాలయంలో అం దించాలని ఆదేశించారు. లింగనిర్ధారణ పరీ క్షలు చేసి అబార్శన్లు నిర్వహించినట్లు తెలిస్తే సంబంధిత డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. సమాజంలో రోజురోజుకు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్ల అనే వివక్షను ప్రతి ఒక్కరూ విడనాడాలని సూచించారు. సమావేశంలో మాస్ మీడియా అధికారి తిరుపత య్య, లీగల్ అడ్వయిజర్ వెంకట్‌రెడ్డి, ఎస్పీహెచ్ఓ కృష్ణకుమారి, ఐఎంఏ అధ్యక్షుడు కృష్ణప్రసాద్, డాక్టర్లు జ్యోతి, పారిజాత, శ్వేతారెడ్డి, క్లస్లర్ అధికారులు శ్రీనివాసస్వామి, శ్రీనివాసరావు, భగవాన్‌నాయక్, తిరుపతయ్య పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
తిరుమలగిరి :నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని తుంగతుర్తి ఏడీఏ పి.వాసు హెచ్చరించారు. తిరుమలగిరిలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగతుర్తి డివిజన్లో 10 వేల హెక్టార్లలో పత్తి గింజలు వేయడానికి 50 వేల ప్యాకెట్లు అవసరం కాగా ఇప్పటికే 30 వేల ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పని సరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. రైతులు మొదటి వర్షానికే విత్తనాలు నాట వద్దని, భూమిలోని వేడిమికి గింజలు మొలకెత్తవని, తదుపరి కురిసే వర్షాలకు విత్తనాలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, ఏఈఓ మురళీ తదితరులు పాల్గొన్నారు.